02-08-1975 అవ్యక్త మురళి

02-08-1975         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

విదేశాలలో ఈశ్వరీయ సేవ యొక్క గొప్పతనం.

                      డబల్ విదేశీ పిల్లల కొరకు విదేశీగా తయారు చేసే జ్యోతిర్మయ బ్రహ్మమహతత్వ నివాసి అయిన శివబాబా మాట్లాడుతున్నారు -
                      బాప్ దాదా ఎదురుగా ఏ పిల్లలు సదా ఉంటారు? సదా ఎదురుగా ఉండే పిల్లల యొక్క విశేషత ఏమిటి? అలాంటి విశేష ఆత్మలను బాప్ దాదా కూడా విశేష రూపంతో కలుసుకోవలసి ఉంటుంది. అలాంటి పిల్లలు నయన సితారలు లేదా ప్రపంచానికి వెలుగు అని అంటారు. స్థూల శరీరంలో కూడా అన్నింటికంటే విశేషమైన మరియు సదా అవసరమైన అవయవం - నయనాలు. కళ్ళు లేకపోతే ప్రపంచం లేదు. అదేవిధంగా ఈ పిల్లలు కూడా అంత విశేష మహిమాయోగ్యులు. ఇలాంటి పిల్లలు సేవాధారిగా ఉంటారు. కనుక విశ్వానికి లేదా ప్రపంచానికి వెలుగు అనగా ప్రకాశం లేదా జ్యోతి సమానం. ఎలాగైతే శరీరం కోసం నయనాలు అవసరమో అలాగే ప్రపంచం కోసం వెలుగు అవసరం. ఒకవేళ ఇలాంటి ఆత్మలు నిమిత్తం కాకపోతే ఈ ప్రపంచం అడవిగా అయిపోతుంది. అంటే ప్రపంచం ప్రపంచంలా ఉండదు. ఈ విధంగా సదా స్వయాన్ని సితారగా  భావించి కర్మ చేస్తున్నారా? సితార మరియు మెరిసే సితార కూడా. ఇలాంటి పిల్లలే బాప్ దాదా యొక్క నయనాలలో ఇమిడి ఉంటారు. అనగా బాబా యొక్క సంలగ్నతలో సదా నిమగ్నమై ఉంటారు మరియు వారి నయనాల్లో కూడా సదా బాప్ దాదా నిండి ఉంటారు. ఇటువంటి కంటి వెలుగు బాబాని తప్ప ఏ వ్యక్తిని లేదా వస్తువును చూస్తూ కూడా చూడరు. ఇలాంటి స్థితి తయారైందా లేదా  ఇప్పటి వరకు కూడా మిగతా ఏవైనా కనిపిస్తున్నాయా? దేనిలో అయినా అంశమాత్రంగా అయినా ఏ రసం అయినా కనిపిస్తుందా? ప్రపంచం నిస్సారంగా అనుభవం అవుతుందా? వీరందరూ చనిపోయారు అని బుద్ధి ద్వారా అనుభవం అవుతుందా? పోయినవారికి ఏమైనా పొందాలనే కోరిక ఉంటుందా? లేదా ఏదైనా సంబంధం యొక్క అనుభూతి ఉంటుందా? ఈవిధంగా కోరిక అంటే ఏమిటో తెలియనివారిగా సదా ఒకని రసంలోనే  ఏకరస స్థితి కలవారిగా అయిపోయారా లేక ఇప్పటి వరకు కూడా చనిపోయిన వారితో ఏదో ఒక రకమైన ప్రాప్తి పొందాలని కోరిక ఉందా లేదా ఏ వినాశీ రసమైనా తనవైపుకు ఆకర్షితం చేస్తుందా? ఎప్పటి వరకు అయితే ఏదోక ప్రాప్తి యొక్క కోరిక లేదా కామన ఉంటుందో లేదా ఏదైనా రసం యొక్క ఆకర్షణ ఉంటుందో బాప్ దాదా యొక్క నయన సితారలుగా అవ్వలేరు, లేదా సదా నయనాలలో  బాప్ దాదా నిండి ఉండరు. ఒకరు విశేష ఆత్మలు వారిని కంటి రత్నాలు లేదా నయన సితారలు లేదా ప్రపంచానికే వెలుగు అని అంటారు. మొదటి నెంబరులో కంటి వెలుగు ఉన్నారు. రెండో నెంబరులో ఏమి ఉంది? కంటి రత్నాలు ప్రసిద్ధం. కంటి రత్నాలు లేదా ప్రపంచానికే వెలుగు. అదేవిధంగా రెండవ నెంబరు వారు ఏ రూపంలో ప్రసిద్ధులు? భుజాల రూపంలో బ్రహ్మ యొక్క భుజాలు అనేకం చూపిస్తారు. రెండో నెంబరు వారు భుజాలు అనగా సహయోగి ఆత్మలు. మరైతే స్వయాన్ని మొదటి నెంబరుగా భావిస్తున్నారా? లేక రెండవ నెంబరు వారా? లండన్ గ్రూప్ ఏ నెంబర్లో ఉంది? డబల్ విదేశీ గ్రూపు బాప్ దాదాని విశేషంగా ఆహ్వనించారు. అంతా విదేశీయులే కానీ వీరు డబల్ విదేశీయులు, కనుక డబల్ విదేశీయులను విశేష రూపంతో బాప్  దాదా చూపించాల్సి వచ్చింది. ఎప్పుడైతే నయనరత్నాలుగా అవుతారో అప్పుడే ఆవిధంగా చేయగలరు. భుజాలుగా కానీ విదేశీయులు సేవ కోసం కొత్త ప్లాన్ తయారు చేయాలి. భారతదేశంలో సేవాధారి ఆత్మలు ఎలాగైతే కొత్త కొత్త పద్ధతులు కనిపెడుతున్నారో అలాగే డబల్ విదేశీయలు ఏమి పరిశోధన చేశారు? భారతదేశంలో కనిపెట్టింది విదేశాల్లో కూడా చేస్తున్నారు కదా. అలాగే విదేశీయుల ఆవిష్కరణ భారతదేశంలో కూడా జరగాలి. ప్రదర్శిని, ప్రొజక్టర్ షో లేదా గీతాపాఠశాల ఇవన్నీ భారతీయులు కనిపెట్టారు. అదేవిధంగా విదేశీయులు ఏమి పరిశోధించారు? (మార్షియలో ప్రైమ్ మినిస్టర్ ని పిలిచారు) ఎవరినైనా పిలవడం అనేది కూడా ఇక్కడ నుండే మొదలైంది. కాని దానిని ప్రత్యక్షంలోకి తీసుకువచ్చింది అక్కడి వారు. భారతవాసీలు ప్రత్యక్షంలోకి తీసుకురాలేదు. ఇది సరే ఏదైతే చేశారో దానికి బాప్ దాదా ధన్యవాదాలు చెబుతున్నారు. కానీ అక్కడ కొత్తగా ఏదైనా కనిపెట్టారా? విదేశీయులు విదేశం యొక్క వాతావరణం అనుసారంగా ఏదోక విహంగ మార్గం యొక్క సేవ కోసం ప్లాన్ తయారు చేయాలి. దాని ద్వారా కొంచెం సమయంలోనే విదేశాలలో సందేశం వ్యాపించాలి. టి.వి లేదా రేడియోలో మీ దగ్గర వస్తాయి. కానీ అక్కడి వారికి సర్వ సాధారణం. మీకొచ్చినట్లే ఇతరులకు కూడా వస్తుంది. భారతదేశంలో అయితే ఇది గొప్ప విషయం. కానీ ఈ విషయం కొన్ని స్థానాల్లో సాధారణమైనది. మరైతే ఎంత పురుషార్థం చేశారు. కొద్ది సమయంలో ధైర్యం, ఉత్సాహ, ఉల్లాసాలు చూపిస్తూ సేవను పెంచారు. దాని కోసం బాప్ దాదా చివరలో వచ్చినా ముందుకు వెళ్ళారు అని టైటిల్ ఇస్తున్నారు. కానీ ఇప్పుడు విదేశీయులందరూ పరస్పరంలో కలుసుకుని కొత్త ప్లాన్ తయారు చేయాలి. దాని ద్వారా విదేశాల్లో ఎంత శక్తిశాలి ధ్వని వ్యాపించాలంటే అది భారతవాసీల వరకు చేరుకోవాలి. విదేశీ సర్వీసుకు ముఖ్య పునాది ఏమిటంటే విదేశీయుల ధ్వని ద్వారా భారత దేశం యొక్క కుంభకర్ణులు మేల్కొంటారు. విదేశీ సేవ యొక్క లక్ష్యం ఇదే. విదేశీయులు విదేశాల్లో చూపించడం గొప్ప విషయం ఏమీ కాదు. కానీ ఈ లక్ష్యంతో విదేశాల్లో సేవ డ్రామాలో నిశ్చయించబడింది. ఇప్పటి వరకూ కూడా ఏది కొత్తగా కనిపెట్టినా దాని ధ్వని విదేశాల నుండే ఇక్కడకు వస్తుంది. పరిశోధనలు భారతవాసీలు చేస్తారు కానీ భారతవాసీలు భారతదేశం యొక్క పరిశోధనను విదేశీయుల ద్వారానే  నమ్ముతారు. అదేవిధంగా ఈ ఈశ్వరీయ ప్రత్యక్షత యొక్క ధ్వని కూడా విదేశీ సేవ ద్వారానే భారతదేశంలో పేరు ప్రసిద్ధం అవుతుంది. విదేశీయులు ఈ కార్యానికి నిమిత్తం అయ్యారు. అందువలన ఇప్పుడు ఇలాంటి పరిశోధన చేయండి. ఒక ఆత్మను నిమిత్తంగా తయారు చేయండి. వారి అనుభవం యొక్క ధ్వని, గొంతు యొక్క ధ్వని కాదు, అనుభవం యొక్క ధ్వని విదేశాల నుండి భారతదేశం వరకు చేరుకోవాలి. అంతిమ సమయంలో విదేశీ సేవకు ఇంత గొప్పతనం ఎందుకు ఇచ్చారు. విదేశానికి వెళ్ళేవారికి కూడా సంకల్పం వస్తుంది. ఇలాంటి ప్రమాదకర లేదా దగ్గర సమయంలో విదేశాలకు ఎందుకు పంపిస్తున్నారని? అంతిమంలో విదేశాల నుండి భారతదేశమే రావాలి అయినా కానీ విదేశీ సేవ వృద్ధి పెరుగుతుంది. మంచి మంచి సహయోగులను విదేశీ సేవార్థం పంపిస్తున్నారు. భారతదేశంలో కూడా వారు అవసరమే.. ఆహ్వనాలున్నాయి అయినా కానీ ఎందుకు పంపిస్తున్నారు? ఇతర మతస్తులకు స్వర్గంలోకి వచ్చే పాత్ర లేదని కూడా తెలుసు. అయినా కానీ ఎవరైతే ఇతర మతంలోకి మారిపోయారో ఆ ఆత్మలకు తమ యొక్క ఆది ధర్మంలోకి తీసుకువచ్చేటందుకు పంపిస్తున్నారు. వారు చాలా కొద్దిమందే ఉంటారు. విదేశీ సేవకు ముఖ్య ఆధారం లేదా లక్ష్యం ఏమిటంటే విదేశాల ద్వారా భారతదేశం వరకు ధ్వని చేరుకోవాల్సిన రహస్యం డ్రామాలో నిర్ణయించబడింది. అందువలనే విదేశీ సేవకు మొదటి అవకాశం ఇవ్వబడింది. ఇక గీతాపాఠశాలలు తెరవడం లేదా టీవీలో మాట్లాడడం ఇవేవీ లక్ష్యం కావు. ఇవన్నీ లక్ష్యానికి చేరుకునేటందుకు సాధనాలు. అర్థమైందా! కనుక పరస్పరం చర్చించుకోండి. త్వరత్వరగా భారతదేశం వరకు ధ్వని ఎలా వ్యాపించాలో, విదేశాల ద్వారా భారతదేశానికి ధ్వని ఏవిధంగా వస్తుందో చర్చించుకోండి. ఈరోజు విశేషంగా విదేశీయుల కోసం బాప్  దాదా కూడా విదేశీగా అవ్వాల్సి వచ్చింది. బాప్ దాదా విదేశీగా కాకపోతే కలుసుకోలేరు కూడా. విదేశీ విశేషాత్మలు ఎవరైతే విశేష కార్యం కోసం నిమిత్తమై ఉన్నారో అలా కానున్న గ్రూపును చూసేటందుకు సాకార రూపంలో కలుసుకునేటందుకు నిరాకారుడు మరియు ఆకారీ కూడా సాకారీ రూపం యొక్క ఆధారం తీసుకోవలసి వచ్చింది. సదా స్వయాన్ని ఇలాంటి విశేషాత్మగా భావించి మనసా, వాచా,కర్మణా విశేష సంకల్పం, మాట మరియు కర్మ చేస్తూ ఉండండి. రెండువైపుల గ్రూపులు మంచివారు. మీ కారణంగా ఇతరాత్మలకు కూడా అవకాశం లభించింది. దానిలో కూడా విశేషంగా మధువన నివాసీయులు స్వయాన్ని సదా అదృష్టవంతులుగా భావించండి. ఎందుకంటే మధువనంలో తప్ప, బాప్ దాదా మరెక్కడా కలుసుకోరు (లూసాకాలో ఎందుకు రారు) ఆకారి రూపం ద్వారా ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఎప్పుడైనా ఎవరికైనా సమయం వచ్చినప్పుడు పరిస్థితులను అనుసరించి ఆ సమయంలో సహజంగానే స్వతహగానే అక్కడికి తీసుకువస్తుంది. మంచిది.
                  స్వయం గురించి సమయం గురించి తెలుసుకునేవారికి, సదా సర్వ రసనల నుండి అతీతంగా ఒకే రసంలో ఉండేవారికి, బాప్ దాదాను నయనాల్లో నింపుకునేవారికి, బాప్ దాదా యొక్క నయన సితారలకు, సదా స్వయాన్ని జ్యోతి స్వరూపంగా సితారలుగా నడిచేవారికి, అతీతమైన మరియు ప్రియమైన ఆత్మలకు మరియు సర్వ శ్రేష్ఠ ఆత్మలతో పాటు విశేషంగా డబల్ విదేశీ ఆత్మలకు బాప్  దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments