04-10-1975 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
ఇప్పుడు దృఢ సంకల్పం అనే అగ్నితో రావణున్ని కాల్పండి.
అకాలమూర్తి ఆత్మలకు ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క వరదానం ఇచ్చే బాప్ దాదా మాట్లాడుతున్నారు -
ఫరిస్తాల సభలో కూర్చుని ఉన్న ఫరిస్తాగా స్వయాన్ని భావిస్తున్నారా? ఫరిస్తా అనగా వారి యొక్క సర్వ సంబంధాలు లేదా సర్వ బంధాలు ఒకనితోనే ఉంటాయి. ఒకనితోనే సర్వబంధాలు మరియు సదా ఏకరస స్థితిలో స్థితులై ఉంటారు. ఒక్కొక్క సెకెను, ఒక్కొక్క మాట ఒకని సంలగ్నతలోనే మరియు ఒకరి సేవ కొరకే ఉంటాయి. నడుస్తూ - తిరుగుతూ, చూస్తూ - మాట్లాడుతూ మరియు కర్మ చేస్తూ కూడా వ్యక్త భావానికి అతీతంగా అవ్యక్తంగా అనగా ఈ వ్యక్త దేహరూపీ భూమి యొక్క స్మృతి నుండి బుద్ధి రూపీ పాదం సదా అతీతంగా ఉంటుంది. ఏవిధంగా అయితే తండ్రి ఈశ్వరీయ సేవార్థం లేదా పిల్లల్ని వెంట తీసుకువెళ్ళే సేవార్థం లేదా స్వచ్ఛమైన భక్తులకు చాలాకాలం యొక్క భక్తికి ఫలాన్నిచ్చే కార్యార్ధం అతీతుడు మరియు నిరాకారుడైనప్పటికీ అల్పకాలికంగా ఆధారం తీసుకుంటున్నారు లేదా అవతరిస్తున్నారు. అదేవిధంగా ఫరిస్తా అనగా అతీతము మరియు అతిప్రియం. బాబా సమానంగా స్వయాన్ని, అవతరిత ఆత్మగా భావిస్తున్నారా? అనగా కేవలం ఈశ్వరీయ సేవార్థమే ఈ సాకార బ్రాహ్మణ జీవితం లభించింది. ధర్మస్థాపకులు, ధర్మస్థాపన అనే పాత్ర అభినయించడానికి వచ్చారు. అందువలనే వారి పేరే - శక్తి అవతారం. కేవలం ధర్మ స్థాపనా కార్యం తప్ప మరే ఇతర కార్యం బ్రాహ్మణులైన మీరు అనగా అవతరిత ఆత్మలైన మీరు చేయకూడదు. సదా ఇదే స్మృతిలో ఇదే కార్యంలో ఉపస్థితులై ఉండేవారినే ఫరిస్తా అని అంటారు. ఫరిస్తా అనగా డబల్ లైట్ రూపం. ఒకటి లైట్ అనగా సదా జ్యో తి స్వరూపం. రెండు లైట్ అనగా పాత కర్మల ఖాతా యొక్క భారం నుండి అతీతం అనగా తేలికతనం. ఈ విధంగా డబల్ లైట్ స్వరూపంగా స్వయాన్ని అనుభవం చేసుకుంటున్నారా? ఈ బ్రాహ్మణ జీవితం కేవలం ఈశ్వరీయ కార్యార్ధం మరే ఇతర కార్యార్ధం కాదు. శ్రీమతం లేకుండా ఆత్మల మతం అనుసారంగా లేదా స్వయం యొక్క మన్మతం అనుసారంగా ఏదీ ఎక్కడా ఉపయోగించకూడదు. ఈ బ్రాహ్మణ జీవితం కూడా బాబా ద్వారా ఈశ్వరీయ సేవ కోసం లభించిన తాకట్టు. తాకట్టు వస్తువుని నాది అనుకోవడం లేదు కదా! సంకల్పం ద్వారా కూడా ఈ బ్రాహ్మణ జీవితం యొక్క ఒక్క శ్వాస అయినా కానీ ఇతర కార్యార్ధం ఉపయోగించకూడదు. అందువలనే భక్తిలో శ్వాసశ్వాసలో స్మరణ అనే స్మృతిచిహ్నం నడుస్తూ వస్తుంది. మీరు నిరంతర ఫరిస్తాలా లేక అల్పకాలిక ఫరిస్తాల? భక్తిలో కూడా ఒక నియమం ఉంది - దానం ఇచ్చిన వస్తువును లేదా అర్పించిన వస్తువుని ఇతర ఏ కార్యార్ధం ఉపయోగించకూడదు. మరైతే మీరందరూ బ్రాహ్మణ జీవితంలో బాప్ దాదాతో మొట్టమొదటగా ఏమి ప్రతిజ్ఞ చేశారు. గుర్తుందా? లేక మరిచిపోయారా? బాబా ముందు మొట్టమొదట చేసిన ప్రతిజ్ఞ ఏమిటంటే తనువు, మనసు, ధనం అన్ని నీ ముందు సమర్పణ చేస్తున్నాం. సర్వ సమర్పణ చేశారు. సర్వం అనగా సంకల్పం, శ్వాస, మాట, కర్మ, సంబంధం, సర్వ వ్యక్తి వైభవాలు, స్వభావ సంస్కారాలు, వృత్తి, దృష్టి మరియు స్మృతి... అన్నింటినీ అర్పించారు; దీనినే సమర్పణ అని అంటారు. సమర్పణ కన్నా ఉన్నతమైన మరియు శక్తివంతమైన మాట స్వయాన్ని సర్వస్వ త్యాగిగా చెప్పుకుంటున్నారు. అందరూ సర్వస్వ త్యాగులేనా లేక కేవలం త్యాగులా? సర్వస్వ త్యాగి అనగా ఏధైతే త్యాగం చేశారో సంబంధం, సంప్రదింపులు, భావ స్వభావాలు మరియు సంస్కారాలు వీటన్నింటిని 63 జన్మలుగా మిగిలిపోయిన కర్మలఖాతా యొక్క అంశాన్ని కూడా వంశ సహితంగా త్యాగం చేశారు. అందువలన సర్వస్వ త్యాగం అని అంటారు. ఇలాంటి సర్వస్వ త్యాగులు, మీ యొక్క పాత కర్మలఖాతా అంతా వంశ సహితంగా సమాప్తం అయిపోయింది. ఇలాంటి సర్వస్వ త్యాగి అయిన వారు నా యొక్క పాత సంభావ సంస్కారం ఇలాంటిది అని సంకల్పం కూడా చేయలేరు. పాత కర్మలఖాతా ఇప్పటి వరకు కూడా అప్పుడప్పుడు ఆకర్షిస్తూ ఉందా? కర్మబంధన యొక్కభారం, కర్మ సంబంధం యొక్క భారం, ఎవరైనా వ్యక్తి లేదా వైభవం ఆధారం యొక్క భారం ఆత్మనైన నన్ను తనవైపుకు ఆకర్షితం చేస్తుందా? ఇలాంటి సంకల్పాలు లేదా మాటలు సర్వస్వత్యాగులు అనరు. సర్వస్వ త్యాగి అయిన వారు సర్వ బంధనాల నుండి ముక్తులుగా, సర్వ భారాల నుండి ముక్తులుగా ప్రతి సంకల్పంలో భాగ్యం తయారు చేసుకునేవారిగా, పదమాపదమ్ భాగ్యశాలిగా ఉంటారు. ఇలాంటి వారి ప్రతి అడుగులో కోటానుకోట్ల సంపాదన స్వతహగానే అవుతుంది. ఇలాంటి సర్వస్వ త్యాగియే కదా! ఈ మాట యొక్క అర్థ స్వరూపంలో స్థితి అయ్యి ఉన్నారు కదా! చెప్పేవారు కాదు, చేసేవారు మరియు అనేకులతో చేయించేవారు కదా! కష్టం అనిపించడం లేదు కదా! కష్టం అనిపిస్తుందేమో అనే ప్రశ్న రాకూడదు. ఎందుకంటే బ్రాహ్మణ జీవితం యొక్క ధర్మం మరియు కర్మ కూడా ఇదే. జీవితం యొక్క నిజ కర్మ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడూ కష్టం అనిపించదు. స్వయాన్ని అవతరిత ఆత్మగా లేదా శక్తి అవతారంగా భావించరో అప్పుడు కష్టం అనిపిస్తుంది. నేను అవతరిత ఆత్మను సదా ఇది స్మృతిలో ఉంచుకోండి. ధర్మస్థాపన చేసే కార్యార్థం ధర్మాత్మను. ధర్మము అనగా ప్రతి సంకల్పం స్వతహగానే ధర్మార్థం ఉంటుంది అర్ధమైందా! ఇలాంటి వారిని ఫరిస్తా అని అంటారు. ఏం చేయను, ఎలా చేయను, అవటం లేదు, రావడం లేదు మరియు వద్దనుకున్నా కానీ అయిపోతుంది, ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఇలా ఎవరంటారు? ఫరిస్తాలు అంటారా, సర్వస్వత్యాగులు అంటారా?మీరు మాస్టర్ సర్వశక్తివంతులు మరి మాట్లాడేది ఈ మాటలు. రెండింటినీ బేరీజు వేసుకోండి. మాస్టర్ సర్వశక్తివంతులు ఈ మాటలు మాట్లాడగలరా? అనేకులను బంధనముక్తులుగా చేసే ఆత్మ ఇలాంటి మాటలు మాట్లాడగలదా? బంధనముక్త ఆత్మల యొక్క మాటలేనా ఇవి? మీరందరూ బంధనముక్త ఆత్మలు కదా? కనుక ఈ రోజు నుండి ఇలాంటి సంకల్పాలు మరియు మాటలను సదాకాలికంగా సమాప్తం చేయండి. దృఢసంకల్పం అనే అగ్నితో ఈ బలహీనతలు అనే రావణున్ని కాల్చండి అనగా దసరా జరుపుకోండి. పంచవికారాల యొక్క వంశాన్ని కూడా మరియు పంచతత్వాల యొక్క అనేక రకాల ఆకర్షణలు కూడా మొత్తంగా ఈ పది విషయాలపై విజయీగా అవ్వండి. అనగా విజయదశమి జరుపుకోండి. మంచిది.
ఈవిధంగా విజయదశమి జరుపుకునే విజయీరత్నాలకు, ఎవరి మస్తకంలో విజయం యొక్క అవినాశి తిలకం పెట్టబడి ఉందో వారికి, ఇలాంటి అవినాశి తిలకధారులకు, సదా అకాల సింహసనాధికారి, అకాలమూర్తి, సర్వాత్మలను బంధనాల నుండి ముక్తులను చేసేవారికి, యోగయుక్తులకు, స్నేహయుక్తులకు, యుక్తియుక్తులకు, సర్వ శ్రేష్ట ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment