04-07-1974 అవ్యక్త మురళి

04-07-1974         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

స్వ స్థితి యొక్క శ్రేష్టత ద్వారా వ్యర్దసంకల్పాల యొక్క అలజడి సమాప్తి.

            మర్యాదా పురుషోత్తములుగా తయారుచేసేటువంటి, సంపూర్ణ గమ్యానికి సమీపంగా  చేర్చేవారు, వ్యర్ధ సంకల్పాల అలజడిని సమాప్తి చేసి శక్తివంతులుగా తయారుచేసేటువంటి మరియు కర్మల గుహ్యగతి తెలిసిన బోళానాధుడైన శివబాబా మాట్లాడుతున్నారు -
             మీ సంపూర్ణ గమ్యానికి చేరుకున్నారా? గమ్యానికి చేరుకునే గుర్తులు కనిపిస్తున్నాయా? సంపూర్ణ గమ్యానికి చేరుకునే గుర్తుల యొక్క డబుల్ నషా వస్తుందా? మొదటి నషా - కర్మాతీతం అంటే సర్వ బంధనాల నుండి ముక్తులుగా, అతీతంగా అయ్యి ప్రకృతి ద్వారా నిమిత్తంగా కర్మ చేయటం. ఇటువంటి కర్మాతీత స్థితి యొక్క అనుభవం అవుతుంది. అతీతంగా అయ్యేటందుకు మాటిమాటికి పురుషార్థం చేయాల్సిన అవసరం ఉండదు. చేసేవారు మరియు చేయించే ఈ కర్మేంద్రియాలు స్వయంతో వేరు అని సహజంగా మరియు స్వతహగా అనుభవం అవుతుంది. రెండవ నషా - విశ్వయజమానిగా అయ్యే నషా. స్థూల శరీరం లేదా వస్త్రం తయారయ్యి ఉంది, ఎదురుగా కనిపిస్తుంది మరియు వస్త్రం తయారయ్యి ఉంది మరియు కొద్ది సమయంలో దానిని ధారణ చేయాలి అని అనుభవం చేసుకుంటారు. ఆ సర్వగుణ సంపన్న మరియు సత్వ ప్రధాన క్రొత్త  శరీరం స్పష్టంగా కనిపిస్తుంది మరియు నడుస్తూ, తిరుగుతూ రేపు ఈ పాత శరీరాన్ని వదిలి, కొత్త శరీరాన్ని ధారణ చేస్తాము అనే నషా మరియు సంతోషం ఉంటుంది. దైవీ పదవి లభిస్తుందా లేక లేదా, దేవతగా అవుతామా లేక లేదా, మరియు రాజాగా అవుతామా లేదా ప్రజలుగా అవుతామా? అని కొద్దిగా కూడా సంకల్పాలు రావు. ఎదురుగా స్పష్టంగా కనిపిస్తుంది, ఈ రోజు మనం ఇలా ఉన్నాము, రేపు అలా అవుతాము అని కనుక సంశయం యొక్క సంకల్పాలు రావు. జ్ఞానం యొక్క మూడవనేత్రం ద్వారా సదా యోగయుక్తంగా అంటే యోగీగా ఉన్న కారణంగా, బుద్ధి యొక్క లైన్ స్పష్టంగా ఉన్న కారణంగా, నిశ్చయబుద్ది విజయంతి ఆధారంగా అనేకసార్లు ఈ శరీరాన్ని ధారణ చేసాను మరియు ఇప్పుడు చేయాల్సిందే అనే అనుభవం అవుతుంది. ఈ విధమైన స్థిరమైన నమ్మకం ఉంటుంది మరియు స్పష్టంగా సాక్షాత్కారం అవుతుంది. ఇలా ఆవుతామా లేక అవ్వమా? ఈ అలజడి బుద్ధిలో ఉన్నంత వరకు స్థితిలో కూడా అలజడి ఉంటుంది.
               ఎంతెంతగా స్వ స్థితి, శ్రేష్ఠస్థితి, జ్ఞానస్వరూప లేదా ఆత్మ యొక్క సర్వగుణ సంపన్న స్థితి, అచంచలంగా, స్థిరంగా, నిరంతరం మరియు ఏకరసంగా అవుతూ ఉంటుందో అంతంతగా సంకల్పాల యొక్క అలజడి సమాప్తి అయిపోతూ ఉంటుంది. ఎలా అయితే సాకారంలో తల్లిని, తండ్రిని చూసారు కదా! ఇద్దరి నషాలో సంకల్పంలో కూడా అలజడి లేదు. సంపూర్ణ అచంచల, స్థిరమైన నిశ్చయం ఉండేది. ఇది తయారయిపోయి ఉంది. లేదా ఇది నిర్ణయమైపోయి ఉంది అని. నషాకు గుర్తు - స్థిరమైన నిశ్చయం మరియు నిశ్చింత స్థితి అనుభవం అవుతుంది. గమ్యానికి గుర్తు - నషా మరియు నషాకు గుర్తు - నిశ్చయం మరియు నిశ్చింత. వెనువెంట మాయ యొక్క ఏ రకమైన యుద్ధంలో అయినా మరియు ఓటమిలో కూడా నిశ్చింతగా ఉండాలి. మాయ ఓడించకూడదు, విజయీగా అవుతామా లేక లేదా ఈ బలహీన సంకల్పాలతో కూడా నిశ్చింతగా ఉండాలి. ఎందుకంటే ఎదురుగా కనిపిస్తుంది. ఇలా అనుభవం అవుతుందా? బలహీన సంకల్పాల చింతలో అంటే మాయ రాకూడదు, బలహీనం అవ్వకూడదు మరియు నాకు సఫలత లభిస్తుందా లేక లేదా? ఇలా భయం అనే భూతానికి వశమై మీ సమయాన్ని మరియు శక్తులను వ్యర్ధంగా పోగొట్టుకోవటం లేదు కదా? ఇటువంటి బలహీన సంకల్పాలు చేయటం అంటే స్వయంలో సంశయ సంకల్పాలు పెట్టుకోవటం ద్వారా ఎప్పుడు కూడా సంపూర్ణంగా కాలేరు. ఈ సంకల్పం పెట్టుకోవటం అంటే బలహీనతల రూపంలో ఒక భూతంతో పాటు అనేక మాయా భూతాలను ఆహ్వనిస్తున్నారు లేదా బుద్ధిలో స్థానం ఇస్తున్నారు లేదా ఒకదానితో అనేక వాటికి ఆహ్వనం ఇస్తున్నారు. అందువలన ఈ భూతాలను బుద్ది నుండి ఎప్పటి వరకు తొలగించరో అప్పటి వరకు ఈ భూతాలతో పాటు బాబా స్మృతి బుద్దిలో ఎలా నిలుస్తుంది? బాబా స్మృతి మరియు భూతం ఇవి  రెండు కలిసి నివసించలేవు. అందువలనే నిశ్చయబుద్ధి విజయంతి అని అంటారు.
                    ఈ నిశ్చయం లేదా స్మృతి ఉంచుకోండి మరియు శక్తిని ఉంచుకోండి - అనేకసార్లు  బాబా వారిగా అయ్యాము, మాయాజీతులుగా అయ్యాము, ఇప్పుడు అవ్వటం కష్టమా? శ్రేష్టఆత్మనైన నేను విజయీగా అయ్యే పాత్ర అనేక సార్లు అభినయించాను అనే స్మృతి స్పష్టంగా లేదా! ఒకవేళ  స్పష్ట స్మృతి లేదు అంటే దీని ద్వారా బాబా ముందు స్వయాన్ని స్పష్టం చేసుకోలేదు అని ఋజువు  అవుతుంది. ఏ కారణంగా అయినా బాబా ముందు ఏదైనా దాస్తే భయం యొక్క భూతం కారణంగానే  దాస్తారు. ఎవరు, ఏవిధంగా ఉన్నాను అలాగే నేను బాబా వాడిని ఈ నిశ్చయంలో లోపం కారణంగా నేను అనేకసార్లు తయారయ్యాను అనే నిశ్చయం కూడా ఉండటం లేదు. స్వయాన్ని బాబా ముందు స్పష్టం చేసుకున్నానా? అని మొదట ఇది పరిశీలన చేసుకోండి. లేదా స్వయాన్ని లేదా బాబాని సంతోషపరుస్తున్నారు అంటే బాబా అయితే అన్నీ తెలిసినవాడు ఆయనకి అన్నీ తెలుసు బాబాకి తెలియదు అని అనుకుంటున్నారా? విశ్వ శిక్షకునికి కూడా శిక్షకునిగా అవుతున్నారా? బాబాకి స్మృతి ఇప్పిస్తున్నారు అంటే బాబా మర్చిపోయారు అనుకుంటున్నారా ఏమిటి! ఈశ్వరీయ నియమం లేదా మర్యాద ఏమిటంటే - ఒక మర్యాదను పాలన చేయకపోయినా వారు మర్యాదాపురుషోత్తములుగా కాలేరు. కనుక కారణాన్ని నివారణ చేసుకోండి. బాబా ముందు దాయటం ద్వారా ఒకటికి లక్షరెట్లు బరువు తయారైన కారణంగా ఎప్పటి వరకు స్వయాన్ని తేలికగా చేసుకోరో, ఒక పొరపాటు వెనుక అనేక పొరపాట్లు చేయటం ద్వారా మరియు ఒక  మర్యాదను ఉల్లంఘన చేయటం ద్వారా  అనేక మర్యాదల ఉల్లంఘన జరగటం ద్వారా, లేదా లక్షల రెట్లు బరువు తయారైన కారణంగా, ఎక్కే కళలో అడుగు ఎలా ముందుకి వేయగలుగుతారు మరియు గమ్యానికి ఎలా సమీపంగా చేరుకోగలుగుతారు? లౌకికంలో కూడా ఏదైనా వస్తువుని దాచేవారికి ఏమి టైటిల్ (బిరుదు) ఇవ్వబడుతుంది? చిన్న వస్తువుని దాచే వారిని కూడా దొంగ అనే లిస్టులో లెక్కిస్తారు కదా? అలాగే బాబా ముందు అసత్యం మాట్లాడటం లేదా ఏదోక రకంగా విషయాన్ని నడిపించేసుకోవటం, ఇలాంటి వారికి ఎంత పాపం తయారవుతుందో తెలుసా? ఇలా అనేక రకాలైన చరిత్రలను బాబా ముందు చూపిసున్నారు. అటువంటి చరిత్ర చూపించేవారు ఎప్పుడు శ్రేష్టచరిత్రవంతులుగా కాలేరు. బాబాని భోళానాధునిగా (అమాయకునిగా) భావించి దాగిపోతుంది మరియు నడిచిపోతుంది అని అనుకుంటున్నారు. కానీ బాబా తండ్రి రూపంలో అమాయకుడే, వెనువెంట కర్మలఖాతా పూర్తి చేసే సమయంలో మరలా న్యాయాధికారిగా ఉంటారు. మరి ఆ సమయంలో ఏమి చేస్తారు? స్వయాన్ని దాచుకోగలరా లేదా రక్షించుకోగలరా?
                    మీ యొక్క అనేక రకాలైన బరువులను పరిశీలన చేసుకోండి. అమృతవేళ నుండి ఏవైతే  ఈశ్వరీయ మర్యాదలు తయారై ఉన్నాయో మరియు ఎన్ని మర్యాదలను ఉల్లంఘిస్తున్నారు అనేది కూడా మీకు తెలుసు. ఒక్కొక్క మర్యాదకు ప్రాప్తి యొక్క మార్కులు కూడా ఉంటాయి, మరియు వెనువెంట తలపై బరువు యొక్క ఖాతా కూడా ఉంటుంది. మరియు ఏ మర్యాదలనైతే సాధారణంగా భావిస్తున్నారో వాటికి ప్రాప్తి మరియు బరువు యొక్క ఖాతా కూడా ఉంటుంది. సంకల్పం, సమయం మరియు శక్తుల యొక్క ఖజానాలను వ్యర్థం చేయటం ద్వారా వ్యర్ధం యొక్క బరువు  తయారవుతుంది. ఎలా అయితే యజ్ఞంలో స్థూలవస్తువులైన అన్నం లేదా భోజనం వ్యర్ధం చేస్తే  భోజా తయారవుతుంది కదా? అలాగే ఈ మరజీవ జీవితం యొక్క సమయం బాబా విశ్వసేవ కోసం ఇచ్చారు, సర్వశక్తులు స్వయం కోసం మరియు విశ్వకళ్యాణార్ధం ఇచ్చారు. మనస్సు శుద్ద సంకల్పాలు చేసేటందుకు ఇచ్చారు మరియు ఈ శరీరం విశ్వసేవ కోసం ఇచ్చారు. మీరందరు తనువు, మనస్సు, ధనం ఏదైతే ఇచ్చారో అవి మీవా ఏమిటి? బాబాకి అర్పణ చేసారు అంటే బాబావి అయిపోయాయి కదా? బాబా మరలా వాటిని విశ్వసేవ కొరకు ఇచ్చారు. శ్రేష్ట సంకల్పంతో వాయుమండలాన్ని మరియు వాతావరణాన్ని శుద్ధంగా చేసేటందుకు మనస్సు ఇచ్చారు. ఇలా  ఈశ్వరుడు ఇచ్చినది అంటే ఈశ్వరుని యొక్క వస్తువుని వ్యర్ధంగా ఉపయోగిస్తే భోజా రాదా?
                       ఈ రోజుల్లో జడచిత్రాల ద్వారా లేదా మందిరాలలో కొద్దిగా ప్రసాదం లభించినా దానిని  ఎప్పుడు వ్యర్ధంగా పోగొట్టుకోరు. ఒకవేళ చిన్న కణం అయినా పాదాలపై పడితే పాపంగా భావించి మస్తకానికి అద్దుకుని స్వీకరిస్తారు. అనేక మంది నోటిలో వేసి ప్రసాదాన్ని సఫలం చేసే ప్రయత్నం చేస్తారు మరియు దానిని వ్యర్ధం అవ్వనివ్వరు. స్వయం బాబా ద్వారా లభించిన ఈ తనువు, మనస్సు అనే వస్తువులు పరమాత్మ ప్రసాదంగా అయిపోయాయి, మరి వీటిని వ్యర్థం చేస్తే భోజా రాదా? ఎలా అయితే సమయం యొక్క వేగం లోతుగా వెళ్తుందో, అలాగే ఇప్పుడు పురుషార్ధం యొక్క ప్రాప్తి మరియు భోజా యొక్క వేగం కూడా గుహ్యమవుతూ ఉంది. దీనినే  కర్మల గతి చాలా గుహ్యమైనది అని అంటారు. ఈ రోజు కర్మల యొక్క గుహ్యగతి చెప్తున్నాను. దీని ద్వారానే సద్గతి పొందుతారు. గమ్యానికి సమీపంగా చేరుకునే గుర్తులు ఏమిటో ఇప్పుడు అర్ధమైందా?  గమ్యానికి సమీపంగా వెళ్ళే విధి ఏమిటో అర్థమైందా?
                         బాప్ దాదాకి కూడా ఇప్పుడే అందరిని సంపూర్ణంగా చేయాలి అనే దయ వస్తుంది. కానీ రచయిత కూడా మర్యాదలలో లేదా ఈశ్వరీయ నియమాలలో బంధీ అయ్యి ఉన్నారు. బాబా కూడా మర్యాదలను ఉల్లంఘన చేయరు. ఎవరు చేస్తే వారు పొందుతారు. ఈ మర్యాదను బాబా పూర్తి చేస్తారు. కానీ ఒకటికి వంద రెట్లు ఇచ్చే అవకాశం బాబాకి ఉంది. ధైర్యం పెట్టుకుంటే బాబా సహాయం చేస్తారు. ఇక ఏమీ చేయరు.
             ఇలా ధైర్యం మరియు ఉల్లాసాలలో ఉండేవారికి, సదా నిశ్చయబుద్ది విజయీగా అయ్యేవారికి, గమ్యానికి సమీపంగా చేరుకునే ఆత్మలకు, సదా నషాలో ఉండే ఆత్మలకు, వ్యర్ధాన్ని సమర్థంగా చేసుకునే ఆత్మలకు, ప్రతి సెకను మరియు ప్రతి సంకల్పాన్ని సఫలం చేసుకుని సఫలతామూర్తి ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments