05-01-1977 అవ్యక్త మురళి

05-01-1977         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

త్యాగి మరియు తపస్వి పిల్లలే సదా సమీపంగా ఉంటారు.

                     జ్ఞాన సూర్యుడైన శివబాబా తన కంటి రత్నాలతో, నయనాలతో సంభాషిస్తూ మాట్లాడుతున్నారు -
                    ఈరోజు నయనాలలో నిండి ఉన్న పిల్లలతో నయనాలతో కలుసుకుంటున్నారు. అటువంటి పిల్లల దృష్టిలో బాప్ దాదా మరియు బ్రాహ్మణులే ఉన్నారు మరియు వారి వారి సృష్టి, వారు మిగిలినవి చూస్తూ కూడా చూడటం లేదు. ఎందుకంటే బాబా ప్రేమలో సదా లవలీనం అయ్యి ఉంటారు. సదా బాబా యొక్క గుణాలు అంటే జ్ఞానం, సుఖం, ఆనందం యొక్క సాగరాలలో నిండి ఉంటున్నారు. ఇటువంటి పిల్లలను చూసి బాబా కూడా హర్షిస్తున్నారు. వారు శరీరంతో ఎంత దూరాన్ని ఉన్నా కానీ అటువంటి పిల్లలకు బాబా దగ్గర అతి సమీపమైన స్థానం సదాకాలికంగా నిర్ణయం అయ్యి ఉంది. అది ఏ స్థానం? తెలుసా?
                  ఏదైతే బాగా ఇష్టమైన వస్తువు ఉంటుందో అది సమీప స్థానంలో ఉంటుంది. ఆ స్థానం ఏమిటంటే 1. నయనాలు  2. హృదయం. హృదయంలో ఉండేవారు శ్రేష్టమా లేక నయనాలలో ఉండేవారు శ్రేష్టమా? రెండింటిలో నెంబర్ వన్ ఎవరు? రెండింటి గొప్పతనం ఒకటేనా, వేరువేరుగా ఉంటుందా? హృదయంలో ఉన్నవారు నయనాలలో కూడా ఉంటారు అని అనుకునేవారు చేతులు ఎత్తండి! ఎవరైతే హృదయంలో ఉన్నవారి మహత్యం వేరు, నయనాలలో ఉండేవారి మహత్యం వేరు అని భావిస్తున్నారో వారు చేతులు ఎత్తండి? ఒకటే అయినా కానీ వేరు, వేరుగా గొప్పతనం ఉంటుంది. అందువలన రెండు మంచివే. ఇంతమంది త్యాగీ, తపస్వీ పిల్లల తమ యొక్క అనేక ధర్మాలు మరియు తమ దేహ ధర్మం యొక్క కర్మలో అనేక రకాల ఆచారాలను త్యాగం చేసి బాప్ దాదా స్మృతి యొక్క తపస్యలో నిమగ్నం అయ్యి ఉన్నారు. అటువంటి త్యాగి మరియు తపస్వీ పిల్లలను ఎలా ఫెయిల్ చేయగలరు? అందువలన సదా పాస్ చేస్తారు.
                  విదేశీయులు అన్నీ తక్కువగా(షార్ట్) చదువుతారు, ఎందుకంటే బిజీగా ఉంటారు. బాప్ దాదా ఒక మాట స్మృతి ఇప్పిస్తున్నారు. అది ఏమిటి? ఆ ఒక మాట ఏమిటంటే పాస్ అవ్వాలి, పాస్ అంటే హిందీలో దగ్గర అని అర్ధం. కనుక సమీపంగా ఉండాలి మరియు ఏదైతే జరిగిపోయిందో దానిని పాస్ చేసేయాలి. ఇలా ఒకే మాటకు మూడు అర్థాలు. ఇదే చిన్న మార్గం. మరియు పాస్ విత్ ఆనర్‌గా అవ్వాలి అంటే గౌరవయుక్తంగా పాస్ అవ్వాలి.
                  కానీ ఈ అర్ధంలో స్థితులయ్యేటందుకు సదా బాబా సమానంగా ఇముడ్చుకొనే శక్తి మరియు బాబా సమానంగా అయ్యే శక్తి రెండు నింపుకోవాలి. ఎందుకంటే బాబా సమానంగా అయ్యేటందుకు ఎప్పుడైతే సేవా వేదిక పైకి వస్తారో అప్పుడు అనేక రకాలైన విషయాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఆ విషయాలను ఇముడ్చుకునే శక్తి ఆధారంగానే మాస్టర్ సాగరులుగా అవుతారు మరియు ఇతరులను కూడా బాబా సమానంగా చేయగలరు. ఇముడ్చుకోవడం అంటే సంకల్పమాత్రంగా కూడా ఏ రకమైన వ్యక్త విషయాలు మరియు భావాలు అంశ రూపంలో కూడా ఉండకూడదు. అకళ్యాణకారి మాటలు కళ్యాణ భావనలోకి ఎలా పరివర్తన అయిపోతాయంటే అకళ్యాణ మాటలనేవే ఉండవు. ఈ స్థితినే విశ్వకళ్యాణకారి స్థితి అని అంటారు. ఎవరిలోనైనా ఏదైనా అవగుణం చూసినా ఒక్క సెకనులో దానిని గుణంగా మార్చుకోవాలి. నష్టాన్ని కూడా లాభంలోకి పరివర్తన చేసుకోవాలి. నిందని కూడా స్తుతిలోకి మార్చుకోవాలి. ఇటువంటి దృష్టి, స్మృతిలో ఉండేవారినే విశ్వకళ్యాణకారి అని అంటారు. విశ్వకళ్యాణకారిగానే కాదు, స్వకళ్యాణకారిగా కూడా అవ్వాలి. ఇటువంటి స్థితినే బాబా సమాన స్థితి అని అంటారు.
                     విదేశీయుల నుండి స్వదేశీయులుగా అయిపోయారు. బాప్ దాదా అయితే స్వదేశీయులగానే చూస్తున్నారు. విదేశీయులుగా కాదు. స్వదేశీ పిల్లలకు స్నేహం యొక్క స్మృతి చిహ్నం ప్రత్యక్షఫలంగా బాప్ దాదాల కలయిక. విదేశీయుల నుండి స్వదేశీయులయిన పిల్లల యొక్క అమృతవేళ యొక్క ఆత్మిక సంభాషణ చాలా రమణీయంగా ఉంటుంది. ఆ సమయంలో విశేషంగా రెండు రూపాలు ఉంటాయి. 1. అధికార రూపంలో కలుసుకుంటున్నారు మరియు మాట్లాడుకుంటున్నారు. 2. నిందలతో మరియు తపనతో ఉన్న ఆత్మల వలె మాట్లాడుతున్నారు. ఇది విని బాప్ దాదాకు మజా వస్తుంది. కానీ ఎక్కువ మందిలో (విదేశీయులలో) ఒక విశేషత ఉంది అది ఏమిటంటే వారు కొంచెంలో రాజీ అయిపోతారు. రాముడు, సీతగా కూడా కాదు, లక్ష్మీనారాయణులుగా కావాలనుకుంటారు. శ్రేష్ట లక్ష్యం పెట్టుకుంటున్న కారణంగా బాప్ దాదా కూడా శుభాకాంక్షలు ఇస్తున్నారు. సదా మీరు ఇదే శ్రేష్ట లక్ష్యం మరియు లక్షణాలలో ఉండాలి. బాప్ దాదాతో దూరంగా ఉండకూడదు. ఎవరైతే హృదయసింహాసనాధికారులుగా ఉంటారో వారు సదా సమీపంగా ఉంటారు. ఈరోజు పిల్లలందరికి బాబాని కలుసుకోవాలని ఒకే సంకల్పం ఉంది. ఇలాగే నిద్రపోతున్నా కూడా ఇదే స్మృతిలో ఉండాలి. బాప్ దాదా కూడా నలువైపుల ఉన్న విదేశీ పిల్లలను సన్ముఖంగా చూస్తూ ప్రియస్మృతులు ఇస్తున్నారు.
                   ఈవిధంగా శ్రేష్ట లక్ష్యం పెట్టుకునేవారికి, సంతోషంతో బాబాతో వ్యాపారం చేసేవారికి, బాబా మరియు సేవలో సదా నిమగ్నం అయ్యి ఉండేవారికి, చివర వచ్చినా తీవ్రంగా ముందుకు వెళ్ళే స్నేహి, సహయోగి ఆత్మలకు, బాబాని కూడా తమ సమానంగా వ్యక్తరూపంగా తయారు చేసేవారికి, కల్పపూర్వం పిల్లలకు, మెరుస్తున్న సితారలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. 

Comments