03-05-1972 అవ్యక్త మురళి

* 03-05-1972         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

 “లా మేకర్'గా కండి, 'లా బ్రేకర్' గా కాదు."

స్వయాన్ని లవ్ ఫుల్ (ప్రియమైన వారి)గా మరియు లాఫుల్(నియమాలలో నడిచేవారి)గా రెండు రకాలుగా భావిస్తున్నారా? ఎంతటి లవ్ ఫుల్ లో అంతగానే లాఫుల్ గా ఉంటున్నారా లేక లవ్ ఫుల్ గా అవ్వగలిగినప్పుడు లాఫుల్ గా అవ్వలేరా లేక లాఫుల్ గా అయినప్పుడు లవ్ ఫుల్ గా అవ్వలేరా? రెండూ తోడుతోడుగా ఒకే సమయములో కర్మలో మరియు స్వరూపములో చూపించగలరా? ఎందుకంటే ఎప్పటివరకైతే లా మరియు లవ్ రెండూ సమానంగా ఉండవో అప్పటివరకు కార్యములో సదా సఫలతామూర్తులుగా అవ్వజాలరు. సఫలతా మూర్తులు లేక సంపూర్ణమూర్తులుగా అయ్యేందుకు ఈ రెండింటి ఆవశ్యకత ఉంది. లాఫుల్ గా మీ కొరకు కూడా అవ్వవలసి ఉంటుందా లేక కేవలము ఇతరుల కొరకే లాఫుల్ గా అవ్వవలసి ఉంటుందా? ఎవరైతే స్వయం తమ పట్ల లాఫుల్ గా అవుతారో వారే ఇతరుల పట్ల కూడా లాఫుల్ గా అవ్వగలరు. ఒకవేళ స్వయము తమ పట్ల ఏ లానైనా బ్రేక్ (ఉల్లంఘన)చేసినట్లయితే వారు ఇతరులపై లా ను ప్రయోగించజాలరు. ఇతరులపట్ల ఎంతగా లాఫుల్ గా అయ్యేందుకు ప్రయత్నము చేసినా కానీ అలా అవ్వజాలరు. కావున నేను నాపట్ల మరియు ఇతర ఆత్మలపట్ల లాఫుల్ గా అయ్యానా? ప్రాతఃకాలము నుండి రాత్రి వరకు మనసా సంకల్పములో మరియు కర్మలో, సంపర్కములో లేక ఇతరులకు సహయోగమును ఇవ్వటములో లేక సేవలో అయినా ఎక్కడైనా ఏవిధంగానైనా నియమాలను ఉల్లంఘించలేదు కదా? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎవరైతే లాబ్రేకర్లుగా ఉంటారో వారు నూతన ప్రపంచ మేకర్(రచయితలు)గా అవ్వజాలరు మరియు పీస్ మేకర్(శాంతి స్థాపకులు)గా, క్రొత్త ప్రపంచ మేకర్ గా అవ్వజాలరు. కావున మిమ్మల్ని మీరు చూసుకోండి - నేను క్రొత్త ప్రపంచ మేకర్ నా, పీస్ మేకర్, లా-మేకర్ నేనా లేక లా-బ్రేకర్ నా? ఎవరైతే స్వయమే లా-మేకర్ లో వారే ఒకవేళ లా ను బ్రేక్ చేసినట్లయితే మరి అటువంటివారిని లా మేకర్ లని అనవచ్చా? ఈశ్వరీయ నియమాలు అంటే ఏమిటి అన్నది స్పష్టంగా తెలుసుకున్నారా లేక ఇప్పుడు తెలుసుకోవాలా? తెలుసుకోవటము అన్నదానికి కల అర్థము ఏమిటి? తెలుసుకోవటము అనగా నడవటము(పాటించటము). తెలుసుకున్న తరువాత ఒప్పుకోవటము ఉంటుంది, ఒప్పుకున్న తరువాత ఇక నడవటము ఉంటుంది. కావున ఇక్కడ ఎవరెవరైతే కూర్చుని ఉన్నారో వారందరూ తెలుసుకున్నారు అనగా నడుస్తున్నారు అని భావించండి.

అమృతవేళ నుండి ఏ దినచర్యనైతే గడుపుతున్నారో అదంతా ఈశ్వరీయ లాస్(నియమాల) అనుసారంగా గడుపుతున్నారా, అందులో కొంత పర్సంటేజ్ ఏమైనా ఉందా? తెలుసుకోవటములో పర్సంటేజ్ (శాతము) ఉందా? ఒకవేళ తెలుసుకోవటములో పర్సంటేజ్ లేదు కానీ తెలుసుకొని నడవటములో పర్సంటేజ్ ఉన్నట్లయితే దానిని తెలుసుకోవటము అని ఎలా అంటారు? యథార్థరూపములో తెలుసుకోలేదు కనుకనే నడవలేకపోతున్నారా లేక తెలుసుకున్నారు కాకపోతే నడవలేకపోతున్నారా, ఏమంటారు? ఇక్కడ తెలుసుకోవటము, ఒప్పుకోవటము, నడవటము ఒక్కటే అని అన్నప్పుడు మళ్ళీ ఈ అంతరమును ఎందుకు ఉంచారు? మనము ఆత్మలము అన్న విషయము మీకు తెలుసు, కానీ ఒప్పుకొని నడవడం లేదు అని అజ్ఞానులకు అర్థం చేయిస్తారు. ఇది ఈశ్వరీయ నియమము, ఇది నియమము కాదు అన్న విషయము మీకు కూడా తెలుసు. తెలుసుకొని కూడా మళ్ళీ నడవనట్లయితే ఇటువంటి స్టేజ్ ను ఏమని అంటారు? (పురుషార్థము). పురుషార్థి జీవితములో పొరపాటు జరగటము అనుమతింపబడుతుందా? ఏవిధంగా డ్రామా, ఢాలు ఆధారమును ఇస్తుందో అలా 'పురుషార్థి' అన్న పదము కూడా ఓడిపోవటములో మరియు అసఫలతను పొందడములో చాలా మంచి ఢాలుగా పనిచేస్తుంది. అలంకారాలలో ఇటువంటి ఢాలు చూపించబడిందా? ఇటువంటి వారిని పురుషార్థులు అని అంటారా? 'పురుషార్థము' అన్న మాటకు అర్థము ఏమిటి? ఈ రథములో ఉంటూ స్వయమును పురుషునిగా అనగా ఆత్మగా భావించి నడవండి, వీరినే పురుషార్థులు అని అంటారు. కావున ఇటువంటి పురుషార్థమును చేసేవారు అనగా ఆత్మిక స్థితిలో ఉండేవారు. ఈ రథమునకు పురుష అనగా యజమాని ఎవరు? ఆత్మ కదా! కావున పురుషార్థి అనగా స్వయమును రథిగా భావించేవారు. ఇటువంటి పురుషార్థులు ఎప్పుడూ ఓటమిని పొందజాలరు. కావున 'పురుషార్థము' అన్న మాటను ఈవిధంగా ఉపయోగించకండి. ఎప్పుడైతే మేము పురుషార్థహీనులుగా అవుతామో అప్పుడు ఓటమి జరుగుతుంది అని అనండి. ఒకవేళ పురుషార్థములో మంచిగా ఉన్నట్లయితే ఓటమి ఉండజాలదు. తెలుసుకోవటము మరియు నడవటములో ఒకవేళ అంతరము ఉన్నట్లయితే అటువంటి స్థితి ఉన్నవారిని పురుషార్థులు అని అనరు. పురుషార్థులు ఎల్లప్పుడూ గమ్యమును తమ ముందు ఉంచుకొని నడుస్తారు. వారు ఎప్పుడూ ఆగరు. మధ్యమధ్యలో మార్గములో వచ్చే దృశ్యాలను చూస్తారు కానీ ఆగరు. చూస్తున్నారా లేక చూస్తూ కూడా చూడడం లేదా? ఏ విషయము మీ ముందుకు వచ్చినా ఒకవేళ దానిని చూసి ఆగిపోయినట్లయితే అటువంటి స్థితిలో నడిచేవారిని పురుషార్థులు అని అనజాలరు. పురుషార్థులు ఎప్పుడూ తమ ధైర్యము మరియు ఉత్సాహమును వదలరు. ధైర్యము, ఉత్సాహము సదా తోడుగా ఉన్నట్లయితే విజయము ఎల్లప్పుడూ ఉండనే ఉంటుంది. ధైర్యహీనులుగా ఎప్పుడైతే అవుతారో మరియు ఉత్సాహమునకు బదులుగా ఏదో ఒక విధమైన సోమరితనము ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఓటమి ఉంటుంది మరియు చిన్న పొరపాట్లు చెయ్యటం ద్వారా లాఫుల్ గా అయ్యేదానికి బదులుగా స్వయం లా-మేకర్లుగా అయి ఉంటూ కూడా లాను బ్రేక్ చేసేవారిగా తయారవుతారు. ఆ చిన్న పొరపాటు ఏమిటి? కేవలము ఒక్క అచ్చు పొరపాటు. ఒక్క అక్షరములోని చిన్ని తేడాతో లా-మేకర్లకు బదులుగా లా ను బ్రేక్ చేసేవారిగా అవుతారు. ఆ ఒక్క చిన్న అంతరము ఉన్న మాట - 'శివ'కు బదులుగా 'శవ'మును చూస్తారు. 'శవ'మును చూడటం ద్వారా 'శివను మర్చిపోతారు. 'శివ' శబ్దము మారిపోయి 'విష'ముగా అవుతుంది. 'విషము' వికారాల విషము. ఒక్క అక్షరము మార్పు ద్వారా, తల్లక్రిందులుగా అయిపోవటం ద్వారా విషము నిండిపోతుంది. దాని పరిణామము కూడా అలానే వెలువడుతుంది. తల్లక్రిందులుగా అయిపోవటం ద్వారా పరిణామము కూడా తప్పకుండా తల్లక్రిందులుగానే వెలువడుతుంది. కావున ఎప్పుడు కూడా శవమును చూడకండి అనగా ఈ దేహమును చూడకండి. దీనిని చూడటం ద్వారా మరియు శరీరభానములో ఉండటం ద్వారా లా బ్రేక్ అవుతుంది. శవమును చూడకూడదు. శివుడినే చూడాలి అని ఒకవేళ ఈ లా లో మిమ్మల్ని మీరు సదా స్థిరంగా ఉంచుకున్నట్లయితే ఎప్పుడూ ఏ విషయములోనూ ఓటమి ఉండజాలదు, మాయ యుద్ధము చెయ్యజాలదు. మాయ యుద్ధము చేసినప్పుడే ఓటమి ఉంటుంది. ఒకవేళ మాయ అసలు యుద్ధమే చెయ్యనట్లయితే ఇక ఓటమి అన్నది ఎలా ఉంటుంది? కావున మిమ్మల్ని మీరు ప్రతి సంకల్పములో తండ్రి పైన బలిహారముగా చేసుకోండి. సంకల్ప సహితంగా ఒకవేళ తండ్రిపై బలిహారము కానట్లయితే సంకల్పము కర్మలోకి వచ్చి ఓటమిని చవిచూపిస్తుంది కావున స్వయమును ఒకవేళ లా-మేకర్లుగా భావించుకొన్నట్లయితే ఎప్పుడూ ఈ లా ను బ్రేక్ చెయ్యకూడదు.

ఈ సంకల్పమేదైతే ఉత్పన్నమౌతోందో అది తండ్రిపై బలిహారమయ్యేందుకు యోగ్యమైనదిగా ఉందా? అని పరిశీలించుకోండి. ఒకవేళ వ్యర్థ సంకల్ప వికల్పములున్నట్లయితే తండ్రి పైన బలి చెయ్యలేరు, తండ్రి స్వీకరించజాలరు. ఉన్నతోన్నతుడైన తండ్రి ముందు ఎటువంటి కానుకను ఉంచాలి అన్నదానినైతే తెలుసుకోగలరు. ప్రతి సంకల్పములో శ్రేష్ఠతను నింపుతూ వెళ్ళండి, ప్రతి సంకల్పమును తండ్రికి మరియు తండ్రి కర్తవ్యమునకు కానుకగా ఇస్తూ వెళ్ళండి, అప్పుడిక ఎప్పుడూ ఓటమిని పొందజాలరు. ఇప్పుడైతే ఏదైనా వ్యర్థ సంకల్పము లేక అశుద్ధ సంకల్పము నడిచినా, దానికి ప్రత్యక్ష రూపములో ఎటువంటి శిక్షా లభించటం లేదు, కానీ కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే కర్మ, మాటను వదిలెయ్యండి, అశుద్ధ లేక వ్యర్థ సంకల్పములేవైతే ఉన్నాయో, చేసారో వాటి ప్రత్యక్ష శిక్షను కూడా అనుభవము చేస్తారు. ఎందుకంటే వ్యర్థ సంకల్పం చేసినప్పుడు, సంకల్పము కూడా ఖజానా, ఖజానాను ఎవరైతే వ్యర్థముగా పోగొడతారో వారి పరిస్థితి ఎలా ఉంటుంది? ధనమును వ్యర్థముగా పోగొట్టేవారి రిజల్టు ఎలా వెలువడుతుంది? దివాలా తీస్తారు. అలాగే ఈ  శ్రేష్ఠ సంకల్పాలనే ఖజానాను వ్యర్థముగా పోగొడుతూ, పోగొడుతూ తండ్రి ద్వారా వారసత్వము ఏదైతే ప్రాప్తించవలసి ఉందో ఆ ప్రాప్తి అనుభవము ఉండదు. దివాలా తీసినవారి గతి ఎలా ఉంటుంది? అటువంటి స్థితిని అనుభవము చేసుకుంటారు కావున ఇప్పుడు ఏ సమయము అయితే నడుస్తుందో అది చాలా సావధానముతో నడిచే సమయము ఎందుకంటే ఇప్పుడు యాత్రికులు నడుస్తూ నడుస్తూ ఉన్నతమైన గమ్యమునకు చేరుకున్నారు. కావున ఉన్నతమైన గమ్యముపైన అడుగడుగులో చాలా అటెన్షన్ వుంచే ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. ప్రతి అడుగులో చెకింగ్ చేసుకొనే ఆవశ్యకత ఉంటుంది. ఒకవేళ ఒక్క అడుగులోనైనా అటెన్షన్ తక్కువ ఉన్నట్లయితే రిజల్టు ఎలా ఉంటుంది? పైకి చేరేందుకు బదులుగా కాలు జారుతూ-జారుతూ క్రిందకు వచ్చేస్తారు. కావున వర్తమాన సమయములో ఇంతటి అటెన్షన్ ఉందా లేక నిర్లక్ష్యము ఉందా? ఇంతకుముందు సమయము వేరుగా ఉండేది, ఆ సమయము గడిచిపోయింది. ఇప్పుడు దయాహృదయము కాదు. ఒకవేళ ఇప్పటివరకు కూడా దయాహృదయులుగా అవుతూ ఉన్నట్లయితే ఆత్మలు తమపైన తాము దయాహృదయులుగా అవ్వజాలరు. తండ్రి ఇంతటి ఉన్నతమైన స్థితిని గూర్చి అప్రమత్తము చేసినప్పుడే పిల్లలు కూడా తమపై దయాహృదయులుగా అవ్వగలరు. తండ్రి దయాహృదయులు కావున ఏది జరిగినా తండ్రి దయ చూపిస్తారు అని ఇప్పుడు భావించకండి. ఇప్పుడైతే ఒక్క తప్పుకు వేయ్యి రేట్ల దండన యొక్క లెక్కాచారమును తీర్చుకోవలసి వస్తుంది. కావున ఇది చిన్న పొరపాటునైనా చేసే సమయము కాదు. ఇప్పుడైతే పూర్తిగా మీ అడుగు-అడుగులో సావధానముగా ఉంటూ అడుగులో పదమాల సంపాదనను చేస్తూ పదమాపతులుగా అవ్వండి. పదమాపదమ భాగ్యశాలి అని పేరు ఉంది కదా! కావున పేరుకు తగినటువంటి కర్మ కూడా ఉండాలి. ప్రతి అడుగులో పదమాల సంపాదనను చేస్తూ పదమాపతిగా అయ్యానా? అని చూసుకోండి. ఒకవేళ పదమాపతిగా అవ్వనట్లయితే పదమాపదమ భాగ్యశాలులు అని ఎలా పిలవబడతారు? ఒక్క అడుగు కూడా పదమాల సంపాదన లేకుండా పోకూడదు. ఇటువంటి చెకింగును చేసుకుంటారా లేక చాలా అడుగులు వ్యర్థంగా పోయిన తరువాత తెలివి వస్తోందా? కావున మొదటి నుండే అప్రమత్తం చేస్తున్నారు.

అంతిమ స్వరూపము శక్తి స్వరూపముగా ఉంటుంది. శక్తి రూపము దయాహృదయముగా ఉండదు. శక్తులను ఎప్పుడూ సంహారరూపములో చూపిస్తారు. మరి సంహార సమయము ఇప్పుడు సమీపంగా వస్తోంది. సంహారము చేసే సమయములో దయాహృదయులుగా అవ్వకూడదు. సంహారము చేసే సమయములో సంహారీ రూపమును ధారణ చేస్తారు, కావున ఇప్పుడు దయాహృదయపు పాత్ర కూడా సమాప్తమైపోయింది. తండ్రి సంబంధము ద్వారా పిల్లల నిర్లక్ష్యము లేక చిన్నతనపు చేష్టలను చూస్తూ కూడా ముందుకు తీసుకువెళ్ళారు, కానీ ఇప్పుడు సద్గురువు రూపంలో ఏవిధంగానైనా సరే పావనంగా తయారుచేసి తోడుగా తీసుకొని వెళ్ళే పాత్ర ఉంది. తండ్రి పిల్లల నిర్లక్ష్యము లేక వయ్యారాలు చూసినా కూడా మళ్ళీ ప్రేమతో అర్థం చేయిస్తూ, నడిపిస్తూ వస్తున్నారు. కానీ అటువంటి రూపము సద్గురువుకు ఉండదు. సద్గురువు రూపములో ఎలా అయితే సద్గురువో అలా సత్సంకల్పము, సత్వచనము, సత్కర్మలను తయారుచేయించేవారిగా ఉంటారు. అది జ్ఞానము ద్వారా కావచ్చు లేక పురుషార్థము ద్వారా తయారుచేయవచ్చు, లేక శిక్షల ద్వారాగానీ తయారుచేయవచ్చు. సద్గురువు చిన్నతనపు చేష్టలు మరియు నిర్లక్ష్యమును చూసేవారుగా ఉండరు, కావున ఇప్పుడు సమయమును మరియు తండ్రి రూపమును  తెలుసుకోండి. తండ్రి యొక్క ఈ అంతిమ స్వరూపమును తెలుసుకోకుండా తమ చిన్ననాటి నిర్లక్ష్యములలోకి వచ్చి మిమ్మల్ని మీరు మోసగించుకొని కూర్చుండిపోకూడదు. కావున చాలా సావధానముగా ఉండాలి. శక్తులు ఇప్పుడు తమ సంహారీ రూపమును ధారణ చెయ్యాలి. ఆసురీ సంస్కారము కలవారు ఎవరైనా శక్తులను ఎదుర్కోజాలరు, ఆసురీ సంస్కారము కలవారు శక్తుల ఎదురుగా వచ్చి కన్నెత్తి చూడను కూడా చూడలేరు అని చూపిస్తారు కదా! కావున ఇటువంటి సంహారీరూపము కలవారుగా అయ్యి స్వయములో ఉన్న ఆసురీ సంస్కారములను కూడా సంహారము చెయ్యండి మరియు ఇతరులలోని ఆసురీ సంస్కారములను కూడా సంహారము చేసే సంహారీమూర్తులుగా అవ్వండి. అంతటి ధైర్యము ఉందా? మాత రూపంలో దయ కలుగుతుంది, కానీ శక్తి రూపంలో దయ రాదు. మాతగా అయ్యి పాలననైతే చాలా చేసారు, మరియు మాత ముందు పిల్లలు మారాము చేస్తారు, కానీ శక్తుల ముందు నిర్లక్ష్యమును చూపగలిగే ధైర్యము ఎవ్వరికీ ఉండదు. మీపట్ల కూడా మీరు ఇప్పుడు సంహారీలుగా అవ్వండి. ఆసురీ సంస్కారము సంకల్పములో కూడా నిలవలేనంతటి స్థితిని ఇప్పుడు తయారుచేసుకోండి. చూపుతోనే అసుర సంహారిణి అని వీరినే అంటారు.

సంకల్పాలను పరివర్తన చేసుకోవటానికి ఎంత సమయము పడ్తుంది? క్షణకాలము. చూపు ద్వారా చూడటానికి ఎంత సమయము పడుంది? ఒక్క క్షణము. కావున దృష్టి ద్వారా అసుర సంహారము చేసేవారిగా అనగా ఒక్క క్షణములో ఆసురీ సంస్కారములను భస్మము చేసేవారిగా అయ్యారా? లేక ఆసురీ సంస్కారాలకు వశీభూతమవుతున్నారా? ఆసురీ సంస్కారములకు వశీభూతమయ్యేవారు ఏ సంప్రదాయములో లెక్కించబడతారు? మీరు ఎవరు? (ఈశ్వరీయ సంప్రదాయులము) మరి ఈశ్వరీయ సంప్రదాయుల వద్దకు ఆసురీ సంస్కారము కూడా రాకూడదు. ఇప్పుడు ఆసురీ సంస్కారము వస్తుందా లేక భస్మమైపోయిందా?(వస్తోంది) అయితే మరల ఎలా తయారవుతారు? మీ రూపమును మార్చుకొని బహురూపులుగా అవుతున్నారా? ఇప్పుడిప్పుడే ఈశ్వరీయ సంప్రదాయము వారిగా, ఇప్పుడిప్పుడే ఆసురీ సంస్కారాలకు వశీభూతమైనట్లయితే ఎలా తయారైనట్లు? బహురూపులుగా అయినట్లే కదా! ఒకవేళ ఇప్పటికిప్పుడే మీలోని ఆసురీ సంస్కారాలను భస్మము చేసే ధైర్యమును ఉంచి సంహారీరూపులుగా అయినట్లయితే అభినందనలు. ఇప్పుడు ఈ ధ్యానమును కూడా ఉంచాలి - సూక్ష్మ శిక్షలకు తోడుతోడుగా స్థూల శిక్షలు కూడా ఉంటాయి. సూక్ష్మ శిక్షలనైతే మాకు మేము అనుభవించి సమాప్తము చేసుకుంటాము అని భావించకూడదు. సూక్ష్మ శిక్షలు సూక్ష్మముగా లభిస్తూ ఉంటాయి మరియు నానాటికీ ఎక్కువ అవుతూ ఉంటాయి, కానీ ఎవరైనా ఒకవేళ ఈశ్వరీయ మర్యాదల అనుసారముగా ఎవరైనా అమర్యాదకరమైన కర్తవ్యమును చేసినా, మర్యాదల ఉల్లంఘన చేసినా, ఇటువంటి అమర్యాదకరంగా నడిచేవారు ఈశ్వరీయ మర్యాదల అనుసారంగా స్థూల శిక్షలనుకూడా అనుభవించవలసి వస్తుంది, ఇంకా ఏమౌతుంది? తమ దైవీ పరివారపు స్నేహము, సంబంధము మరియు వర్తమాన సమయములోని సంపదల ఖజానా ఏదైతే ఉందో వాటి నుండి వంచితులవ్వవలసి ఉంటుంది. కావున ఇప్పుడు ఆలోచించి అర్థం చేసుకొని అడుగును వెయ్యాలి. ఇటువంటి నియమాలు శక్తుల ద్వారా స్థాపన అవుతున్నాయి. మొదటినుండే జాగ్రత్త పడాలి కదా!
తరువాత, ఇలా అని మేము భావించలేదు, ఇదైతే క్రొత్త విషయము అని అనకూడదు. కావుననే మొదటినుండే వినిపిస్తున్నారు. సూక్ష్మ లాజ్ కు తోడుగా స్థూలమైన లాజ్ లేక నియమాలు కూడా ఉన్నాయి. ఎలాంటి తప్పు ఉంటుందో, దాని అనుసారంగా తప్పు చేసినవారికి శిక్ష ఉంటుంది. కావున లా-మేకర్ లైనట్లయితే లాను బ్రేక్ చెయ్యవద్దు. ఒకవేళ లా-మేకర్లు కూడా లా ను బ్రేక్ చేసినట్లయితే లాఫుల్ రాజ్యమును పరిపాలించే అధికారిగా ఎలా అవుతారు? ఎవరైతే స్వయమునే లా అనుసారంగా నడిపించలేరో వారు లవ్ ఫుల్  రాజ్యమును ఎలా నడిపించగలరు? కావున ఇప్పుడు స్వయమును లా-మేకర్లుగా భావించుకొని ప్రతి అడుగును లాఫుల్ గా వెయ్యండి, అనగా శ్రీమతము అనుసారంగా వెయ్యండి, మన్మతాన్ని కలపవద్దు. మాయ శ్రీమతాన్ని మార్చి మన్మతాన్ని కలిపేసి, దానినే శ్రీమతంగా భావించుకొనేలాంటి బుద్ధిని ఇస్తుంది. మాయకు వశులై మన్మతాన్ని కూడా శ్రీమతంగా భావిస్తారు, కావున పరిశీలించే శక్తిని ఎల్లప్పుడూ కార్యములో పెట్టండి. పరిశీలించటంలో కూడా అంతరము ఉన్న కారణంగా స్వయాన్ని స్వయమే నష్టపరుచుకుంటారు. కావున ఎప్పుడైనా ఒకవేళ మీకు మీరు పరిశీలించుకోలేకపోయినట్లయితే నిమిత్తమైయున్న శ్రేష్ఠ ఆత్మల ద్వారా సహయోగమును తీసుకోండి. ఇది శ్రీమతమా లేక మన్మతమా అని తేల్చుకోండి. మళ్ళీ దానిని ప్రాక్టికల్ లోకి తీసుకురండి. అచ్ఛా, ఇలా లాఫుల్ మరియు లవ్ పుల్ ఈ రెండింటిని తోడుతోడుగా పెట్టుకొని నడిచేవారు ఎవరైతే ఉన్నారో అటువంటి ఆత్మలకు నమస్తే.

Comments