05-12-1970 అవ్యక్త మురళి

 * 05-12-1970         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“ప్రతిజ్ఞ చేసేవారికి మాయ ఛాలెంజ్."

          శబ్దము నుండి దూరంగా వెళ్ళటము మరియు తీసుకువెళ్ళటము వస్తుందా? ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు శబ్దములోకి రావటము మరియు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు శబ్దము నుండి దూరంగా వెళ్ళటము, ఇటువంటి సహజ అభ్యాసులుగా అయ్యారా? ఈ పాఠమును పక్కా (దృఢం) చేసుకున్నారా? విజయీరత్నాలుగా అయ్యారా? దేనిపై విజయిలుగా అయ్యారు? అందరి హృదయాలలో విజయాన్ని ప్రాప్తింపచెయ్యగలరా? ఏవిధంగా బాప్ దాదా యొక్క ఈ కర్తవ్య గుణమునకు స్మృతి చిహ్నము ఇక్కడ ఉందో అలా తండ్రి సమానంగా విజయులుగా అయ్యారా? అన్నింటిపై విజయాన్ని పొందారా? ఇతరులెవరైనా మీపై విజయులుగా అవ్వగలరా? ఇటువంటి స్థితిని భట్టీలో తయారుచేసుకొన్నారా? భట్టీ నుండి వెళ్ళిన తరువాత ప్రాక్టికల్ పరీక్ష ఉంటుంది. పాస్ విత్ హానర్ అనగా సంకల్పములో కూడా ఫెయిల్ అవ్వకుండా ఉండటము, అలా తయారయ్యారా? 'సరే, అలాగేనండి' అన్న నినాదాన్ని చాలా బాగా చేసారని నిన్న సమాచారమును విన్నాము. ఇటువంటి ప్రతిజ్ఞ చేసేవారు పాస్ విత్ హానర్ గా అవ్వాలి. ప్రతిజ్ఞ చేసేవారి నుండి బాగా ఎక్కువగా ప్రాక్టికల్ పరీక్షను తీసుకోవాలి అన్నది మాయ ఛాలెంజ్. ఎదుర్కొనే శక్తిని ఎల్లప్పుడూ మీలో స్థిరంగా ఉంచుకోవాలి. అష్ట శక్తుల గురించి ఏదైతే వినిపించి ఉన్నామో, వాటిని మీలో ధారణ చేసారా? జ్ఞానమూర్తిగా, గుణమూర్తిగా ఇరువురిగా అయ్యారా? మాయకు మంచిగా సదాకాలమునకు వీడ్కోలు ఇచ్చేసారా? మీరు ఇచ్చే స్థూలమైన వీడ్కోలుకు ముందే మాయకు వీడ్కోలు ఇవ్వాలి. మాయ కూడా చాలా చతురమైనది. ఎవరైనా శరీరమును వదిలినప్పుడు (మరణించినప్పుడు) ఒక్కోసారి శ్వాస లోపల దాగి ఉంటుంది, వీరు మరణించారని మిగిలిన వారు కూడా భావించేస్తారు కానీ దాగి ఉన్న ఆ శ్వాస మళ్ళీ ఒక్కోసారి పని చెయ్యటం మొదలుపెడ్తుంది. అలాగే మాయ తన అతి సూక్ష్మరూపాన్ని కూడా ధారణ చేస్తుంది, డాక్టర్లు కూడా ఇంకా శ్వాస (ప్రాణం) ఎక్కడైనా దాగి లేదు కదా అని బాగా పరిశీలిస్తుంటారు. అలాగే మూడవనేత్రము ద్వారా మీ పరిశీలనను చాలా బాగా చేసుకోవాలి. అప్పుడిక, ఈ విషయము గురించి అయితే మాకు ఇప్పుడే తెలిసింది అన్న మాటలు ఎప్పుడూ వెలువడవు. కావుననే బాప్ దాదా ముందు నుండే జాగ్రత్తపరులుగా, తెలివైనవారుగా తయారుచేస్తున్నారు, ఎందుకంటే ప్రతిజ్ఞ చేసారు, ఏ స్థానములో ప్రతిజ్ఞ చేసారు? ఎవరి ముందు చేసారు? ఈ విషయాలన్నింటినీ గుర్తు ఉంచుకోవాలి. ప్రాప్తినైతే చేసారు కానీ ప్రాప్తితో పాటు ఇంకేం చెయ్యవలసి ఉంటుంది? ప్రాప్తి చేసారు, కానీ అన్నీ తృప్తి అయ్యేంతగా ప్రాప్తి పొందారా? ఎంత తృప్తులుగా అవుతారో అంతగా ఇచ్ఛామాత్రం అవిద్య (కోరిక అంటేనే తెలియనివారు) గా అవుతారు. కామన (కోరిక) కు బదులుగా సామ్ నా (ఎదుర్కొనే) శక్తి  వస్తుంది. పాత వృత్తుల నుండి నివృత్తులవుతారు  - ఇవన్నీ పరీక్షలోని ప్రశ్నలు, ఈ పరీక్షలు ప్రాక్టికల్ గా రానున్నాయి. మిమ్మల్ని పూర్తి క్లియర్ గా లేక చేసుకొన్నారా, డోంట్  కేర్  (లెక్కచెయ్యని) శక్తిని మీలో ధారణ చేసారా? స్వయము మరియు సమయము,  రెండింటిని గుర్తించి మంచిగా స్పష్టముగా తెలుసుకున్నారా? వీటన్నింటినీ చేసారా లేక చెయ్యవలసి ఉందా? అన్ని విషయాలలో ప్రాప్తిని పొంది తృప్త ఆత్మగా అయ్యి పరీక్ష హాలులోకి వెళ్ళేందుకు ధైర్యవంతులుగా, శక్తివంతులుగా అయ్యాము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. అన్ని విషయాలలో పరీక్షను ఇచ్చేందుకు మరియు పాస్ విత్ హానర్ గా  అయ్యే ధైర్యము కలిగినవారుగా, శక్తివంతులుగా ఎవరైతే తయారయ్యారో వారు చేతులెత్తండి. అచ్ఛా, ఇప్పుడు ప్రాక్టికల్ పరీక్ష యొక్క రిజల్టును చూస్తాము, ఎవరైతే ఈ నెలలో పాస్ విత్ హానర్ రిజల్టును చూపిస్తారో వారికి బాప్ దాదా  విశేషంగా స్మృతి బహుమతిని ఇస్తారు. కానీ కేవలం పాస్ కాదు, పాస్ విత్ హానర్ గా అవ్వాలి. మీ మీ రిజల్టును వ్రాసి పంపాలి. ఇంత పెద్ద గ్రూపులో ఎంతమంది  పాస్ విత్ హానర్ గా వెలువడుతారో అప్పుడు చూస్తాము. కానీ మీ టీచరు మరియు మీ తోటివారు ఎవరైతే ఉన్నారో వారి నుండి కూడా సర్టిఫికేట్ ను తీసుకోవాలి, అప్పుడే స్మృతి బహుమతి లభిస్తుంది. సహజమే కదా! ఉన్నదే ధైర్యవంతులుగా అయినప్పుడు ఇదేమంత కష్టమైనది? నేను విజయీమాలలోని విజయీరత్నాన్ని అన్న స్మృతిని ఎల్లప్పుడూ ఉంచుకోవాలి. ఈ స్మృతిలో ఉండటం ద్వారా ఇక ఎప్పుడూ ఓటమి ఉండదు. అచ్ఛా! సమాప్తిలో పూర్ణరీతితో బలి అయిపోతాము అని అందరూ అన్నారు మరి సంపూర్ణముగా బలి అయ్యారా?  మహాబలులుగా అయి వెళుతున్నారా లేక ఇంకా మరణించవలసి ఉందా? మాహాబలుల ముందు మాయ బలము పని చెయ్యజాలదు.

          ఇటువంటి నిశ్చయమును మీలో ధారణ చేసి వెళ్తున్నారు కదా! రిజల్టును చూస్తాము, అప్పుడు బాప్ దాదా అటువంటి విజయీరత్నాలకు ఒక అలౌకికమైన మాలను ధరింపచేస్తారు. అచ్చా!

Comments