03-02-1972 అవ్యక్త మురళి

03-02-1972         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

"స్వయమును తెలుసుకోవడం ద్వారా సమ్యమనము(నియమము) మరియు సమయమును గుర్తించడం."

ఏవిధంగా బాబాను గూర్చి, వారు ఎలా ఉన్నారో అలా ఎవరైతే తెలుసుకుంటారో వారు సర్వప్రాప్తులను పొందగలరు అని అంటారో అలాగే స్వయమును గూర్చి తెలుసుకునేందుకు కూడా ఎలా ఉన్నారో అలా తెలుసుకొని, ఒప్పుకొని రోజంతా ఆ విధంగా నడుచుకుంటున్నారా? ఎందుకంటే ఏ విధంగా బాబాను సర్వ స్వరూపాలతో లేక సర్వ సంబంధాలతో తెలుసుకోవడం అవసరమో అలాగే బాబా ద్వారా స్వయమును కూడా అలా తెలుసుకోవడం అవసరం. తెలుసుకోవడము అంటే ఒప్పుకోవడం. నేను ఎలా ఉన్నానో అలా ఒప్పుకొని నడుచుకున్నట్లయితే ఎటువంటి స్థితి ఉంటుంది? దేహంలో ఉంటూ విదేహిగా, వ్యక్తంలో ఉంటూ అవ్యక్తంగా, నడుస్తూ తిరుగుతూ ఫరిస్తాగా లేక కర్మ చేస్తూ కర్మాతీతంగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే స్వయమును మంచిగా తెలుసుకుంటారో మరియు ఒప్పుకుంటారో అప్పుడు ఎవరైతే స్వయమును గూర్చి తెలుసుకుంటారో వారి ద్వారా ఏదైనా నియమంలో నడవాలి. స్వయమును తెలుసుకొని నడిచేవారితో స్వయం నియమమే తనకు తానుగా తోడుగా ఉంటుంది. ఇది నియామమా కాదా అని వారు ఆలోచించవలసిన పనిలేదు. స్వయం యొక్క స్థితిలో స్థితులై ఉండేవారు ఏ కర్మలైతే చేస్తారో, ఏ మాటలైతే మాట్లాడతారో, ఏ సంకల్పాలనైతే చేస్తారో అవే నియమాలుగా అయిపోతాయి. ఏవిధంగా సాకారంలో స్వయం యొక్క స్మృతిలో ఉండడం ద్వారా ఏ కర్మలనైతే చేశారో అవే బ్రాహ్మణ పరివారపు నియమాలుగా అయిపోయాయి కదా! ఇవి నియమాలుగా ఎలా అయ్యాయి? బ్రహ్మ ద్వారా ఏవైతే జరిగాయో అవే బ్రాహ్మణ పరివారం కొరకు నియమాలుగా అయిపోయాయి. కావున స్వయం యొక్క స్మృతిలో ఉండడం ద్వారా ప్రతి కర్మ సమ్యమనంగా అయిపోతుంది. దానితోపాటు సమయపు పరిచయం యొక్క విలువ కూడా వారిముందు స్పష్టంగా ఉంటుంది. ఏ విధంగా పెద్ద ఆఫీసర్ల ముందు మొత్తం ప్లాను అంతా ఉంటుందో, దాన్ని చూస్తూ వారు తమ తమ కార్య వ్యవహారాలను నడుపుతారో, ఏ విధంగా ఎరోప్లేన్లు, స్టీమర్లు నడిపేవారి వద్ద తమ తమ ప్లానులు ఉంటాయో, వాటి ద్వారా వారు వారి మార్గమును స్పష్టంగా అర్థం చేసుకోగలరో అదేవిధంగా ఎవరైతే స్వయమును తెలుసుకుంటారో వారిద్వారా సమ్యమనము దానంతట అదే కొనసాగుతూ ఉంటుంది మరియు సమయం యొక్క పరిచయం కూడా అంతే స్పష్టంగా ఉంటుంది. రోజంతా స్వయం ఎలా ఉన్నారో అటువంటి స్మృతే ఉంటుంది. కావున ఏ కర్మనైతే నేను చేస్తానో నన్ను చూసి అందరూ చేస్తారు అన్న గాయనము ఉంది. కావున ఈ విధంగా స్వయమును తెలుసుకునే వారు ఏ కర్మలనైతే చేస్తారో అవే నియమాలుగా అయిపోతాయి, వారిని చూసి అందరూ అనుసరిస్తారు. ఇటువంటి స్మృతి సదా ఉండాలి. మొదటి స్థితి ఏదైతే ఉంటుందో అందులో పురుషార్థం చేయవలసి ఉంటుంది. ఇది సరైనదా, కాదా అని ప్రతి అడుగులోను ఆలోచించవలసి ఉంటుంది. ఎప్పుడైతే స్వయం యొక్క స్మృతిలో సదా ఉంటారో అప్పుడు సహజమైపోతుంది, అప్పుడు ఇది ఆలోచించవలసిన అవసరం ఉండదు. ఎప్పుడూ ఏ కర్మలూ నియమం లేకుండా జరుగజాలవు. ఏవిధంగా సాకారంలో స్వయం యొక్క నషాలో ఉన్న కారణంగా అథారిటీతో సాకారుని ద్వారా ఏదైనా తప్పు పని జరిగినా, దానిని కూడా సరిచేసేస్తాము అని అథారిటీతో అనగలిగేవారు, ఈ అథారిటీ ఉంది కదా? అంతటి అథారిటీ ఎలా ఉండేది? స్వయం యొక్క నషాతో. స్వయం యొక్క స్వస్వరూపపు స్మృతిలో ఉండడం ద్వారా ఏ కర్మా తప్పుడు కర్మగా జరుగజాలదు అన్న నషా ఉంటుంది. ఇటువంటి నషా నెంబర్ వారీగా అందరిలోను ఉండాలి. ఫాలో ఫాదర్ చేసేవారికి ఈ స్థితి రాదా? దీన్ని కూడా ఫాలో చేస్తారు కదా! సాకార రూపంవారు ఎంతైనా మొదటి ఆత్మ కదా! మొదటి ఆత్మ దేనినైతే నిమిత్తంగా అయి చూపించిందో దానిని రెండవ, మూడవ నెంబర్‌వారీ ఆత్మలెవరైతే ఉన్నారో వారు వారిని అన్ని విషయాలలోను ఫాలో చేయవచ్చు. నిరాకార స్వరూపమువారి విషయం వేరు. సాకారంలో నిమిత్తంగా అయి వేటినైతే చేసి చూపించారో వాటిని అందరూ నెంబర్ వారీగా, పురుషార్థానుసారంగా ఫాలో చేయవచ్చు. దీనినే స్వయములో సంపూర్ణ నిశ్చయబుద్ధి అని అంటారు. ఏ విధంగా బాబాలో వంద శాతము నిశ్చయబుద్ధిగా ఉన్నారో అలా బాబాతో పాటు స్వయంలో కూడా అంతటి నిశ్చయబుద్దులుగా తప్పకుండా అవ్వాలి. స్వసృతి యొక్క నషా ఎంతగా ఉంటుంది? ఏవిధంగా సాకార రూపంలో నిమిత్తంగా అయి ప్రతి కర్మను నియమ రూపంలో చేసి చూపించారో అలా ప్రాక్టికల్‌గా మీరు బాబాను అనుసరించాలి. ఇటువంటి స్థితి ఉందా? ఏ విధంగా బండి సరిగ్గా పట్టాలపై నడిచేటప్పుడు ఆక్సిడెంట్ జరుగజాలదు అన్న నిశ్చయముంటుందో, నిశ్చింతగా నడుపుతూ ఉంటారో అలాగే స్వస్మృతి యొక్క నషా ఉన్నట్లయితే, ఫౌండేషన్ సరిగ్గా ఉన్నట్లయితే కర్మలు మరియు మాటలు నియమం లేకుండా జరుగజాలవు. అటువంటి స్థితి సమీపంగా వస్తోంది. దీనినే సంపూర్ణ స్థితికి సమీపంగా వెళ్ళడము అని అంటారు. ఈ స్వమానంలో స్థితులై ఉండడం ద్వారా అభిమానము రాదు. ఎంతగా స్వమానము ఉంటుందో అంతగా నిర్మాణత ఉంటుంది. కావున వారికి అభిమానము ఉండదు. ఏవిధంగా నిశ్చయము యొక్క విజయము తప్పకుండా జరుగుతుందో అదేవిధంగా నిశ్చయబుద్ధి కలవారి ప్రతి కర్మలోను విజయము ఉంటుంది అనగా ప్రతి కర్మ నియమము అనుసారంగా ఉన్నట్లయితే విజయము తప్పకుండా ఉంటుంది. ఈవిధంగా ఎంతవరకు ఈ స్థితికి సమీపంగా ఉన్నాము అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఎప్పుడైతే మీరు సమీపంగా వస్తారో అప్పుడు ఇతరుల నెంబర్ కూడా సమీపంగా వస్తుంది. దినప్రతిదినము ఇటువంటి పరివర్తన యొక్క అనుభవము జరుగుతూ ఉంటుంది. వెరిఫై చేయించడము, ఒకరికొకరు గౌరవమునివ్వడము అది వేరే విషయము. కాని, స్వయములో నిశ్చయమును ఉంచి ఎవరినైనా అడగడము మరొక విషయము. వారు ఏ కర్మనైతే చేస్తారో అది నిశ్చయబుద్ధిగా అయి చేస్తారు. బాబా కూడా పిల్లలకు గౌరవమును ఇచ్చి సలహా ఇస్తారు కదా! ఎంత సమీపంగా వచ్చాము అని ఇటువంటి స్థితిని గమనించాలి. అప్పుడిక ఇది సరైనదా, కాదా అన్న ఈ సంకల్పము రాదు. ఈ సంకల్పం చెరిగిపోతుంది, ఎందుకంటే మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ గా ఉంటారు. స్వయం యొక్క నషాలో ఎటువంటి లోపము ఉండకూడదు. కార్య వ్యవహారాల నియమము అనుసారంగా ఒకరికొకరు గౌరవమునిచ్చుకోవడం కూడా సమ్యమనమే(నియమమే). ఇటువంటి స్థితి ఉందా? ఒక ఉదాహరణ రూపంలో చూశారు కదా! సాకారుని ద్వారా చూసిన విషయాలను అనుసరించడమైతే సహజమే కదా! కావున ఇటువంటి సమానతతో కూడిన స్థితి వస్తోంది కదా! ఇప్పుడు ఇటువంటి మహాన్ మరియు గుహ్యగతితో కూడిన పురుషార్థము జరగాలి, సాధారణ పురుషార్థము కాదు. సాధారణ పురుషార్థము బాల్యానికి సంబంధించినది. కాని ఇప్పుడు విశేష ఆత్మల కొరకు విశేష పురుషార్థమే కావాలి. అచ్ఛా!

Comments