07-02-1975 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
సంతుష్టతయే సంపూర్ణతకు గుర్తు.
సర్వాత్మల పట్ల స్నేహాన్ని మేల్కొలిపే వారు, సర్వుల హితకారి శివబాబా మాట్లాడుతున్నారు .
ఇప్పుడు ఈ సమయంలో మీ యొక్క ముఖ కవళికలు మరియు భవిష్యత్తును తెలుసుకోగలుగుతున్నారా? ఎంతెంత సమయానికి సమీపంగా వెళ్తున్నారో, సమయాన్ని అనుసరించి మీ సంపూర్ణత యొక్క గుర్తులు అనుభవంలోకి వస్తున్నాయా? సంపూర్ణత యొక్క ముఖ్య గుర్తులు ఏవి? ఆత్మ సంపూర్ణతను పొందుతుందని, ఏ ముఖ్య విషయం ఆధారంగా అందరికీ అనుభవం అవుతుంది. ఆ ముఖ్య విషయం ఏమిటంటే అలాంటి ఆత్మ సదా స్వయంతో, అన్ని సబ్జెక్టులలో సంతుష్టంగా ఉన్నట్లు అనుభవం చేసుకుంటుంది మరియు వెనువెంట ఇతరాత్మలతో కూడా సదా సంతుష్టంగా ఉంటుంది. కనుక సంతుష్టతయే సంపూర్ణతకు గుర్తు. ఎంతెంతగా ప్రతి సమయం సర్వాత్మల యొక్క సంతుష్టత యొక్క ఆశీర్వాదం లేదా సూక్ష్మ స్నేహం మరియు సహయోగం లభిస్తూ ఉంటాయో దాని ద్వారా తెలుసుకోవచ్చు, వీరు సంపూర్ణతకు సమీపంగా వచ్చారని. దీంట్లోనే అద్భుతముంది. ఎలాంటి సంస్కారాలు గలవారైనా అసంతుష్టంగా ఉండే ఆత్మ సంప్రదింపుల్లోకి వచ్చినా వారు కూడా అనుభవం చేసుకోవాలి - నేను నా సంస్కారాల కారణంగానే అసంతుష్టంగా ఉంటున్నాను. కానీ ఈ విశేషాత్మలు నా పట్ల స్నేహము లేదా సహయోగము యొక్క లేదా దయాహృదయం యొక్క శుభ భావన యొక్క దృష్టి సదా కలిగి ఉన్నారని. అంటే తమలోపం తామే అనుభవం చేసుకోవాలి. అంతే కాని ఫిర్యాదు రాకూడదు నిమిత్తమైన ఈ ఆత్మలు ఆత్మనైన నన్ను సంతుష్టం చేయలేదని, ఇలా సర్వాత్మల ద్వారా సంతుష్టమణి అనే సర్టిఫికెట్ పొందాలి. అప్పుడే సంపూర్ణతకు సమీపంగా ఉన్నారని అంటారు. ఎంతగా సంపూర్ణత నిండుతూ ఉంటుందో, అంతగానే సర్వాత్మల యొక్క సంతుష్టత కూడా పెరుగుతూ ఉంటుంది. సర్వులను సంతుష్టత చేసే ముఖ్య సాధనం ఏమిటి? (ప్రతి ఒక్కరూ చెప్పారు) ఈ అన్ని విషయాలు కూడా అవసరమే. ఈ విషయాలన్నింటినీ పరిస్థితి వచ్చినప్పుడు ప్రత్యక్షంలోకి తీసుకురావాలి. కానీ ఒక్క విషయం ఏమిటంటే ఎలాంటి సమయమో, ఎలాంటి పరిస్థితియో, ఏ రకమైన ఆత్మ ఎదురుగా ఉన్నా కానీ, ఆవిధంగా స్వయాన్ని మలుచుకోగలిగి ఉండాలి, మీ స్వభావ సంస్కారాలకు వశీభూతం అవ్వకూడదు. స్థూల రూపంలో ఎలాంటి సమయమో అలాంటి రూపమో, ఎలాంటి దేశమో అలాంటి వేషమో ఎలాగైతే తయారుచేసుకుంటారో అలాగే స్వభావం లేదా సంస్కారాల్లో కూడా అంతే సహజంగా అనుభవం అవ్వాలి. ఇలా మీ స్వభావ సంస్కారాల్లో కూడా సమయానుసారంగా పరివర్తన చేసుకోగలరా? కఠినమైన వస్తువు మలచబడదు. కఠినమైన సంస్కారాన్ని కూడా సమయానుసారం మలచుకోలేరు. అందువలన సహజ సంస్కారం ఉండాలి. ఎలాంటి సమయమో అలా స్వయాన్ని తయారు చేసుకోగల సహజత్వం ఉండాలి. ఇది అభ్యసించాలి నావి కూడా కొన్ని స్వభావ సంస్కారాలుండాలి కదా, అని స్వభావ సంస్కారాల్లోకి రాకూడదు. ఆది అనాది సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవే స్వరూపంలో ఉండాలి. సంస్కారాల పరివర్తన అనేది అనాది కాలం నుంచి ఉంది. అనగా చక్రంలోకి రావడంతోనే పరివర్తన అవుతూ ఉంటారు. అనగా ఆత్మలో సంస్కారాలు పరివర్తన అనే అభ్యాసం స్వతహాగానే ఉంది. అప్పుడప్పుడు సతోప్రధానంగా, అప్పుడప్పుడు సతో, రజో లేదా తమో సంస్కారాలు సమయానుసారంగా మారుతూనే ఉంటాయి. ఇప్పుడు జ్ఞానసాగరులై , పాత్రధారులై ఉన్నతోన్నత వేదికపై పాత్ర అభినయిస్తూ ఉన్నారు. శక్తివంతులు కూడా, దయా సాగరులు కూడా, సర్వశక్తివంతుని వారసత్వానికి అధికారులు కూడా. మరైతే స్వభావ సంస్కారాలను సమయానుసారం లేదా సేవానుసారం లేదా ఎవరో ఒకరి కళ్యాణం కోసం లేదా స్వ ఉన్నతి కోసం పరివర్తన చేసుకోవడం అతి సహజంగా అనుభవం అవ్వాలి. ఇదే విశేష ఆత్మల యొక్క అంతిమ విశేష పురుషార్థం. ఇలాంటి పురుషార్ధం యొక్క అనుభవజ్ఞులేనా? ఇలా సంపూర్ణ బంగారంగా అయ్యారా? దీని ద్వారా మీ నెంబర్ ఏమిటో పరిశీలన చేసుకోవచ్చు లేదా మీ సంగమయుగీ భవిష్య ఫలితమేమిటో తెలుసుకోవచ్చు. నిమిత్తమైన విశేష ఆత్మలు కదా? కనుక ఈ శాతాన్ని తీయండి. స్వభావ సంస్కారాలను మీ శస్త్ర స్వరూపంలో ఉపయోగించగలుగుతున్నారా లేక కష్టమా? ప్రతి విషయంలో సఫలత ఎంత శాతం వస్తుంది? దూరంగా ఉండి సంతోషంగా ఉండేవారు కాదు, దూరం పెట్టేవారు కాదు, సంప్రదింపుల్లోకి వస్తూ కూడా సంబంధంలో ఉంటూ కూడా స్వయమే మీ సంప్రదింపులను, సంబంధాన్ని పెంచుకుంటూ సఫలతామూర్తులవ్వాలి. అప్పుడే ముందు నెంబర్ తీసుకోగలరు. బేహద్ యజమానికి సంబంధం బేహద్ గా ఉండాలి. అదెలా అవుతుంది? అవకాశం దొరకదు కానీ ప్రతి కార్యానికి యోగ్యులైతే స్వయంలో యోగ్యత ఉంటే స్వతహాగానే నిమిత్తం అవుతారు. ఈ సంవత్సరంలో ఇలాంటి విశేషతను చూపించండి. సాకార బాబాలో ఎలాంటి విశేషత చూశారో అలాంటి విశేషత చూపించండి. ప్రతి ఒక్కరి హృదయం నుండి మా బాబా అనే మాట రావాలి.
Comments
Post a Comment