02-05-1974 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
ఇప్పుడు బాబా సమానంగా సర్వగుణ సంపన్నంగా అవ్వండి.
సర్వప్రాప్తులతో సంపన్నగా తయారుచేసేటువంటి, స్థిరమైన, అఖండమైన మరియు నిర్విఘ్న విశ్వరాజ్యాధికారిగా తయారు చేసేటువంటి సర్వశక్తివంతుడైన శివబాబా మాట్లాడుతున్నారు -
స్వయాన్ని మాస్టర్ జ్ఞానసాగరులుగా భావిస్తున్నారా? ఎలా అయితే జ్ఞానసాగరుడు సర్వశక్తులతో సంపన్నుడో అదేవిధంగా స్వయాన్ని కూడా సర్వప్రాప్తులతో సంపన్నంగా అనుభవం చేసుకుంటున్నారా? దేవతల ఖజానాలో అప్రాప్తి వస్తువు ఏదీ ఉండదు అని అంటారు. ఇది బ్రాహ్మణుల మహిమయా లేక దేవతలదా? అన్ని సంస్కారాలు మీరు బ్రాహ్మణజీవితం నుండే అనుభవం చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్ని సంస్కారాలు మీలో నింపుకుంటున్నారు. ఈ మహిమ యొక్క సంస్కారాన్ని మీరు ఇప్పటి నుండే అనుభవం చేసుకుంటున్నారా? ఎందుకంటే ఈ సమయంలో మీరు ఉన్నతోన్నతమైన బాప్ దాదా యొక్క సంతానం, కానీ దేవతా జీవితంలో మిమ్మల్ని మాస్టర్ సర్వశక్తివంతులు అని అనరు. ఇప్పుడు మీరు సాగరుని సంతానం, కనుక సాగరుని సమానంగా సంపన్నంగా ఇప్పుడు అవుతారా లేక భవిష్యత్తులో అవుతారా? జ్ఞానసాగరుడైన బాబా పిల్లలను అన్నింటిలో సంపన్నంగా ఇప్పుడే తయారుచేస్తారు. అప్పుడే అంతిమ స్థితి యొక్క మహిమ - సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపన్నులు, సంపూర్ణ నిర్వికారులు మరియు సంపూర్ణ అహింసకులు అని జరుగుతుంది. ఈ సంపన్నస్థితి యొక్క వారసత్వం బాబా ద్వారా ఈ బ్రాహ్మణ జీవితంలోనే లభిస్తుంది. ఇప్పుడు మీరు మీ వారసత్వానికి అధికారులా లేక అవ్వాలా? ఎప్పటి నుండి బాబా వారిగా అయ్యారో అప్పటి నుండి వారసత్వానికి అధికారిగా అయ్యారు. వారసత్వం ఏమిటి? వారసత్వంలో సర్వ ప్రాప్తులు లేదా అనంతమైన ఖజానా అనుభవం చేసుకుంటున్నారా?
వారసత్వానికి అధికారులు కనుక అధికారుల యొక్క గుర్తులు ఏమిటి? అధికారులు బాబా సమానంగా సదా కళ్యాణకారులుగా, దయాహృదయులుగా, మహాజ్ఞానీలుగా, గుణదానీలుగా, ప్రతి సంకల్పం, ప్రతి మాట, ప్రతి కర్మ ద్వారా బాబాని సాక్షాత్కారం చేయించే సాక్షాత్త్ బాబా సమానంగా ఉంటారు. అటువంటి అధికారుల యొక్క మహిమ ఏమిటంటే వారి జీవితంలో అప్రాప్తి వస్తువనేది ఏదీ ఉండదు. అన్నింటిలో సపన్నంగా ఉంటారు, వారి నయనాలు మరియు బుద్ది ఏ వైపు మునిగి ఉండవు. వారు సదా ఆత్మిక దృష్టిలో ఉంటారు, అనేక వ్యర్దసంకల్పాలు లేదా అనేక వైపులకు దృష్టి మరియు బుద్ధి వెళ్ళడానికి అతీతంగా, అన్ని చింతల నుండి నిశ్చింతగా మరియు బాబా ద్వారా లభించిన ఖజానాను సదా స్మరణ చేసుకుంటూ ఉంటారు. వారికి ఇక ఏ రెండవ ఇతర సంకల్పం చేసే ఖాళీ ఉండదు. ఎందుకంటే బాబా ద్వారా లభించిన ఖజానాను స్వయం పట్ల మరియు సర్వాత్మల పట్ల పంచి పెట్టే మరియు ధారణ చేయటంలో వారు చాలా బిజీగా ఉంటారు. అన్నింటికంటే ఉన్నతోన్నతమైన వ్యాపారం, అన్నింటికంటే ఉన్నతోన్నతమైన దానం ఇదే. ఇంత శ్రేష్ఠ కార్యాన్ని మరియు శ్రేష్ట దాన,పుణ్యాలను వదిలి ఏమి చేస్తారు? ఇక చిన్న, చిన్న వ్యర్ధకార్యాలు చేయాలనే సంకల్పమైనా వస్తుందా? ఈ పని పూర్తి చేసేసారా, అందువలనే ఖాళీగా ఉన్నారా? పూర్తి చేయకపోతే ఖాళీ ఎలా దొరుకుతుంది? ఇంత ఉన్నత కార్యంలో బిజీగా ఉండేవారు, బొమ్మల ఆటలు ఆడుకుంటూ ఉంటే వారిని ఏమంటారు? బొమ్మలాటలో లక్ష్యం ఏదైనా ఉంటుందా? ఏమైనా ఫలితం వస్తుందా? ఇంత ఉన్నత వ్యక్తులు అయ్యి, ఒక అడుగులో కోట్లు సంపాదించుకునేవారు, ఇలా బొమ్మలాటలు ఆడుకుంటూ ఉంటే వారిని గొప్పవారు, తెలివైనవారు అని అంటారా? వ్యర్థ సంకల్పాలు కూడా బొమ్మలాటలే. ఇప్పటి వరకు ఈ చిన్నతనం యొక్క సంస్కారం ఉందా?
ఎవరికైతే స్వయానికి అవసరమైన మరియు సమీప చైతన్య శక్తులైన సంకల్పం మరియు బుద్ధి అంటే మనస్సు మరియు బుద్ధిపై నియంత్రణ ఉండదో, అధికారిగా ఉండరో లేదా విజయీగా అవ్వరో వారు విశ్వ స్వరాజ్యాధికారిగా లేదా విజయీరత్నంగా అవుతారా? రాజ్యం యొక్క ముఖ్య అధికారికి స్వయంపై అధికారం లేకపోతే వారు రాజ్యాన్ని స్థిరంగా, అఖండంగా మరియు నిర్విఘ్నంగా నడిపించగలరా? ఆత్మ యొక్క సమీప శక్తులైన మనస్సు, బుద్ధి లేదా ముఖ్య రాజ్యాధికారులు లేదా కార్యాధికారులు ఇవి కూడా మీ వశంలో లేకపోతే అటువంటి వారిని ఏమంటారు? గొప్ప విజయీలు అంటారా లేక గొప్ప బలహీనులు అని అంటారా? నా సూక్ష్మ రాజ్యాధికారులు నా అధికారంలో ఉన్నాయా? అని స్వయాన్ని చూసుకోండి. ఒకవేళ అవి మీ అధికారంలో లేకపోతే విశ్వరాజ్యాధికారిగా ఎలా అవుతారు? మీ చిన్న, చిన్న కార్యకర్తలే మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటే, అటువంటి వారిని మహావీరులు అని అంటారా? మేము లా (నియమం) అండ్ (మరియు) ఆర్డర్ (ఆజ్ఞ ) తో నిండిన రాజ్యాన్ని స్థాపన చేస్తాము అని ప్రతిజ్ఞ అయితే చేస్తున్నారు. మరి ఈ ప్రతిజ్ఞ చేసేవారు ఈ చిన్న, చిన్న కార్యకర్తలను అంటే కర్మేంద్రియాలను మీ నియమం మరియు ఆజ్ఞలో నడిపించకుండా స్వయమే కార్యకర్తలకు వశీభూతమై పోతే అటువంటి వారు విశ్వంలో నియమం మరియు ఆజ్ఞతో నిండిన రాజ్యాన్ని స్థాపించగలరా? ప్రతి కర్మేంద్రియం ఎంత వరకు స్వయం యొక్క అధికారంలో ఉంది? అనేది పరిశీలించుకోండి మరియు ఇప్పటి నుండి విజయీ సంస్కారాన్ని ధారణ చేయండి, బాప్ దాదా యొక్క పేరుని ప్రత్యక్షం చేసేవారే బాబా సమానంగా సంపన్నంగా ఉంటారు.
మంచిది, ఇలా సైగతో అర్థం చేసుకునేవారికి, ప్రతి కార్యకర్తను స్వయం యొక్క సైగతో నడిపించేవారికి, ప్రతి ఆత్మకు బాబా వైపుకి సైగ చేసేవారికి, సదా స్వయం యొక్క అధికారాన్ని అనుభవంలోకి తీసుకువచ్చేవారికి, సదా సంపన్నం మరియు సదా విజయీ ఇలా తెలివైన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు, శుభరాత్రి మరియు నమస్తే.
Om Shsnthi
ReplyDelete