02-07-1970 అవ్యక్త మురళి

* 02-07-1970         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

 “సైలెన్సు శక్తి యొక్క ప్రయోగము"

మిమ్మల్ని మీరు స్నేహము మరియు శక్తిరూపులుగా భావిస్తున్నారా? శక్తుల కర్తవ్యము ఏమిటో తెలుసా? శక్తులకు ముఖ్యంగా రెండు గుణాలకు గాయనము చేస్తారు, అవి ఏమిటి? మీ స్మృతి చిహ్నములో విశేషంగా ఏం చూపిస్తారు? శక్తుల మూర్తులలో ముఖ్య విశేషత ఏమిటి? మీరు స్వయం శక్తులు, మరి మీ విశేషతలగురించే తెలియదా! ఎంతటి ప్రేమమూర్తులో అంతగానే సంహారమూర్తులు. శక్తుల విశేషత ఇదే. శక్తుల నయనాలు ఎల్లప్పుడూ ప్రేమ మూర్తిగా ఉంటాయి, కానీ ఎంతటి ప్రేమమూర్తియో అంతగానే భయంకర రూపము కూడా ఉంటుంది. ఒక్క క్షణములో ఎవరినైనా ప్రేమమూర్తిగా కూడా తయారుచెయ్యగలరు, అలాగే ఒక్క క్షణములో ఎవరి వినాశనమైనా చెయ్యగలరు కూడా. మరి ఇలా ఈ రెండు గుణాలు మీలో చూసుకుంటున్నారా? రెండు గుణాలు ప్రత్యక్ష రూపములోకి వస్తున్నాయా లేక గుప్త రూపములో ఉన్నాయా? ప్రేమరూపము ప్రత్యక్షముగా మరియు శక్తిరూపము గుప్తముగా ఉంది. మళ్ళీ ఆ వికరాళ రూపమును ఎప్పుడు ప్రత్యక్షము చేస్తారు? తెలుసా? ఈ మధ్య బాప్ దాదా విశేషంగా ఏ స్లోగన్ ను ఇస్తున్నారు? 'ఎప్పుడో కాదు, ఇప్పుడే చేస్తాము'. 'ఎప్పుడో' అన్న మాటను బలహీనులు మాట్లాడుతారు. వీరులైన శక్తులు 'ఇప్పుడు' అని అంటారు. ఏవిధంగా స్వయం అవినాశియో అలాగే ఈ మాయలో చిక్కుకొని వినాశనవవ్వడం వారి కొరకు అసంభవము. ఎవరైతే అవినాశియో వారి కొరకు మాయ యొక్క ఏ అలలోనైనా తేలియాడటం కూడా అసంభవమే. ఏవిధంగా బాప్ దాదాను గూర్చి అసంభవము అని అంటారో అలా ఎవరైతే అవినాశి స్థితిలో ఉంటారో వారి కొరకు మాయ యొక్క ఎటువంటి స్వరూపానికైనా లొంగడం అసంభవము. ఎవరైతే స్వయమే లొంగుతారో వారి ముందు ఇతరులు ఎలా తల వంచుతారు? మీరు మొత్తము విశ్వమును మీ ముందు వంచేవారే కదా! పులుల లాంటి శక్తుల ఒక్క సంకల్పమైనా లేక ఒక్క మాటైనాగానీ వ్యర్థముగా పోజాలవు. ఏది అంటారో దానిని చేస్తారు. సంకల్పము మరియు కర్మలో అంతరము ఉండదు. ఎందుకంటే సంకల్పము కూడా జీవితపు అమూల్యమైన ఖజానా వంటిది. ఏవిధంగా స్థూల ఖజానాను వ్యర్థము చెయ్యరో అలాగే ఎవరి మూర్తిలో అయితే రెండు గుణాలు ప్రత్యక్ష రూపములో ఉన్నాయో అటువంటి శివ శక్తుల ఒక్క సంకల్పము కూడా వ్యర్థమవ్వదు. ఒక్కొక్క సంకల్పము ద్వారా స్వయము మరియు సర్వుల కల్యాణము జరుగుతుంది. ఒక్క క్షణములో, ఒక్క సంకల్పముతో కూడా కల్యాణము చెయ్యగలరు. కావుననే శక్తులను కల్యాణి అని అంటారు. ఏవిధంగా బాప్ దాదా కల్యాణకారియో అలాగే పిల్లల కల్యాణకారీ పేరు కూడా ప్రసిద్ధము. ఇప్పుడైతే ఇంతటి లెక్కను చూడవలసి ఉంటుంది. ఎన్ని క్షణాలలో, ఎన్ని సంకల్పాలు సఫలమయ్యాయి, ఎన్ని అసఫలమయ్యాయి? ప్రస్తుతం సైన్సు చాలా ఉన్నతిని పొందింది, ఒక్క సానంలో కూర్చునే తమ అస్త్రాలద్వారా క్షణకాలములో వినాశనము చెయ్యగలరు. మరి శక్తుల ఈ సైలెన్సు బలము ఎక్కడ కూర్చుని ఉన్నాగానీ ఒక్క క్షణములో పని చెయ్యలేరా? ఎక్కడికైనా వెళ్లేందుకుగానీ మరియు వారికి వచ్చేందుకు గానీ అవసరమే లేదు. తమ శుద్ధ సంకల్పాల ద్వారా ఆత్మలను ఆకర్షించి ఎదురుగా
తీసుకొని వస్తారు. వెళ్లి శ్రమపడే అవసరము లేదు. ఇప్పుడు అటువంటి ప్రభావమును కూడా చూస్తారు మీరు ఎటువంటి బాణమును వెయ్యాలంటే, బాణము సహితముగా పక్షి మీ  వచ్చెయ్యాలి అని సాకారములో అంటూ ఉండేవారు. ఇప్పుడు మీ విల్ పవర్ ద్వారా
 అలా జరుగుతుంది.  

అన్నింటికంటే ఎక్కువ దూరంగా దేని లైటు వెళ్తుంది? లైట్ హౌస్ లైటు. కావున ఇప్పుడు లైట్ హౌస్ గా, సెర్చిలైట్ గా అవ్వాలి. ఏదో పేరుకు బల్బులాగా కాదు. ఎవరైతే స్వయమును సెర్చ్ చేసుకోగలరో వారే సెర్చ్ లైట్ గా అవ్వగలరు. ఎంతగా స్వయమును సెర్చ్
చేసుకోగలరో అంతగానే సెర్చ్ లైట్ గా అవుతారు. ఒకవేళ స్వయమును సెర్చ్ చేసుకోలేకపోతే సెర్చ్ లైట్ గా కూడా అవ్వలేరు. ఇప్పుడైతే ఆ సమయము వచ్చేసింది. ఇప్పుడు పవర్ ఫుల్ గా కూడా కాకుండా విల్ పవర్ కలిగినవారిగా అవ్వాలి. విల్ పవర్ మరియు వైడ్(విశాల) పవర్ కావాలి. విల్ పవర్ మరియు వైడ్ పవర్ అనగా అనంతము వైపుకు దృష్టి - వృత్తి, మరి ఇప్పుడు దేనిని అదనంగా చేరుస్తారు? శక్తి అయితే ఉంది కానీ ఇప్పుడు విల్ పవర్ మరియు వైడ్ పవర్ అవసరము. ఈ రోజు బాప్ దాదా ఏ రూపంతో చూస్తున్నారు? ఆశా సితారలు,
ఇప్పుడు ఆశా సితారలు, మళ్ళీ తరువాత సఫలతా సితారలుగా అవుతారు. కావున వర్తమానము కూడా చూస్తారు మరియు భవిష్యత్తును కూడా చూస్తున్నారు. సఫలత మీ మెడలోని హారము. మీ మెడలో సఫలతా హారము కనిపిస్తోందా? సంగమయుగములో ఎటువంటి అలంకారము ఉంటుంది? యథా యోగ్యము, తథా శక్తిగా సఫలతా హారము ప్రతి ఒక్కరి మెడలో అలంకరింపబడి ఉంది. బాప్ దాదా పిల్లల అలంకారమును చూస్తారు. అలంకరింపబడిన పిల్లలు మంచిగా అనిపిస్తారు. బాప్ దాదాకు ఇప్పుడు ఏ సంకల్పము
కలుగుతూ ఉంది? బాప్ దాదా మీతో ఏం మాట్లాడుతారు, దీనిని గ్రహించగలరా? ప్రస్తుతము బాబా బుద్ధి యొక్క డ్రిల్లును చేయించేందుకు వస్తున్నారు. ఇప్పుడు మైదానములో ప్రత్యక్షమవ్వాలి. ఇప్పుడు గుప్తముగా ఉండే సమయము కాదు. ఎంతగా ప్రత్యక్షమవుతారో అంతగా బాప్ దాదాను ప్రఖ్యాతము చేస్తారు. అనంతములో షికారు చేసి చక్రవర్తులుగా అవుతున్నారా? ఎవరైతే ఒక్క స్థానములోనే కూర్చుని ఉంటారో వారిని ఏమని అంటారు? ఎవరైతే ఒక్క స్థానములోనే స్థితులై ఉంటారో సేవ కూడా చేస్తూ ఉంటారో, అనంతములో పరిక్రమణ చెయ్యరో అటువంటి వారికి భవిష్యత్తులో కూడా ఒక ఇండివిడ్యువల్ రాజ్యము లభిస్తుంది. తండ్రి కూడా సర్వుల సహయోగిగా అయ్యారు కదా! ఎవరైతే విశ్వములోని ప్రతి ఆత్మతో సంబంధమును జోడిస్తారో, సహయోగిగా అవుతారో వారే విశ్వమునకు రాజుగా అవుతారు. ఏవిధంగా బాప్ దాదా విశ్వ స్నేహీగా, సహయోగిగా అయ్యారో అలాగే పిల్లలు కూడా బాబాను ఫాలో చెయ్యాలి. అప్పుడు విశ్వ మహారాజు అన్న పదవి ఏదైతే ఉందో అందులోకి వచ్చేందుకు అధికారిగా అవ్వగలరు. లెక్క ఉంది కదా! ఎలా మరియు ఎంతనో, అలా మరియు అంతగానే లభిస్తుంది. ఇప్పుడు ప్రతిజ్ఞ చేసి విశేషముగా ప్రత్యక్షమవ్వాలి. ఇతరులను ప్రఖ్యాతము చెయ్యకూడదు, తండ్రిని ప్రత్యక్షము చెయ్యాలి. ప్రత్యక్షత జరిగినప్పుడు ప్రఖ్యాతమవుతారు. విశ్వ అధికారిగా అయ్యే లక్ష్యమును ఉంచారు కదా! ఇప్పుడు ఈ తీవ్ర పురుషార్థమును చెయ్యాలి. ఈ పాత ప్రపంచమునుండి చాలా సహజంగా అనంతమైన వైరాగ్యమును తీసుకువచ్చేందుకు సాధనము ఏమిటి? (కొందరు చెప్పారు) ఎవరు ఏ విషయమైతే వినిపించారో వారు సహజంగా భావించి వినిపించారు కదా, ఒకవేళ సహాజమే అయినప్పుడు అనంతమైన వైరాగిగా అయితే సహజంగానే అయిపోతారు. స్వయముతోనే జోడించనప్పుడు మరి ఇతరులతో ఎలా జోడిస్తారు. అనంతమైన వైరాగ్యము అని అంటారు కదా. ఎవరైతే వైరాగులుగా ఉంటారో వారు ఎక్కడ నివాసము చేస్తారు?  అనంతమైన వైరాగులుగా అవ్వాలనుకుంటే ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు మధువన నివాసులుగా భావించండి అని చాలా సరళమైన యుక్తిని చెప్తారు. కానీ మధుననాన్ని ఎప్పుడూ ఖాళీగా చూడవద్దు, మధువనము ఉన్నదే మధుసూధనుడితో పాటు. కావున మధుననము గుర్తుకు రావటంతోనే బాప్ దాదా, దైవీ పరివారము, త్యాగము -తపస్సు మరియు సేవకూడా గుర్తుకు వస్తుంది. మధువనము తపస్యా భూమి కూడా. మధువనము ఒక్క క్షణములో అన్నింటి నుండీ త్యాగము చేయిస్తుంది. ఇక్కడ అనంతమైన వైరాగులుగా అయిపోయారు కదా. కావున మధువనము ఉన్నదే త్యాగిగా, వైరాగిగా తయారుచేసేదిగా. ఎప్పుడైతే అనంతమైన వైరాగులుగా అవుతారో అప్పుడే అనంతమైన సేవ చెయ్యగలరు. ఎక్కడ కూడా ఆకర్షణ వుండకూడదు. ఇతరుల విషయాన్ని అయితే వదిలెయ్యండి, మీతో మీకు కూడా ఆకర్షణను ఉంచుకోకూడదంతే. 

ఈరోజు  బాప్ దాదాల మధ్య పరస్పరం ఆత్మిక సంభాషణ జిరిగింది. పిల్లలైన ప్రతి ఒక్కరూ ఎంతవరకు బంధింపబడి ఉన్నారు మరియు ప్రతి ఒక్కరి బంధనము ఎంతవరకు తొలగిపోయి ఉంది, ఎంతవరకు తొలగిపోలేదు అని ఈరోజు ప్రభాత సమయంలో వతనము నుండి ఒక దృశ్యాన్ని చూసారు. కొందరివి లావు తాళ్ళు కూడా ఉన్నాయి, కొందరివి  తక్కువగా కూడా ఉన్నాయి, కొందరివి తేలికపాటి దారాలుగా కూడా ఉన్నాయి. ఎవరిని తేలికపాటి దారాలుగా ఉండిపోయాయి, ఎవరివీ లావు తాళ్ళు, ఎవరివి సన్న తాళ్ళు అన్న దృశ్యాన్ని చూసారు. కానీ ఎవరివి ఎలా ఉన్నా బంధనము అనే అంటారు కదా. ఏవో ఒకటి చిన్నా లేక పక్కా దారాలుగా ఉన్నాయి. తేలికపాటి దారాలను కూడా బంధనము అనే అంటారు కదా, అయితే వీరికి ఆలస్యము అవ్వదు. లావు తాళ్ళు ఉన్నవారికి ఆలస్యము కూడా అవుతుంది  మరియు శ్రమ కూడా కలుగుతుంది. ఈరోజు వతనము నుండి ఈ దృశ్యాన్ని చూస్తారు. ప్రతి ఒక్కరూ తమను తాము తెలుసుకోగలరు. లావు తాళ్ళా లేక సన్ననివా? తేలికపాటి దారాలా లేక పక్కా దారాలా? బంధనము కల బంధేలీలా లేక స్వతంత్రులా? స్వతంత్రత అన్నదానికి అర్థము స్పష్టత. అయినాకూడా బాప్ దాదా హర్షిస్తారు. అద్భుతాన్నైతే చేస్తారు, కానీ బాప్ దాదా ఇప్పుడు అంతకంటే ఎక్కువ చూడాలనుకుంటున్నారు. ఎంతగా మీ నోట్లో బాప్ దాదా పేరు ఉంటుందో అంతగానే అందరి నోళ్ళలో మీ పేరు ఉంటుంది. మధువనము ఉన్నదే పరివర్తన భూమిగా. మరి ఏ పరివర్తనను చేసి వెళ్ళాలి అన్నదానినైతే అర్ధం చేసుకున్నారు కదా! అచ్చా!

Comments