* 02-08-1972 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“ప్రతి కర్మను విధిపూర్వకంగా చేయడం ద్వారా సిద్ధి యొక్క ప్రాప్తి"
స్వయమును విధి ద్వారా సిద్ధిని ప్రాప్తించుకునేవారిగా భావిస్తున్నారా? ఎందుకంటే మీరు ఏ పురుషార్థం చేసినా ఆ పురుషార్థపు లక్ష్యము సిద్ధిని పొందడము. ప్రపంచంలోని వారి వద్ద ఈ రోజుల్లో రిద్ధి-సిద్ధులు ఎన్నో ఉన్నాయి. ఆ వైపు రిద్ధి-సిద్ధులు మరియు ఇక్కడ విధి ద్వారా సిద్ధి. యథార్థమైనది విధి ద్వారా సిద్ధిని పొందడము, దీనినే ఇంకొక రూపంలో తీసుకున్న కారణంగా రిద్ధి-సిద్ధులలోకి వెళ్ళిపోయారు. కావున స్వయమును సిద్ధీస్వరూపులుగా భావిస్తున్నారా? మీరు ఏ సంకల్పాలనైతే చేస్తారో అవి యథార్థంగా, విధిపూర్వకంగా ఉన్నట్లయితే దాని రిజల్టు ఎలా వెలువడుతుంది? సిద్ధి. కావున ప్రతి సంకల్పము లేక కర్మ విధిపూర్వకంగా ఉన్నట్లయితే సిద్ధి తప్పకుండా కలుగుతుంది. ఒకవేళ సిద్ధి లేదంటే విధిపూర్వకంగా కూడా లేనట్లే. కావున భక్తిలో కూడా ఏ కార్యాలైతే చేస్తారో లేక చేయిస్తారో వాటిలో విలువ విధిపూర్వకంగా చేయడంపైనే ఉంటుంది. విధిపూర్వకంగా చేసినప్పుడు ఆ సిద్ధిని అనుభవం చేసుకుంటారు. అన్నీ ఇక్కడినుండే ప్రారంభమయ్యాయి కదా! కావుననే స్వయమును సిద్ధీస్వరూపులుగా భావిస్తున్నారా లేక ఇప్పుడు అలా అవ్వాలా అని అడుగుతున్నారా? సమయానుసారంగా ఈ రెండు క్షేత్రాలలోను రిజల్టు ఇప్పటివరకు తప్పకుండా 95 శాతము ఉండాలి. ఎందుకంటే ఏవిధంగా సమయం యొక్క వేగమును చూస్తున్నారో, మరియు ఛాలెంజ్ ను కూడా చేస్తున్నారో అది ఎప్పుడైతే మీ స్థితి సంపన్నంగా అవుతుందో అప్పుడే సంపన్నమవుతుంది. మీరు ఏదైతే ఛాలెంజ్ చేస్తారో దాని పరివర్తన దేని ఆధారంపై జరుగుతుంది? దాని పునాది ఎవరు? మీరే పునాది కదా! ఎప్పుడైతే పునాది తయారైపోతుందో అప్పుడు దాని తర్వాత నెంబర్ వారీగా రాజధాని కూడా తయారైపోతుంది. కావున ఎవరైతే రాజ్యము చేసే అధికారులుగా అవ్వాలో వారు తమ అధికారాన్ని తీసుకోకపోతే ఇతరులకు నెంబర్ వారీగా అధికారము ఎలా ప్రాప్తమవుతుంది? ఏ విశ్వపరివర్తనా కార్యమైతే జరగాలో అది ఎప్పటివరకైతే మీ యొక్క స్థితి విధి ద్వారా సిద్ధిని పొందదో అప్పటివరకు పూర్తవ్వదు. అప్పటివరకు ఈ విశ్వకళ్యాణ కర్తవ్యంలో ఎలా స్థితులవ్వగలరు? మొదట స్వయం యొక్క సిద్ధి జరుగుతుంది. ఇంత పెద్ద కర్తవ్యమును కొద్ది సమయంలో సంపన్నం చేయాలంటే ఎంతటి వేగం ఉండాలి? దీని కొరకు ఏదైనా ప్లానును తయారుచేస్తారా? స్పీడును ఎలా పూర్తి చేస్తారు? సిద్ధీస్వరూపులుగా అవ్వడము అనగా సంకల్పం చేయగానే సిద్ధి ప్రాప్తించాలి. ఇది 100 శాతం సిద్ధిస్వరూపులుగా అయ్యేవారి గుర్తు. కర్మ చేయగానే సిద్ధి ప్రాప్తమవ్వాలి. ఎప్పుడైతే సాధారణ జ్ఞానపు ఆధారముపై రిద్ధి-సిద్ధులను ప్రాప్తించుకోగలరో మరప్పుడు శ్రేష్ఠ జ్ఞానము యొక్క ఆధారంపై విధి ద్వారా సిద్ధిని ప్రాప్తింపజేసుకోలేరా? ఏ విధిలో లోటు ఉన్న కారణంగా సిద్ధి కూడా సంపూర్ణంగా లభించదు అని పరిశీలించుకోవాలి. విధిని పరిశీలించుకోవడం ద్వారా సిద్ధి దానంతట అదే సరి అయిపోతుంది. ఇందులో కూడా సిద్ధి లభించకపోవడానికి ముఖ్య కారణము ఒకే సమయంలో మూడు రూపాలతో సేవ చేయరు. మూడు రూపాలు మరియు మూడు విధాలుగా ఒకే సమయంలో చేయాలి. జ్ఞానస్వరూపులుగా, శక్తిస్వరూపులుగా మరియు ప్రేమస్వరూపులుగా ఉండాలి. ప్రేమ మరియు నియమాలు రెండూ కలిసి వస్తాయి. ఈ మూడు రూపాలలోను సేవ చేయవలసిందే అని మనసా వాచా కర్మణా మూడు రీతులలోను మరియు ఒకే సమయంలో మూడు రూపాలతోను సేవ చేయాలి. ఎప్పుడైతే వాణి ద్వారా సేవ చేస్తారో అప్పుడిక మనసు కూడా శక్తిశాలిగా ఉండాలి. శక్తిశాలి స్థితి ద్వారా వారి మనస్సును కూడా మార్చగల్గుతారు మరియు వాణి ద్వారా వారిని జ్ఞానస్వరూపులుగా చేసేస్తారు మళ్ళీ కర్మణా సేవ అనగా వారి సంపర్కంలోకి ఎవరు వస్తారో వారి సంపర్కము ఎంతటి ప్రేమ స్వరూపంగా ఉండాలంటే నేను నా ఈశ్వరీయ కుటుంబంలోకి చేరుకున్నాను అని వారికి దానంతట అదే అనిపించాలి. ఆ నడవడికయే అలా ఉండాలి, తద్వారా వీరు మా వాస్తవికమైన కుటుంబము అని వారు అనుభూతి చేసుకోవాలి. ఈ మూడు విధాలుగా వారి మనస్సును నిగ్రహించండి మరియు వాణి ద్వారా జ్ఞానమునివ్వండి, ప్రకాశము మరియు శక్తి యొక్క వరదానమును ఇవ్వండి మరియు కర్మణా అనగా సంపర్కము ద్వారా, మీ స్థూలమైన కర్మ ద్వారా ఈశ్వరీయ పరివారపు అనుభవమును కలిగించండి, తద్వారా ఈ విధిపూర్వకమైన సేవను చేసినట్లయితే సిద్ధి లభించదా? ఒకే సమయంలో మూడు రూపాలలో మరియు మూడు విధాలుగా సేవ చేయడంలేదు. ఎప్పుడైతే వాచాలోకి వస్తారో అప్పుడు మనస్సు ఏదైతే శక్తిశాలిగా ఉండాలో అది తగ్గిపోతుంది. ఎప్పుడైతే రమణీకమైన కర్మల ద్వారా ఎవరినైనా సంపర్కంలోకి తీసుకువచ్చినప్పుడు కూడా ఏ మనసైతే శక్తిశాలిగా ఉండాలో అది ఉండదు. కావున ఒకే సమయంలో మూడూ కలిసి ఉన్నట్లయితే సిద్ధి తప్పకుండా లభిస్తుంది. ఈ విధంగా సేవ చేసే అభ్యాసము మరియు అటెన్షన్ కావాలి. సంబంధంలోకి రారు, లోతైన సంపర్కంలోకీ రారు, పైపైన సంపర్కంలోకి వస్తారు. ఆ బాహ్యపు సంపర్కము అల్పకాలికంగా ఉంటుంది. వారిని ప్రేమలోకి కూడా తీసుకువస్తారు, కాని ప్రేమ స్వరూపులుగా అవ్వడంతో పాటు శక్తిశాలిగా ఉండాలి. ఆ ఆత్మలలో కూడా శక్తిని నింపాలి, తద్వారా వారు సమస్యలను, వాయుమండలమును, వైబ్రేషన్లను ఎదుర్కొని సదాకాలికమైన సంబంధంలో ఉండడమన్నది జరుగదు. జ్ఞానముపైనైనా ఆకర్షితులవుతారు లేక ప్రేమపైనైనా ఆకర్షితులవుతారు. ఎక్కువగా ప్రేమపైన ఆకర్షితులవుతారు. రెండవ నెంబర్లో జ్ఞానము ఉంటుంది. కాని, మీరు ఎంత శక్తిశాలిగా ఉండాలంటే మీ ముందుకు ఏ విషయం వచ్చినా మీరు చలించకూడదు. ఇప్పుడు ఈ లోపము ఉంది. ఎవరైతే సేవాధారులుగా నిమిత్తులుగా అవుతారో వారిలో కూడా జ్ఞానము ఎక్కువగా ఉంది. ప్రేమ కూడా ఉంది కాని, శక్తి తక్కువగా ఉంది. శక్తిశాలీ స్థితికి గుర్తు ఏమిటి? ఒక్క క్షణంలో ఏ వాయుమండలమునైనా లేక వాతావరణమునైనా మాయ యొక్క ఎటువంటి సమస్యనైనా అంతం చేసేస్తారు, ఎప్పుడూ ఓటమిని చవిచూడరు. సమస్యారూపంగా అయి వచ్చే ఆత్మలు కూడా వారిపై బలిహారమవుతారు. దానినే వేరే పదాలలో ప్రకృతి దాసిగా అవ్వడము అని అంటారు. ఎప్పుడైతే పంచతత్వాలు దాసిగా అవ్వగలవో అప్పుడిక మనుష్య ఆత్మలు బలిహారమవ్వలేరా? కావున శక్తిశాలి స్థితి యొక్క ప్రాక్టికల్ రూపము ఇదే. కావుననే ఒకే సమయంలో మూడు రూపాలతో సేవ చేసే రూపురేఖ ఎప్పుడైతే తయారవుతుందో అప్పుడు ప్రతిఒక్కరి కర్తవ్యంలో సిద్ధి కనిపిస్తుంది అని అనడం జరుగుతుంది. మరి అది విధి ద్వారా లభించే సిద్ధియే కదా! విధిలో లోపము ఉన్న కారణంగా సిద్ధిలో కూడా లోపము ఉంటుంది. ఇప్పుడు సిద్ధీ స్వరూపులుగా అయ్యేందుకు ఈ విధిని మొదట సరిచేసుకోండి. భక్తిమార్గంలో సాధన చేస్తారు, ఇక్కడ ఉండేవి సాధనాలు. అవి ఏ సాధనాలు? బాప్ దాదాల ప్రతి ఒక్క విశేషతను స్వయంలో ధారణ చేస్తూ చేస్తూ విశేష ఆత్మగా అయిపోతారు. ఏ విధంగా పరీక్షా రోజులు సమీపంగా ఉన్నప్పుడు చదువుకున్న థియరీని కాని లేక ప్రాక్టికల్ ని కాని రెండింటినీ రివైజ్ చేస్తారు మరియు ఏ సబ్జెక్ట్ లో ఏఏ లోపాలు మిగిలి ఉన్నాయి అని పరిశీలిస్తారు. అదేవిధంగా సమయం దగ్గరగా వస్తుంది కాబట్టి ప్రతి సబ్జెక్టులోను ఏ లోపము ఉంది మరియు ఎంత శాతం వరకు లోపము మిగిలి ఉంది అని పరిశీలించుకోండి. అతీతముగా ఉండడంలోను మరియు ప్రాక్టికల్ లోను రెండింటిలోను పరిశీలించుకోవాలి. ప్రతి సబ్జెక్టులోను లోపాన్ని చూస్తూ స్వయమును పరిపూర్ణంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. కాని ఎప్పుడైతే మొదట రివైజ్ చేస్తారో అప్పుడు మీ లోపాన్ని గూర్చి తెలుస్తుంది. మీకు సబ్జెక్టులను గూర్చి అయితే తెలుసు, మరి సబ్జెక్టులను బుద్ధిలో ధారణ చేశారా, లేదా? దానిని గుర్తించేది ఎలా? ఏ విధంగా సిద్ధి యొక్క శాతము పెరుగుతూ ఉంటుందో దాని అనుసారంగా సమయం కూడా వ్యర్థమవ్వదు. కొద్ది సమయంలోనే సఫలత ఎక్కువగా లభిస్తూ ఉంటుంది, దీనినే సిద్ధి అని అంటారు. సమయం ఎక్కువగా, శ్రమను కూడా ఎక్కువగా చేస్తున్నట్లయితే సఫలత లభించినా దానిని కూడా తక్కువ శాతము అనే అంటారు. అన్నివిధాలుగాను తక్కువగానే ఖర్చవ్వాలి, తనువు కూడా తక్కువ, మనస్సు కూడా తక్కువ, సంకల్పాలు కూడా తక్కువగా ఖర్చవ్వాలి లేకపోతే సంకల్పం చేస్తారు, ప్లానులు తయారుచేస్తూ చేస్తూ నెలా నెలన్నర పడుతుంది. కావున సమయము మరియు సంకల్పాలు మరియు మీ సర్వశక్తులు ఏవైతే ఉన్నాయో ఆ సర్వశక్తుల ఖజానాలను ఎక్కువగా కర్మలోకి తీసుకురాకూడదు, తక్కువ ఖర్చుతో బాగా ప్రఖ్యాతమవ్వాలి. దేనిద్వారా సిద్ధి ప్రాప్తమవ్వగలదో అటువంటి సంకల్పాలే ఉత్పన్నమవుతాయి. వేటిలోనైతే సఫలత ఇమిడి ఉంటుందో ఆ సమయమే నిశ్చితమవుతుంది. దీనినే సిద్ధిస్వరూపులుగా అవ్వడము అని అంటారు. కావున అన్ని సబ్జెక్టులలోను మనం ఎంతవరకు పాసయ్యాము అన్నది గుర్తించడం ఎలాగ? ఎవరు ఎన్ని సబ్జెక్టులలో పాసవుతారో అంతగానే ఆ సబ్జెక్టుల ఆధారంపై వారికి ప్రాప్తి మరియు గౌరవము లభిస్తాయి. ఒకటేమో ప్రాప్తి యొక్క అనుభవం కలుగుతుంది, జ్ఞానం యొక్క సబ్జెక్టేదైతే ఉందో దాని ద్వారా ప్రకాశము మరియు శక్తి యొక్క లక్ష్యమేదైతే ప్రాప్తమవుతుందో ఆ ప్రాప్తి యొక్క అనుభవమును పొందుతారు. ఆ జ్ఞానపు సబ్జెక్ట్ యొక్క ఆధారంపై దైవీ పరివారం ద్వారా కాని లేక ఇతర ఆత్మల ద్వారా కాని గౌరవం కూడా అంతే లభిస్తుంది. ఈ రోజుల్లోని మహాత్ములకు ఇంతటి గౌరవం ఎందుకు లభిస్తుంది? ఎందుకంటే ఏ సాధననైతే చేశారో మరియు ఏ సబ్జెక్టులనైతే అధ్యయనం చేస్తారో దాని ప్రాప్తి మరియు గౌరవము వారికి లభిస్తుంది, ప్రకృతి దాసిగా అవుతుంది. కావున జ్ఞానం యొక్క ఈ విషయమును వినిపించారు. అలాగే యోగపు సబ్జెక్టు కూడా ఉంది, దాని ద్వారా ఏ ప్రాప్తి లభిస్తుంది? యోగము అనగా స్మృతి శక్తి ద్వారా ఏ లక్ష్యమైతే లభించాలో, వారు ఏ సంకల్పాలు చేస్తారో అవి సమర్థంగా ఉంటాయి మరియు ఏ సమస్య అయితే రానున్నదో దానికి మొదటినుండే యోగశక్తి ద్వారా ఇది అవ్వనున్నది అని అనుభవమవుతుంది. కావున మొదటి నుండే తెలిసిన కారణంగా ఎప్పుడూ ఓడిపోజాలరు. అలాగే యోగశక్తి ద్వారా తమ పాత సంస్కారాల బీజాలు అంతమైపోతాయి. ఏ సంస్కారము తమ పురుషార్థంలో విఘ్నంగా అవ్వదు. దేనినైతే స్వభావము అని అంటారో అది కూడా పురుషార్థంలో విఘ్నరూపంగా అవ్వదు. కావున ఏ సబ్జెక్ట్ యొక్క లక్ష్యము ఉంటుందో ఆ లక్ష్యము అనుభవమవ్వాలి. లక్ష్యము ఉన్నట్లయితే దాని పరిణామంగా గౌరవం తప్పకుండా లభిస్తుంది. మీరు నోటి ద్వారా ఏ మాటలనైతే ఉచ్చరిస్తారో లేక ఏ ప్లానులనైతే తయారుచేస్తారో అవి సమర్థంగా ఉన్న కారణంగా అందరూ గౌరవాన్ని ఇస్తారు అనగా ఎవరెవరైతే ఒకరికొకరు సలహాలను ఇస్తారో ఆ సలహాలకు అందరూ గౌరవమునిస్తారు ఎందుకంటే సమర్థులుగా ఉంటారు. అదేవిధంగా ప్రతి సబ్జెక్టును చూడండి. దివ్యగుణాలు లేక సేవా సబ్జెక్టు యొక్క ప్రాప్తి ఏమిటంటే ఎవరైతే సమీప సంబంధంలోకి మరియు సంబంధంలోకి వస్తారో, సమీప సంబంధంలోకి మరియు సంపర్కంలోకి రావడం ద్వారా గౌరవం దానంతట అదే లభిస్తుంది. కావున ఈ విధంగా ప్రతి సబ్జెక్ట్ యొక్క లక్ష్యాన్ని పరిశీలించండి మరియు ఆ లక్ష్యాన్ని పరిశీలించేందుకు సాధనము గౌరవము. నేను జ్ఞానస్వరూపంగా ఉన్నట్లయితే నేను ఎవరికైతే జ్ఞానమునిస్తున్నానో వారు ఆ జ్ఞానమునకు అంతటి గౌరవమును ఇస్తారు. జ్ఞానమునకు గౌరవమును ఇవ్వడం అనగా జ్ఞానస్వరూపులకు గౌరవమునివ్వడము. జ్ఞానం యొక్క సబ్జెక్టులో లక్ష్యము ఉన్నట్లయితే ఇంకెవరి సంకల్పాలనైనా పరివర్తనచేసి సమర్థంగా చేయగల్గుతారు, అప్పుడు తప్పకుండా గౌరవమునిస్తారు. కావున ఈ విధంగా ప్రతి సబ్జెక్టులోను చెకింగ్ చేసుకోవాలి. ప్రతి సంకల్పంలోను లక్ష్యము మరియు గౌరవము రెండింటి ప్రాప్తి యొక్క అనుభవమును పొందినట్లయితే దానిని పర్‌ఫెక్ట్ అని అంటారు. పర్‌ఫెక్ట్ అనగా ఎటువంటి ఎఫెక్ట్ నుండైనా దూరంగా ఉండడము. అన్ని ఎఫెక్ట్ ల నుండి దూరంగా ఉన్నట్లయితే పర్‌ఫెక్ట్ గా ఉన్నట్లు. శరీరం యొక్క, సంకల్పాల యొక్క లేక ఏ సంపర్కాలలోకైనా రావడం ద్వారా, ఎవరి వైబ్రేషన్లు లేక వాయుమండలము ద్వారానైనా అన్నిరకాల ప్రభావాల నుండి అతీతంగా అయిపోతారు. కావున సబ్జెక్టులో పాసవ్వడము అనగా పర్‌ఫెక్ట్ గా అవ్వడము. ఈ విధంగా అవుతున్నారు కదా? లక్ష్యమైతే ఇదే కదా! ఇప్పుడు మీ పరిశీలన ఎక్కువగా ఉండాలి. ఏ విధంగా ఇతరులతో సమయంతో పాటు స్వయములో కూడా పరివర్తన తీసుకురండి అని ఇతరులకు చెబుతారో అలా ఎల్లప్పుడూ సమయంతో పాటు స్వయములో కూడా పరివర్తనను తీసుకురావాలి అన్నది స్మృతిలోకి రావాలి. స్వయమును పరివర్తనలోకి తీసుకువస్తూ తీసుకువస్తూ సృష్టిపరివర్తన జరిగిపోతుంది. మీ పరివర్తన యొక్క ఆధారంతో సృష్టిలో పరివర్తన తీసుకువచ్చే కార్యమును చేయగల్గుతారు. ఈ శ్రేష్ఠతయే ఇతరులలో ఉండదు. వారు కేవలం ఇతరులను పరివర్తన చేసే ప్రయత్నం చేస్తారు. కాని ఇక్కడైతే స్వయం యొక్క ఆధారంపై సృష్టిని పరివర్తన చేస్తారు. కావున ఏదైతే ఆధారంగా ఉందో దానిని గూర్చి మీపై మీరు అంతటి అటెన్షన్‌ను ఇవ్వాలి. మా ప్రతి సంకల్పం వెనుక విశ్వకళ్యాణం యొక్క సంబంధము ఉంది అని ఎల్లప్పుడూ స్మృతిలో ఉండాలి. ఎవరైతే ఆధారమూర్తులుగా ఉన్నారో వారి సంకల్పాలలో సామర్థ్యత లేకపోతే సమయం యొక్క పరివర్తనలో కూడా బలహీనత వచ్చేస్తుంది. ఈ కారణంగా ఎంతెంతగా స్వయం సమర్థులుగా అవుతారో అంతగానే సృష్టిపరివర్తన యొక్క సమయమును సమీపంగా తీసుకురాగలుగుతారు. డ్రామా అనుసారంగా అది నిశ్చయమై ఉన్నాకాని అది కూడా ఏ ఆధారంపై అలా నిశ్చితమై ఉంది? ఆధారమైతే ఉంటుంది కదా! కావున ఆధారమూర్తులు మీరే. ఇప్పుడైతే మీరు అందరి దృష్టిలోను ఉన్నారు, అచ్ఛా!
Comments
Post a Comment