06-12-1975 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
ఆత్మిక గాలిపటమై అలౌకిక దీపానికి స్వాహా అవ్వండి.
విశ్వమనే షోకేసులో అమూల్య రత్నాలుగా ప్రసిద్ధం చేసేవారు, మాస్టర్ త్రికాలదర్శి స్థితిలో స్థితులు చేసేవారు, సర్వగుణాలలో మాస్టర్ సాగరులుగా తయారుచేసేవారు, ఆత్మీయత అనే రంగుతో చిత్రాన్ని మనోకర్షణగా(మనసును ఆకర్షణగా) తయారుచేసే ఆత్మిక తండ్రి శివబాబా మాట్లాడుతున్నారు -
స్వయాన్ని ప్రపంచమంతటి మధ్యలో మెరుస్తున్న విశేష అదృష్ట సితారగా అనుభవం చేసుకుంటున్నారా? మీరు ఎంత అదృష్టవంతులంటే మీ మహిమ స్వయం తండ్రి పాడుతున్నారు. ఇంతకంటే శ్రేష్టభాగ్యం మరెవరికైనా ఉంటుందా; సదా ఈ సంతోషం ఉంటుందా? మీ సంతోషాన్ని చూసేవారి యొక్క చింత లేదా దు:ఖం యొక్క ఘటనలు సమాప్తం అయిపోవాలి. దు:ఖాన్ని మరిచి సుఖం యొక్క ఊయలలో ఊగడం మొదలు పెట్టాలి. ఈ విధంగా స్వయాన్ని అనుభవం చేసుకుంటున్నారా? మహిమ ఉంది కదా - పరుసవేది యొక్క సాంగత్యంలో లోహం కూడా బంగారంగా అయిపోతుందని. ఆవిధంగా స్వయాన్ని పరుసవేది మణులుగా మీ యొక్క సాంగత్యంతో ఇనుపయుగంలోని ఆత్మలు స్వర్ణమయుగంలోనివారిగా తయారైపోవాలి. ఇలాంటి స్థితిని అనుభవం చేకుంటున్నారా? ఏ ఆత్మ అయినా సరే బికారిగా వస్తే సంపన్నమైపోయి వెళ్ళాలి. ఈ విధంగా మీ అదృష్ట చిత్రాన్ని రోజూ మీ దర్పణంలో చూస్తున్నారా? ఏ సమయంలో చూస్తున్నారు? అమృతవేళ చూస్తున్నారా? చూసుకునే సమయం నిర్ణయించుకున్నారా లేక నడుస్తూ తిరుగుతూ ఎప్పుడు పడితే అప్పుడే చూసుకుంటూ ఉంటున్నారా? రోజంతటిలో ఎన్నిసార్లు చూసుకుంటారు? అనేకసార్లు చూసుకుంటారా లేక ఒకసారే చూసుకుంటారా మాటిమాటికి తమముఖాన్ని అద్దంలో చూసుకోవడం ఈ రోజుల్లో ఫ్యాషన్ కదా! వారు తమ ముఖకవళికలను చూసుకుంటూ ఉంటారు. మీరు మీ భవిష్యత్తును చూసుకోవాలి. మీ ముఖకవళికలపై ధ్యాస లేదు, కానీ ప్రతి సమయం మీ భవిష్యతుని శ్రేష్టంగా తయారుచేసుకోవాలనే ధ్యాస ఉంది. ఈ విధంగా మీ అదృష్టచిత్రాన్ని చూసుకుంటున్నారా? మా చిత్రంలో ఎంత వరకు ఆత్మీయత పెరుగుతూ వెళ్తుంది అని. ప్రజలు లౌకిక దృష్టితో వారి రూపంలో లేదా వారి ముఖంలో ఎంతవరకు ఎరుపురంగు వచ్చింది అని చూసుకుంటారు. కానీ వీరందరూ మీ అలౌకిక చిత్రాన్ని చూసుకుంటూ ఆత్మీయత అనే ఎరుపురంగు చూసుకుంటున్నారా? ఈరోజు విశేషంగా దూరదేశీ లేదా డబల్ విదేశీ అనగా త్రికాలదర్శి పిల్లలను విశేషంగా కలుసుకునేటందుకు వచ్చారు. ఇది కూడా విశేష అదృష్టం కదా! మిమ్మల్ని మీరు అటువంటి అదృష్టవంతులుగా భావిస్తున్నారా? పదమాపదమ్ భాగ్యశాలీ ఆత్మలుగా స్వయాన్ని భావిస్తున్నారా లేదా సౌభాగ్యశాలులేనా పదమాపదమ్ అనే మాట కూడా సరిపోదా? స్వయాన్ని ఏమని భావిస్తున్నారు? మా ప్రతి అడుగులో పదమాలు నిండి ఉన్నాయి అని చెప్పండి. ఎవరి అడుగుల్లో అనేక పదమాలు నిండి ఉంటాయో వారు స్వయం ఏమవుతారు? ఎవరైనా తమ విశేషతను లేదా తమ శ్రేష్టతను వర్ణించి చెప్పేటప్పుడు ఏమంటారు? వారు మా ముందు ఎంత మా పాదం క్రింద ఉండేవారు అని అంటారు. అదేవిధంగా పదమాలు అనగా కోటానుకోట్ల సంపాదన మీ పాదాల క్రింద ఉంటుంది. ఇలాంటి శ్రేష్ట అదృష్టవంతులేనా కేవలం మీ భాగ్యాన్ని స్మరణ చేసుకున్నా కూడా మీరు ఏవిధంగా అయిపోతారు? భాగ్యాన్ని స్మరణ చేస్తూ చేస్తూ బాబా కంటే కూడా సర్వశ్రేష్టంగా మరియు బాబాకి కూడా శిరోకిరీటంగా అయిపోతారు. మీ సర్వశ్రేష్ట స్థితి యొక్క స్మృతిచిహ్న చిత్రం చూశారా? మీ సర్వశ్రేష్ట భాగ్యానికి గుర్తుగా ఏ స్మృతిచిహ్న చిత్రం తయారైంది? ఆ చిత్రం ద్వారా అందరికంటే ఉన్నతులుగా ప్రసిద్ధులు అయ్యారు. అది ఏ చిత్రం? విరాట స్వరూపంలో బ్రాహ్మణులను సర్వశ్రేష్ఠులుగా పిలక రూపంలో చూపించారు. పిలక కంటే ఉన్నతమైనది ఏమైనా ఉంటుందా? శక్తి సేన కూడా స్వయాన్ని ఇటువంటి అదృష్టవంతులుగా భావిస్తున్నారా/ అందరికంటే అధికులుగా స్వయాన్ని అదృష్టవంతులుగా భావిస్తున్నారా? బాబా కూడా ఈ రోజు విశేషంగా పిల్లల యొక్క విశేషభాగ్యాన్ని చూసి హర్షిస్తున్నారు. మూలమూలల నుండి, విదేశాలలోని మూలల నుండి కూడా వచ్చి మీ ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వచ్చిన పిల్లలను చూసి బాబా కూడా హర్షిస్తున్నారు. అర్ధకల్పం నుండి ఆశ పెట్టుకుంటే ఇప్పటికి ఇక్కడికి చేరుకున్నారు. పిల్లలు తమ గమ్యానికి చేరుకోవడం చూసి లేదా సర్వ ఆశలు పూర్తి అవ్వడం చూసి బాబా కూడా హర్షిస్తున్నారు. విదేశి గ్రూపు యొక్క విశేషత ఏమిటి? విదేశీయుల యొక్క విశేషత చూస్తూ బాబా కూడా విశేషంగా హర్షిస్తున్నారు. ఎక్కువమంది భారతవాసీలు అయినా కానీ ఇప్పుడు విదేశీయులుగా అయితే పిలువబడుతున్నారు కదా! మొదటి క్వాలిటీ ఆత్మలు రావడంతోనే గాలిపటాల వలే దీపంలో కాలిపోయి చనిపోతున్నారు. దాంట్లో ఇక ఏమీ ఆలోచించడం లేదు. అనగా విన్నారు, అనుభవం చేసుకున్నారు మరియు నడుస్తూ ఉన్నారు. విదేశీయుల్లో ఈ క్వాలిటీ భారతవాసీల కంటే విశేషమైనది. భారతవాసీలు అయితే మొదట ప్రశ్నిస్తారు, తరువాత ఆలోచిస్తారు, ఆ తరువాత స్వాహా అవుతారు. విదేశాల నుండి వచ్చినటువంటి ఆత్మలు దీపంపై గాలిపటాల సమానంగా స్వాహా అయిపోయే విశేషత కలిగి ఉన్నారు. అర్ధమైందా! కొంతమంది దూరంగా కూర్చుని చాలా తపనతో ఉన్నారు. అలాంటి తపన గల ఆత్మలకు గమ్యం దొరికితే ఎంత బాగుంటుంది? అదేవిధంగా తపించే ఆత్మలందరూ కూడా ఎక్కువ మంది విదేశీ గ్రూపులో కనిపిస్తున్నారు. అర్హమైందా! మీ విశేషత ఏమిటో? ఇలా గాలిపటాలుగా అయ్యేవారికి స్వతహాగానే వారి యొక్క పురుషార్థం స్మృతి మరియు సేవ తప్ప మరేమి ఉండదు. అందువలన వేగంగా ముందుకు వెళ్ళిపోతున్నారు. కానీ మీరు ఎప్పుడు ఎందుకు మరియు ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. మాయా యుద్ధంతో ఓడిపోయేవారా లేక సదా విజయులా. మాయను ఓడింపచేసేవారు కానీ ఓడిపోయేవారు కాదు. విదేశీయులకు బాబా యొక్క విశేష సహాయం కూడా ఉంది. ఆ సహాయం యొక్క బహుమతి కారణంగా వేగంగా వెళ్ళిపోతున్నారు. ఈ విశేషతను సదా స్థిరంగా ఉంచుకోండి. ఎందుకు మరియు ఏమిటి అనే ప్రశ్నలకు బదులు సదా మాస్టర్ త్రికాలదర్శి స్థితిలో స్థితులై ప్రతి కార్యం లేదా సంకల్పాన్ని స్వరూపంలోకి తీసుకురండి. త్రికాలదర్శి అయినప్పుడు ఎందుకు మరియు ఏమిటి అనే ప్రశ్నలు సమాప్తి అయిపోతాయి కదా! కనుక సదా మాస్టర్ త్రికాలదర్శి స్థితిలో స్థితులై ఉండండి. సదా స్వయాన్ని ఒకే బాబా యొక్క స్మృతిలో లీనమై ఉండే బాప్ దాదా సమానంగా భావించి నడుస్తూ ఉండండి. తత్వయోగులు సదా తత్వంలో లీనమైపోవాలి, కలిసిపోవాలి అనే లక్ష్యం పెట్టుకుంటారు కదా, కానీ ఈ సమయంలో జ్ఞానం ఆధారంగా మీరు అర్థం చేసుకున్నారు బాబా స్మృతిలో లీనమైపోవాలి లేదా లవలీనం అయిపోవాలి. అంతే కాని లీనమైపోవడం అనేది ఉండదు అని. బాబా స్మృతిలో లీనమైపోయి మిమ్మల్ని మీరు మరిచిపోవడాన్ని వారు ఒకటి లీనం అయిపోవడం అని చెబుతారు. ఎప్పుడైతే ప్రేమలో లీనమైపోతారో అనగా సంలగ్నతలో నిమగ్నమైపోతారో అప్పుడు బాబా సమానంగా అయిపోతారు. దీనినే వారు లీనమైపోవడంగా చెబుతారు. మీరు ఈ విధంగా అనుభవం చేసుకుంటున్నారు కదా! బాబా యొక్క ప్రేమలో ఆత్మ తనను తాను పూర్తిగా లీనం చేసుకోవాలి. అలా అనుభవం చేసుకోవాలి. అలాంటి అనుభవం అవుతుంది కదా! ఎవరైనా సాగరంలో లీనమైపోయారనుకోండి ఆ సమయంలో వారి అనుభవం ఏముంటుంది? కేవలం సాగరం తప్ప మరేది కనిపించదు. అలాగే బాబా అనగా సర్వగుణాల సాగరునిలో లీనమైపోవాలి. దీనినే లవలీనం అయిపోవడం అనగా బాబా స్నేహంలో లీనమైపోవడం అని అంటారు. బాబాలో లీనం అయిపోవడం కాదు, బాబా స్మృతిలో లీనమైపోవడం. ఇలాంటి అనుభవం అవుతుందా, విదేశీయుల పార్టీని చూసి బాప్ దాదా వారి యొక్క భవిష్యత్తును చూస్తున్నారు. విదేశీయుల భవిష్యత్తు ఏమిటి? సత్యయుగ భవిష్యత్తు కాదు. సత్యయుగం యొక్క భవిష్యత్తు అయితే రాజా రాణి కానీ సంగమయుగం యొక్క భవిష్యత్తు ఏమిటి? (బాబాని ప్రత్యక్షం చేయటం) కాని అది ఎప్పుడు చేస్తారు? దానికి తారీఖు ఏమిటి? తారీఖు నిర్ణయం కానంత వరకు శక్తిశాలి ప్లాన్ తయారవ్వదు. విదేశీయుల ద్వారానే భారతదేశం యొక్క కుంభకర్ణులు మేల్కొంటారు. ఒకవేళ మీరు చేసేస్తాము అని ఆలోచిస్తూ ఉన్నట్లయితే వారు కూడా మేల్కొంటాము అని చెబుతూనే ఉంటారు. అందువలన మేల్కొలిపేవారిలో పూర్తి శక్తి ఉండాలి. శక్తిశాలి ప్లాన్ తయారుచేయాలి. ఈ సంవత్సరంలో ఇది చేయాలి అని మీరు అనుకున్నప్పుడే వారు కూడా ఈ సంవత్సరంలో మేల్కొంటాము అని అంటారు. మేల్కొలిపేవారి సమయం ఇప్పుడు ఇంకా నిర్ణయింపబడలేదు. అందువలన మేల్కొనేవారికి కూడా సమయం నిర్ణయం కాలేదు. మేల్కొలిపేవారు ఆలోచిస్తున్నారు చేయాలని. అదేవిధంగా వారు కూడా మేల్కోవాలి అనుకుంటూ అంతిమంలో మేల్కొంటారు. అందువలన విదేశీయుల భవిష్యత్తు ఏమిటి? భారతదేశంలోని పేరు ప్రఖ్యాతులు కలవారిని మెల్కొల్పడం - ఇదే విదేశీయుల భవిష్యత్తు. వారు సాధారణ కుంభకర్ణులు కారు. ప్రసిద్ద కుంభకర్ణులను మేల్కొల్పాలి. అలాంటి వారిని ఒక్కరిని మేల్కొల్పటం ద్వారా అనేకులు మేల్కొంటారు. వారినే ప్రసిద్ధులు అని అంటారు. ధరణి అనగా వేదిక అయితే తయారవుతూ ఉంది. ఇప్పుడు కేవలం పాత్రధారులు పాత్ర అభినయించాలి అంతే. కానీ ఆ పాత్ర కూడా హీరోపాత్ర సాధారణ పాత్రతో జరగనిది. హీరో పాత్ర అభినయించడం ద్వారానే కుంభకర్ణులు మేల్కొని ఇక్కడ అక్కడ అని అంటారు. మంచిది.
ఈ విధంగా అదృష్టాన్ని మేల్కొల్పేటందుకు నిమిత్తులైన జాగృతీ జ్యోతులకు, సదా స్వయం యొక్క మరియు సమయం యొక్క విలువను తెలుసుకునే వారికి, ఇటువంటి అమూల్య రత్నాలకు, విశ్వమనే షోకేసులో విశేషంగా ప్రసిద్ధమయ్యే సర్వసిద్ధి స్వరూపులకు, ప్రతి సంకల్పాన్ని స్వరూపంలోకి తీసుకువచ్చే బాప్ సమాన ఆత్మలకు, సర్వగుణాలను సేవలోకి మరియు స్వరూపంలోకి తీసుకువచ్చేవారికి, ఇటువంటి విశేష ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment