04-02-1975 అవ్యక్త మురళి

04-02-1975         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

జ్ఞానాన్ని స్వయంలో నింపుకోవడం ద్వారానే అమూల్య ముత్యాలు మరియు అమోఘశక్తి ప్రాప్తిస్తాయి.

                  జ్ఞాన ఖజానానిచ్చి సదా సంతోషంగా తయారు చేసేవారు మరియు సర్వ శక్తులను ఇచ్చే శివబాబా మాట్లాడుతున్నారు --
                   సంగమయుగీ శ్రేష్టాత్మలు ఛాత్రకుల వలె ఉన్నారు. ముత్యపు చిప్ప గురించి చెబుతారు కదా - ప్రతి చినుకును స్వయంలో నింపుకోవడం ద్వారా ముత్యంగా తయారు చేస్తుంది. అదేవిధంగా మీరందరూ కూడా ఏవైతే జ్ఞాన విషయాలు లేదా మహవాక్యాలు వింటున్నారో మరియు ధారణ చేస్తున్నారో ఆ ఒక్కొక్క మాట ఏ విధంగా అవుతుంది? మీరు కూడా వాటిని ముత్యాలుగా తయారు చేస్తున్నారు, ఇక్కడ ఒక్కొక్క మాట కోటానుకోట్లకు అధిపతిగా తయారుచేస్తుంది. ఒక్కొక్క మాట అమూల్యంగా ఎప్పుడవుతుందంటే ఆ మాటను మీరు ధారణ చేసినప్పుడు, చాత్రక పక్షి చినుకును ఎలాగైతే గ్రహిస్తుందో, అదేవిధంగా మీరు కూడా ఈ జ్ఞానాన్ని విని మీలో నింపుకుంటున్నారు. నింపుకున్న దానికి ప్రత్యక్ష స్వరూపంగా ఏమి కనిపిస్తుంది? ప్రతి సంకల్పం, ప్రతి మాట మరియు ప్రతి కర్మ కోటానుకోట్ల సంపాదన జమ చేసుకునేటందుకు ఆధారం అవుతాయి. అంటే ప్రతి సెకెను యొక్క మాటలో ఆ ఆత్మ కోటానుకోట్లకు అధిపతి స్వరూపంలో కనిపిస్తుంది. సూలధనం యొక్క నషా మరియు సంతోషం ముఖంలో మెరుస్తూ కనిపిస్తుంది, కాని అది అల్పకాలికమైనది. జ్ఞాన ఛాత్రకులైన వారి ముఖంలో సంతోషం యొక్క మెరుపు సదా స్పష్టంగా కనిపిస్తుంది. మీ దర్పణంలో మూడవనేత్రం ద్వారా మీ యొక్క ఇలాంటి మెరుపును ప్రతి సమయం చూస్తున్నారా? ప్రతి సెకెను యొక్క జమ లెక్కను పరిశీలించుకుంటున్నారా? ఎంత కలిసొస్తుంది(+) ఎంత తక్కువ అవుతుంది (-) ఇలా మీ యొక్క లెక్క స్పష్టంగా పెట్టుకునే అభ్యాసీలేనా? విశేష సమయం తీసి లెక్కలు చూసుకుంటున్నారా? ఇప్పుడిప్పుడే సంపాదన, ఇప్పుడిప్పుడే పోగొట్టుకోవడం, ఈ ఎక్కడం దిగడం ఎక్కువగా ఉంటే ఆలోచించడం, చూడడం మరియు మాట్లాడడంలో విశేష సమయం తీయాల్సి ఉంటుంది. అలా కాకుండా సంపాదన ఏకరసంగా ఉంటే జమ జరుగుతుంది, మాటిమాటికి నష్టం అనే మాట ఉండదు, అనగా ఖాతా స్పష్టంగా ఉంది. ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో ఒక్క సెకెనులో లెక్క తీయగలరా? ఏమి ఫలితం కనిపిస్తుంది, ఇప్పుడైతే అనేక ఆత్మలతో అనేక జన్మలుగా తయారైన ఖాతా దానిని పాపకర్మల ఖాతా అని అంటారు, దానిని భస్మం చేసుకోవాలి. స్వయం యొక్క ఇలాంటి ఖాతాను తయారుచేసుకోలేరా? ఇదైతే పాత ఖాతా, మీరైతే పాత ఖాతాను సమాప్తి చేసుకుని, కొత్త జన్మ, కొత్త ఖాతాను తయారు చేసుకునేవారు. పాత ఖాతా అంతా సమాప్తి అవుతూ ఉంది అని అనుభవం అవుతుందా? ఒకవేళ పాత ఖాతా అంతటినీ పూర్తిగా సమాప్తి చేసుకునే యుక్తి రాకపోతే ఆ మిగిలిపోయిన కొంచెం ఖాతా మాటిమాటికి మనసును తినేస్తుంటుంది. మాయకు కొంచెం అయినా అప్పు ఉండిపోతే అప్పు ఇచ్చిన మాయ మాటిమాటికి విసిగిస్తుంది. ఈ అప్పు తీరిపోయిందా, మాయ యొక్క అప్పు పాత ఖాతాలో మిగిలిపోయింది. అందుకే మాయ మాటిమాటికి అలజడి చేస్తుంది. ఏదో ఒక మానసిక అప్పు రూపంలో, ఆ అప్పు తీర్చాల్సి ఉంటుంది. మీ ఖాతాను పరిశీలించుకోండి - ఏదైనా మిగిలిపోయిన అప్పు సంకల్పం రూపంలో లేదా సంస్కారం రూపంలో లేదా స్వభావం రూపంలో మిగిలిపోలేదు కదా? ఎలాగైతే శారీరక రోగం లేదా అప్పు బుద్ధిని ఏకాగ్ర చిత్తం అవ్వనివ్వదు, అనుకోనప్పటికీ తన వైపుకి మాటిమాటికి లాగుతుంటుంది. అదేవిధంగా మానసిక అప్పు కూడా బుద్ధియోగాన్ని ఏకాగ్రం అవ్వనివ్వదు, అంతే కాకుండా విఘ్న రూపంగా కూడా అవుతుంది. సమయం యొక్క సమాప్తి ఇప్పుడు సమీపంగా ఉంది. మీ యొక్క లెక్కలన్నింటినీ పరిశీలించుకోండి మరియు సమాప్తి చేసుకోండి. లెక్కలు చూడడం వస్తుంది కదా? మాస్టర్ జ్ఞానసాగరులు కదా? పాత ఖాతా యొక్క అప్పు వ్యర్థ సంకల్పాలు లేదా వికల్పాల రూపంలో ఉంటుంది లేదా ఏదోక స్వభావ సంస్కార రూపంలో ఉంటుంది. ఈ విషయాల ఆధారంగా పరిశిలించుకోండి - ఒకే సంకల్పం ఉంటుందా? స్మృతి కూడా ఒకరినే చేస్తున్నారు లేదా ఒకరినే చేయాలనుకుంటున్నారు, కాని మరొకటి అవుతుందా? ఏది తనవైపుకి ఆకర్షిస్తుంది, ఎందుకు ఆకర్షిస్తుంది? ఏదైనా భారం ఉందా, తనవైపునకు లాగుకోవడానికి? తేలికైన వస్తువు ఎప్పుడూ కిందికి రాదు, ఎక్కే  కళలోనే ఉంటుంది, ఏ రకమైన భారం ఉన్నా ఎంతగా పైకి ఎగరాలనుకున్నా పైకి వెళ్ళదు, కిందికే వచ్చేస్తుంది. అదేవిధంగా రోజంతటిలో మనసా, వాచా, కర్మణాలో, సంప్రదింపులు మరియు సేవలో ఈ విషయాలను పరిశీలించుకోండి. సేవలో కూడా ప్లాన్ మరియు ప్రత్యక్షంలో సంకల్పం మరియు కర్మలో తేడా ఎందుకు వస్తుంది? ఆ తేడాకు కారణం ఆలోచిస్తే స్పష్టంగా ఏమి కనిపిస్తుందంటే ఏదోక లోపం ఉన్న కారణంగానే ప్లాన్ మరియు ప్రత్యక్షతలో తేడా వస్తుంది. సర్వశక్తుల్లో ఏదో ఒక శక్తి విశేష లోపంగా ఉంటుంది. ఎలాగైతే యుద్ధ మైదానంలో సర్వ శస్త్ర ధారులుగా కాకపోతే సమయానికి ఏదైనా సాధారణ శస్త్రం అయినా అవసరపడితే ఆ సాధారణ శస్త్రం లేకపోయినా కానీ చాలా నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా సర్వ శక్తులు సమూహంగా ఉండాలి. అంటే సర్వ శస్త్రధారిగా ఉండాలి. మీ బుద్ధిని అనుసరించి ఇది సాధారణ విషయం అని నిర్ణయిస్తున్నారు. కానీ అది కూడా సమయానుసారం చాలా మోసగిస్తుంది. అందువలన మీ బిరుదు - మాస్టర్ సర్వశక్తివాన్. తండ్రి సర్వశక్తివంతుడైనప్పుడు పిల్లలు మాస్టర్ సర్వశక్తివంతులు అవ్వరా! విజయీ అనగా సర్వ శస్త్రధారి అని అర్ధము. పరిశీలనతో పాటు పరివర్తన ఎందుకు చేయలేకపోతున్నారు ఎప్పుడైతే సర్వశక్తులు స్వయంలో నిండుతాయో అప్పుడే పరివర్తన జరుగుతుంది. అనగా జ్ఞానవంతులతో పాటు శక్తివంతులుగా అవ్వాలి, రెండింటిలో సమానత ఉండాలి. 75 శాతం జ్ఞానవంతులుగా ఉండి శక్తివంతులుగా అవ్వడంలో 3,4 మార్కులు తక్కువ ఉన్నా కానీ సమానత అవ్వదు. సమానత అంటే సమానంగా ఉండాలి. జ్ఞానవంతులుగా అయిన దానికి ఫలితం ప్లానింగ్ చేస్తారు. శక్తివంతులు అయ్యేదానికి ఫలితం ప్రత్యక్షంలోకి వస్తుంది. జ్ఞానవంతులు అయినదానికి ఫలితం సంకల్పం మరియు శక్తివంతులు అయిన దానికి ఫలితం స్వరూపంలోకి రావడం. రెండింటి సమీపత మరియు సమానత ఉండాలి. రెండింటి సమానరూపంగా అవ్వడమే సంపూర్ణంగా అవ్వడం. యోగంలో మరియు సేవలో ఎంత సమయం బిజీగా ఉంచుకుంటారో అంతగా స్వతహాగానే అప్పు ఇచ్చిన వారు (మాయ) వచ్చే ధైర్యం లేదా తీరిక దొరకదు. మంచిది.

Comments