06-08-1970 అవ్యక్త మురళి

* 06-08-1970         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

బంధన్ముక్త ఆత్మ యొక్క గుర్తులు.

ఇప్పుడు అవ్యక్త స్థితిలో స్థితులై వ్యక్త దేహ ఆధారమును తీసుకొని చూస్తున్నారు, ఈ అనుభవమును చేస్తున్నారా? ఏదైనా స్థూల స్థానములో ప్రవేశిస్తారు కదా, అలాగే ఈ స్థూల దేహములో ప్రవేశించి ఈ కార్యమును చేస్తున్నారు. అటువంటి అనుభవము కలుగుతోందా? ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రవేశించటము మరియు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ అతీతమైపోవటము, ఇలా అనుభవము చేస్తున్నారా? ఒక్క క్షణములో ధారణ చెయ్యటము మరియు ఒక్క క్షణములో వదలటము, ఈ అభ్యాసము ఉందా? ఎలా అయితే స్థూల వస్తువులను కూడా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకోవటము మరియు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వదలటము చెయ్యగలరో, అలా ఈ దేహ భావమును ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వదిలేసి దేహీ అభిమానిగా అయిపోవటము - వస్తువుల విషయములో ఎంత సహజమో అంత సరళంగా ఈ అభ్యాసము ఉందా? రచయిత ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రచన ఆధారమును తీసుకోగలడు, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రచన ఆధారమును వదలగలడు- ఇటువంటి రచయితలుగా అయ్యారా? ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అతీతముగా, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ప్రియముగా అయిపోవాలి. అంతటి బంధనముక్తులుగా అయ్యారా? ఈ దేహ బంధనము కూడా ఉంది. దేహము తన బంధనలో బంధిస్తుంది. ఒకవేళ దేహబంధన నుండి ముక్తులైపోయినట్లయితే ఈ దేహము బంధనము వెయ్యదు. కానీ కర్తవ్యమునకు ఆధారముగా భావించి ఆధారమును ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకోవచ్చు, అటువంటి అభ్యాసము జరుగుతూ ఉందా? దేహభానమును వదిలేందుకు అనగా దాని నుండి అతీతంగా అయ్యేందుకు ఎంత సమయం పడుతుంది? ఒక్క క్షణం పడ్తుందా? ఎప్పుడూ ఒక్క క్షణం పడ్తుందా లేక ఒక్కోసారి ఒక్కోరకంగా సమయం పడ్తుందా? (ఒక్కోసారి ఒక్కో విధంగా) ఇప్పుడు అన్ని బంధనాల నుండి ముక్తులవ్వలేదని దీనిద్వారా నిరూపణ అవుతోంది. ఎంత బంధనముక్తులో అంతగానే యోగుయుక్తులుగా అవుతారు మరియు ఎంత యోగయుక్తులుగా ఉంటారో అంతగానే జీవనముక్తిలో ఉన్నత పదవి ప్రాప్తి ఉంటుంది. ఒకవేళ బంధనముక్తులుగా లేనట్లయితే యోగయుక్తులుగా కూడా ఉండరు. వారిని మాస్టర్ సర్వ శక్తివంతులు అని అంటారా? దేహ సంబంధాలు మరియు దేహ పదార్ధాల నుండి మోహమును తొలగించటము సులభమే కానీ దేహ భానము నుండి ముక్తులవ్వటమన్నది శ్రమతో కూడుకున్న విషయము. ఇప్పుడు ఏ బంధనము మిగిలిపోయి ఉంది? ఇదే, దేహ భావము నుండి ముక్తులైపోవటము. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వ్యక్తములోకి రావాలి. ఇటువంటి అభ్యాసమును ఇప్పుడు చాలా ఎక్కువ వేగముతో చెయ్యాలి. ఏవిధంగా ఇప్పుడు తండ్రి ఆధారమును తీసుకొని మాట్లాడుతున్నారో అలాగే మనము కూడా దేహ ఆధారమును తీసుకొని కర్మ చేస్తున్నామని భావించాలి. ఈ అతీతత్వపు అవస్థ ప్రమాణంగానే ప్రియంగా అవ్వాలి. ఎంతగా ఈ అతీతత్వపు అభ్యాసములో ముందు ఉంటారో అంతగానే విశ్వమునకు ప్రియముగా భావించటములో ముందు ఉంటారు. సర్వుల స్నేహిగా అయ్యేందుకు మొదట అతీతంగా అవ్వాలి. సేవ చేస్తూ, సంకల్పము చేస్తూ కూడా వీరు చాలా అతీతులు మరియు చాలా ప్రియమైనవారు అని మీకూ మరియు ఇతరులకు కూడా అటువంటి అనుభవము కలగాలి. ఎంతగా స్వయము అతీతులుగా అవుతారో అంతగా ఇతరులను తండ్రికి ప్రియమైనవారుగా తయారు చెయ్యగలరు.

సేవా సఫలత స్వరూపము ఏమిటి? (అందరినుండి భిన్న-భిన్న ఆలోచనలు వెలువడ్డాయి). సర్వ ఆత్మలను తండ్రికి స్నేహులుగా మరియు తండ్రి కర్తవ్యములో సహయోగులుగా మరియు పురుషార్ధములో ఆ ఆత్మలను శక్తి స్వరూపులుగా తయారు చెయ్యటం - ఇదే  సేవా సఫలత స్వరూపము. ఏ ఆత్మలకైతే సేవ చేస్తారో ఆ ఆత్మలలో ఈ మూడు క్వాలిఫికేషన్లు(అర్హతలు) ప్రత్యక్ష రూపంలో కనిపించాలి. ఒకవేళ ఈ మూడింటిలో ఏ ఒక్క గుణమైనా తక్కువగా ఉన్నట్లయితే సేవా సఫలత కూడా తక్కువగా ఉంటుంది. అర్థమైందా!

 ఏ ఒక్క విషయమును ముఖ్యంగా ధ్యానములో ఉంచుకోవాలి మరియు ధారణ చెయ్యాలి? దీని ద్వారానే ఈ సఫలతా స్వరూపమును ప్రాక్టికల్‌లో తీసుకురాగలరు, అది ఏ విషయము? చాలా సహజము. కష్టమైన పనిపై ధ్యానమును ఇచ్చి ధారణ చేస్తారు మరియు సహజ విషయమును వదిలెయ్యటం ద్వారా సహజమును ధారణ చెయ్యటంలో ఆలస్యమౌతుంది. ఇది తెలుసా? ఇదేమంత పెద్ద విషయం కాదు, అయిపోతుందిలే అని భావించటం జరుగుతుంది. కానీ జరిగేదేమిటి? అయిపోతుందిలే.... అయిపోతుందిలే అని అనుకుంటూ అనుకుంటూనే ధ్యానము నుండి తొలగిపోతుంది. కావుననే ధారణరూపులుగా కూడా అవ్వరు. మరి అది ఏ విషయము? ఒకవేళ ఆ విషయమును, ధారణ చేసినట్లయితే సఫలతా స్వరూపులుగా అవ్వగలరు.(సాక్షిస్థితి). ఈ విషయము సరైనది. ఈరోజు బాప్ దాదా సాక్షి స్థితి అనే రాఖీని కట్టడానికి వచ్చారు. ఒకవేళ ఈ సాక్షి స్వరూపపు రాఖీ ఎల్లప్పుడూ కట్టబడి ఉంటే సేవా సఫలత చాలా త్వరగా వెలువడుతుంది. ఇప్పుడు ఏ కర్తవ్యమునకైతే ఒక మాసము పడుతుందో ఆ కర్తవ్యమునకు ఒక గంట కూడా పట్టదు. ఈ సాక్షి స్థితి అనే రాఖీ కట్టుకోవాలి. ఇతరులకైతే పవిత్రతా రాఖీని కడతారు, కానీ బాప్ దాదా ఈ రోజు ఈ సాక్షి స్థితి అనే రాఖీని కడుతున్నారు. ఎంతగా  సాక్షిగా ఉంటారో అంతగా సాక్షాత్కారమూర్తులుగా మరియు సాక్షాత్ మూర్తిగా అవుతారు. సాక్షి స్థితి తక్కువగా ఉన్న కారణంగా సాక్షాత్ మూర్తులుగా మరియు సాక్షాత్కారమూర్తులుగా కూడా తక్కువగా అయ్యారు. కావున ఈ అభ్యాసము చెయ్యండి. ఏ అభ్యాసము? ఇప్పుడిప్పుడే ఆధారమును తీసుకున్నారు. ఇప్పుడిప్పుడే అతీతమైపోవడము... ఈ అభ్యాసమును పెంచుకోవటము అనగా సంపూర్ణతను మరియు సమయమును సమీపముగా తీసుకురావటము. మరి ఇప్పుడు ఏ ప్రయత్నమును చెయ్యాలి? సమయము మరియు సంపూర్ణతను సమీపములోకి తీసుకురండి. మరొక విషయమును కూడా విశేషంగా ధ్యానములో ఉంచుకోవాలి, అది - మీ రికార్డును మంచిగా ఉంచుకొనేందుకు అందరికీ రిగార్డు (గౌరవము)ను ఇవ్వండి. ఎంతగా సర్వులకు రిగార్డును ఇస్తారో అంతగానే మీ రికార్డును మంచిగా ఉంచుకోగలరు. ఇతరులకు రిగార్డును ఇవ్వటము అనగా మీ రికార్డును మంచిగా తయారుచేసుకోవటము. ఒకవేళ తక్కువ రిగార్డును ఇచ్చినట్లయితే మీ రికార్డులో లోపము చేసుకుంటారు. కావున ఈ ముఖ్యమైన విషయము యొక్క ఆవశ్యకత ఉంది. అర్థమైందా! ఏవిధంగా యజ్ఞమునకు సహాయకులుగా అవ్వటమే సహాయము తీసుకోవటమో అలా గౌరవమును ఇవ్వటమే గౌరవము తీసుకోవటము. తీసుకొనేందుకే ఇస్తారు. ఒక్కసారి ఇవ్వటము అనేకసార్లు తీసుకొనేందుకు హక్కుదార్లుగా తయారుచేస్తుంది. చిన్నవాళ్ళకు ప్రేమను, పెద్దవారికి గౌరవమును ఇవ్వాలని అంటారు కదా! కానీ అందరినీ పెద్దవారిగా భావించి గౌరవమును ఇవ్వటము ఇదే సర్వుల స్నేహమును ప్రాప్తి చేసుకొనేందుకు సాధనము. ఈ విషయము కూడా విశేష ధ్యానమును ఉంచేందుకు యోగ్యమైనది. ప్రతి విషయములోనూ మొదట మీరు. దీనిని వృత్తి, దృష్టి మరియు వాణి, కర్మలో తీసుకురావాలి. ఎంతగా మొదట మీరు అని అంటారో
అంతగానే విశ్వపిత సమానంగా అవ్వగలరు.

విశ్వపిత సమానము అన్నదాని అర్థం ఏమిటి? ఒకటేమో విశ్వపిత సమానంగా అవ్వటము. రెండవది ఎప్పుడైతే విశ్వ రాజులుగా అవుతారో అప్పుడు కూడా విశ్వపిత అనే అంటారు కదా! విశ్వరాజే  విశ్వపిత కదా! కావున విశ్వపితగా కూడా అవుతారు మరియ విశ్వపిత సమానంగా కూడా అవుతారు. దేనితో అవుతారు? మొదట మీరు అని అనటం ద్వారా. అర్థమైందా?

నిర్మానులుగా అవ్వటం ద్వారా ప్రత్యక్ష ప్రమాణులుగా అవ్వగలరు. నిర్మానులుగా అవ్వటము ద్వారా విశ్వ నిర్మాణము చెయ్యగలరు. అర్థమైందా? అటువంటి స్థితిని ధారణ చేసేందుకు సాక్షిస్థితి అనే రాఖీని కట్టుకోవాలి. ఎప్పుడైతే మొదటి నుండే సాక్షిస్థితి అనే రాఖీని కట్టుకొని ఉన్నట్లయితే రాఖీ సేవ సఫలతాపుర్వకంగా జరుగుతుంది. అర్థమైందా!

పార్టీలతో - సమ్మేళనము చేస్తున్నారు. సమ్మేళనమునకు గల అర్థము ఏమిటి? సర్వ ఆత్మల మిలనము. సర్వ ఆత్మల మిలనమును ఎవరితో చేయిస్తారు? తండ్రితో, ఇప్పుడు ఇది ఏ సమయము? సంపూర్ణతా సమయము సమీపముగా వచ్చే సమయము, కావున వర్తమాన సమయ ప్రమాణంగా సఫలత నిశ్చితయ్యే ఉంది. కల్పపూర్వము కూడా పురుషార్థమును నిమిత్తమాత్రముగా చేయించారు. పురుషార్థము ఈరోజు, ప్రాప్తి ఎప్పుడో అని కూడా కాదు. ఇప్పుడిప్పుడే పురుషార్థము, ఇప్పుడిప్పుడే ప్రాప్తి. అటువంటి పురుషార్థులేనా? ఎప్పుడైతే స్వయం ప్రాప్తి స్వరూపులుగా అవుతారో అప్పుడు ఇతర అనేక ఆత్మలకు ప్రాప్తిని చేయించగలరు. ఒకవేళ స్వయమే ప్రాప్తి స్వరూపులుగా అవ్వనట్లయితే ఇతరులకు ఎలా ప్రాప్తి చేయించగలరు? ఇప్పుడు చేయించకపోతే మరింకెప్పుడు చేయిస్తారు? వినిపించి ఉన్నాము కదా - “ఎప్పుడో" అన్న మాటకూడా సమాప్తము, ప్రతి విషయములో “ఇప్పుడు", వాణి, కర్మ మరియు సంకల్పములో ఇంతటి పరివర్తనను తీసుకురావాలి. సంకల్పములో కూడా ఎప్పుడో చేస్తాములే లేక ఎప్పుడో అవుతుందిలే అన్న మాట కూడా రాకూడదు. ఇప్పుడు అయి తీరుతుంది, అలా పరివర్తన చెయ్యాలి. అప్పుడే సేవా సఫలత ఉంటుంది. ఒకవేళ స్వయములోనే ఎప్పుడో అవుతుందిలే అని ఉన్నట్లయితే మీ ప్రజలు కూడా చాలా మంచిగా అయితే అనిపిస్తుంది, ఎప్పుడైనా చేస్తాములే లేక ఎప్పుడో అయిపోతుందిలే అని అంటారు. ఎప్పుడో అన్నదానిపై వదిలేసే వారు వెనుక వచ్చే ప్రజలుగా ఉంటారు. కావున ఇప్పుడు సమీప ప్రజలను తయారు చెయ్యాలి. సమీప ప్రజలను తయారు చేసేందుకు నాజూకుతనమును వదలవలసి ఉంటుంది. సుకుమారంగా నడవడం వదిలిపెట్టి రహస్యము నెరిగినవారిగా నడుచుకోవాలి. నిర్లక్ష్యము నాజూకుతనము అవుతుంది. ఎంతెంతగా రాజయుక్తంగా ఉంటారో అంతంతగా నాజూకుతనము వదిలిపోతూ ఉంటుంది. ఆత్మికతకు చెందిన ఒకటే రూపము ఎల్లప్పుడూ ఉంటుందా? రూపమును మార్చేందుకు బదులుగా ఈ శరీరభానమును వదలాలి, ఈ అభ్యాసములో ఉండాలి. శరీరమును వదిలే అభ్యాసము ఉన్నట్లయితే రూపము మారటము వదిలిపోతుంది. చదువులో కూడా రెగ్యులర్ గా ఉండటము కూడా ముఖ్యమైన విషయము. అది కూడా కేవలము క్లాసుకు రావటములోనే కాదు, ప్రతి విషయములో రెగ్యులర్, ఎంతటి రెగ్యులర్ లో అంతటి రూలర్లుగా అవుతారు. కావున ఏం చెయ్యవలసి ఉంటుంది? అన్ని విషయాలలో రెగ్యులర్. అమృతవేళ లెయ్యటం నుండి ప్రతి కర్మ, ప్రతి సంకల్పము మరియు ప్రతి మాటలోకూడా రెగ్యులర్. ఒక్క మాట కూడా వ్యర్థమైన మాటగా వెలువడకూడదు. ఈ ప్రపంచములోని పెద్ద పెద్దవారు ఎవరైతే ఉంటారో వారు ఉపన్యాసమును ఇచ్చే సమయములో వారు మాట్లాడే మాటలు కూడా ఫిక్స్ చెయ్యబడి ఉంటాయి. మీరు కూడా చాలా పెద్ద మనుష్యులు కదా! కావున మీ మాటలు కూడా ఫిక్స్ అయ్యి ఉండాలి. మాయ మిక్స్ ఉండకూడదు. ఇటువంటి రెగ్యులర్ లుగా అయ్యేవారి సేవ సఫలమయ్యే ఉంటుంది. సమ్మేళనపు ప్రతి కార్యమును చేస్తూకూడా మేము విశ్వము ముందు సాక్షాత్కారమూర్తులము అన్నదానిని ఎప్పుడూ మరువకూడదు. సాక్షాత్కారమూర్తిగా అవ్వటంతో మీ ద్వారా బాప్ దాదాల సాక్షాత్కారము స్వతహాగనే జరుగుతుంది. స్వయమును ఎప్పుడైతే జ్ఞాన యోగములకు ప్రత్యక్ష ప్రమాణంగా తయారుచేస్తారో అప్పుడే దానిని చెయ్యగలరు. ఎంతగా స్వయమును ప్రత్యక్ష ప్రమాణంగా తయారుచేస్తారో అంతగానే తండ్రిని ప్రత్యక్షము చెయ్యగలరు. అచ్ఛా!

Comments