03-12-1970 అవ్యక్త మురళి

 * 03-12-1970         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

"ఎదుర్కొనేందుకు కోరికల త్యాగము" 

          ఈ రోజు అందరికీ అవ్యక్త స్థితిని అనుభవము చేయిస్తున్నాము. ప్రతి ఒక్కరూ యథాశక్తి అనుభవము చేస్తున్నారు, ప్రతి ఒక్కరూ ఎంతవరకు నిరాకారీగా మరియు అలంకారీగా అయ్యారు అన్నదానిని చూస్తున్నారు. రెండూ ఆవశ్యకమైనవే. అలంకారి ఎప్పుడు కూడా దేహ అహంకారిగా అవ్వజాలరు. కావున ఎల్లప్పుడూ నేను నిరాకారిగా మరియు అలంకారిగా ఉన్నానా అని మిమ్మల్ని మీరు చూసుకోండి. ఇదే మన్మనాభవ, మధ్యాజీభవ, స్వస్థితిని మాస్టర్ సర్వశక్తివాన్ అని అంటారు. మరి మాస్టర్ సర్వ శక్తివంతులుగా అయ్యారు కదా! ఈ స్థితి ద్వారా సర్వ పరిస్థితులను దాటివేస్తారు. ఈ స్థితిలో స్వభావము అనగా సర్వులలో స్వయము యొక్క భావము అనుభవమౌతుంది మరియు అనేకమైన పాత స్వభావాలు సమాప్తమౌతాయి. స్వభావము అనగా స్వయములో ఆత్మ భావమును చూడండి, అప్పుడిక ఈ భావ-స్వభావాల విషయాలు సమాప్తమైపోతాయి. ఎదుర్కొనేందుకు సర్వ శక్తులూ ప్రాప్తిస్తాయి. ఎప్పటివరకైతే స్థూల లేక సూక్ష్మ కోరికలు ఉంటాయో అప్పటివరకు ఎదుర్కొనే శక్తి రాజాలదు. కోరిక ఎదుర్కోనివ్వదు, అందుకనే బ్రాహ్మణుల అంతిమ సంపూర్ణ స్వరూపముగా దేనిని చెప్తారు, తెలుసా? ఈ స్థితి యొక్క వర్ణన ఇచ్ఛామాత్రం అవిద్య. ఇచ్ఛామాత్రం అవిద్యాలాంటి స్థితి బ్రాహ్మణులైన మనకు తయారైందా? అని ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎప్పుడైతే ఇటువంటి స్థితి తయారౌతుందో అప్పుడు జయజయకారాలతో పాటు హాహాకారాలు కూడా ఉంటాయి. ఇదే మీ అందరి అంతిమ స్వరూపము. మీ స్వరూపపు సాక్షాత్కారము జరుగుతుంది, ఏవిధంగా శరీరమును వదిలేవారికి ఇప్పుడిప్పుడే మేము ఈ శరీరమును వదిలి, క్రొత్త శరీరమును ధారణ చేస్తాము అని ఎంత స్పష్టంగా బుద్ధిలో ఉంటుందో అంత స్పష్టంగా మీ సంపూర్ణ మరియు భవిష్యరూపము ఎల్లప్పుడూ కనిపించాలి. అలా ఇప్పుడిప్పుడే ఈ స్వరూపమును ధారణ చెయ్యాలి అని ఎల్లప్పుడూ బుద్ధిలో ఉండాలి. ఏవిధంగా స్థూలమైన వస్త్రాన్ని ఎంత త్వరగా ధారణ(ధరించటం) చేస్తారో అలానే ఈ సంపూర్ణ స్వరూపమును ధారణ చెయ్యండి. చాలా సుందరమైన మరియు శ్రేష్ఠమైన వస్త్రమును ఎదురుగా చూస్తూ ఉన్నప్పుడు ఇక పాత వస్త్రమును వదిలి ఆ కొత్త దానిని ధరించటానికి ఏం కష్టముంది? అలాగే మీ శ్రేష్ఠ స్వరూపము లేక స్థితిని తెలుసుకున్నారు, ఎదురుగా ఉంది, ఇక ఆ సంపూర్ణ శ్రేష్ఠ స్వరూపమును ధారణ చెయ్యటంలో ఆలశ్యం దేనికి? ఎటువంటి అహంకారము ఉన్నాగానీ అది అలంకారహీనంగా తయారుచేస్తుంది. కావున నిరహంకారి మరియు నిరాకారి, పిదప అలంకారి. ఈ స్థితిలో స్థితులై సర్వ ఆత్మల కల్యాణకారిగా అయ్యేవారే విశ్వరాజ్య అధికారిగా అవుతారు. ఎప్పుడైతే సర్పుల కల్యాణకారిగా అవుతారో, సర్వుల కల్యాణము చేసేవారు తమ అకల్యాణమును చేసుకోగలరా? ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు విజయీరత్నాలుగా భావించి ప్రతి సంకల్పము మరియు కర్మను చెయ్యండి. మాస్టర్ సర్వశక్తివంతులు ఎప్పుడూ ఓటమిని పొందజాలరు. ఓడిపోయేవారు కేవలము ఓటమినే కాకుండా ధర్మరాజు విధించే శిక్షలనుకూడా అనుభవించవలసి వస్తుంది. హార్(ఓటమి) మరియు మార్(శిక్ష )లకు సిద్ధమేనా? ఓటమిని పొందినప్పుడు ఓటమికి ముందు శిక్షలను ఎదురుగా చూడండి. శిక్షల ద్వారా భూతము కూడా పారిపోతుంది. కావున శిక్షలను ఎదురుగా ఉంచుకోవటం ద్వారా భూతము పారిపోతుంది. ఇప్పటివరకు ఓటమిని పొందటము ఎవరి పని? మాస్టర్ సర్వశక్తివంతుల పని కాదు, కావున అవే పాత విషయాలు, పాత నడవడిక ఇప్పుడు మాస్టర్ సర్వశక్తివంతుల ముఖముపై శోభించవు. కావున సంపూర్ణ స్వరూపమును ఇప్పుడిప్పుడే ధారణ చేసేందుకు మీతో మీరు ప్రతిజ్ఞ చెయ్యండి, ప్రయత్నము కాదు. ప్రయత్నము మరియు ప్రతిజ్ఞలో చాలా తేడా ఉంది. ప్రతిజ్ఞ ఒక్క క్షణములో చెయ్యబడుతుంది. ప్రయత్నమునకు సమయము పడ్తుంది. కావున ఇప్పుడు ప్రయత్నము చేసే సమయము కూడా పోయింది. ఇప్పుడైతే ప్రతిజ్ఞ మరియు సంపూర్ణ రూపము యొక్క ప్రత్యక్షతను చెయ్యాలి. సాక్షాత్తు తండ్రి సమానంగా సాక్షాత్కార మూర్తిగా అవ్వాలి. ఇలా మిమ్మల్ని మీరు సాక్షాత్కారమూర్తులుగా భావించటం ద్వారా ఎప్పుడూ ఓటమిని పొందరు. ఇప్పుడు ప్రతిజ్ఞ చేసే సమయమే కానీ ఓడిపోయే సమయము కాదు. ఒకవేళ పదేపదే ఓటమిని పొందుతుంటే వారి భవిష్యత్తు కూడా ఎలా ఉంటుంది? పెద్ద పెద్ద పదవులనైతే పొందలేరు. పదేపదే ఓటమిని పొందేవారు దేవతల హారాలను తయారుచేసేవారిగా అవ్వవలసి ఉంటుంది. ఎంతెంతగా పదేపదే ఓటమిని పొందుతూ ఉంటారో అంతంతగానే పదే పదే హారాలను తయారు చెయ్యవలసి ఉంటుంది, రత్నజడిత హారాలను తయారుచేస్తారు కదా! మళ్ళీ ద్వాపరములో కూడా భక్తులుగా అయినప్పుడు అనేక మూర్తులకు పదేపదే హారాలను ధరింపచేయవలసి వస్తుంది, కావున ఎప్పుడూ ఓటమిని పొందవద్దు. ఇక్కడ ఓటమిని పొందేవారు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ హార్(ఓటమి)ని పొందనట్లయితే బలిహారమవుతారు. ఇప్పుడు బలిహారము లేక బలి అయ్యేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సమాప్తిలో బలి అవ్వాలా లేక బలి అయిపొయ్యారా? ఎవరైతే బలిహారమైపోయారో వారి పరీక్షను తీసుకుంటాము. ఈ రోజు నుండి వీరందరి నుండి ఇక ఎటువంటి కంప్లైంట్లు రావు. ఓడిపోనప్పుడు ఇక కంప్లైంట్లు ఎందుకు? మీ అందరి పరీక్షాపత్రాలు వతనములో సిద్ధమవుతున్నాయి. ఓం శాంతి.

Comments