05-09-1975 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
ఫరిస్తా స్వరూపంలో స్థితులవ్వండి.
భూలోకవాసి మనుష్యుల నుండి ఆకాశ వతనవాసి ఫరిస్తాలుగా తయారుచేసేవారు, సదా జ్యోతి రూపము, ప్రముఖ హీరో పాత్రధారి, జీరో (బిందువు) శివబాబా పిల్లల సన్ముఖంలో ఫరిస్తాగా అయ్యే పురుషార్థం చెబుతూ మాట్లాడిన మధుర మహావాక్యాలు -
ఫరిస్తా స్వరూపం యొక్క స్థితిలో సదా స్థితులవుతున్నారా? ఫరిస్తా స్వరూపం యొక్క ప్రకాశంలో ఇతరాత్మలకు కూడా ప్రకాశమే కనిపిస్తుంది. హద్దులోని పాత్రధారి తమ యొక్క హద్దులోని పాత్ర అభినయిస్తున్నప్పుడు ప్రకాశం కారణంగానే అతి సుందర స్వరూపంగా కనిపిస్తారు. అదే పాత్రధారి సాధారణ జీవితంలో, సాధారణ కాంతిలో పాత్ర అభినయిస్తే ఎలా కనిపిస్తారు? లైట్ యొక్క ఫోకస్ వారి ముఖకవళికలను పరివర్తన చేసేస్తుంది. అదేవిధంగా బేహద్ డ్రామాలో మీరు కూడా హీరో, హీరోయిన్ పాత్రధారులే. అవ్యక్త స్థితి అనే కాంతిలో ప్రతి పాత్ర చేయడం ద్వారా మీరు ఎలా కనిపిస్తారు? అవ్యక్త ఫరిస్తాగా కనిపిస్తారు, సాకారికి బదులు సూక్ష్మవతనవాసిగా కనిపిస్తారు, సాకారిగా ఉంటూ ఆకారిగా అనుభవం అవుతారు. అప్పుడు ప్రతి పాత్ర ప్రతి ఒక్కరిని స్వతహాగానే ఆకర్షితం చేసే విధంగా ఉంటుంది. ఎలాగైతే ఈ రోజుల్లో హద్దులోని సినిమా లేదా డ్రామా కలియుగ మానవులను ఆకర్షించడానికి ముఖ్య కేంద్రం. వదలాలనుకున్నా, చూడకూడదనుకున్నా హద్దులోని పాత్రధారుల పాత్ర తన వైపుకు ఆకర్షిస్తూ ఉంటుంది. దానికి ఆధారం లైటింగ్. అదేవిధంగా అంతిమ సమయంలో మాయ యొక్క ఆకర్షణ అతి అయి, ఆ తరువాత అంతం అయినప్పుడు బేహద్ హీరో పాత్రధారి, సదా జీరో స్వరూపంలొ స్థితులై జీరో బాబాతో పాటు ప్రతి పాత్ర అభినయించేవారు మరియు దివ్య జ్యోతి స్వరూపులు అనగా స్థితి కూడా లైట్ మరియు వేదికపై ప్రతి పాత్ర కూడా అభినయించే డబల్ ఫరిస్తాలు కూడా ప్రతి ఆత్మను స్వతహాగానే తమవైపుకు ఆకర్షితం చేస్తారు. ఈనాటి ప్రపంచంలో డ్రామా కాకుండా ఫరిస్తాల నయనాల వలె ఆకర్షితం చేసే మరొక సాధనం ఏది? టెలివిజన్ (టివి).టీవీ ద్వారా ప్రాపంచిక దృశ్యాలను చూస్తూ ఆకర్షితం అయిపోయి పడిపోయే కళలోకి వచ్చేస్తారు. కానీ ఫరిస్తాల నయనాలు దివ్య దూరదర్శిని వలె పనిచేస్తాయి. ఫరిస్తాల నయనాల ద్వారా కేవలం ఈ ప్రపంచమే కాదు మూడులోకాలను దర్శనం చేయించేవిగా ఉంటాయి. ఇలాంటి ఫరిస్తాల మస్తకంలో మెరుస్తున్న మణి ఆత్మలకు సెర్చ్ లైట్ వలె లేదా లైట్‌హౌస్ సమానంగా స్వ స్వరూపాన్ని, స్వ మార్గాన్ని లేదా శ్రేష్ఠ గమ్యాన్ని స్పష్టంగా సాక్షాత్కారం చేయిస్తాయి. ఇలాంటి ఫరిస్తాల యొక్క యుక్తియుక్త మాట లేదా అమూల్య మాట ప్రతి బికారీ ఆత్మను రత్నాలతో జోలెను నింపేవిగా ఉంటాయి. దేవతలు కూడా భక్తులకు ప్రసన్నమై పూలవర్షం కురిపించారని మహిమ ఉంటుంది కదా! అదేవిధంగా శ్రేష్ఠ ఆత్మలైన మీ ద్వారా విశ్వాత్మలకు సర్వ శక్తులు, సర్వ గుణాలు లేదా సర్వ వరదానాల యొక్క పూలవర్షం సర్వుల కోసం కురుస్తుంది. అప్పుడే మిమ్మల్ని అందరినీ దేవత అనగా ఇచ్చేవారిగా భావించి భక్తగణం ద్వాపరయుగం నుండి దేవతల యొక్క మహిమ మరియు పూజ చేస్తూ వచ్చారు. ఎందుకంటే అంతిమ సమయంలో సర్వ ఆత్మలు దాంట్లో కూడా విశేషంగా భారతవాసీ ఆత్మలు దేవతా ధర్మం అంతిమం వరకు వృద్ధి పొందే ఆత్మలు, సత్యయుగంలో మీ దేవతా రూపం యొక్క పాలన పొందరు కదా! కనుక తరువాత ఈ ధర్మం వృద్ధి అయ్యే సమయం మొదలుకుని అంతిమం వరకు మీ దేవతా రూపం, దాత రూపం లేదా వరదాత రూపాన్ని అనుభవం చేసుకుంటారు. అంతిమ దేవతా రూపం ద్వారా పొందిన అనేక ప్రాప్తుల యొక్క సంస్కారాన్ని లేదా స్మృతులు సర్వాత్మల్లో నిండిపోతాయి. అందువలన ప్రత్యక్ష రూపంలో సత్యయుగీ సృష్టిలో కాకుండా ద్వాపరయుగీ సృష్టి వేదికపైకి వస్తూనే దేవతా స్వరూపం యొక్క, ప్రాప్తి యొక్క స్మృతులన్నీ ప్రత్యక్షం అవుతాయి, అప్పుడే మహిమ చేస్తారు మరియు పూజిస్తారు. మీ అంతిమ ఫరిస్తా రూపం గురించి అర్థమైందా! ఇలాంటి బేహద్ పాత్రధారులు స్వతహాగానే తమవైపుకు ఆకర్షితం చేయరా? ఇదే డబల్ లైట్ స్థితి.ఇదే మిమ్మల్ని అందరినీ మరియు బాబాని ప్రత్యక్షం చేసేవి. జీరో మరియు హీరో ఇద్దరు కూడా ప్రత్యక్షం అవుతారు. అర్థమైందా (కరెంట్ పోయింది) అప్పుడు బాబా అన్నారు - ఇప్పుడు కూడా చూడండి కరెంట్ ఆధారంగా ఎన్ని పనులు జరుగుతాయి. ఇప్పుడు కూడా మిమ్మల్ని అందరినీ ఆకర్షించే వస్తువులన్నీ కరెంట్ ఆధారంగానే ఉన్నాయి. మంచిది.
ఈవిధంగా సదా జీరోతో పాటు హీరో పాత్ర అభినయించేవారికి, సదా ఇచ్చేటటువంటి దేవతా స్వరూపులకు, విశ్వంలో స్వయాన్ని మరియు బాబాని ప్రత్యక్షం చేసేవారికి, విశ్వంలోని సర్మాత్మల యొక్క సర్వ మనోకామనలు సంపన్నం చేసేవారికి, ఇలాంటి ఫరిస్తాలకు, ఫరిస్తాల ప్రపంచంలో ఉండేవారికి, ఫరిస్తాల ప్రపంచం కంటే అతీతంగా ఉండేవారికి బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment