03-08-1975 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
శివశక్తి లేదా పాండవసేన తయారయ్యేటందుకు జాగ్రత్తలు.
మాయ చేసే యుద్ధంలో విజయాన్ని ప్రాప్తింప చేసేవారు, సర్వాత్మల కళ్యాణం చేసేవారు, సర్వ రకాల బంధనాలు లేదా ఆకర్షణల నుండి అతీతంగా ఉండేవారు, సర్వోన్నత సేనాధిపతి శివబాబా ఆత్మిక యుద్ధవీరులకు మనోహర శిక్షణలు లేదా జాగ్రత్తలు ఇస్తూ మాట్లాడిన మధుర మరియు అమూల్య మహవాక్యాలు -
అందరూ యోగయుక్త, యుక్తియుక్త స్థితిలో స్థితులై మీ కార్యం చేస్తున్నారా? ఎందుకంటే వర్తమాన సమయాన్ని అనుసరించి సంకల్పం, మాట, కర్మ ఈ మూడు యుక్తీయుక్తంగా ఉండాలి.అప్పుడే సంపన్నంగా లేదా సంపూర్ణంగా కాగలరు. నలువైపులా వాతావరణం యోగయుక్తంగా మరియు యుక్తియుక్తంగా ఉండాలి. యుద్ధమైదానంలో ఎప్పుడైతే యుద్ధవీరులు శత్రువుల ఎదురుగా నిలబడతారో, అప్పుడు తమపై మరియు తమ శస్త్రాలపై అనగా తమ శక్తుల పై ఎంత ధ్యాస ఉంటుంది. ఇప్పుడు సమయం సమీపంగా వస్తూ ఉంది అనగా యుద్ధ మైదానంలో ఎదురుగా నిలబడాల్సిన సమయం. ఇలాంటి సమయంలో నలువైపులా సర్వశక్తుల యొక్క ధ్యాస, స్వయంపై ధ్యాస అవసరం. ఒకవేళ కొంచెం అయినా ధ్యాస తక్కువ అయితే సమయాన్ని అనుసరించి నలువైపులా అలజడులు పెరిగిపోతున్నాయి. ఆ నలువైపుల అలజడుల యొక్క వాతావరణం యొక్క ప్రభావం యుద్ధంలో ఉపస్థితి అయి ఉన్న ఆత్మిక సైన్యంపై కూడా పడుతుంది. రోజు రోజుకు సంపూర్ణత యొక్క సమయానికి సమీపంగా వచ్చే కొలదీ ప్రపంచంలో అలజడులు మరింత పెరుగుతాయి కానీ తక్కువ అవ్వవు. నలువైపులా లాగుతున్న జీవితం వలె అనుభవం అవుతుంది. ఒకవైపు ప్రకృతి యొక్క చిన్న చిన్న ఆపదల ద్వారా కలిగే నష్టం యొక్క ఆందోళన, రెండవవైపు ప్రాపంచిక ప్రభుత్వం యొక్క కఠినమైన నియమాల యొక్క ఆందోళన. మూడవ వైపు వ్యవహరంలో లోటు యొక్క ఆందోళన మరియు నాల్గవవైపు లౌకిక సంబంధీకులు మొదలైన వారితో స్నేహం మరియు స్వేచ్ఛ కారణంగా సంతోషం యొక్క అనుభవం అల్పకాలికంగా ఉంటుంది. కానీ అది కూడా అప్పుడు సమాప్తి అయిపోయి భయం యొక్క అనుభూతి యొక్క ఆందోళనలో ఉంటారు. ఇలా నలువైపులా ఆందోళనలు ప్రజల్లో పెరగనున్నవి. నలువైపులా ఆందోళనలో ఆత్మలు తపిస్తారు. ఎక్కడికి వెళ్తే అక్కడే ఆందోళన, శరీరంలో కూడా ఏదైనా నరం లాగుతుంటే ఎంత అలజడి అయిపోతారు. బుద్ధి లాగేస్తుంటుంది. అదేవిధంగా ఇలాంటి వాతావరణం పెరిగిపోతుంది. ఏ గమ్యం కనిపించదు. ఏమి చేయాలో తెలియదు. అవును అనినా, కాదు అనినా గొడవే. సంపాదించినా కష్టమే, సంపాదించకపోయినా కష్టమే. ధనం దాచుకున్నా కష్టమే, దాచుకోకపోయినా కష్టమే. ఇలాంటి వాతావరణం తయారవుతుంది. ఇలాంటి సమయంలో నలువైపులా ఆందోళనల యొక్క ప్రభావం ఆత్మిక పాండవసేనపై పడకూడదు. ఆందోళనలోకి వచ్చే సమస్యలు స్వయానికి లేకపోయినా కానీ వాతావరణం యొక్క ప్రభావం బలహీన ఆత్మపై సహజంగానే పడుతుంది. ఏమవుతుందో? ఎలా అవుతుందో? అని భయంతో కూడిన ఆలోచనలు వస్తాయి. కానీ ఇలాంటి విషయాల యొక్క ప్రభావం పడకూడదు. దీని కోసం మధ్యమధ్యలో ఈశ్వరీయ స్మృతి యాత్ర యొక్క కార్యక్రమాలు ఏవొకటి జరగాలి. మధువనం ద్వారా అధికారికంగా విశేష కార్యక్రమాలు జరగాలి. దీని ద్వారా ఆత్మల యొక్క కోట గట్టిగా అవుతుంది. ఈ రోజుల్లో సేవ కూడా పెరుగుతుంది. కానీ పెరగడంతో పాటు యుక్తియుక్తంగా ఉండడం కూడా చాలా అవసరం. ఈరోజుల్లో అందరూ జ్ఞానీ ఆత్మగా అవ్వడానికి రావడం లేదు. ఒకటి క్వాలిటి ఆత్మలు అనగా బాబా సమానంగా అయ్యేవారు. మాష్టర్ బాబా సమాన స్వరూపులుగా ఉంటారు. మొదటి క్వాలిటీ బాబా సమానంగా అవ్వడం, రెండవ క్వాలిటీ బాబా యొక్క సంబంధంలో ఉండేవారు మరియు మూడవ క్వాలిటీ కేవలం బాబా లేదా సేవ యొక్క సంప్రదింపుల్లో ఉండేవారు. ఈ రోజులో సంబంధం మరియు సంప్రదింపుల్లో ఉండేవారు ఎక్కువగా వస్తారు. స్వరూపంగా తయారయ్యేవారు తక్కువగా వస్తారు. అందరూ ఒకలాంటి వారు రారు. రోజురోజుకి క్వాలిటి ఆత్మలు తగ్గి బలహీన ఆత్మలు అనగా ప్రజా సంఖ్య ఎక్కువగా వస్తుంది. అలాంటి వారికి ఏదో ఒక విషయమే నచ్చుతుంది. రెండు కూడా కాదు. అన్ని విషయాల్లో నిశ్చయం ఉండదు. కనుక సంప్రదింపుల్లోకి వచ్చేవారిని కూడా వారికి ఏది కావాలంటే ఆ రకంగానే వారిని సంప్రదింపుల్లో ఉంచాలి. ప్రమాదకరమైన సమయం వస్తుంది మరియు సమస్యను అనుసరించి కూడా వారు ప్రతిరోజు వచ్చే విద్యార్థిగా అవ్వటం కూడా కష్టం అవుతుంది. కానీ సంప్రదింపుల్లో ఉండేవారు చాలామంది వస్తారు. ఎందుకంటే చివరి సమయం కదా! చివరి స్థితి ఎలా ఉంటుంది? మొదట్లో ఉన్న ఉత్సాహ ఉల్లాసాలు ఎవరికో కొద్దిమందికే ఉంటాయి. ఎక్కువ మంది సంబంధంలోకి మరియు సంప్రదింపుల్లోకి వచ్చేవారిగా ఉంటారు. కనుక ఈ ధ్యాస ఉంచుకోవాలి. సంప్రదింపుల్లోకి వచ్చిన ఆత్మను సరిగ్గా పరిశీలన చేయకుండా సంప్రదింపుల నుండి వారిని వంచితం చేయకూడదు. ఎవరూ ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. వారు నియమాలలో నడవలేరు. కానీ వారు స్నేహంలో ఉండాలనుకుంటారు.ఇలాంటి ఆత్మలపై కూడా తప్పకుండా ధ్యాస పెట్టాలి. ఈ గ్రూపు మూడవ నెంబరు వారని అర్ధం చేసుకోవాలి. వారిని ఆ రకంగానే సంభాళించాలి. సమయాన్ని అనుసరించి వాతావరణాన్ని శక్తిశాలిగా తయారుచేసుకోవడం అవసరం. సమయాన్ని అనుసరించి బ్రాహ్మణాత్మలు సాధారణ రీతిగా దినచర్య గడపడం ఉండకూడదు. లేకపోతే ఆ ప్రభావం పెరిగిపోతుంది. అందువలన విశేష పద్దతిలో వాతావరణాన్ని స్మృతియాత్ర ద్వారా శక్తివంతంగా తయారుచేయడంలో పిల్లలందరికీ ధ్యాస ఇప్పించవలసి ఉంటుంది. స్వయాన్ని ప్రాపంచిక వాతావరణం నుండి రక్షించుకోవడం ఎలా? ఆ స్థితి ఏమిటి? కర్మయోగి అయినా కానీ యోగి స్థితి అని దేనిని అంటారు? ఈ రకమైన విషయాలపై ఇప్పుడు విశేష ధ్యాస పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు డ్రామానుసారం నలువైపులా పెద్ద పెద్ద సేవలు చేసే సమయం కొంచెం సమయంలో సమాప్తం అయిపోతుంది. పెద్ద పెద్ద ప్రోగ్రాములు బయట చేయలేనప్పుడు టీచర్స్ ఖాళీ అయిపోతారు. బయట సేవ లేకపోతే ఇక మిగిలింది సెంటర్ కి వచ్చేవారి యొక్క సేవ. బయట సర్వీసులతో బుద్ధి ఫ్రీగా ఉంటుంది. లేకపోతే ప్లాన్స్ వేస్తున్నాము, మననం చేస్తున్నాము, చాలా బిజీగా ఉంటున్నాము అని అంటారు. కానీ ఇప్పుడైతే అది కూడా లేదు. కనుక ఇప్పుడు స్మృతియాత్ర అనే సబ్జెక్టుపై ఎక్కువ ధ్యాస పెట్టాలి. ప్రతి సెంటర్ లో ఏదోక కార్యక్రమం జరగాలి. దాని ద్వారా సెంటర్‌కు వచ్చే ఆత్మల్లో బలం నిండాలి. అలాంటి సమయంలో వారు కూడా అతీతంగా ఉండాలి. సాక్షి అయి సమస్యను ఎదుర్కోగలగాలి. దాని కోసం యోగబలం కావాలి. కనుక ఎంత వరకు బయట సర్వీస్ యొక్క కొత్త కొత్త ప్లాన్స్ తయారు చేసే బాధ్యత తక్కువగా ఉంటుందో మిగతా పాయింట్స్ పైన ధ్యాస ఎక్కువగా ఉండాలి. లేకపోతే ఖాళీ అయిపోయి వ్యర్థం వైపు ఎక్కువగా వెళ్ళిపోతారు. సేవలో బిజీగా ఉండడం ద్వారా వ్యర్థ విషయాల నుండి రక్షణగా ఉంటారు. ఇప్పుడు అలాంటి సేవలకు అవకాశం తక్కువగా ఉంది, కనుక సమయం చాలా ఉంటుంది. అప్పుడు వ్యర్థ వాతావరణంలో సమయం పోతుంది, అందువలన బ్రాహ్మణులను జాగ్రత్తగా, తెలివైనవారిగా చేసేటందుకు లేదా స్వయం యొక్క రక్షణ కోసం ఇలాంటి పాయింటు చెప్పాలి. లేదా క్లాసుల యొక్క కార్యక్రమం తయారుచేయాలి. వాటి ద్వారా మధువనం అనే లైట్‌హౌస్ నుండి విశేషమైన లైట్ మాకు వస్తోంది అని వారు అనుభవం చేసుకోవాలి.
డ్రామానుసారం కార్యవ్యవహరమైతే సరిగానే నడుస్తుంది. ఇప్పుడు కార్యవ్యవహరాలు నడిపించడం ద్వారానే రాజ్యం నడిపించే సంస్కారం పెరుగుతుంది కదా! అది రాజ సింహసనం,ఇది రాజ ఆసనం. రాజ్యం చేసేవారిగా అయి సింహసనంపై కూర్చుంటారు. రాజ్యం చేసేవారు అనగా అధికారి అయిపోయారు. ఏ ఆకర్షణకు, కర్మ భోగానికి లేదా కర్మేంద్రియాలకు ఆధీనం కాకూడదు, అధికారి అవ్వాలి. ఇప్పుడు ఇది రాజ ఆసనం. యోగం కోసం ఆసనంపై స్థితి అవుతారు కదా! ఆసనం ఉండేదే కూర్చునేటందుకు లేదా ఆసీనులు అయ్యేటందుకు. కనుక స్థితిలో స్థితులవ్వడమే ఆసనంపై కూర్చోవడం, ఎంతెంత ఈ ఆసనంపై కూర్చునే అభ్యాసం ఉంటుందో అంతగానే రాజ సింహసనంపై కూర్చునే అధికారం ప్రాప్తిస్తుంది. అభ్యాసం అవుతూ ఉంది కదా? సహజ సిద్ధ రూపం పొందుతూ ఉంది. చేయాల్సిన అవసరం ఉండదు అయిపోతుంది. స్వభావమే అలా అయిపోతుంది. ఎలాగైతే ఇతర ఏ స్వభావానికైనా వశమైతే ఆ పని చేయడం స్వతహగానే అయిపోతుంది. అదేవిధంగా ఇది కూడా స్వభావంగా అయిపోవాలి. అధికారిగా ఉండే స్వభావం. యోగం చేయాలి అని సంకల్పం చేయగానే అయిపోవాలి. బాబా అనగానే యోగం కుదరాలి. ఇదే సమీప స్థితి. ఆసనంపై కూర్చున్నారు. సింహసనంపై కూర్చున్న రాజు ఎప్పుడైనా కానీ నేను రాజుననే విషయం మరిచిపోతాడా? అలాగే ఈ ఆసనంపై అనగా ఈ స్థితిలో స్థితులైతే నేను అధికారిని అని మరిచిపోలేరు. అందరూ యదార్థంగా మరియు యోగయుక్తంగా ఉన్నారా? ఎంతో కొంత అయితే ఉంటూనే ఉంటుంది మరియు ఉండాలి కూడా. లేకపోతే అంతిమ పేపర్ ఎలా ఉంటుంది? ఇవి కూడా ప్రత్యక్ష పరీక్షలు ఈ పరీక్షలే మార్కులను జమ చేస్తాయి. ఇలా మార్కులు జమ అవుతూ అవుతూ పాస్ విత్ ఆనర్ జాబితాలోకి వచ్చేస్తారు. కనుక ఏదైతే జరుగుతుందో అది పరీక్షలో మార్కులు జమ చేసేటందుకు. అన్ని విషయాల్లో జమ చేసుకోవాలి. కేవలం స్మృతియాత్రలోనే కాదు నాలుగు సబ్జెక్టులలో మార్కులు జమ చేసుకోవాలి. అప్పుడే పాస్ విత్ ఆనర్ అవుతారు. సఫలత అయితే ప్రతి కార్యంలో ముందుగానే నిర్ణయించబడి ఉంది. పరదా లోపల ఉన్నా లేక పరదా బయట ఉన్నా కొన్ని పరిస్థితుల్లో, సఫలత పరదా లోపల ఉంటుంది మరియు కొన్ని పరిస్థితుల్లో సఫలత ప్రత్యక్షంగా ఉంటుంది. రెండు పరిస్థితుల్లో సఫలత ప్రత్యక్షత ఉంటుంది. కొన్ని సమయాల్లో గుప్తంగా కూడా చూడాల్సి ఉంటుంది. దాగి ఉన్నది ప్రత్యక్షం అవ్వడంలో కొంచెం సమయం పడుతుంది. ప్రత్యక్షంగా ఉన్నదైతే ఆ సమయంలోనే కనిపిస్తుంది. కనుక దాగి ఉన్నా కాని సఫలతయే, అది ఎవరూ తొలగించలేరు . మంచిది.
Comments
Post a Comment