04-07-1971 అవ్యక్త మురళి

* 04-07-1971         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

 “స్మృతి యొక్క సహజ విధి''

               ఇక్కడ అందరూ కూర్చున్నారు, ఏ స్టేజ్ యొక్క స్థితిలో స్థితులై ఉన్నారు? ఈ సమయంలో మీ స్మృతి యొక్క స్టేజ్ ను ఏమని అంటారు? ఈ స్థితిలో డబుల్ స్మృతి ఉందా లేక సింగల్ స్మృతి ఉందా? ఈ సమయంలోని స్టేజ్ ను కర్మాతీతపు లేక ఫరిస్తాతనపు స్మృతి యొక్క స్టేజ్ అని అనవచ్చా? ఎవరైతే అవ్యక్తి స్థితిని కాకుండా ఇతర మరేదైనా స్టేజ్ గా అనుకుంటారో వారు చేతులెత్తండి. మొత్తము రోజంతా ఇటువంటి అవ్యక్త స్థితిలో ఉంటూ కర్మ చెయ్యగలరా? (చెయ్యలేము). ఇప్పుడు ఏదైతే వ్రాస్తున్నారో అది కూడా కర్మయే కదా! మరి ఇప్పుడు కర్మ చేస్తూ అటువంటి స్టేజ్ ను ఉంచలేరా? (ఇప్పుడు బాబా సమ్ముఖములో కూర్చున్నాము) ఒకవేళ బాబా మాతోటి ఉండనే ఉన్నారు, సమ్ముఖముగా ఉన్నారు అని ఎల్లప్పుడూ భావించినట్లయితే మరి ఆ స్థితి ఎల్లప్పుడూ ఉండాలి. ఆ మనుష్యులు ఇటువంటి వాయుమండలములోకి ముఖ్యంగా అటెన్షన్ ను పెట్టి వెళ్ళినట్లయితే ఈ అటెన్షనే వారి రక్షణకు సాధనంగా అవుతుంది. అలాగే ఏదైనా సాధారణ కర్మ చేస్తున్నాకూడా మధ్యమధ్యలో అవ్యక్త స్థితిని తయారుచేసుకొనే అటెన్షన్ ఉండాలి మరియు ఏ కార్యమును చేస్తున్నా కూడా ఎల్లప్పుడూ బాప్ దాదాను తమ సహచరునిగా భావించి డబుల్ ఫోర్స్ తో కార్యము చేసినట్లయితే ఏ స్టేజ్ ఉంటుందో చెప్పండి? ఒకటేమో స్మృతి చాలా సహజంగా ఉంటుంది. ఏవిధంగా ఇప్పుడు సమ్ముఖముగా భావించటం ద్వారా సహజ స్మృతి ఉంది కదా! ఇదేవిధంగా ఒకవేళ ఎల్లప్పుడు ప్రతి కర్మలో తండ్రిని తమ సహచరునిగా భావించి నడుచుకున్నట్లయితే అది సహజ స్మృతి అవ్వదా? ఎవరైనా ఎల్లప్పుడూ తోడుగా ఉన్నట్లయితే ఆ తోడు కారణంగా సృతి స్వతహాగనే ఉంటుంది కదా! కావున అటువంటి సహచరుడు ఉండటం ద్వారా లేక బుద్ధికి నిరంతరము సత్యము యొక్క సాంగత్యమును ఇవ్వటం ద్వారా నిరంతర సత్సంగము ఉండాలి. మీరు ఉన్నదే సత్సంగీలుగా, ప్రతి క్షణములో, ప్రతి అడుగులో సత్యము యొక్క సాంగత్యము ఉండాలి కదా! ఒకవేళ నిరంతరము మిమ్మల్ని మీరు సత్సంగీలుగా తయారుచేసుకున్నట్లయితే స్మృతి సహజంగా ఉంటుంది మరియు శక్తిశాలీ సాంగత్యము ఉన్న కారణంగా ప్రతి కర్తవ్యములో మీకు డబల్ ఫోర్స్ ఉంటుంది. డబల్ ఫోర్స్ ఉన్న కారణంగా ఏ కార్యమైతే స్థితి లెక్కలో కష్టమని భావిస్తారో అది సహజమైపోతుంది ఎందుకంటే డబల్ ఫోర్స్ అయిపోయింది మరియు అదే సమయంలో ఒక కర్తవ్యమునకు బదులుగా రెండు కార్యాలను సమాప్తము చెయ్యగలరు. ఒకటి సహజ స్మృతి, రెండవది సఫలత, మూడవది కర్మలన్నింటిలో ఉల్లాస-ఉత్సాహాలు మరియు సహయోగపు ప్రాప్తి ఉంటాయి కావున నిరంతర సత్సంగీలుగా అవ్వండి. మీ వద్దకు ఎవరైనా వచ్చినప్పుడు మీరు వారికి ఎల్లప్పుడూ సత్యము యొక్క సాంగత్యమును చెయ్యండి అని వారికి నియమాన్ని తెలుపుతారు కదా! మరి ఈ అభ్యాసమును మీరు కూడా నిరంతరము చెయ్యవలసి ఉంటుంది. మరల స్మృతి ఏదైతే కష్టమనిపిస్తుందో, స్మృతి ఎలా నిలుస్తుంది, ఎక్కడ నిలుస్తుంది అని సంకల్పాలేవైతే చేస్తారో ఈ అన్ని సంకల్పాలు సమాప్తమైపోతాయి. కర్మ యొక్క సహజ సిద్ధి లభిస్తుంది. ఇందులో కావాలంటే నిరాకార రూపముతో సాంగత్యము చెయ్యండి, లేదా సాకారరూపంలో చెయ్యండి కానీ సత్యము యొక్క సాంగత్యము అయితే ఉండాలి. సాకార సంబంధము కూడా మొత్తము కల్పములో అవినాశిగా ఉంటుంది కదా! కావున సాకార స్మృతి అయినా లేక నిరాకారీ స్మృతి అయినా కానీ స్మృతి అయితే తప్పక ఉండాలి. బాప్ దాదా సాంగత్యము తప్ప మరే ఇతర సాంగత్యము బుద్ధిలో ఉండకూడదు. ఫరిస్తాగా అయ్యేందుకు తండ్రి తోటి ఏ రిస్తా(సంబంధము) ఉందో అది దృఢంగా ఉండాలి. ఒకవేళ మీ రిస్తా దృఢంగా ఉన్నట్లయితే ఫరిస్తాగా అవ్వనే అవుతారు. ఇప్పుడు కేవలం ఈ మీ రిస్తాను మంచిగా చేసుకోండి. ఒకవేళ ఒక్కరి తోటి సర్వ రిస్తాలు(సంబంధములు) ఉన్నట్లయితే సహజముగా మరియు సదా ఫరిస్తాలుగా ఉంటారు. బుద్ధి వెళ్ళటానికి వేరే ఏముంది కనుక! ఇంకా ఏవైనా మిగిలి ఉన్నాయా? సర్వ సంబంధాలు, సర్వ రిస్తాలు, సర్వ రాస్తాలు(దారులు) మూసి ఉన్నాయా? దారి తెరుచుకొని ఉన్నట్లయితే బుద్ధి పరుగెడుతుంది. ఎప్పుడైతే అన్ని సంబంధాలు కూడా సమాప్తమో దారులు కూడా మూసుకుపోయి ఉంటాయో అప్పుడిక బుద్ది ఎక్కడకు వెళుతుంది! ఒక్కటే రాస్తా, ఒక్కటే రిస్తా ఉన్నట్లయితే మరల ఫరిస్తాగా అయిపోతారు. ఏ రాస్తా లేక ఏ రిస్తా ఇప్పటివరకు పూర్తిగా సమాప్తమైపోలేదు అన్నదానిని పరిశీలించుకోండి. కాస్త తెరుచుకొని ఉన్నా కూడా అక్కడి నుండి వెళ్ళటానికి మనుష్యులు ప్రయత్నిస్తారు. పూర్తిగా మూసివేసి ఉన్నట్లయితే వెళ్ళనే వెళ్ళరు.

            కన్నం ఉన్నా కూడా దానిని టచ్ చేసి వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా ఒకవేళ దారి కాస్త అయినా  తెరుచుకొని ఉన్నట్లయితే బుద్ధి వెళుతుంది. ఇప్పుడు దానిని ఎలా ముయ్యాలి? అన్ని దారులను  మూసివేసేందుకు సహజమైన యుక్తిని పదే పదే వినిపిస్తూ ఉంటారు. ప్రతిరోజూ మురళిలో కూడా  వింటారు. గుర్తుందా? విస్మృతికి స్మృతిని ఇప్పించే యుక్తి ఏది? ఒకటే చిత్రము ఉంది, అందులో బాప్ దాదా  మరియు వారసత్వము వచ్చేస్తాయి. ఒకవేళ ఈ చిత్రాన్ని ఎల్లప్పుడూ ఎదురుగా ఉంచుకున్నట్లయితే  మిగిలిన అన్ని దారులూ మూసుకొనిపోతాయా? చిత్రాలు మరియు లిటరేచర్ ను ఏదైతే ముద్రిస్తారో  మీరు వాటిపై ఈ బ్లాక్ ను వేస్తారు కదా! ఒకవేళ ఈ ఒక్క బ్లాక్ బుద్ధిలో నిలిచి ఉన్నట్లయితే అన్ని దారులూ  మూసుకొనిపోతాయి, ఇది సహజ యుక్తి, వేరే గుర్తు కూడా ఇవ్వబడింది. ఇదైతే ప్రతిరోజూ మురళిలో  వింటారు. ఈ యుక్తి లేనటువంటి మురళియే లేదు. ఇది చాలా సహజమైనది. ఈ చిత్రాన్ని ఎప్పుడూ  మీ ముందు ఉంచుకోండి అని చిన్నపిల్లలకు చెప్పినా వారు కూడా చెయ్యగలరు. బ్యాడ్జ్ ను పెట్టుకొన్నాగానీ  ఇప్పుడు బుద్ధిలో స్మృతిస్వరూపంగా అవ్వండి. ఈ ఒక్క చిత్రము స్మృతి ద్వారా అన్ని స్మృతులు వచ్చేస్తాయి. మొత్తము జ్ఞాన సారమంతా కూడా ఈ ఒక్క చిత్రములో ఇమిడి ఉంది. రచయిత మరియు రచనల  జ్ఞానము ద్వారా ఈ ప్రాప్తి కలుగుతుంది కదా! ఎంతగా ఈ సహజయుక్తులను ఆచరిస్తూ ఉంటారో  అంతగా కష్టము సరళమైపోతుంది. ఎవరిని స్మృతి చెయ్యాలి, ఏం స్మృతి చెయ్యాలి, ఇది స్మృతి అవునో  కాదో తెలియదు అని తికమకపడకండి. ఉద్దేశపూర్వకంగా స్వయమును తికమకపెట్టుకుంటారు. స్మృతి అంటే ఏమిటి? తండ్రి స్మృతి లేక తండ్రి కర్మల ద్వారా తండ్రి స్మృతి లేక తండ్రి గుణాల ద్వారా తండ్రి స్మృతి,  మరి ఇది స్మృతి అయింది కదా! రూపము యొక్క స్మృతి అయినా లేక గుణాలు లేక కర్తవ్యాలైనా, స్మృతి  అయితే ఒక్కరిదే కదా! మీరు చాలా కష్టమైనదిగా తయారుచేసుకుంటారు. స్మృతి కోర్సును కష్టం కష్టం అంటుంటే ఫోర్సు రాదు, కోర్సులోనే ఉండిపోతారు. దానిని సహజము చెయ్యండి. బాబా తప్ప మరేదీ లేనే  లేదు. సహజమైన విషయాన్ని ఎక్కడో కొందరు కష్టం చేసేస్తారు మరియు ఇప్పటివరకు కూడా దారి  ఎక్కడో తెరిచి ఉంది కావున పదే పదే బుద్ధిని కష్టపడి తిరిగి పంపించాల్సి ఉంటుంది. ఇందులో  అలసిపోతారు, తల బరువైపోతుంది. కష్టమనుకొని కష్టములో పడిపోతారు. కావున సహజమైన పద్ధతి - మొదట ఈ అన్ని దారులనూ మూసివెయ్యండి. దీనిని మూసివెయ్యండి అని గవర్నమెంట్ ప్రకటిస్తుంది  కదా. కావున మీ కొరకు కూడా బాప్ దాదా ఈ ఆజ్ఞను ఇస్తున్నారు - మొదటైతే అన్ని దారులనూ  మూసివెయ్యండి, అప్పుడిక కష్టము నుండి విముక్తులైపోతారు, సహజమైపోతుంది, అప్పుడిక నేచురల్  అయిపోతుంది. ఈ అటెన్షన్‌ను పెట్టడము కష్టమా లేక సహజమా? కష్టమనేదే లేదు కానీ, కష్టంగా  చేసుకొంటారు. ఒకవేళ ఈ అటెన్షన్‌ను ప్రతి సమయము పెట్టూ ఉన్నట్లయితే కష్టముండదు. కాస్త  నిర్లక్ష్యములో ఉంటూ వచ్చారు కావున ఇప్పుడు కష్టమనిపిస్తుంది. ఏవిధంగా చిన్నతనములో ఏ  విషయాలను నేర్పించినా అవి సహజంగా స్మృతిలో ఉంటాయి. పెద్దతనములో ఏదైనా విషయమును  స్మృతిలోకి తీసుకురావటము కష్టమైపోతుంది. ఇందులో కూడా ఎవరైతే చిన్నతనము నుండే ఈ అటెన్షన్ ను పెట్టే అభ్యాసము చేసారో వారికి ఇప్పుడు కూడా సహజ స్మృతి యొక్క చార్టు ఉంటుంది. మరియు ఎవరైతే  ఈ అటెన్షన్ ను పెట్టడంలో మొదటి నుండీ నిర్లక్ష్యముగా ఉంటారో వారికి ఇప్పుడు కష్టమనిపిస్తుంది. జరిగినదేదో జరిగిపోయిందనుకుని ఎల్లప్పుడూ నేను పిల్లవాడిని, తండ్రితోటి ఉన్నాను అని భావించండి.  ఇలా భావించటం ద్వారా ఆ చిన్ననాటి జీవితము స్మృతిలో ఉంటుంది. ఎంతగా ఈ స్మృతిలో ఉన్నట్లయితే  అంతగా సహాయము లభిస్తుంది. మళ్ళీ కష్టమైన కార్యము సహజమైపోతుంది. ఇప్పటినుండే మిమ్మల్ని  ఒక్క క్షణము కూడా తండ్రి నుండి వేరుగా భావించకండి. తండ్రి తోడు కూడా ఉంది మరియు తండ్రి చేతిలో నా చెయ్యి కూడా ఉంది అని ఎల్లప్పుడూ భావించండి.

            ఒకవేళ ఎవరైనా పెద్దవారి చేతిలో చెయ్యి ఉన్నట్లయితే చిన్నవారి స్థితి కంగారు లేకుండా ఉంటుంది, నిశ్చింతగా ఉంటారు. కావున ప్రతి కర్మలో బాప్ దాదా నా తోడుగా కూడా ఉన్నారు మరియు మా ఈ అలౌకిక జీవితపు చెయ్యి వారి చేతిలో ఉంది అని భావించండి, అనగా జీవితము వారి అధీనము, బాధ్యత వారిదౌతుంది. భారములన్నింటినీ తండ్రిపై పెట్టి స్వయమును తేలికగా చేసుకోవాలి. భారమే లేనప్పుడు కష్టమేమన్నా అనిపిస్తుందా? భారమును దించుకొనేందుకు మరియు కష్టమును సహజము చేసేందుకు సాధనము - తండ్రి హస్తము మరియు తోడు. ఇదైతే సహజము కదా! సాకారుని నుండి నిరాకారుని వైపుకు స్మృతి వస్తుంది. అప్పుడిక బాబా స్మృతిలోకి రావాలంటే బాబా స్మృతిలోకి రండి, దాదా స్మృతిలోకి రావాలంటే దాదా స్మృతిలోకి రండి. బాబా స్మృతి వచ్చినట్లయితే తోడుగా దాదా స్మృతి కూడా ఉండనే ఉంటుంది. దాదా స్మృతితో తండ్రి స్మృతి కూడా ఉంటుంది, వారు వేరవ్వజాలరు. ఒకవేళ సాకార స్నేహీగా అయినా కూడా ఇతర అన్ని విషయాల నుండి బుద్ధి తొలగిపోతుంది కదా! సాకార స్నేహిగా అవ్వటము కూడా తక్కువైనదేమీ కాదు. సాకార స్నేహము కూడా సర్వ స్నేహాల నుండి, సంబంధాల నుండి బుద్ధియోగాన్ని త్రెంచేస్తుంది. కావున అనేకవైపుల నుండి తెంచుకొని ఒక్క వైపుకు జోడించే సాధనముంది కదా! సాకారుని నుండి నిరాకారుని వైపుకు స్మృతి వస్తుంది. ఎప్పుడైతే బాప్ దాదాలిరువురి తోడు ఉంటుందో అప్పుడే సాకారునితో స్నేహము కూడా పెరుగుతుంది. ఒకవేళ బాప్ దాదా తోడు ఉండనట్లయితే సాకారుడు అంత ప్రియంగా ఉండరు. ఏవిధంగా బాప్ దాదా ఇరువురూ తోడుతోడుగా ఉన్నారో అలా మీ స్మృతి కూడా తోడుతోడుగా అయిపోతుంది. కష్టమని ఎప్పుడూ భావించకండి, సహజయోగులుగా అవ్వండి. కష్టయోగులుగా అయితే ద్వాపరము నుండి అవుతూ వచ్చారు, హఠయోగుల హఠమును మీరు ఖండిస్తారు కదా! మరి మీరు కూడా సహజయోగులుగా అవ్వకుండా, కష్టమని అంటే ఇక విషయమొక్కటే అయినట్లు కదా! సహజయోగిగా అవ్వాలి. యథార్థ స్మృతి, నిరంతర సహజయోగులై కేవలము మీ స్టేజ్ ను మధ్యమధ్యలో శక్తి శాలిగా తయారుచేసుకుంటూ వెళ్ళండి. స్టేజ్ పైన ఉన్నారు, కేవలము సమయ ప్రతిసమయము ఈ స్మృతి స్టేజ్ ను శక్తిశాలిగా తయారుచేసుకొనేందుకు అటెన్షన్ యొక్క ఫోర్స్ ను నింపుతూ ఉండండి. దిగే కళ ఇప్పుడు సమాప్తమైపోయిందా లేక ఇప్పుడు కూడా ఉందా? అప్పుడే ఎక్కే కళలోకి వచ్చారు కదా!

            ఒక్కరోజు దినచర్యను ఆలోచించండి సాకార స్మృతి అన్నా ఉంటుంది లేక నిరాకారీ స్మృతి అన్నా ఉంటుంది. కార్యవ్యవహారము కూడా యజ్ఞ కార్యవ్యవహారము కదా! యజ్ఞపిత ద్వారానే యజ్ఞ రచన జరిగింది. కావున యజ్ఞ కార్యవ్యవహారము అన్నమాట అనటంతో తండ్రి స్మృతి వచ్చేస్తుంది కదా! ఎప్పుడు కార్యవ్యవహారమును చేస్తున్నా ఈశ్వరీయ సేవలో ఉన్నాను లేక యజ్ఞ కార్యములో ఉన్నాను అని భావించండి. ఒకటేమో డైరెక్ట్ వికర్మ వినాశన స్టేజ్ లో స్థితులై ఫుల్ ఫోర్స్ తో వికర్మలను నాశనము చెయ్యటము. రెండవ పద్ధతి - ఎంతెంతగా శుద్ధ సంకల్పాలు లేక మనన శక్తి ద్వారా తమ బుద్ధిని బిజీగా ఉంచుకొంటారో ఆ శక్తులు జమ అవుతాయి, కావున దాని ద్వారా అవి నెమ్మది నెమ్మదిగా సమాప్తమైపోతాయి. బుద్ధిలో ఇది నిండటం ద్వారా ముందున్నది స్వయమే తొలగిపోతుంది. మొదట అంతటినీ తొలగించి మరల నింపటము ఒకటైతే, రెండవది నింపటం ద్వారా తొలగించటము, ఒకవేళ ఖాళీ చేసే ధైర్యము లేనట్లయితే వేరేది నింపటం ద్వారా మొదటిది తనకు తానే సమాప్తమైపోతుంది. ఆ స్థితి దానికదే తయారవుతూ ఉంటుంది. ఒకవైపు నిండుతూ ఉంటుంది మరియు రెండవవైపు ఖాళీ అవుతూ ఉంటుంది. అప్పుడిక ఏ స్టేజీ నైతే కోరుకుంటారో అది నేచురల్ అయిపోతుంది. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అయిపోతుంది. ఫుల్ ఫోర్స్ తో ఖాళీ చేసే విధానము రాకపోతే ఇంకొక మార్గము కూడా ఉంది కదా. నింపుకుంటూ ఉంటే స్వతహాగా ఖాళీ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కే కళ అన్నదానిని స్మృతిలో ఉంచుకోండి. దారులన్నీ మూసుకుపోయినట్లయితే బుద్ధి ఎక్కడకూ వెళ్ళనే వెళ్ళదు. యజ్ఞ కార్యవ్యవహారము మరియు కర్మణా సేవకుకూడా మార్కులు ఉన్నాయి కదా! అయినా కూడా పాస్ విత్ ఆనర్స్ లో ఆ 100 మార్కులు సహాయము చేస్తాయి కదా! కానీ ఇది తప్పనిసరి, ఏ సమయములో కార్యవ్యవహారము మరియు వాచ సేవ చేసేది ఉందో అప్పుడు ఇది ఈశ్వరీయ సేవ అన్న లక్ష్యమును ఉంచాలి. యజ్ఞ   కార్యవ్యవహారము, కావున ఆటోమేటిక్ గానే యజ్ఞ రచయిత స్మృతి వస్తుంది మరియు ఏ కార్యమును చేస్తున్నా - ఈ కార్యమునకు నిమిత్తముగా తయారుచేసే వెన్నెముక ఎవరు! అని ఆలోచించండి. నేనైతే  నిమిత్తమును, కానీ బ్యాక్ బోన్ ఎవరు! బ్యాక్ బోన్(వెన్నముక) లేకుండా మీరు శరీరములో నిలవగలరా?  వెన్నముక లేకుండా మీరు ఏ కర్మలో సఫలతను కూడా పొందలేరు. ఏ కార్యమును చేస్తున్నా, కేవలము - నేను నిమిత్తమును అని ఆలోచించండి, చేయించేవారు ఎవరు. 'చేసి-చేయించేవారు' అని  భక్తిమార్గంలో అనేవారు కానీ వేరే అర్థంతో అన్నారు. కానీ ఈ సమయంలో ఏ కర్మను చేస్తున్నా అందులో చేసి-చేయించేవారైతే ఉన్నారు కదా! చేయించేవారు తండ్రి, చేసేవారు నిమిత్తము. ఒకవేళ  ఈ స్మృతిలో ఉండి కర్మ చేసినట్లయితే సహజ స్మృతి ఉండదా? నిరంతరయోగులుగా ఉండరా? మళ్ళీ  ఎప్పుడైనా హాస్యానికి కిందకు వచ్చినా, ఏదైనా స్టేజీపై నటులు పాత్రను అభినయించినట్లుగా లోక కళ్యాణార్ధం హాస్యపు పాత్రను అభినయిస్తారు, తరువాత తమ స్థితిలోకి వచ్చి, ఇప్పటివరకు ఈ పాత్రను అభినయించాను, ఇప్పుడు ఇంకొక పాత్రను అభినయిస్తాను అని భావిస్తారు, అంతా ఆటలా  అనుభవమవుతుంది, సాక్షిగా అయి పాత్రను అభినయిస్తారు. మరి అప్పుడు సహజయోగులుగా  అయినట్లే కదా! స్మృతిని కూడా సహజము చెయ్యండి. ఎప్పుడైతే ఈ స్మృతి కోర్సు సహజమైపోతుందో  అప్పుడు ఎవరికైనా కోర్సు ఇవ్వటంలో స్మృతి ఫోర్సును కూడా నిండగలదు. కేవలము కోర్సు ఇవ్వటం ద్వారా  ప్రజలు తయారవుతారు కానీ ఫోర్స్ తో పాటు కోర్సులో సమీప సంబంధములోకి వస్తారు. అతీతము  మరియు ప్రియము అని పూర్తిగా అనుభవము చేస్తారు. కావున అందరూ సహజయోగులు, హఠము  చెయ్యవద్దు. 63 జన్మలు కష్టమును చూస్తూ చూస్తూ ఈ ఒక్క జన్మలోని సహజ పురుషార్థములో కూడా ఒకవేళ కష్టములోనే ఉన్నట్లయితే సహజ మరియు స్వతహ విధానమును ఎప్పుడు అనుభవము చేసుకుంటారు? దీనిని సహజయోగమనే అంటారు కదా! కఠినయోగమైతే కాదు కదా. ఈ సహజయోగము అక్కడ సహజ రాజ్యమును చేయిస్తుంది, అక్కడ కూడా ఎటువంటి కష్టము ఉండదు.  ఇక్కడి సంస్కారమునే అక్కడకు తీసుకొని వెళ్తారు. ఒకవేళ చివరి వరకు కూడా కష్టపు సంస్కారము  ఉన్నట్లయితే అక్కడ సహజ రాజ్యమును ఎలా చేస్తారు? దేవతల చిత్రాలనేవైతే తయారుచేస్తారో వారి ముఖములో సరళతను తప్పక చూపిస్తారు. ఈ విశేష గుణమును చూపిస్తారు. ముఖ కవళికలలో సరళత, దీనినే మీరు అమాయకత్వము అని అంటారు. ఎవరు ఎంత సహజ పురుషార్ధిగా ఉంటారో వారు  మనస్సులో కూడా సరళముగా, వాచలో కూడా సరళముగా, కర్మలో కూడా సరళముగా ఉంటారు,  వారినే ఫరిస్తా అని అంటారు. అచ్ఛా!

Comments