* 05-11-1970 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
"ఆలస్యము ప్రమాదకరము"
ప్రతి ఒక్కరూ తమ లైట్ మరియు మైట్(శక్తి)ని చూసి పరీక్షించుకోగలరా? మిమ్మల్ని మీరు పరీక్షించుకొనే శక్తిని మీలో అనుభవము చేస్తున్నారా? మిమ్మల్ని ఇప్పటివరకు పురుషార్థీ మూర్తిగా భావిస్తున్నారా లేక సాక్షాత్ మరియు సాక్షాత్కారమూర్తిగా కూడా భావిస్తున్నారా లేక అనుభవము చేసుకుంటున్నారా? లేక ఇది అంతిమ స్థితి అని భావిస్తారా? ఇప్పుడిప్పుడే మీ భక్తులు మీ సమ్ముఖమునకు వచ్చినట్లయితే మీ ముఖము నుండి వారికి ఏ మూర్తి సాక్షాత్కారమౌతుంది? ఏ సాక్షాత్కారమౌతుంది? సాక్షాత్కారమూర్తులు ఎల్లప్పుడూ సంపూర్ణస్థితి యొక్క సాక్షాత్కారమును చేయిస్తారు, కానీ ఇప్పుడు ఒకవేళ మీ ఎదురుగా ఎవరైనా వచ్చినట్లయితే వారికి అటువంటి సాక్షాత్కారమును చేయించగలరా? మీ పురుషార్థములోని ఎగుడు-దిగుళ్ళు వారికి సాక్షాత్కారమౌతూ ఉండకూడదు కదా! ఫోటో తీసే సమయంలో ఎవరైనా కదిలితే ఆ ఫోటో సరిగ్గా వస్తుందా? అలాగే ఎల్లప్పుడూ మా ఫోటో తీస్తున్నారు అని ప్రతి క్షణమూ భావించండి. ఫోటో తీసే సమయంలో అన్నివిధాలుగా ధ్యానమును ఉంచటం జరుగుతుంది, అలాగే మీపై ఎల్లప్పుడూ ధ్యానమును ఉంచుకోవాలి. ఒక్కొక్క క్షణమూ ఈ సర్వోత్తమ మరియు పురుషోత్తమ సంగమయుగపు డ్రామారూపీ కెమరాలో మీ అందరి ఫోటో వెలువడుతూ ఉంటుంది. ఈ చిత్రమే మళ్ళీ చరిత్ర రూపములో గాయనమవుతూ ఉంటుంది. మరియు ఇప్పటి భిన్న భిన్న స్థితుల చిత్రములు భిన్న-భిన్న రూపములో పూజ్యనీయమౌతాయి. మా చిత్రమును డ్రామారూపీ కెమరా ఎదురుగా తీస్తూ ఉన్నారు అని ప్రతి సమయమూ స్మృతిలో ఉంచుకోండి. ఇప్పటి ఒక్కొక్క చిత్రము ఒక్కొక్క చరిత్ర గాయనయోగ్యము మరియు పూజనయోగ్యముగా అవుతుంది. ఎలాగైతే ఇక్కడ కూడా మీరు ఎవరైనా డ్రామా స్టేజీపైన డ్రామా చేస్తున్నప్పుడు గానీ, సాక్షాత్కారము చేయిస్తున్నప్పుడుగానీ ఎంతటి ధ్యానమును ఉంచుతారు! అలా అనంతమైన స్టేజ్ మధ్యలో పాత్రను అభినయిస్తున్నాను, మొత్తము విశ్వములోని ఆత్మల దృష్టి నావైపే ఉంది అని భావించండి. ఇలా భావించటం ద్వారా సంపూర్ణతను త్వరగా ధారణ చెయ్యగలరు. అర్థమైందా! ఒక స్లోగన్‌ను ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవటం ద్వారా సహజంగానే త్వరగా సంపూర్ణంగా అవ్వగలరు. ఏ స్లోగనన్ను గుర్తు పెట్టుకుంటారు? (వెళ్ళటము మరియు రావటము). అదైతే కరెక్టే, కానీ ఎలా వెళ్ళాలి, సంపూర్ణంగా అయ్యి వెళ్ళాలా లేక ఇలాగే వెళ్ళాలా? ఇందుకొరకు దేన్ని గుర్తు పెట్టుకోవాలి? ఆలస్యం ప్రమాదము. ఒకవేళ ఏ విషయములోనైనా ఆలస్యం చేసినట్లయితే రాజ్య భాగ్యపు అధికారములో కూడా అంత ఆలస్యం అవుతుంది. కావున వర్తమాన సమయప్రమాణంగా ఒక్క క్షణము కూడా ఆలస్యం చెయ్యకూడదు అన్నదానిని ఎల్లప్పుడూ గుర్తు ఉంచుకోండి. ఈ రోజుల్లో కంప్లీట్ అనగా సంపూర్ణ కర్మాతీతంగా అయ్యేందుకు పురుషార్థము చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు ముఖ్యంగా ఒక కంప్లైంట్ (ఫిర్యాదు) సమయ ప్రతి సమయము అందరి నుండీ వస్తుంది. కంప్లీట్ అవ్వాలనే అనుకుంటారు కానీ ఆ కంప్లైంట్ కంప్లీట్ అవ్వనివ్వదు. అది ఏ కంప్లైంట్? వ్యర్థ సంకల్పాల కంప్లైంట్. కంప్లీట్ అవ్వటంలో వ్యర్థ సంకల్పాల తుఫానులు విఘ్నము కలిగిస్తున్నాయి. ఇది ఎక్కువలో ఎక్కువమందిలోని కంప్లైంట్. ఇప్పుడు దీనిని తొలగించేందుకు ఈ రోజు యుక్తిని తెలుపుతాము. మనస్సులోని వ్యర్థ సంకల్పాల కంప్లైంట్ ఎలా ముగుస్తుంది? సృతియాత్ర అయితే ముఖ్యమైన విషయము, కానీ ఇందుకొరకు భిన్న భిన్న యుక్తులు ఉన్నాయి. అవి ఏ యుక్తులు? పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారివద్ద వారి ప్రతి సమయమును గురించిన అపాయింట్‌మెంట్ డైరీ తయారై ఉంటుంది. వారి ప్రతి గంటా ఫిక్స్ అయ్యి ఉంటుంది. మీరు కూడా చాలా పెద్దవారు కదా! కావున ప్రతిరోజూ అమృతవేళ మొత్తము రోజుకు సంబంధించి మీ అపాయింట్‌మెంట్ డైరీని తయారు చెయ్యండి. ఒకవేళ మీ మనస్సును ప్రతి సమయము అపాయింట్ మెంట్ లో బిజీగా ఉంచుకున్నట్లయితే మధ్యలో వ్యర్థ సంకల్పాలు మీ సమయాన్ని తీసుకోలేవు. అపాయింట్ మెంట్ నుండి ఫ్రీగా ఉంటారు కాబట్టి అప్పుడు వ్యర్థ సంకల్పాలు సమయాన్ని తీసేసుకుంటాయి. కావున సమయమును బుకింగ్ చేసుకునే విధానాన్ని నేర్చుకోండి. ఈ రోజు మొత్తము రోజంతటిలో ఏమేమి చెయ్యాలి అని మీకు మీరే అపాయింట్ మెంట్ చేసుకోవాలి, అప్పుడిక సమయము సఫలమైపోతుంది. మనస్సును ఎందులో అపాయింట్ మెంట్ చేసుకోవాలి అన్నదాని కొరకు నాలుగు విషయాలు చెప్తున్నాము - 1. మిలనము, 2. వర్ణన, 3. మగనము, 4. లగనము. లగనమును ఉంచటంలో కూడా చాలా సమయము పోతుంది కదా! కావున మగ్న అవస్థలో తక్కువగా ఉంటారు. కావున లగన్, మగన్, మిలన్ మరియు వర్ణన్. వర్ణన అంటే సేవ, మిలనము అంటే ఆత్మిక సంభాషణ చెయ్యటము. బాప్ దాదాతో కలుస్తారు కదా! కావున ఈ నాలుగు విషయాలలో మీ సమయాన్ని ఫిక్స్ చేసుకోండి. ఒకవేళ ప్రతిరోజుటి మీ దినచర్యను ఫిక్స్ చేసుకొనేందుకు మొత్తము సమయానికి అపాయింట్ మెంట్ ఫిక్స్ అయి ఉన్నట్లయితే మధ్యలో వ్యర్థ సంకల్పాలకు డిస్టర్బ్ చేసేందుకు సమయమే లభించదు. ఏవిధంగా పెద్ద మనుష్యులు బిజీగా ఉన్న కారణంగా ఇతర వ్యర్థమైన విషయాలలో ధ్యానమును మరియు సమయమును ఇవ్వలేరో అలా ఈ సమయము ఈ విషయానికి, ఈ సమయము ఈ విషయంలో పెట్టాలి అని మీదినచర్యలో సమయమును ఫిక్స్ చేసుకోండి. ఇలా అపాయింట్ మెంట్ ను ఏర్పరచుకున్నట్లయితే అప్పుడు ఈ కంప్లైంట్ సమాప్తమైపోతుంది మరియు కంప్లీట్ గా అయిపోతారు. అచ్ఛా!
Comments
Post a Comment