* 06-08-1970 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“దృష్టిద్వారా సృష్టి రచన (టీచర్స్ ట్రైనింగు క్లాసు - ఓపనింగ్ సెరిమనీ)"
అవ్యక్త స్థితిలో ఉంటూ యజ్ఞములో కార్యము చేస్తున్నారా? ఏవిధంగా తండ్రి అవ్యక్తమై, వృక్షములో ప్రవేశించి కార్యము చేస్తారో అలా తండ్రి సమానంగా అయ్యారా? తండ్రి సమానంగా అయినప్పుడే ఇతరులను కూడా తండ్రి సమానంగా తయారు చెయ్యగలరు. దృష్టి తండ్రి సమానంగా అయ్యిందా? వాణి తండ్రి సమానంగా తయారైందా? సంకల్పము తండ్రి సమానంగా ఉందా? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. తండ్రికి స్మృతిలో ఏముంటుంది? తెలుసా? తండ్రి స్మృతిలో ఎల్లప్పుడూ ఏముంటుంది మరియు మీ స్మృతిలో ఎల్లప్పుడూ ఏముంటుంది? అంతరము ఉందా?(ఉంది) ఏ అంతరము ఉంది? సమాన స్మృతి ఉంటుందా? ఏ స్మృతి అయినా ఉంటుందా లేక ఏ స్మృతి ఉండదా? స్మృతి ఉంటుందా లేక స్మృతి నుండి కూడా దూరంగా ఉంటారా? ఏ విషయములోనైనా తండ్రి సమానంగా మీ స్మృతి ఉంటుందా? అది ఏ స్మృతి (గుణాలు స్మృతి) తండ్రి సమానంగా ఉండే మరేదైనా స్మృతి ఉందా? (కర్తవ్య స్మృతి) మంచి గుణాల సమానత ఉందా? (లేదు) అంతిమము వరకు స్మృతిలో సమానత వచ్చేస్తుందా? (నంబర్ వార్) మొదటి బిడ్డ, తండ్రిలో తేడా ఉంటుందా? బాప్ దాదాలలో తేడా ఉంటుందా? సమానత వచ్చేస్తుందా? తండ్రి ఏవిధంగా అనంతమైన తండ్రో అలాగే దాదా కూడా అనంతమైన తండ్రి. బాప్ దాదా సమీపములో ఉన్నవారిలో సమానత ఉండాలి. ఎంతెంత సమీపత ఉంటుందో అంతంత సమానత. అంతిమంలో పిల్లలైన మీరు కూడా మీ రచనకు రచయితలుగా అయ్మి ప్రాక్టికల్ లో అనుభవము చేస్తారు. ఏవిధంగా తండ్రిని, రచనను చూస్తే రచయిత స్వరూపపు స్మృతి స్వతహాగనే ఉంటుందో అలాంటి స్థితి నంబర్ వారీగా పిల్లలకు కూడా రావాలి. అచ్ఛా!
(జానకి దాదీని చూసి) దృష్టి ద్వారా సృష్టిని రచించడము వస్తుందా? మీ రచన ఎటువంటిది? ముఖ (నోటి) రచననా లేక నయన రచననా? నోటి నుండి రచన(ఇప్పటి వరకు అలాగే ఉంది). ఇకముందు ధ్యానమునుంచండి, దృష్టి ద్వారా సృష్టిని రచించండి. దృష్టి ద్వారా సృష్టి అన్న నానుడి ఉంది. సత్యయుగములో ఏవిధంగా యోగబలము ద్వారా రచన ఉంటుందో అలా అంతిమంలో మీ అందరి దృష్టి ద్వారా సృష్టి తయారవుతుంది. సృష్టి మారిపోయేంతటి దృష్టి. అలా మీ దృష్టిలో దివ్యతను అనుభవము చేస్తూ వెళ్తున్నారా? దృష్టి మోసగిస్తుంది కూడా మరియు దృష్టి పతితులను పావనంగా చేస్తుంది కూడా, దృష్టి మారటం ద్వారా సృష్టి తప్పక మారి తీరుతుంది. మరి దృష్టి ఎంతవరకు మారింది? దృష్టి మారటమంటే ఏమిటో తెలుసా? ఆత్మిక దృష్టిని తయారు చేసుకోవాలి. ఆత్మిక దృష్టి, దివ్యదృష్టి మరియు అలౌకిక దృష్టి తయరైందా? ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా ఆత్మిక స్వరూపమే కనిపించాలి. అలా దృష్టి మారిందా? ఎప్పుడైతే దృష్టిలో అనగా నేత్రాలు లేక నయనాలలో ఏదైనా లోపము ఉన్నట్లయితే ఒకే సమయములో రెండు, రెండు వస్తువులుగా కనిపిస్తాయి. అలా దృష్టి పూర్తిగా మారనట్లయితే ఇక్కడ కూడా రెండు రెండు వస్తువులు కనిపిస్తాయి. దేహము మరియు దేహి (ఆత్మ), ఒక్కోసారి ఇది, ఒక్కోసారి అది కనిపిస్తుంది, అలా జరుగుతుంది కదా! ఒక్కోసారి దేహాన్ని చూస్తే, ఒక్కోసారి దేహీని చూస్తారు. ఎప్పుడైతే కళ్ళు పూర్తిగా బాగైపోతాయో అప్పుడు ఏ వస్తువు ఏలా ఉంటుందో అలాగే యథార్థ రూపములో కనిపిస్తుంది. అలాగే ఈ దృష్టి మారినప్పుడు యథార్థ రూపము ఏదైతే ఉందో అది కనిపిస్తుంది. యథార రూపము ఏమిటి? దేహి, దేహము కాదు. కావున యధార్థ రూపము ఏదైతే ఉందో అది అలాగే కనిపించినప్పుడు దృష్టి సరిగ్గా ఉందని భావించండి. దృష్టిపై చాలా ధ్యానమును ఉంచాలి. దృష్టి మారిపోయినట్లయితే ఎప్పుడూ మోసగించదు. సాక్షాత్కారమును దృష్టి ద్వారా చేస్తారు మరియు ఒక్కొక్కరి దృష్టిలో తమ యథార్థ రూపమును మరియు యథార్థమైన ఇల్లు మరియు రాజధానిని చూస్తారు. ఒకవేళ యథార్థ దృష్టి ఉన్నట్లయితే దృష్టిలో అంతటి శక్తి ఉంటుంది. కావున ఎల్లప్పుడు మిమ్మల్ని మీరు ఇలా పరిశీలించుకోండి. ఇప్పుడు ఎవరు ఎదురుగా వచ్చినా నా దృష్టి ద్వారా ఏ సాక్షాత్కారమును చేసుకుంటారు. మీ వృత్తిలో ఏదైతే ఉందో దానిని ఇతరులు మీ దృష్టిద్వారా చూడగలరు. ఒకవేళ వృత్తి దేహ అభిమానమునకు చెందినదై ఉంటే, చంచలముగా ఉంటే మీ దృష్టి ద్వారా అయ్యే సాక్షాత్కారము కూడా అదే ఉంటుంది. ఇతరుల దృష్టి, వృత్తి కూడా చంచలమౌతాయి, యథార్థ సాక్షాత్కారమును చేయించలేరు. అర్థం చేసుకున్నారా? వీరి ట్రైనింగు జరుగుతోంది కదా! ఈ గ్రూపు కొరకు ముఖ్యమైన విషయము - మీ వృత్తిని మంచిగా చేసుకోవటం మూలంగా మీ దృష్టిని ఇంకా దివ్యమైనదిగా తయారుచేసుకోవాలి. ఎంతవరకు తయారైంది, ఎందువల్ల తయారవ్వలేదు. వీటిగురించి వీరికి స్పష్టంగా అర్థం చేయించాలి (జానకి దాదీకి సూచన) అర్థమైందా! సృష్టి మారకపోవటానకి గల కారణమేంటి? దృష్టి మారకపోవటము. దృష్టి మారకపోవటానికి కారణమేంటి? వృత్తి మారకపోవటము. దృష్టి మారినట్టయితే సృష్టి కూడా మారిపోతుంది.
ఈ రోజుల్లో పిల్లలందరికీ బాప్ దాదా ఇచ్చే విశేష సూచన ఇదే - మీ దృష్టిని మార్చండి. సాక్షాత్కారమూర్తిగా అవ్వండి. మిమ్మల్ని చూసేవారు ఎలా అనుభనం చెయ్యాలంటే - ఇవి నయనాలు కాదు కానీ ఇంద్రజాలము చేసే డిబ్బీలు. ఏవిధంగా ఇంద్రజాలికుని డబ్బాలో భిన్నభిన్నమైన వాటిని చూస్తారో అలాగే మీ నయనాలలో దివ్య దృశ్యము చూడాలి. నయనాలు సాక్షాత్కారానికి సాధనాలుగా తయారవ్వాలి. అర్థమైందా ఈ గ్రూపు ఎటువంటి గ్రూపో తెలుసా? వీరిలో ఏ విశేషత ఉంది? ప్రతి ఒక్క గ్రూపుకు వారి వారి విశేషత ఉంది. ఎందుకని? మొత్తము విశ్వములోకి విశేష ఆత్మలు, మేము సాధారణమైన వారిమనైతే భావించటం లేదు. కదా? అలా ఎప్పుడూ భావించవద్దు. మొత్తము విశ్వములోపల విశేష ఆత్మలు ఎవరు? ఒకవేళ మీరు విశేష ఆత్మలు కానట్లయితే తండ్రి తనవారిగా ఎందుకు తయారుచేసుకున్నారు. మిమ్మల్ని మీరు విశేష ఆత్మలుగా భావించటం ద్వారా విశేషతలను తీసుకువస్తారు. ఒకవేళ సాధారణంగా భావించినట్లయితే కర్తవ్యము కూడా సాధారణమైనదే చేస్తారు. కానీ అలా కాదు. ప్రతి ఒక్క ఆత్మ తనును తాను విశేషమైన వారిగా భావించి ఇతరులలో కూడా విశేషతను తీసుకురావాలి. మరి పిల్లలైన మీరు విశేషమైన ఆత్మలు. ఈ నషా ఈశ్వరీయ నషా, దేహభానముతో కూడిన నషా కాదు. ఈశ్వరీయ నషా ఎలప్పుడూ నయనాల నుండి కనిపించాలి. మరి ఈ గ్రూపు విశేషత ఏమిటి? మీరు మీ గ్రూపు యొక్క విశేషతను తెలుసుకున్నారా? ఏంటది? (వీరి హృదయాలలో ఉత్సాహము ఉంది. గ్రహించాలన్న భావన ఉంది. నేర్చుకొనేందుకు ఉల్లాసము ఉంది. తెల్లని కాగితాలు). ఈ గ్రూపు టైటిల్ అయితే చాలా పెద్దదిగా ఉంది. మీ విశేషతలను వింటున్నారా? ట్రైనింగ్ తరువాత ఈ గుణాలు స్థిరంగా ఉండాలి. ఇది కూడా ట్రైనింగ్ కావాలి. అర్థమైందా!
ఇప్పుడైతే విశేషతలను చాలా మంచిగా వినిపిస్తున్నారు. తెల్లని కాగితంపై ఏది వ్రాసినా చాలా స్పష్టంగా ఉంటుంది. ఎంతటి స్పష్టమో అంతటి శ్రేష్టము. ఒకవేళ స్పష్టతలో లోపము ఉన్నట్లయితే శ్రేష్ఠతలో కూడా లోపము ఉంటుంది. ఇతరమైన దేనినీ కలపవద్దు. కొందరు చాలా మిక్స్ చేస్తుంటారు. దీనితో ఏమవుతుందంటే యధార్థ రూపము కూడా అయథార్థమౌతుంది. ఆ జ్ఞానము విషయాలే మాయరూపంగా కూడా అయిపోతాయి. కావున ఈ గ్రూపు సదా స్పష్టము మరియు శ్రేష్టముగా ఉంది అని ఈ గ్రూపు విశేషత విశ్వములో కనిపించాలి. ఎల్లప్పుడూ మీ యథార్థ రూపంలో ఉండండి, ఏది ఎలా ఉందో దానిని ఆ రూపములోనే తెలుసుకొని, ధారణ చెయ్యాలి మరియు నడుస్తూ ఉండాలి, ఇదే స్పష్టత, ఈ గ్రూపుకు బాప్ దాదా ఏ టైటిల్‌ను ఇస్తారు ?
చిన్నవారు దైవంతో సమానము అన్న నానుడి ఉంది. కానీ బాప్ దాదా చిన్నవారైతే అల్లాహ్(భగవంతుని)తో సమానము అని అంటారు. అన్ని విషయాలలో అడుగడుగులో సమానతను ఉంచండి. కానీ సమానత ఎలా వస్తుంది? సమానత కొరకు రెండు విషయాలను ధ్యానములో ఉంచుకోవాలి, అప్పుడే సమానత వస్తుంది. ఏ రెండు విషయాలను ధ్యానములో ఉంచుకోవలసి వస్తుంది? బాప్ దాదా సమానంగా అవ్వాలంటే సమానంగా అయ్యేందుకు బుద్ధిలో ఏం ఉంచుకోవలసి ఉంటుంది?(బాప్ దాదానే ఉంచుకుంటాము) మొదట వినిపించాము కూడా, ఏం ఉంచుకుంటారు? సమానంగా ఎలా అవుతారు? సాకారరూపములో ఏ విశేషతలు ఉండేవి? ఒకటేమో మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ ఆధారమూర్తులుగా భావించండి. మొత్తము విశ్వమునకు ఆధారమూర్తులు. దీనితో ఏమౌతుందంటే ఏ పని చేసినా బాధ్యతతో చేస్తారు. ఒంటరితనము ఉండదు. బాప్ దాదా ఏవిధంగా సర్వులకు ఆధారమూర్తులో అలా పిల్లలు ప్రతిఒక్కరూ విశ్వమునకు ఆధారమూర్తులు. మీరు ఏ పని చేస్తారో దానినే అందరూ చేస్తారు. సంగమయుగములో ఏ యథార్థ పద్ధతులు, ఆచారాలు నడుస్తాయో, అవి భక్తిమార్గములో మారి ఆచరించబడతాయి. కావున మొత్తము విశ్వమునకు మీరు ఆధారమూర్తులు. మీరు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు ఆధారమూర్తిగా భావించాలి మరియు రెండవది, ఉద్ధారమూర్తిగా అవ్వాలి. ఎంతగా మీ ఉద్ధారము చేసుకుంటారో అంతగా ఇతరుల ఉద్ధారము చేస్తారు. ఎంతగా ఇతరుల ఉద్ధారము చేస్తారో అంతగా మీ ఉద్ధారము కూడా చేసుకుంటారు. మీ ఉద్ధారమునే చేసుకోనట్లయితే ఇతరుల ఉద్ధారమును ఎలా చేస్తారు? ఎప్పుడైతే ఆధారమూర్తిగా అవుతారో అప్పుడే ఉద్ధారమూర్తిగా అవుతారు.
చిన్నవారైనా కూడా కర్తవ్యము తండ్రి సమానంగా చెయ్యాలి. దీనిని గుర్తు ఉంచుకోవటంద్వారా సమానత వస్తుంది. అప్పుడు "చిన్నవారు తండ్రి సమానము" అని ఈ గ్రూపుకు టైటిల్ ఏదైతే ఇవ్వడం జరిగిందో అది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. దీనిని మరచిపోవద్దు. అచ్ఛా, ఇప్పుడు ఏం చెయ్యాలి? (తిలకాన్ని దిద్దాలి) ఈ టీకా(తిలకము)కూడా సాధారణమైనది కాదు. తిలకాన్ని ఎందుకు పెట్టారో తెలుసా? సౌభాగ్యమునకు గుర్తు. ఏ విషయాలనైతే విన్నారో ఆ అన్నింటిలో స్థిరమయ్యేందుకు గుర్తు ఈ తిలకము. తిలకమును కూడా మస్తకములోనే దిద్దుతారు. కావున బుద్ధిలో ఈ అన్ని విషయాలు గుర్తుండిపోవాలి. కావుననే ఈ తిలకమును పెట్టడము జరుగుతుంది. ఈ తిలకాన్ని ఇంకా ఎందుకు పెట్టడం జరుగుతుంది? (బిందురూప స్థితికి గుర్తు, రాజ తిలకము, విజయ తిలకము, బాధ్యతా తిలకము, రకరకాల ఆలోచనలను వినిపించటం జరిగింది.)
బాప్ దాదా ఏదైతే వినిపిస్తారో అది వేరుగా ఉంటుంది. టీకా అని తిలకమునే కాదు, దానికి ఇంకేదైనా అర్థం ఉందా?(ఇంజెక్షన్)ఈ టీకా (జ్ఞాన ఇంజెక్షన్) సదా మాయా రోగాలను నివృత్తి చేసేందుకు కూడా టీకా. సదా ఆరోగ్యవంతముగా ఉండేందుకు కూడా టీకా, ఒక టీకా అంటే ఏవైతే మీరందరూ వినిపించారో అవి. మరొక టీకా అంటే ఇది కూడా. రెండు టీకాలను పెట్టుకోవాలి. ఒకటి శక్తి శాలిగా అయ్యేందుకు, రెండవది సదా సౌభాగ్యవతులుగా ఉండేందుకు మరియు భాగ్యములో స్థితులయ్యేందుకు. రెండు తిలకాలనూ బాప్ దాదా దిద్దుతారు. గుర్తు ఒక్కటే, అందులోని రహస్యాలు రెండు. గుర్తు అన్నది స్థూలమైనది కానీ రహస్యాలు రెండున్నాయి. కావున కేవలం తిలకాన్ని దిద్దుకోవద్దు. తిలకాన్ని పెట్టుకోవటము అనగా సదాకాలము కొరకు ప్రతిజ్ఞ చెయ్యటము. ఏ ప్రతిజ్ఞను చెయ్యాలి? ఈ టీకా ఒకటి ప్రతిజ్ఞకు గుర్తు. ఎల్లప్పుడూ ప్రతి విషయములో పాస్ విత్ ఆనర్ గా అవుతారు. ఈ ప్రతిజ్ఞా తిలకము ఇది. అంతటి ధైర్యము ఉందా? పాస్ అవ్వటము కాదు కానీ పాస్ విత్ ఆనర్, అనగా మనసులో కూడా సంకల్పాల ద్వారా శిక్షలు తినకూడదు. ధర్మరాజు శిక్షలు అన్నవి తరువాతి సంగతి కానీ మీ సంకల్పాల అలజడుల నుండి లేక శిక్షల నుండి దూరంగా ఉండటము, దీనినే పాస్ విత్ ఆనర్ అని అంటారు. మీ పొరపాటుతో స్వయమునకు శిక్షను ఇస్తారు. చిక్కుకుంటారు, పిలుస్తారు, తికమక చెందుతారు. వీటి నుండి కూడా దూరంగా ఉండటము. పాస్ విత్ అనర్ అని వీరినే అంటారు. అటువంటి ప్రతిజ్ఞను చెయ్యటానికి తయారుగా ఉండండి. వాణి, కర్మ, సంబంధ-సంపర్కాల మాట వదలండి, సంకల్పాలలో కూడా చిక్కుకోకూడదు. అది స్థూల విషయము. అటువంటి ప్రతిజ్ఞను చేసే గ్రూపేనా? ధైర్యవంతులు. ధైర్యము స్థిరంగా ఉన్నట్లయితే సర్వులకు సహాయకులుగా ఉంటారు. సహయోగులుగా అయినట్లయితే స్నేహము లభిస్తూ ఉంటుంది. ఏవిధంగా వృక్షములో కోమలమైనవి మరియు చిన్న చిన్న క్రొత్త ఆకులు వెలువడుతున్నప్పుడు చాలా ప్రియంగా అనిపిస్తాయి, కానీ పక్షులు కూడా ఈ లేత చిగుర్లనే తింటాయి. అర్థం చేసుకున్నారా? కేవలము ఎవరికి ప్రియంగా ఉండాలి? బాప్ దాదాకు ప్రియంగా ఉండాలి, అంతేగానీ మాయారూపీ పక్షులకు కాదు. మరి వీరు కూడా కోమలమైన ఆకులు. కోమలమైన ఆకులు కమాల్ (అద్భుతము) చెయ్యాలి. ఏ కమాల్ చెయ్యాలి? మీ ఈశ్వరీయ చరిత్రపై సర్వులను ఆకర్షితము చెయ్యాలి, అంతేగానీ మీపై కాదు, చరిత్రపై. ఈ గ్రూపుపై పూర్తి ధ్యానము ఉంది. అర్థమైందా? కావున ఈ గ్రూపుకు తమపై కూడా అంతటి ధ్యానమును ఉంచాలి. అచ్ఛా! ఓం శాంతి.
Comments
Post a Comment