02-04-1972 అవ్యక్త మురళి

* 02-04-1972         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“మహిమాయోగ్యులుగా ఎలా అవ్వాలి?"

సదా ఉపరామ(అతీతమైన) స్థితిలో ఉండేందుకు విశేషంగా ఏ రెండు విషయాల ఆవశ్యకత ఉంది? ఎందుకంటే వర్తమాన సమయములో ఉపరామ స్థితిలో ఉండేందుకు ప్రతి ఒక్కరూ నంబర్ వారీగా పురుషార్ధము చేస్తున్నారు. సహజముగా ఉపరామ స్థితిలో స్థితులవ్వగలిగేందుకు ఏ రెండు విషయాల ఆవశ్యకత ఉంది? గుర్తు అయితే ఉన్నాయి కానీ వాటిలో కూడా రెండు విషయాలు ఏవి, వాటిని వినిపించండి? రెండు విషయాలను రెండు మాటలలో వినిపించండి. ఇప్పుడైతే మొత్తము జ్ఞాన విస్తారమును సార రూపములోకి తీసుకురావాలి కదా! శక్తులు విస్తారమును సారములోకి సహజముగా చెయ్యగలరా? మీ అనుభవముతో వినిపించండి. ఉపరామ స్థితి లేక సాక్షీ స్థితి, విషయమైతే ఒక్కటే. వాటి కొరకు రెండు విషయాలు ధ్యానములో ఉండాలి - ఒకటి ఆత్మనైన నేను మహాన్ ఆత్మను, రెండవది ఆత్మనైన నేను ఇప్పుడు ఈ పాత సృష్టిలో లేక ఈ పాత శరీరములో మెహమాన్(అతిథి)ని. కావున మహాన్ మరియు మెహమాన్ ఈ రెండూ స్మృతిలో రావటం ద్వారా బలహీనతలు లేక మోహము కారణంగా ఉపరామ స్థితి లేకుండా ఏ ఆకర్షణలోకి వస్తారో ఆ ఆకర్షణ సమాప్తమై స్వతహాగా మరియు సహజముగా ఉపరామముగా అయిపోతారు. ఎవరైతే సాధారణ కర్మ లేక సాధారణ సంకల్పము, సంస్కారములకు వశమై నడుస్తారో లేక వశమై ఉంటారో, వారందరూ స్వయమును మహాన్ ఆత్మ మరియు మెహమాన్‌గా భావించి నడవటం ద్వారా వర్తమానములో మరియు భవిష్యత్తులో మరియు భక్తి మార్గములో కూడా మహిమా యోగ్యులుగా అయిపోతారు. ఒకవేళ మెహమాన్ లేక మహాన్ గా భావించనట్లయితే మహిమాయోగ్యులుగా కూడా అవ్వజాలరు. మహిమ కేవలము భక్తిలోనే ఉండదు, కానీ మొత్తము కల్పమంతటిలోనూ ఏదో ఒక రూపములో మహిమాయోగ్యులుగా అవుతారు. సత్యయుగములో ఎవరైతే మహాన్ గా అనగా విశ్వ మహారాజుగా మరియు మహారాణిగా అవుతారో వారు ప్రజల ద్వారా మహిమాయోగ్యులుగా అవుతారు. భక్తిమార్గములో దేవి లేక దేవత రూపములో మహిమాయోగ్యులుగా అవుతారు మరియు సంగమయుగములో ఎవరైతే మహాన్ కర్తవ్యమును చేసి చూపిస్తారో, వారు బ్రాహ్మణ పరివారము ద్వారా కూడా మరియు ఇతర ఆత్మల ద్వారా కూడా మహిమాయోగ్యులుగా అవుతారు. కావున కేవలము ఈ సమయములో మెహమాన్ గా మరియు మహాన్ ఆత్మగా భావించటం ద్వారా మొత్తము కల్పము కొరకు స్వయమును మహిమాయోగ్యముగా తయారుచేసుకోగలరు. మహాన్ గా ఉన్నానా మరియు మెహమాన్‌గా అయ్యి నడుస్తున్నానా లేక కార్యము చేస్తున్నానా అని మీ కర్మలు మరియు సంకల్పమును పరిశీలించుకోండి. అప్పుడిక అటాచ్మెంట్ (అనుబంధము) సమాప్తమైపోతుంది. మెహమాన్‌గా కేవలము ఈ సృష్టిలోనే కాదు, ఈ శరీరరూపీ ఇంటిలో కూడా మెహమాన్లు(అతిథులు). ఎప్పుడైతే స్వయమును మెహమాన్‌గా భావిస్తారో అప్పుడు దేహ-భానపు ఆకర్షణ ఏదైతే ఉందో లేక స్మృతి రూపంలో ఏ సంస్కారాలైతే నిలిచియున్నాయో అవి చాలా సహజంగా తొలగిపోగలవు. మీకు ఒక ఇల్లు ఉంది, మీరు వారికి కారణంగానో అకారణంగానో అమ్ముతారు, అమ్మేసినట్లయితే ఇక దానిపై నాదీ అనేది వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ స్థానములోనే నివసిస్తున్నా కూడా అతిథిగా భావించి ఉంటారు. కావున నాదిగా భావించి ఉండటంలో మరియు అతిథిగా భావించి ఉండటంలో ఎంత అంతరము అయిపోతుంది! కావున నేను శరీరమును అని దేనినైతే భావిస్తున్నారో ఆ శరీరమును ఇప్పుడు ఇది నాది కాదు అని భావించండి. ఇప్పుడు నాది అని అంటారా? ఇప్పుడు ఈ శరీరము మీదిగా లేదు, దీని నుండి మరజీవగా అయినట్లయితే నా శరీరము కూడా కాదు. తనువును అర్పణము చేసేసారా లేక నాది అని భావిస్తున్నారా? ఇప్పుడు ఈ పాత శరీరము యొక్క ఆయుషు కూడా సమాప్తమైపోయింది. ఇదైతే డ్రామా అనుసారంగా ఈశ్వరీయ కర్తవ్యము కొరకు శరీరము నడుస్తూ ఉంది. కావున ఇప్పుడు మీరు ఇది నా శరీరము అని చెప్పజాలరు. ఈ శరీరముపై కూడా మేరాపన్(నాది అన్న భావము) సమాప్తమైపోయింది. ఇప్పుడైతే బాబా ఆత్మకు కర్మ చేసేందుకు తాత్కాలిక లోన్ రూపములో ఈ శరీరమును ఇచ్చారు. ఈ శరీరము నాది కాదు, లోన్ తీసుకొని కర్తవ్యము చేసేందుకు పాత్రను అభినయిస్తాను అని తండ్రి ఏవిధంగా భావిస్తారో అలా మీరు కూడా తండ్రి సమానులు కదా. నా శరీరము అని భావించినట్లయితే అన్ని విషయాలు వచ్చేస్తాయి. నాది అన్న మాటతోటి అనేకము ఉన్నాయి. మేరాపన్ అన్నదే సమాప్తమైపోయినట్లయితే దానికున్న అనేక సహచరులు కూడా సమాప్తమైపోతాయి. ఉపరామమైపోతాయి. ఈశ్వరీయ కర్తవ్యము కొరకు ఈ శరీరమును లోన్ తీసుకున్నారు. మరే ఇతర కర్తవ్యము కొరకు ఈ శరీరము లేదు, ఇలా స్వయమును అతిథిగా భావించి నడవటం ద్వారా ప్రతి కర్మ మహాన్ గా స్వతహాగనే అయిపోతుంది. శరీరమే మీది కానప్పుడు శరీర సంబంధములోని వ్యక్తులు, వస్తువులు కూడా మీవిగా ఉండవు, కావున సదా అలా భావించి నడవండి. ఇలా భావించి నడిచేవారు ఎల్లప్పుడూ నషాలో ఉంటారు. వారికి స్వతహాగానే తమ ఇల్లు స్మృతిలో ఉంటుంది. కేవలము ఇల్లే కాదు, బాబా గురించి 6 విషయాలనేవైతే వినిపిస్తారో అవన్నీ స్వతహాగనే స్మృతిలో ఉంటాయి. తండ్రి పరిచయమును ఇచ్చేందుకు సారరూపంలో వినిపిస్తారు, అందులో మొత్తము జ్ఞానము వచ్చేస్తుంది, ఆ సారమును 6 విషయాలలో వినిపిస్తారు. కావున మీరు స్వయమును అతిథిగా భావించి నడిచినట్లయితే మీ 6 విషయాలు కూడా సదా స్మృతిలో ఉంటాయి. పేరు - సర్వోత్తమ బ్రాహ్మణులు. రూపము - సాలిగ్రామము. ఈ విధముగా సమయ స్మృతి, ఇంటి స్మృతి, కర్తవ్య స్మృతి, వారసత్వపు స్మృతి స్వతహాగనే ఉంటుంది. విస్తారములో మొత్తము జ్ఞానమునేదైతే ఇంత సమయము విన్నారో అది సారరూపములో వచ్చేస్తుంది. ఏది మాట్లాడినా లేక కర్మ చేసినా అందులో సారము నిండి ఉంటుంది, అసారము ఉండదు. అసారము అనగా వ్యర్ధము. కావున మీ ప్రతి మాట మరియు ప్రతి కర్మలో మొత్తము జ్ఞాన సారము ఉండాలి. ఎప్పుడైతే మొత్తము జ్ఞాన సారము బుద్ధిలో ఉంటుందో అప్పుడే అది జరుగుతుంది. సదా నషాలో ఉండంటం ద్వారానే నిషానా వెయ్యగలరు. ఒకవేళ నషా లేనట్లయితే నిషానా(గురి)కూడా ఉండదు. మొత్తము జ్ఞాన సారము 6 మాటలలో బుద్ధిలోకి రావటం ద్వారా మొత్తము జ్ఞానము రివైజ్ అయిపోతుంది. కావున నషా తక్కువగా ఉన్న కారణంగా లక్ష్యము పైకీ క్రిందకు అయిపోతుంది. ఇప్పుడిప్పుడే ఫుల్ ఫోర్స్ లో నషా ఉంటుంది, ఇప్పుడిప్పుడే మధ్యమంగా అయిపోతుంది. కింది స్థితి అయితే సమాప్తమైపోయింది కదా. కింది స్థితి అంటే ఏంటి అన్నవిధంగా దాని అవిద్యులుగా అయిపోవాలి. మిగిలినవి శ్రేష్ఠము మరియు మధ్యమ స్థితులు, మథ్యమ స్థితిలోకి వచ్చిన కారణంగా రిజల్టు లేక లక్ష్యము కూడా మధ్యమంగానే ఉంటుంది. వర్తమాన సమయములో మీ స్మృతి స్టేజ్, సేవా స్టేజ్ రెండింటినీ చూసినట్లయితే రిజల్టు మధ్యమంగా కనిపిస్తుంది. ఎంత ఉండాల్సి ఉందో అంత లేదు అని మెజారిటీ వారు అంటారు. ఆ మధ్యమ రిజల్టుకు ముఖ్య కారణము ఇదే - మధ్యమకాల సంస్కారాలను ఇప్పటివరకు పూర్తిగా భస్మము చెయ్యలేదు. కావున ఈ మధ్యమకాల సంస్కారము అనగా ద్వాపరకాలము నుండి తీసుకుంటే దేహ అభిమానము లేక బలహీన సంస్కారాలనేవైతే నింపుకుంటూ వెళ్ళారో వాటికి వశమవ్వటం కారణంగా మధ్యమ రిజల్టు కనిపిస్తుంది. అనుకోలేదు కానీ సంస్కారము చాలాకాలము నుండి ఉన్న కారణంగా మళ్ళీ అదే జరిగిపోతుంది అని ఈ కంప్లైంట్ ను కూడా చేస్తారు. కావున ఈ మథ్యమకాల సంస్కారాలను పూర్తిగా భస్మము చెయ్యలేదు. డాక్టర్లు కూడా రోగకారక జర్మ్స్ (కీటాణువుల)ను పూర్తిగా అంతము చేసేందుకు ప్రయత్నము చేస్తారు. ఒకవేళ అంశమాత్రము ఉండిపోయినా కూడా ఆ అంశము నుండి వంశము జన్మిస్తుంది. కావున ఈ విధంగా మథ్యమకాల సంస్కారాలు అంశరూపములో ఉన్న కారణంగా కూడా ఈ రోజు అంశముగా ఉన్నది రేపు వంశమైపోతుంది. దీనికి వశీభూతమైపోయిన కారణంగా శ్రేష్ఠ రిజల్టు ఏదైతే వెలువడవలసి ఉందో అది వెలువడదు. మీతో మీరు సంతుష్టంగా, మీ పురుషార్థముతో, మీ సేవతో లేక మీ బ్రాహ్మణ పరివారపు సంపర్కముతో సంతుష్టులుగా ఉన్నారా అని ఎవరినైనా అడిగితే ఆలోచిస్తారు. ఒకవేళ అవును అని అన్నా కూడా ఆలోచించి అంటారు, వెంటనే చెప్పరు. తమ పురుషార్థములో, సేవలో మరియు సంపర్కములో... మూడింటిలో సర్వాత్మల ద్వారా సంతుష్టతా సర్టిఫకేట్ లభించాలి. సర్టిఫికేట్ కాగితముపై వ్రాతపూర్వకంగా లభించదు, కానీ ప్రతి ఒక్కరి ద్వారా అనుభవమౌతుంది. ఇలా సర్వ ఆత్మల సంపర్కములో స్వయమును సంతుష్టంగా ఉంచుకోవటము మరియు సర్వులను సంతుష్టము చెయ్యటము, ఇందులో ఎవరైతే విజయులుగా అవుతారో వారే అష్ట దేవతా విజయీరత్నాలుగా అవుతారు. రెండు విషయాలలో సరిగ్గా అయిపోతారు, మిగిలిన ఈ మూడవ విషయమేదైతే ఉందో అందులో యథాశక్తి మరియు నంబర్ వారీగా ఉన్నారు. ఉన్నదైతే అన్ని విషయాలలో నంబర్ వారీగానే, కానీ ఈ విషయంలో ఎక్కువగా ఉన్నారు. ఒకవేళ మూడు విషయాలలో సంతుష్టంగా లేనట్లయితే శ్రేష్ఠముగా లేక అష్టరత్నాలలోకి రాజాలరు. పాస్ విత్ ఆనర్ గా అయ్యేందుకు సర్వుల ద్వారా సంతుష్టత అనే పాస్ పోర్టు లభించాలి. సంపర్కము విషయంలో లోటు ఉంటుంది. సంపర్కములో సంతుష్టంగా ఉండే మరియు సంతుష్టము చేసే విషయంలో పాస్ అయ్యేందుకు ఏ ముఖ్యమైన విషయము ఉండాలి? అనుభవము యొక్క ఆధారముతో చూడండి, సంపర్కములో అసంతుష్టత ఎందుకని ఉంటుంది? సర్వులను సంతుష్టము చేసేందుకు లేక మీ సంపర్కమును సంతుష్టము చేసేందుకు లేక మీ సంపర్కమును శ్రేష్ఠంగా తయారుచేసేందుకు. ముఖ్యమైన విషయము - మీలో సహనము చేసే శక్తి లేక ఇముడ్చుకొనే శక్తి ఉండాలి. అసంతుష్టతకు కారణము ఇదే - ఎవరి వాణినైనా లేక సంస్కారము లేక కర్మనైనా చూసినప్పుడు, అది వారి వివేకము ద్వారా యథార్థముగా అనిపించదు, ఆ కారణంగా అటువంటి మాట లేక కర్మ జరిగిపోతుంది, దీని ద్వారా ఇతర ఆత్మలు అసంతుష్టమైపోతారు. ఎవరి సంస్కారమునైనా లేక మాటను లేక కర్మనైనా చూసి అది యథార్థము కాదు లేక అలా జరగకుండా ఉండాల్సింది అని మీరు భావిస్తారు, అయినప్పటికీ ఒకవేళ ఆ సమయములో ఇముడ్చుకొనే శక్తి లేక సహనము చేసే శక్తులను ధారణ చేసినట్లయితే మీ సహనశక్తి మరియు ఇముడ్చుకొనే శక్తి ఆటోమేటిక్ గా వారికి వారి అయథార్థ నడవడికను సాక్షాత్కారము చేయిస్తుంది. కానీ జరిగేది ఏంటి? వాటిద్వారా లేక దృష్టి-వృత్తి ద్వారా వారికి అనుభవము చేయించేందుకు లేక సాక్షాత్కారము చేయించేందుకు మీరు కూడా మీ సంస్కారాలకు వశమైపోతారు. ఈ కారణము వలన స్వయమూ సంతుష్టంగా ఉండరు, ఇతరులూ సంతుష్టంగా ఉండరు. ఆ సమయములో ఒకవేళ ఇముడ్చుకొనే శక్తి ఉన్నట్లయితే దాని ఆధారముతో లేక సహనము చేసే శక్తి ఆధారముతో వారి కర్మ లేక సంస్కారమును కొద్ది సమయము కొరకు అవాయిడ్ చేసినట్లయితే మీ సహనశక్తి లేక ఇముడ్చుకొనే శక్తి ఆ ఆత్మపై సంతుష్టతా బాణమును వెయ్యగలదు. ఇది లేని కారణంగా అసంతుష్టత ఉంటుంది. కావున అందరి సంపర్కములో సర్వులను సంతుష్టము చేసేందుకు లేక సంతుష్టంగా ఉండేందుకు ఈ రెండు గుణాలు లేక రెండు శక్తులు చాలా ఆవశ్యకము. వీటితోనే మీ గుణగాయనము జరుగుతుంది. ఆ సమయములో విజయము కనిపించదు, ఓటమి కనిపిస్తుంది. కానీ ఆ సమయములోని ఓటమి అనేక జన్మలు మీ మెడలో హారాన్ని వేస్తుంది. కావున ఈ ఓటమిని కూడా విజయముగా భావించాలి. ఈ లోపము ఉన్న కారణంగా ఈ సబ్జెక్ట్ లో ఎంత సఫలత ఉండాలో అంత ఉండదు. బుద్ధిలో నాలెడ్జ్ ఉన్నాకూడా ఏ సమయములో ఏ రూపముతో ఎవరికి నాలెడ్జ్ ను చెప్పాలి లేక యుక్తితో విషయమును చెప్పాలి అన్న తెలివి కూడా ఉండాలి. నేను వీరికి శిక్షణను ఇచ్చాను అని భావిస్తారు. కానీ అది ఇచ్చే సమయము కానప్పుడు, వారి సమర్థత లేనట్లయితే ఆ శిక్షణ, శిక్షణగా పని చెయ్యదు. భూమిని చూసి, సమయమును చూసి విత్తనమును నాటినట్లయితే సఫలత కూడా వెలువడుతుంది. సరైన సమయము లేకుండా, ధరణి సరిగ్గా లేకుండా ఉన్నట్లయితే అది ఎంత మంచి క్వాలిటీకి చెందిన విత్తనమైనా కూడా ఫలాలు రావు. అదేవిధంగా జ్ఞాన పాయింట్లు లేక శిక్షణ లేక యుక్తి ఇవ్వవలసి ఉండే ధరణిని మరియు సమయమును చూడాలి. ధరిత్రి అనగా ఆ ఆత్మ యొక్క సమర్థతను చూడండి మరియు సమయమును కూడా చూడండి, అప్పుడు శిక్షణరూపీ బీజము ఫలమును ఇవ్వగలదు. అర్థమైందా?

కావున వర్తమాన సమయములో సర్వ శ్రేష్ఠ ఆత్మలకు లేక మహావీరులు, మహావీరుణులకు ఈ విశేష పురుషార్థమువైపు అటెన్షన్ ఇవ్వాలి, ఇదే మహావీరత. సంతుష్టులను సంతుష్టముగా ఉంచటము మహావీరత కాదు, స్నేహీకి స్నేహమును ఇవ్వటము మహావీరత కాదు, సహయోగులతో సహయోగులుగా అవ్వటము మహావీరత కాదు. కానీ ఏవిధంగా అపకారులకు కూడా ఉపకారము చేస్తారో, ఎవరు ఎంతగా అసహయోగులుగా అయినా కూడా మీ సహయోగపు శక్తి ద్వారా అసహయోగులను సహయోగులుగా చేయటము, దీనినే మహావీరత అని అంటారు. ఈ కారణముతో ఇది కాలేదు, వీరు ముందుకు వెళ్ళలేదు, కావున ఇది జరగదు అని అనడం కాదు. వారు ముందుకు వెళ్ళనీ లేక వెళ్ళక పోనీ, మీరైతే ఎదగగలరు కదా? ఇదికూడా సంబంధముయొక్క స్నేహమని భావించాలి. సంబంధీకులెవరైనా ఒకవేళ ఏ విషయములోనైనా బలహీనముగా ఉన్నట్లయితే బలహీనులను బలహీనులుగా భావించి వదిలివేయటమును మర్యాద అని అనరు. బలహీనులను బలహీనులుగా భావించి వదిలివేయకుండా, వారికి బలమును ఇచ్చి శక్తివంతులుగా తయారు చెయ్యాలి మరియు సహచరునిగా చేసుకొని అటువంటి బలహీనులను హైజంప్ చేసేందుకు యోగ్యమైన వారిగా తయారు చెయ్యాలి ఇదే ఈశ్వరీయ మర్యాద, అప్పుడే మహావీర్ అని అంటారు. కావున ఈ సబ్జెక్ట్ పై అటెన్షన్‌ను పెట్టడం ద్వారా మళ్ళీ సేవా ప్లానులను ఏవైతే తయారుచేస్తారో లేక పాయింట్లను ఏవైతే వెలువరిస్తారో అవి సేవ యొక్క ప్లాన్ల రూపీ నగలలో ఈ రత్నాలు మెరుస్తుంటాయి. కేవలము బంగారము మాత్రమే దూరము నుండి అంత ఆకర్షణగా ఉండదు, ఒకవేళ బంగారములో రత్నాలను పొదిగినట్లయితే అవి దూరము నుండే తమవైపుకు ఆకర్షితము చేస్తాయి. ప్లాన్స్ ను తయారుచేస్తారు, వాటినైతే తయారు చెయ్యండి, కానీ ప్లాన్స్ లో ఈ రత్నమేదైతో ఉందో దానిని ప్రతి ఒక్కరూ తమకు తామే పెట్టుకొని అప్పుడు ప్లాన్‌ను ప్రాక్టికల్ లో చేసినట్లయితే మొత్తము విశ్వములో ఏ ధ్వనినైతే వ్యాపింపచెయ్యాలనుకున్నారో అందులో సఫలత లభించగలదు. దూరదూరములలో ఉన్న ఆత్మలు ఈ రత్నముపై ఆకర్షితమైపోయి వస్తారు. అర్థమైందా! అచ్ఛా! ఓం శాంతి.

Comments