05-05-1977 అవ్యక్త మురళి

05-05-1977         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

వరదాని, మహాదాని మరియు దాని ఆత్మల లక్షణాలు.

                          వరదాని, మహాదాని పిల్లలతో బాబా మాట్లాడుతున్నారు -
                  వరదాత బాబా తన యొక్క వరదాని, మహాదాని మరియు దాని పిల్లలను చూస్తున్నారు. ఎవరైతే స్వయాన్ని సర్వఖజానాలతో సంపన్నంగా తయారు చేసుకున్నారో వారే వరదాని పిల్లలు. ఎవరైతే సర్వ ఖజానాలతో స్వయాన్ని సంపన్నం చేసుకోలేదు కానీ కొద్దిగా శక్తిననుసరించి జమ చేసుకున్నారో వారు మహాదాని. ఎవరైతే జమ చేసుకోలేదు కానీ ఇప్పుడిప్పుడే లభించింది, ఇప్పుడిప్పుడే తీసుకున్నారు మరియు ఆ సమయంలోనే ఏది లభించిందో అదే ఇస్తారు. వారు దాని ఆత్మలు. ఎవరైతే జమ చేసుకోరో వారు సంపాదించుకుంటారు, కొంచెం తింటారు,. కొంచెం ఇస్తారు. ఇలా బాబా మూడు రకాలైన పిల్లలను చూస్తున్నారు.
                 వరదాని పిల్లలు స్వయం జమ చేసుకున్న ఖజానాలను అంటే స్వయం యొక్క శక్తిని, స్వయం యొక్క గుణాల ద్వారా, స్వయం యొక్క జ్ఞాన ఖజానా ద్వారా, నిర్బల ఆత్మలకు వరదానం ద్వారా, ధైర్యం, ఉల్లాసం, యొక్క శక్తి మరియు సంతోషం యొక్క ఖజానా, తమ సహయోగం శక్తిని ఇచ్చి బలహీనంగా ఉన్నవారిని శక్తిశాలిగా చేస్తారు. మహదానులు పురుషార్థం చేసే యుక్తులు లేదా ఉల్లాసం, ఉత్సాహంలోకి తీసుకువచ్చే యుక్తులు చెప్తూ బలహీన ఆత్మలను పురుషార్థం చేయించడానికి నిమిత్తం అవుతారు. స్మృతి ఇప్పిస్తూ సమర్థతను తీసుకు రావటానికి నిమిత్తం అవుతారు. తమ శక్తుల సహయోగం ఇవ్వరు కానీ మార్గం స్పష్టంగా చూపించడానికి నిమిత్తం అవుతారు. ఇలా చేయండి, ఇలా నడవండి అని మార్గం చూపించడానికి నిమిత్తం అవుతారు.
                 దాని పిల్లలు ఏది విన్నారో, ఏది మంచిగా అనిపించిందో, ఏది అనుభవం చేసుకున్నారో దాని వర్ణన ద్వారా ఆత్మలను బాబా వైపు ఆకర్షితం చేయడానికి నిమిత్తం అవుతారు. కానీ మార్గం చూపించేవారిగా, లేదా తమ శక్తుల సహయోగం ద్వారా శ్రేష్టంగా చేసేటువంటి మహాదానిగా కాలేరు. మొదటి నెంబర్ సహయోగం ఇచ్చేవారు, రెండవ వారు మార్గం చూపించేవారు, మూడవవారు మార్గం చెప్పేవారు. మూడింటిలో నేను ఎవరు? అని స్వయాన్ని పరిశీలన చేసుకోండి. ఎందుకంటే అనుభవం చేసుకోవాలి. దేనిని? స్వయాన్ని, స్వయం అనుభూతి యొక్క కోర్స్ నడుస్తుంది. దాని ద్వారా ఇప్పటి వరకు ఏదైతే లోపం ఉండిపోయిదో దాని నుండి స్వయాన్ని ముక్తి చేసుకోగలరు.
                 బాబా ఎలా అయితే ముక్తి దాతయో అలాగే పిల్లలు కూడా మాస్టర్ ముక్తి దాతలు. కానీ ఎప్పుడైతే మొదట స్వయం ముక్తి దాతలుగా అవుతారో అప్పుడే ఇతరులను కూడా ముక్తి చేసి తమ స్వ స్వరూపంలో మరియు స్వదేశం యొక్క స్వమానంలో స్థిరం చేయగలరు. ఈ రోజుల్లో వాతావరణంలో ప్రతి ఆత్మ ఏదోక విషయం యొక్క బంధనానికి వశమై ఉంది. నలువైపుల ఆత్మలందరు కొంతమంది తనువు యొక్క దు:ఖానికి వశీభూతమై, కొంతమంది సంబంధాలకు వశీభూతమై, కొంతమంది కోరికలకు వశీభూతమై, కొంతమంది తమ సంస్కారాలకు అంటే దు:ఖదాయి స్వభావం, దు:ఖదాయి సంస్కారం యొక్క దు:ఖానికి వశీభూతమై, కొంతమంది ప్రభు ప్రాప్తి లభించని కారణంగా అశాంతితో భ్రమిస్తూ దు:ఖానికి వశీభూతమై, కొంతమంది జీవిత లక్ష్యం స్పష్టంగా లేని కారణంగా అలజడి, కొంతమంది పశువుల వలె తింటూ, త్రాగుతూ జీవితం గడుపుతున్నారు, కానీ సంతుష్టత లేదు. కొంతమంది సాధన చేస్తూ, త్యాగం చేస్తూ, అధ్యయనం చేస్తూ కూడా గమ్యాన్ని పొందలేకపోతున్నారు. పిలవటం, అరవటం యొక్క దు:ఖానికి వశీభూతమై, ఇలా అనేక రకాలైన బంధనాలకు వశమై, దు:ఖం, అశాంతికి వశమై, ఆత్మలు ముక్తి కావాలని అనుకుంటున్నారు. ఆత్మ సంబంధంతో మీ సోదరాత్మల దు:ఖం చూసి దయ వస్తుందా? కనిపిస్తుందా? ఆత్మల దు:ఖమయ జీవితానికి ఏ తోడు లభించటం లేదు. వారు కనిపిస్తున్నారా లేక స్వయమే బిజీగా ఉన్నారా?
                 లౌకిక జీవితంలో బాల్యంలో చదువు యొక్క సమయాన్ని స్వయం కోసమే ఉపయోగించుకుంటారు. దాని తర్వాత రచనకు సమయం ఉపయోగిస్తారు అంటే ఇతరుల బాధ్యతలలో సమయాన్ని ఉపయోగిస్తారు. అలౌకికంలో కూడా మొదట స్వయాన్ని పరిపక్వంగా చేసుకునేటందుకు పురుషార్ధం చేసారు, ఇప్పుడు విశ్వకళ్యాణకారి అయ్యి విశ్వాత్మల పట్ల లేదా మీ నిజ పరివారం పట్ల సమయం ఉపయోగించాలి. విశ్వంలో సర్వాత్మలు మీ పరివారం ఎందుకంటే బేహద్ తండ్రికి పిల్లలు. కనుక బేహద్ పరివారం. మరి మీ పరివారం పట్ల దయ రావటం లేదా? ఇప్పుడు దయాహృదయులుగా అవ్వండి. మాస్టర్ రచయితలుగా అవ్వండి. మీకు లభించిన శక్తులు లేదా జ్ఞానఖజానాను మాస్టర్ జ్ఞానసూర్యులుగా అయ్యి వృత్తి, దృష్టి మరియు స్మృతి అంటే శుభభావన యొక్క శ్రేష్ట సంకల్పం ద్వారా, మీ జీవితంలో గుణాల ధారణ ద్వారా ఈ అన్ని సాధనాల కిరణాల ద్వారా అశాంతిని తొలగించండి. ఎలా అయితే సూర్యుడు ఒకే స్థానంలో ఉంటూ కూడా తన కిరణాల ద్వారా నలువైపుల ఉన్న అంధకారాన్ని దూరం చేస్తాడో అలాగే మాస్టర్ జ్ఞానసూర్యునిగా అయ్యి దు:ఖీ ఆత్మలపై దయ చూపించండి.
               స్వయం మరియు సేవ రెండింటి సమానత ఉంచుకోండి. స్వయాన్ని కూడా మర్చిపోకండి మరియు విశ్వసేవను కూడా మర్చిపోకండి. విశ్వ పరిక్రమణ చేయటం అనేది ఎంత సమయం యొక్క పని? విశ్వయజమానికి పిల్లలు కనుక యజమాని అయ్యి విశ్వ పరిక్రమణ చేయండి. మూడు లోకాల చక్రం తిరగగలుగుతున్నప్పుడు విశ్వం యొక్క చక్రం తిరగటం కష్టమైన విషయమా! ఎలా అయితే ఆదిలో యోగ్య రాజులు సదా తమ రాజ్యం యొక్క చక్రం తిరుగుతూ ప్రజలను సదా సుఖీగా మరియు సంతుష్టంగా ఉంచేవారు. ఇవన్నీ ఎవరి నుండి నేర్చుకున్నారు? అన్ని ఆచారాలకు పునాది సంగమయుగం మరియు బ్రాహ్మణులు సంగమయుగి నివాసీయులు. అందువలనే ఇప్పటి వరకు కూడా ఏ ఆచారానికి అయినా బ్రాహ్మణులనే పిలుస్తారు. మీ ద్వారానే రాజులు ఆచారాలు నేర్చుకున్నారు. మీరు నేర్పించేవారు కనుక తప్పకుండా చేస్తారు. కనుక మాస్టర్ రచయితగా అయ్యి విశ్వం యొక్క పరిస్థితిని చూడండి. ఏమి చేయాలో అర్థమైందా? ఇప్పుడు చిన్నతనం యొక్క సోమరితనాన్ని వదిలేయండి. సమయం మరియు శక్తులను సేవలో సఫలం చేసుకోండి. మంచిది.
                సదా సర్వ ఖజానాలను సఫలం చేసుకునేవారికి, స్వయం మరియు విశ్వం యొక్క సమానత ఉంచుకునేవారికి, మాస్టర్ జ్ఞానసూర్యులుగా, సదా దయాహృదయులుగా, సదా సర్వుల పట్ల సహయోగ భావన మరియు కామన ఉంచుకునేవారికి, ఇటువంటి శ్రేష్టాత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments