* 04-08-1972 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“సర్వీసబుల్, సెన్సిబుల్ మరియు ఎసెన్స్ ఫుల్ గా ఉండేవారి గుర్తులు"
స్వయమును సర్వీసబుల్ గా, సెన్సిబుల్ గా మరియు ఎసెన్స్ ఫుల్ గా భావిస్తున్నారా? ఈ మూడు గుణాలు బాబా సమానంగా స్వయములో అనుభవం చేసుకుంటున్నారా? ఎందుకంటే వర్తమాన సమయంలో మీ ముందు ఏ స్వరూపమునైతే ఉంచుకుంటారో, అదేవిధంగా సమానతలోకి సమీపంగా వస్తూ ఉంటారు కదా! మరి మీరు ఏ చిహ్నమును ముందు ఉంచుకున్నారు? బాబా చిహ్నమును. విష్ణువు చిహ్నమునైతే భవిష్యత్తులో ఉంచుకుంటారు. కాని, సంగమయుగం యొక్క చిహ్నము బాబాయే కదా! కావున చిహ్నమును మీ ముందు ఉంచుకుంటూ సమానతను తీసుకువస్తున్నారు కదా? ఈ మూడు గుణాలలోను సమానతను అనుభవం చేసుకుంటున్నారా లేక ఒక్క గుణం యొక్క విశేషతను అనుభవం చేసుకుంటూ రెండవ, మూడవ గుణం యొక్క విశేషతను అనుభవం చేసుకోకుండా ఉంటున్నారా? సమయప్రమాణంగా మూడు గుణాలు ఏ శాతములోనైతే ఉండాలో ఆ శాతంలో ఉన్నాయా? వర్తమాన సమయానుసారంగా పురుషార్థపు శాతము ఎంతగా ఉండాలో అంతగా ఉందా? 95 శాతంవరకైనా చేరుకోవాలి కదా! ఇప్పుడిక సమయమే కొద్దిగా మిగిలి ఉంది. ఆ సమయానుసారంగా 95 శాతము ఉండాలి. 100 శాతము అని అనరు, ఎందుకంటే అలా అంటే సమయం యొక్క కారణమును చెబుతారు. కావుననే 100 శాతము అని అనడం లేదు. 50 శాతము వదులుతున్నారు. సంగమయుగపు పురుషార్థపు సమయం అనుసారంగా ఎంత శాతం ఉన్నారు? సమయపు పర్సంటేజ్ అనుసారంగా 95 శాతం ఉన్నట్లయితే అది ఏమంత పెద్ద విషయం కాదు. కావున ఇంతటి లక్ష్యమును ఉంచుతూ మీ వేగమును ముందుకు తీసుకువెళుతున్నారా లేక ఇప్పటికి ఇంకా సమయం ఉంది అని భావిస్తున్నారా? ఇంకా ఇంత సమయం మిగిలి ఉంది అని సంకల్పమైతే రావడం లేదు కదా! ఇప్పుడే పురుషార్థం సమాప్తం చేసేస్తే అప్పుడు ఇక ఏం చేస్తారు? ఈ సంకల్పమైతే రావడం లేదు కదా! ఏదో లోపము మిగిలి ఉంది, కావుననే డ్రామాలో ఇంత సమయం మిగిలి ఉంది. సమయానుసారంగా లోటు ఉన్నా అది ఎంత శాతంలో ఉండాలి? 50-50 ఉండడం కాదు. 50 శాతం సంపన్నం చేయాలంటే వేగం చాలా తీవ్రంగా ఉండాలి. ఎవరైతే అంతటి తీవ్ర వేగంలో ఉంటారో వారు 95 శాతం వరకు చేరుకోలేకపోవడమన్నది జరుగజాలదు. కావున ఇప్పుడు ఏ లక్ష్యమును ఉంచాలి? ఇప్పుడు సమయానుసారంగా, డ్రామా అనుసారంగా ఏదైనా లోపము మిగిలి ఉన్నట్లయితే అది 5 శాతం మాత్రమే అనుమతింపబడుతుంది కాని ఎక్కువ కాదు. అంతకన్నా ఎక్కువ లోపం ఉన్నట్లయితే ఫైనల్ స్థితి నుండి దూరంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి. అప్పుడిక బాప్ దాదాకు సమీపంగా మరియు సమానంగా ఉండాలి అన్న లక్ష్యమునేదైతే ఉంచుతారో అది పూర్తవ్వజాలదు. ఎందుకంటే ఇప్పుడు మొదటి నెంబర్ లోనివారు అవ్యక్త స్థితిని పొందేసారు. ఆ తర్వాతి సమీప రత్నాలెవరైతే ఉంటారో వారు తక్కువలో తక్కువ ఎంత సమీపంగా ఉండాలంటే, ఇక కేవలం 5 శాతం మాత్రమే మిగిలి ఉండాలి. బాబా అవ్యక్తమైపోయి సమీప రత్నాలలో 50 శాతం తేడా ఉన్నట్లయితే మరి వారిని సమీపము అని అంటారా? వారు 8 నెంబర్లలోకి రాగలరా? సాకార బాబా సాక్షిగా అయి తమ స్థితిని వర్ణన చేసేవారు కదా! కావున సాక్షిగా అయి మీ స్థితిని పరిశీలించుకోవాలి. ఎవరు ఎలా ఉన్నారో వారిని అలా వర్ణన చేయడంలో ఆలోచన ఎందుకు రావాలి? బైట నుండి మహిమ చేయడం వేరే విషయము. కాని, తమలో తాము చెకింగ్ చేసుకోవడంలో బుద్ధి యొక్క నిర్ణయమును ఇవ్వాలి. ఇతరులకు మీ యొక్క ఇటువంటి స్థితి అనుభవమైతే అవ్వాలి కదా! కావున సమీప రత్నాలుగా అయ్యేందుకు అంతటి వేగంతో మీ శాతమును తయారుచేసుకోవాలి కదా! 50 శాతమును మెజారిటీ అని అంటారు. కాని, అష్టదేవతలను మైనారిటీ అని ఎలా అనగలరు? మైనారిటీవారి స్థితి కూడా మెజారిటీవారి స్థితిలాగానే ఉండిపోతే, లక్షణాలు అలాగే ఉంటే ఇక తేడా ఏమి ఉన్నట్లు? కావున మూడు విషయాలు ఏవైతే ఇమిడి ఉన్నాయో వాటిని స్వయములో పరిశీలించుకోండి.సేవాధారుల రూపము ఎలా ఉంటుంది అన్నది మీ ముందు ఉంచుకుంటూ వర్తమాన స్థితి అనుసారంగా లేక వర్తమాన యాక్టివిటీ అనుసారంగా స్వయమును సర్వీసబుల్ అని అనవచ్చా అని పరిశీలించుకోండి. సర్వీసబుల్ గా ఉన్నవారి ప్రతి సంకల్పము, ప్రతి మాట, ప్రతి కర్మ సేవ చేసేందుకు యోగ్యంగా ఉంటాయి. అవి వాటంతట అవే సేవ చేస్తాయి. వారి సంకల్పము కూడా ఆటోమేటిక్ గా సేవ చేస్తాయి. ఎందుకంటే వారి సంకల్పాలు సదా విశ్వకళ్యాణార్థమే ఉంటాయి, అనగా విశ్వకళ్యాణకారీ సంకల్పాలే ఉత్పన్నమవుతాయి, వ్యర్థము ఉండదు. సమయం కూడా ప్రతిక్షణము మనసా వాచా కర్మణా సేవలోనే గడుపుతారు. అటువంటివారినే సేవాధారులు అని అంటారు. ఎవరికైనా స్థూలమైన వ్యాపారం ఉన్నట్లయితే, వారి సంకల్పము మరియు కర్మలు కూడా అవే అనుసారంగా జరుగుతాయి కదా! స్వప్నాలలో కూడా అదే చూస్తారు. కావున సేవాధారుల సంకల్పాలు కూడా వాటంతట అవే సేవను గూర్చే జరుగుతాయి. ఎందుకంటే వారి వ్యాపారమే అది. అచ్ఛా!
సెన్సిబుల్ గా ఉండేవారి లక్షణాలు ఎలా ఉంటాయి? (ప్రతి ఒక్కరూ వినిపించారు). ఇన్ని లక్షణాలను వినిపించారు, మరి ఇప్పుడే లక్ష్యములో నిలిచి ఉండగలరా? సెన్సిబుల్ అనగా వివేకవంతులు. లౌకికరీతిలో ఎవరైతే వివేకవంతులుగా ఉంటారో వారు ముందూ వెనుకా ఆలోచించి అడుగులు వేస్తారు. కాని ఇక్కడైతే ఇది అనంతమైన విషయము. కావున ఎవరైతే వివేకవంతులుగా ఉంటారో వారి ముఖ్య లక్షణము - త్రికాలదర్శులుగా అయి మూడు కాలాలను ముందే తెలుసుకుంటూ వారు కర్మ చేస్తారు. కల్పపూర్వపు స్మృతి కూడా స్పష్టరూపంలో కల్పపూర్వము కూడా నేను విజయునిగా అయ్యాను, ఇప్పుడు కూడా విజయునిగా ఉన్నాను అన్నది స్మృతిలో ఉంటుంది. అనేకసార్లు విజయులుగా అవుతూనే ఉంటాము... ఈ విజయత్వపు నిశ్చయం యొక్క ఆధారంపై లేక త్రికాలదర్శి స్థితి యొక్క ఆధారంపై ఏ కర్మలు చేసినా అవి ఎప్పుడూ వ్యర్ధంగా లేక అసఫలంగా అవ్వవు. కావున త్రికాలదర్శత్వపు స్థితి ఎలా ఉండాలో అర్థమైందా? కేవలం వర్తమాన సమయాన్ని అర్థం చేసుకోవడమును కూడా సంపూర్ణత అని అనరు. ఏ కార్యములోనైనా అసఫలత లేక వ్యర్థము ఉన్నట్లయితే దానికి కారణము - మూడు కాలాలను మీ ముందు ఉంచుకుంటూ కార్యము చేయకపోవడమే. ఇంతటి బేహద్ వివేకమును ధారణ చేయలేరు.ఆ కారణంగానే వర్తమాన సమస్యలను చూస్తూ వ్యాకులత చెందుతారు మరియు వ్యాకులత చెందిన కారణంగా సఫలతను పొందలేరు. ఎవరైతే వివేకవంతులుగా ఉంటారో వారు అనంతమైన వివేచనతోలేక త్రికాలదర్శులుగా అయి ప్రతి కర్మను చేస్తారు లేక ప్రతి మాటను మాట్లాడుతారు. దానినే అలౌకికములేక అసాధారణము అని అంటారు. వివేకవంతులు ఎప్పుడూ సమయమును, సంకల్పాలను లేక మాటలను వ్యర్థం చేసుకోరు. ఏ విధంగా లౌకికరీతిలో కూడా ఎవరైనా ధనమును లేక సమయమును వ్యర్థం చేసుకున్నట్లయితే వారికి అంత వివేకం లేదు అని అనడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే సేవాధారులుగా ఉంటారో వారు ప్రతి క్షణమును సమర్థంగా చేసుకొని కార్యంలో వినియోగిస్తారు. వ్యర్థ కార్యాలలో వినియోగించరు. సేవాధారులు ఎప్పుడూ వ్యర్థ సాంగత్యపు రంగులోకి రారు, వారు ఎప్పుడూ ఏ వాతావరణానికి వశమవ్వరు, ఈ లక్షణాలన్నీ సేవాదారులకు చెందినవి.
మూడవరకం వారు ఎసెన్స్ ఫుల్ :- వీరి లక్షణాలు ఎలా ఉంటాయి? (ప్రతి ఒక్కరూ వినిపించారు) అందరూ సరిగ్గానే వినిపించారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ వివేకవంతులుగా అయి కూర్చున్నారు కదా! ఎవరైతే ఎసెన్స్ ఫుల్ గా ఉంటారో వారిలో ఆత్మికత యొక్క సుగంధం ఉంటుంది. ఆత్మిక సుగంధం అనగా ఆత్మికతతో కూడిన సర్వశక్తులు వారిలో ఉంటాయి. ఆ సర్వశక్తుల ఆధారంపై ఎవరినైనా సహజంగానే తమవైపుకు ఆకర్షించగలరు. స్థూలమైన సుగంధము లేక ఎసెన్స్ దూరం నుండే ఎవరినైనా తనవైపుకు ఆకర్షిస్తుంది, వద్దు అనుకున్నా కూడా తనవైపుకు ఆకర్షించేస్తుంది కదా! వద్దనుకున్నవారిని కూడా ఆకర్షించేస్తుంది. అదేవిధంగా ఎటువంటి ఆత్మలైనా ఎసెన్స్ ఫుల్ గా ఉండేవారి ముందుకు వచ్చినప్పుడు ఆ ఆత్మికత వైపుకు ఆకర్షితులైపోతారు. ఆత్మికత ఉన్నవారి విశేషత ఎలా ఉంటుందంటే, దూరంగా ఉన్న ఆత్మలను కూడా తమ ఆత్మికత ద్వారా ఆకర్షించేస్తారు. ఏ విధంగా మీరు మనసా శక్తి యొక్క ఆధారంపై ప్రకృతిని కూడా పరివర్తన చేసి కల్యాణము చేస్తారో ఆకాశము లేక వాయుమండలము మొదలైనవాటి సమీపంగా వెళ్లితే చెప్పరు కదా! ఏ విధంగా మనసా శక్తి ద్వారా ప్రకృతిని తమోప్రధానం నుండి సతో ప్రధానంగా చేస్తారో, అలా ఇతర విశ్వ ఆత్మలెవరైతే మీ ముందుకు రాలేరో వారిని మీరు దూరంగా ఉంటూ ఆత్మికతా శక్తి ద్వారా బాబా పరిచయమును లేక బాబా ముఖ్య సందేశమేదైతే ఉందో దానిని మనసా ద్వారా కూడా వారి బుద్ధిలో స్పర్శింపజేయగలరు. మీరు విశ్వకళ్యాణకారులు, మరి ఇంతమంది విశ్వాత్మల ముందుకు వెళ్ళి సందేశమునివ్వగలరా? అందరికీ వాణి ద్వారా సందేశమునివ్వలేరు, వాణితో పాటు మనసా సేవ కూడా దినప్రతిదినము పెరుగుతూ ఉండడం అనుభవం చేసుకుంటారు. ఏ విధంగా బాబా భక్తుల భావనను సూక్ష్మ రూపంలో పరివర్తన చేస్తారో, మరి ఆ సమయంలో వారు వారి ముందుకు వెళ్ళి వాణి ద్వారా చేస్తారా? సూక్ష్మమైన మిషనరీ ఉంది కదా! అలా శక్తులు లేక పాండవులైన మీరు ప్రాక్టికల్ లో భక్త ఆత్మలకు లేక జ్ఞనీ ఆత్మలకు ఇరువురికీ బాబా సందేశమునిచ్చే కార్యము అనగా సూక్ష్మమైన మిషనరీ వేగవంతమవ్వనున్నది. ఇది అంతిమ సేవ యొక్క రూపురేఖ. ఏ విధంగా సుగంధము దగ్గరగా ఉన్నవారికైనా లేక దూరంగా ఉన్నవారికైనా సుగంధమునిచ్చే కర్తవ్యము చేస్తుందో అలా కేవలం సమ్ముఖంలోకి వచ్చేవారికే కాదు దూరంగా ఉన్న ఆత్మల వరకు కూడా మీ ఈ ఆత్మికత యొక్క శక్తి సేవ చేస్తుంది అప్పుడే ప్రత్యక్ష రూపంలో విశ్వకళ్యాణకారులు అని గానం చేయబడతారు. ఇప్పుడైతే విశ్వకళ్యాణపు ప్లానులను తయారుచేస్తున్నారు, ప్రాక్టికల్ గా లేదు. మళ్ళీ ఎప్పుడైతే ఈ సూక్ష్మ మిషనరీ ప్రారంభమవుతుందో అప్పుడిక ప్రత్యక్ష కర్తవ్యంలో నిమగ్నమైపోతారు. ఏ విధంగా ఆత్మలు బాబా పరిచయంరూపీ అంచలిని తీసుకునేందుకు తపిస్తున్నారో మరియు తపిస్తున్న ఆత్మలు బుద్ధి ద్వారా లేక సూక్ష్మ శక్తి ద్వారా వారిన చూడకుండా కూడా కనిపిస్తున్నట్లుగా అనుభవం చేసుకుంటారు. కావున ఈ విధమైన సేవలో ఎప్పుడైతే నిమగ్నమైపోతారో అప్పుడు విశ్వకళ్యాణకారులు అన్న పేరు ప్రత్యక్షంగా ప్రసిద్ధమైపోతుంది.
ఇప్పుడు చూడండి మీరేమంటారు? మేము విశ్వకల్యాణ సంకల్పాన్ని చేపట్టాము అని మీరంటారు. మరి జనులు ఏమంటారు? విశ్వకల్యాణపు ఇంత పెద్ద కార్యము మీ ఈ స్పీడు ద్వారా జరుగగలదా? విశ్వకల్యాణ కార్యాన్ని ఇప్పటివరకు చాలా కొద్దిగా మాత్రమే చేశారు. దీనిని విశ్వం వరకు ఎలా చేరుస్తారు? ఇప్పుడు ఇది ప్రత్యక్షంగా లేదు కదా! మళ్ళీ నలువైపులా ఎక్కడెక్కడనుండైతే మాస్టర్ వివేకవంతుల వివేకముగా అయి సూక్ష్మమైన మిషనరీ ద్వారా ఎప్పుడైతే అందరి బుద్ధిని స్పందింపజేస్తారో అప్పుడు, ఏదో శక్తి ఉంది, ఏదో ఆత్మికత తనవైపుకు ఆకర్షిస్తోంది అన్న శబ్దము వ్యాపిస్తుంది. కలుసుకునేందుకు వెదుకుతారు లేక ఒక్క క్షణము కేవలం దర్శించుకునేందుకు తపిస్తారు. దానికి గుర్తు - ఇప్పటివరకు జడచిత్రాల రూపంలో కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు జడమూర్తుల ఉత్సవమేదైనా జరిగితే ఎంతమంది గుమిగూడుతారు! ఎంతమంది భక్తులు ఆరోజు కోసం, ఆ ఘడియ కోసం దర్శించుకునేందుకు తపిస్తారు. అనేకసార్లు దర్శించినా కూడా ఆ రోజు యొక్క మహత్వమును పూర్తిచేసేందుకు పాపం ఎంత 'కష్టంగా ప్రయత్నం చేస్తారు! ఈ గుర్తు ఎవరిది? ప్రత్యక్షంగా ఉన్న కారణంగానే సృతి చిహ్నాలు గుర్తులుగా తయారయ్యాయి కదా! అచ్ఛా!
*పంజాబ్ మరియు యు.పి జోన్ వారితో :-
జ్ఞానసాగరుడైన బాబా ద్వారా వెలువడిన జ్ఞానగంగలుగా అనుభవం చేసుకుంటున్నారా? యు.పి.లో గంగ మహత్వము ఎందుకు ఉంది? ఎందుకంటే ఇంకే నదిని పతిత పావని అని అనరు, గంగానదినే పతిత పావని అని అంటారు. యమునా నదిని పతిత పావని అని అనరు, దానిని చరిత్ర భూమి అని అంటారు. పంజాబ్ లో కూడా నదులు చాలా ఉన్నాయి. నది ఎక్కడి నుండి వెళ్ళినా దాని చుట్టూ అంతా పచ్చగా చేసేస్తుంది కదా! పచ్చదనము, సంతోషము... అలాగే మీ అందరి పని కూడా అందరినీ పచ్చగా చేయడము. ఏ ఆత్మలైతే సుఖశాంతులు అనే రసము నుండి ఎండిపోయారో అటువంటి ఎండిపోయిన వారిని మళ్ళీ పచ్చగా చేయడం... ఇదే మీ పని. ఎక్కడైతే కరువు ఉంటుందో అక్కడ మనుష్యులు నిరుపేదలుగా అయిపోతారు. అలాగే ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో అక్కడ మనుష్యులు సంతోషంగా ఉంటారు. కావున క్రొత్త ప్రపంచము పచ్చదనపు ప్రపంచము మరియు పాత ప్రపంచము కరువు ప్రపంచము. మీరందరూ ప్రవహిస్తున్న నిండైన నదులు కదా! కావున నడుస్తూ తిరుగుతూ మీ ప్రతి అడుగు ద్వారా ఆత్మలను పచ్చగా చేసెయ్యండి.
ఈ సమయంలో అందరి విశేష ధ్యానము పంజాబ్ వైపు ఉంది. ఏ విషయమును గూర్చి? అకాల మృత్యువును గూర్చి. అన్నిచోట్ల కన్నా ఎక్కువగా అకాల మృత్యువులు పంజాబ్ లో జరుగుతున్నాయి. మరి మీరందరూ అకాలమృత్యువు నుండి రక్షించుకునేవారే కదా! అటువంటి ఆత్మలకు జ్ఞానమునిచ్చి అమరులుగా చేసినట్లయితే జన్మజన్మలు అకాలమృత్యువు నుండి సురక్షితంగా ఉంటారు. సత్యయుగంలో అకాలమృత్యువు జరుగదు. తమ స్వ ఇచ్ఛాతో శరీరమును వదులుతారు. ఏ విధంగా ఈ పాత వస్త్రమును తమ స్వ ఇచ్ఛాతో మారుస్తారే కాని బలవంతంగా కాదో, అలాగే ఈ శరీరరూపీ వస్త్రమును కూడా తమ కోరిక అనుసారంగా మార్చాలి. ఏ విధంగా వస్త్రము సమయము పూర్తయిపోయినప్పుడు, అది పాతబడినప్పుడు దానిని ఏ విధంగా మార్చివేస్తారో అలాగే సమయానుసారంగా, ఆయువు అనుసారంగా శరీరమును పరివర్తన చేస్తారు. కావున పిల్లలైన మీరు అటువంటి దు:ఖిత ఆత్మలకు మేము మిమ్మల్ని 21 జన్మల వరకు అకాలమృత్యువు నుండి రక్షించగలము అన్న శుభవార్తను వినిపించండి. ఈ రోజుల్లో అకాలమృత్యువు అంటేనే భయముగా ఉంది. భయముతోనే తింటున్నారు, భయముతోనే నడుస్తున్నారుభయముతోనే పడుకుంటున్నారు. ఇటువంటి ఆత్మలకు సంతోషకరమైన విషయాన్ని వినిపించి భయము నుండి విడిపించండి. ఈ శరీరము వెళ్ళిపోయినా కాని భయముతో మరణించరు. ఎందుకంటే తాము అకాల మృత్యువు నుండి సురక్షితంగా ఉంటాము అన్న సంతోషము ఉంటుంది. ఏదో ఒకటి తమ తోడుగా తీసుకువెళుతున్నాము, ఖాళీగా వెళ్ళడం లేదు అన్న సంతోషము ఉంటుంది. కావున ఈ సేవను చేస్తున్నారా లేక మాకు తుపాకీ గుండ్లు ఏమైనా తగులుతాయి అని భయపడుతున్నారా? మీరందరూ ధైర్యవంతులే కదా! మీ శాంతి మరియు సుఖపు వైబ్రేషన్ల ద్వారా జనులకు సుఖశాంతులను అనుభూతి చేయించండి. ఎటువంటి ఉగ్రవాదులైనా వారు కూడా ప్రేమ మరియు శాంతి శక్తి ముందు పరివర్తన అయిపోతారు. మీ వద్దకు అటువంటివారు ఎవరైనా వస్తే ఏమి చేస్తారు? ప్రేమతోనే పరివర్తన చేస్తారు కదా! వారిని మీ సోదరులుగా చేసేస్తారు కదా! అచ్ఛా!
Comments
Post a Comment