05-12-1974 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
వ్యర్ధసంకల్పాలను సమర్ధంగా చేసుకోవటం ద్వారా కాలునిపై విజయం.
కాలుని పై విజయం ఇప్పించేటువంటి, సర్వశక్తుల యొక్క అధికారిగా తయారుచేసేటువంటి బాప్ దాదా మాట్లాడుతున్నారు -
అవ్యక్త కలయిక అని దేనిని అంటారు? ఎవరితో కలయిక జరుగుతుందో వారి సమానంగా అవ్వవలసి ఉంటుంది. కనుక అవ్యక్త కలయిక అంటే బాబా సమానంగా అవ్యక్త రూపధారిగా అవ్వాలి. అలా అయ్యారా? వ్యక్త దేశం యొక్క, వ్యక్త దేహం యొక్క, మరియు వ్యక్త వస్తువుల యొక్క ఆకర్షణ కొద్దిగా కూడా తమ వైపు ఆకర్షితం చేసుకోకూడదు. ఇటువంటి స్థితి తయారుచేసుకున్నారా? మొట్ట మొదటి ప్రతిజ్ఞ ఏమిటంటే నీతోనే వింటాను మరియు నీతోనే మాట్లాడతాను అని. ఈ ప్రతిజ్ఞ నిలుపుకునేటందుకు రాత్రి, పగలు ఎప్పటి వరకు అవ్యక్త లేదా నిరాకారి స్థితిలో స్థితులవ్వరో అప్పటి వరకు బాప్ దాదాతో వెనువెంట ఉండే అనుభవం చేసుకోగలరా, అంటే ప్రతిజ్ఞ నిలుపుకోగలరా? రోజంతటిలో ఎంత సమయం ఈ ప్రతిజ్ఞ నిలుపుకుంటున్నారు? ఎవరితో కలయిక జరుగుతుందో ఆ స్థానంలో, ఆ స్థితి స్వయం తయారుచేసుకోవాల్సి ఉంటుంది. స్థానం మరియు స్థితి ఈ రెండు మారుతూ ఉంటాయి. అప్పుడే ఈ ప్రతిజ్ఞ నిలుపుకోగలరు. వ్యక్తభావంలోకి రావటం, ఏదోక వ్యక్తి లేదా వస్తువుపై భావన ఉండటం అంటే వీరు ప్రియమైనవారు, మంచివారు అని వ్యక్తి మరియు వస్తువుపై ఈ భావన ఉండటం అంటే ఇది కామన రూపంగా అయిపోతుంది. ఎప్పటి వరకు కామన ఉంటుందో అప్పటి వరకు మాయను సంపూర్ణంగా ఎదుర్కోలేరు. ఎప్పటి వరకు ఎదుర్కోలేరో అంత వరకు సమానంగా కాలేరు అంటే ప్రతిజ్ఞను నిలుపుకోలేరు.
ఎలా అయితే మీరు చిత్రంలో కృష్ణుడిని సృష్టి యొక్క గ్లోబ్ పై చూపిస్తారు. ఆ చిత్రం యొక్క మీ ప్రత్యక్ష స్థితిని తయారు చేసుకోండి. ఈ వ్యక్త దేశానికి లేదా ఈ పాత ప్రపంచానికి అతీతం అయిపోండి. వ్యక్తభావం మరియు వ్యక్తవస్తువులతో అతీతం అంటే వాటిపై సాక్షి అయ్యి నిల్చుని ఉండాలి. ఎలా అయితే పాదం క్రింద గ్లోబ్ చూపిస్తారో లేదా గ్లోబ్ పై కూర్చున్నట్లుగా చూపిస్తారో అంటే ఆయన యొక్క అధికారి స్థితి, యజమాని స్థితి చూపిస్తారు, కనుక మీ చిత్రాన్ని ఇలా తయారుచేసుకోండి. ఈ పాత ప్రపంచంలో ఎలా అయితే మీ స్వ కోరికతో, మీరు రచించుకున్న సంకల్పాల ఆధారంతో అవ్యక్తం నుండి వ్యక్తంలోకి వస్తున్నారు. వ్యక్తి లేదా వస్తువుల యొక్క ఆకర్షణకు అధీనం అయ్యి కాదు. ఎలా అయితే లిఫ్ట్ ఎక్కినప్పుడు మొదటి ఫ్లోర్ కి వెళ్ళాలన్నా, రెండవ ఫ్లోర్లోకి వెళ్ళాలన్నా స్విచ్ మీ చేతులో ఉంటుంది. స్విచ్ కంట్రోల్ నుండి బయటికి వచ్చేస్తే ఫలితం ఏమి వస్తుంది? మధ్యలో ఆగిపోతుంది కదా? అలాగే ఈ స్మృతి యొక్క స్విచ్ అదుపులో ఉంచుకోండి. ఎక్కడ కావాలంటే, ఎప్పుడు కావాలంటే, మరియు ఎంత సమయం కావాలంటే అలా మీ స్థానాన్ని లేదా స్థితిని సెట్ చేసుకోండి. ఇలా అధికారిగా అయ్యారా? కాలునిపై విజయం పొందారా? కాలుడు అంటే సమయం. కాలునిపై విజయీగా అయ్యారా? ఒకవేళ పాండవసేన లేదా శక్తి సేనకు ఈ స్థితి అంతిమ సమయంలో కనుక వస్తే శాంతి శక్తి విజ్ఞానశక్తి కంటే తక్కువ అయిపోయినట్లే కదా! ఎందుకంటే విజ్ఞానం ఇప్పుడు కూడా ఈ తత్వాలపై విజయం పొందింది.
ప్రదర్శినీలో రావణుడు 4 తత్వాలపై విజయం పొందినట్లుగా మీరు చిత్రం చూపిస్తారు కదా! దానిలో కాలుడిని కూడా చూపిస్తారు కదా? రావణుడు అంటే రావణశక్తి అయిన విజ్ఞానం ఇప్పుడు కూడా ఎక్కువగా హద్దు యొక్క తత్వాలపై విజయం పొందింది. కనుక విజ్ఞానం మీ కంటే శక్తిశాలి అయ్యింది కదా? విజ్ఞానశక్తి తన ప్రత్యక్ష ఋజువు చూపిస్తున్నప్పుడు శాంతిశక్తి ప్రత్యక్ష ఋజువు అంతిమంలో ఇస్తుందా? సమయంపై విజయీ అంటే కాలునిపై విజయీ. ఇప్పుడు దీని శాతం తక్కువగా ఉంది. స్వయాన్ని నిరాకారి స్థితి లేదా అవ్యక్త స్థితిలో స్థితులు చేసుకుంటున్నారు. కానీ ఎంత సమయం స్థితులవ్వాలనుకుంటున్నారో అంత సమయం ఆ స్థితిలో స్థితులవ్వటంలేదు. స్థితి యొక్క అనుభవాన్ని కూడా పొందుతున్నారు, శ్రమ కూడా చేస్తున్నారు. కాని కాలునిపై విజయం పొందటం లేదు. దీనికి కారణం ఏమిటి? అరగంట శక్తిశాలి స్మృతిలో కూర్చోవాలి అని ఆలోచిస్తున్నారు మరియు అరగంట కూర్చుంటున్నారు కూడా మరియు ప్లాన్ కూడా తయారు చేసుకుంటున్నారు. కానీ ఎంతెంతగా ఏ స్థితి కోసం ఆలోచిస్తున్నారో అంత సమయం ఆ సమయంలో ఆ స్థితిలో స్థితులు కాలేకపోతున్నారు. మూడవ ఫ్లోర్ కి వెళ్ళాలి అని ఆలోచించి స్విచ్ ఆన్ చేసున్నారు. కానీ రెండవ ఫ్లోర్ కి వెళ్తున్నారు. ఎందుకంటే కాలునిపై విజయం పొందలేకపోతున్నారు. దీనికి కారణం ఏమిటంటే - రోజంతటిలో మాటి మాటికి సమయాన్ని పోగొట్టుకునే అభ్యాసిగా అయిపోయారు. వ్యర్ధంపై ధ్యాస పెట్టుకోవటం ద్వారానే కాలునిపై విజయం పొందటంలో సమర్థంగా అవుతారు. ఎప్పటి వరకు సమయం వ్యర్థంగా పోతుందో అంత వరకు విజయం పొందటంలో సమర్థంగా కాలేరు. దీని కారణంగా ఏ కలయిక అనుభవం చేసుకోవాలనుకుంటున్నారో లేదా నిరంతరం ప్రతిజ్ఞ నిలుపుకోవాలనుకుంటున్నారో అది నిలుపుకోవటం లేదు. ఇప్పుడు మీ అదృష్టం యొక్క చిత్రాన్ని అన్ని తత్వాలపై మరియు కాలునిపై సదా విజయీగా ఉండే విధంగా తయారు చేసుకోండి. ఎప్పుడైతే ఒక్కొక్క సెకను వ్యర్ధం నుండి సమర్ధంలోకి పరివర్తన చేసుకుంటారో, అప్పుడే విజయీగా అవుతారు. మంచిది.
ఇలా సదా విజయీలకు, సదా అధికారులకు, నిరంతరం ప్రతిజ్ఞ నిలుపుకునేవారికి, ప్రతి ఒక్కరిని వ్యర్ధం నుండి సమర్థంలోకి పరివర్తన చేసేవారికి, సదా వ్యక్తభావానికి అతీతంగా అవ్యక్త స్థితిలో ఉండేటువంటి అదృష్ట సితారలకు లేదా సమీప సితారలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment