02-04-1970 అవ్యక్త మురళి

* 02-04-1970         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“సంపూర్ణ స్థితికి చిహ్నాలు"

అందరి లోపల వినే సంకల్పము ఉంది. బాప్ దాదాది ఏముంది? బాప్ దాదా వినడము  మరియు వినిపించడముల నుండి అతీతముగా తీసుకువెళతారు. ఒక్క క్షణంలో శబ్దం నుండి అతీతముగా అవ్వడం వస్తుందా? శబ్దంలోకి చాలా సహజముగా మరియు త్వరగా ఏవిధంగా అయితే వస్తారో అలాగే శబ్దం నుండి అతీతంగా కూడా సహజంగా మరియు త్వరగా వెళ్ళగల్గుతారా! మిమ్మల్ని మీరు ఏమని పిలిపించుకుంటారు? మాస్టర్ సర్వశక్తివాన్. ఇప్పుడు మాస్టర్ సర్వశక్తివాన్ అన్న నషా తక్కువగా ఉంటోంది, కావున ఒక్క క్షణంలో శబ్దంలోనికి రావడం మరియు ఒక్క క్షణంలో శబ్దం నుండి అతీతంగా అయిపోవడం ఈ శక్తి యొక్క ప్రత్యక్ష ప్రకాశము ముఖముపై కన్పించడం లేదు. ఎప్పుడైతే ఇటువంటి స్థితి ఏర్పడుతుందో, ఎప్పుడైతే ఇప్పుడిప్పుడే శబ్దంలోకి రావడం మళ్ళీ ఇప్పుడిప్పుడే శబ్దం నుండి అతీతంగా వెళ్ళిపోయే ఈ అభ్యాసం సరళముగా మరియు సహజంగా అయిపోతుందో అప్పుడు సంపూర్ణత వచ్చిందని భావించండి. ఇదే సంపూర్ణ స్థితికి గుర్తు. అప్పుడు పురుషార్థాలన్నీ సరళమైపోతాయి. పురుషార్థంలో వచ్చేస్తాయి. ఎప్పుడైతే ఈ రెండింటిలోనూ సరళత అనుభవమవుతుందో అప్పుడు సంపూర్ణత యొక్క స్థితి ప్రాప్తించనున్నదని అర్థం చేసుకోండి. సంపూర్ణ స్థితి కలవారు పురుషార్థం తక్కువగా చేస్తారు మరియు సఫలతను అధికంగా ప్రాప్తింపజేసుకుంటారు. ఇప్పుడు పురుషార్థము అధికముగా చేయవలసి వస్తోంది. దాంతో పోలిస్తే సఫలత తక్కువగా ఉంది. నేడు బాప్ దాదా అందరి ముఖంలో ఒక విశేషమైన విషయాన్ని పరిశీలించారు, ఇది ఎవరికి టచ్ అవుతుందో చూద్దాము! బాబా ఏ విషయాన్ని పరిశీలించారు? థాట్ రీడర్స్ సంకల్పాలను క్యాచ్ చేయగలిగినప్పుడు మరి మాస్టర్ సర్వశక్తివంతులు వాటిని క్యాచ్ చేయలేరా? ఈ భట్టి ఏదైతే జరిగిందో వారి పరీక్షను తీసుకోవడం జరగలేదు. కావున నేడు ఆ పరీక్షను పెడదాము. అందరూ పాసయ్యే ఉన్నారు. ఒకటేమో, పాస్ అవ్వడము, రెండవది, పాస్ విత్ హానర్‌గా అవ్వడం. పాండవ సేన శక్తులకు ముందు ఉంటారు. కొందరు ముందు, కొందరు వెనుక ఉంటారు. (గోపులతో) మీరు శక్తుల ముందు ఉన్నారా లేక వెనుక ఉన్నారా? ఎవరైతే ముందుకు పరిగెడదామనుకుంటారో వారినెవరూ ఆపలేరు. స్వయం యొక్క అవరోధమే ఆపగలదు. కాని ఇంకెవరైనా ఆపడం ద్వారా అది ఆగజాలదు. అలాగే పాండవులు వెనుక ఉండడమే ముందుకు వెళ్ళడము. వెనుక ఎందుకు ఉంటారు? గార్డ్ వెనుక ఉంటాడు. మీరు వెనుక ఉండే గార్డా లేక ముందు ఉండేవారా? ఏ స్థానము మంచిగా అనిపిస్తుంది. గార్డ్ వెనుక ఉంటాడు, గైడ్ ముందు ఉంటాడు. కావున గైడ్ ముందు ఉన్నట్లే కదా! పాండవులను గార్డ్ గా చేసి, శక్తులను రక్షించేందుకు నిమిత్తం చేయడం జరిగింది. పాండవులు వెనుక ఉండి శక్తులను ముందు ఉంచారు. గైడ్ గా అవ్వకూడదు, గార్డ్ గా అవ్వాలి. పాండవులు గైడ్ గా అయితే గడబిడ అవుతుంది. కావున పాండవ సేన గార్డ్ గా అవ్వాలి. మీరు ఏ పురుషార్థుల లైనులో ఉన్నారు? పురుషార్థుల లైనులు ఎన్ని తయారయ్యాయి? ఇప్పుడు బాప్ దాదా ఇటువంటి మాస్టర్ సర్వశక్తివంతులుగా తయారు చేసే చదువును చదివిస్తున్నారు. ఎవరి ముఖము ద్వారానైనా, వారి స్థితి మరియు సంకల్పాలను స్పష్టంగా అర్థం చేసుకోగలిగే చదువును చదివిస్తున్నారు. అనుమానం కూడా లేకుండా స్పష్టంగా తెలిసిపోవాలి. ఇది అంతిమ చదువు యొక్క స్థితి. సాకార రూపంలో కొద్ది స్వరూపము అంతిమంలో చూపించారు. ఎవరైతే సాకార రూపంలో తోడుగా ఉన్నారో వారు ఇటువంటి అనేక విషయాలను నోట్ చేశారు. ఇటువంటి స్థితియే నెంబర్ వారీగా పిల్లలందరిదీ ఏర్పడనున్నది, ఎప్పుడైతే ఇటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుందో అప్పుడు అంతిమ స్వరూపము మరియు భవిష్య స్వరూపము పిల్లలైన మీ అందరి ముఖం ద్వారా అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పటివరకైతే సాక్షాత్తు సాకార రూపంగా అవ్వరో అప్పటివరకు సాత్కారాలు జరుగజాలవు. కావున ఈ సబ్జెక్టుపై అతి సమీప రత్నాలు ధ్యానమునివ్వాలి. ఎంతగా సమీపంగా ఉంటారో అంతగా స్వయము స్పష్టంగా ఉంటారు మరియు ఇతరులు కూడా వారి ముందు స్పష్టంగా కనిపిస్తారు. ఎవరి పురుషార్థం ఎంతెంతగా స్పష్టమవుతూ ఉంటుందో అంతంతగా వారి ప్రాలబ్ధం కూడా స్పష్టమవుతూ ఉంటుంది. అలాగే ఇతరులు కూడా వారి ముందు స్పష్టమవుతూ ఉంటారు. స్పష్టత అనగా సంతుష్టత. ఎంతగా సంతుష్టమవుతూ ఉంటారో అంతగానే స్పష్టమవుతారు. స్పష్టమైన పిల్లలను సాకార రూపంలో ఏ పదాలతో సంబోధించేవారు? స్వచ్ఛమైనవారు మరియు సత్యమైనవారు. ఎవరిలోనైతే సత్యత మరియు స్వచ్ఛత ఉంటాయో వారు సదా స్పష్టంగా ఉంటారు. ఎప్పుడైతే స్వచ్చత ఉంటుందో అప్పుడు అన్ని వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ పాఠము భట్టీలోని చదువులో చివరి పాఠము, ఇందులోనే ఉదాహరణ మూర్తులుగా అవ్వాలి. ఎవరు ఏ విషయంలో ఉదాహరణ మూర్తులుగా అవుతారో వారికి దాని ఫలితముగా పరీక్షలో ఎక్స్ ట్రా మార్కులు లభిస్తాయి. నాలుగు సబ్జెక్టులను విశేషంగా ధ్యానములో ఉంచుకోవాలి. 1. స్మృతి శక్తి, 2. స్నేహశక్తి, 3.సహయోగ శక్తి మరియు సహన శక్తి. ఈ నాలుగు విషయాలు విశేషంగా ఈ భట్టీలోని సబ్జెక్టులు. ఈ నాలుగు విషయాలలో బాప్ దాదా ఏమి రిజల్టును చూశారు? హర్షించదగ్గ రిజల్ట్ చూశారు. అన్ని శక్తులు సమానంగా అవ్వడంలో కొంత శాతంలో లోపము ఉంది. నాలుగు శక్తులు ఉన్నా కాని ఆ నాలుగింటిలో సమానత ఉండాలి. అందులో శాతంలో లోపం ఉంది. కావున రిజల్టు ఏమిటి? 75 శాతం పాసయ్యారు, మిగిలిన 25 శాతంలో లోపం ఏదైతే ఉందో అది సర్వశక్తులలో సమానత ఉండడంలోనే లోపము ఉంది. కొందరిలో ఒక శక్తి విశేషంగా ఉంటే మరికొందరిలో ఇంకొక శక్తి విశేషంగా ఉంది.  నాలుగు శక్తులు ఎప్పుడైతే సమానంగా ఉంటాయో అప్పుడు సంపూర్ణంగా ఉన్నారని భావించండి. (ఈ స్థితిలో శరీరమును వదలవలసివస్తే భవిష్య రిజల్టు ఎలా ఉంటుంది?). ఎవరైతే ఇటువంటి పురుషార్థులుగా ఉంటారో వారు ఎంతైనా ధైర్యమును ఉంచారు కదా! కావున 'పిల్లలు ధైర్యమును ఉంచితే బాబా సహాయము చేస్తారు' అని బాప్ దాదా కూడా పిల్లలతో ప్రతిజ్ఞ చేశారు. ఇటువంటి ధైర్యమును ఉంచి నడిచేవారు అంతిమం వరకు ఇదే ధైర్యంలో ఉంటూ ఉంటారు. కావున ఇటువంటి ధైర్యవంతులైన పిల్లలకు ఎంతో కొంత సహాయం లభిస్తుంది. అందరి నుండి బుద్ధియోగాన్ని తొలగించి అంతిమంలో ఒక్కరి సృతిలో ఉండే పురుషార్థమును ఎవరైతే చేస్తారో వారికి సహాయం లభించిన కారణంగా పురుషార్థము సహజమైపోతుంది. స్కాలర్ షిప్ లభిస్తుందా, లభించదా అన్నది అంతిమం వరకు ధైర్యమును ఉంచడముపై ఆధారపడి ఉంది. ఎంతగా చాలా సమయం నుండి ధైర్యంతో ముందుకు నడుస్తూ ఉంటారో అంతగా వారు బహుకాలము లింక్ (సంబంధము) తెగిపోని కారణంగా త్వరగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఇప్పుడు కూడా కారణంగానైనా, అకారణంగానైనా చాలాకాలముగా ఉండవలసిన ధైర్యము యొక్క లింకు తెగిపోయినట్లయితే స్కాలర్ షిప్ తీసుకోవడం కష్టము. బహుకాలపు లింకు అంతిమం వరకు ఉన్నట్లయితే ఎక్స్ ట్రా సహాయం లభించగలదు. కావున ఇప్పుడు ఈ చివరి పాఠమును పక్కా చేయిస్తున్నారు. ఇప్పటివరకు టోటల్ రిజల్ట్ లో ఏమిచూశారు? సేవ సబ్జెక్టులో ఇంఛార్జ్ గాఅవ్వడం వస్తోంది కాని స్మృతి సబ్జెక్టులో బ్యాటరీని ఛార్జ్ చేసుకోవడం చాలా తక్కువగా వస్తోంది. అర్థమైందా! సాకారరూపంలో అనుభవం చూశారు కదా! సాకార రూపంలో సేవ యొక్క బాధ్యత అందరికన్నా ఎక్కువగా ఉండేది. పిల్లలలో వారికన్నా ఎంత తక్కువగా ఉంది! పిల్లలకు కేవలం సేవా డ్యూటీయే ఉంది కాని సాకార రూపంలో అయితే అన్ని డ్యూటీలు ఉండేవి! సంకల్పాల సాగరముగా ఉండేవారు, బాధ్యతల సంకల్పాలలో ఉండేవారు అయినా సాగరపు అలలను చూసేవారా లేక సాగరపు లోతులలో చూసేవారా? పిల్లలకు అలలలో తేలి ఆడడం వస్తుంది కాని లోతులలోకి వెళ్ళడం రావడంలేదు. అందుకు సహజ సాధనము - అభ్యాసము చేయండి అని ఇంతకుముందు కూడా వినిపించడం జరిగింది. ఇప్పుడిప్పుడే శబ్దంలోకి రావడం మళ్ళీ మాస్టర్ సర్వశక్తివంతుడిగా అయి ఇప్పుడిప్పుడే శబ్దం నుండి అతీతంగా వెళ్ళడం. ఇలా వెనువెంటనే చేసే అభ్యాసము చేయండి. ఎంత కార్య వ్యవహారంలో ఉన్నా మధ్యమధ్యలో ఒక్క క్షణమైనా కేటాయించి ఎంతగా అభ్యాసం చేస్తారో అంతగా ప్రత్యక్ష రూపము తయారవుతూ ఉంటుంది. అభ్యాసము తక్కువగా ఉంది, కావుననే ప్రాక్టికల్ రూపం లేదు. కాసేపు సాగరపు అలలలో ఉంటూ మరికాసేపు సాగరము లోతులలో వెళ్ళే అభ్యాసం చేయండి. పిల్లలలో ఎంతైతే,  సాహసం ఉందో అంతగానే సహనశక్తి కూడా ఉందా అన్న విశేషమైన విషయమును ఈరోజు పరిశీలిస్తున్నారు. సాహసమును ఉంచే శక్తి ఎంత ఉంది మరియు సహన శక్తి ఎంత ఉంది అన్నది చూస్తున్నారు. ఎంతెంతగా స్వయం పురుషార్థంలో సంతుష్టముగా మరియు స్పష్టంగా ఉంటారో అంతగానే ఇతరులు కూడా వారి ముందు స్పష్టంగా కనిపిస్తారు. ఇప్పుడు పరీక్ష కూడా జరిగింది, రిజల్టును కూడా వినిపించారు. పాండవుల విషయం మిగిలిపోయి ఉంది. బాప్ దాదా వద్ద పురుషార్థుల లైను ఎంతగా ఉంది! ఇతరులను చూడకుండా తమలైనును చూసుకుంటున్నారా లేక లైనును కూడా చూడకుండా మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారా?? ఒకటేమో, తీవ్ర పురుషార్థుల లైను, ఇంకొకటి - పురుషార్థుల లైను, మూడవది - గుప్త పురుషార్థులలైను, నాలుగవది - ఢీలా పురుషార్థుల లైను... మీరు ఏ లైన్ లో ఉన్నారో ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇక మీకే తెలియాలి అన్న పదమును వాడని సమయము త్వరగానే రాబోతోంది. మనందరికీ తెలుసు, ఎందుకంటే మనమంతా మాస్టర్ సర్వశక్తివంతులం కదా! శక్తులందరూ సమాన రూపంలోనే వెళతారు, మళ్ళీ మాస్టర్ సర్వశక్తివంతులుగా అయిపోతారు. బాబాకు అంతటి నిశ్చయము ఉంది. ఎవరైతే నిశ్చయబుద్ధి కలవారో వారు విజయులుగా ఉంటారు. బాబాపై మరియు స్వయంపై నిశ్చయబుద్ధి కలిగి ఉన్నట్లయితే విజయము ఎక్కడకు వెళుతుంది? నిశ్చయబుద్ధి కలవారి వెనుకనే విజయము వస్తుంది. వారు విజయము వెనుక పరిగెత్తరు, విజయము వారి వెనుక పరిగెత్తుతుంది. మేము విజయులుగా అవ్వాలి అన్న సంకల్పమును కూడా వారు త్యాగము చేసేస్తారు. ఇటువంటి సర్వస్వ త్యాగులుగా ఉన్నారా? సర్వస్వ త్యాగులు మరియు సర్వ సంకల్పాల త్యాగులు. కేవలం సర్వసంబంధాల త్యాగము కాదు, సర్వ సంకల్పాల నుండి కూడా త్యాగులుగా ఉండాలి. ఇదే సంపూర్ణ స్థితి. బాప్ దాదా ఏమి గమనిస్తున్నారు? విజయ సితారను చూస్తున్నారు. కావున బాప్ దాదాల లిస్ట్ లో మీరు విజయీ సితారలు. ఏ విధంగా ఇతర కార్యాలలో పరస్పర సహయోగులుగా ఉన్నారో అలాగే భవిష్యత్తులో కూడా పరస్పర సహయోగులుగా కనిపిస్తున్నారు. అలా అవ్వడం కాదు, కనిపిస్తున్నారు. అంతే సమీపంగా వస్తారు, ఎంతగా ఇప్పుడు శబ్దం చేస్తున్నారో మరియు అది చేరుతుందో అంతే సమీపంగా రానున్నది. ఇప్పుడు మీరు అన్ని విషయాలలో కొద్ది సమయంలో పూర్తిగా ఫాలో చేయాలి. చేస్తున్నారు మరియు ఇంకా చేస్తూనే ఉంటారు.

మీ మొట్టమొదటి సమూహమేదైతే తయారైందో వారేం చేస్తున్నారు? ఎందుకోసం ఆ సమూహాన్ని తయారు చేశారు? యజ్ఞమును సంభాళించడంతో పాటు సమూహంలో ఉండేవారు స్వయమును కూడా సంభాళించుకుంటున్నారా? ఎవరైతే స్వయమును సంభాళించుకుంటారో వారు యజ్ఞమును కూడా సంభాళిస్తారు. ఎవరైతే స్వయమును సంభాళించుకోలేరో వారు యజ్ఞమును కూడా సంభాళించలేరు. ఈ సమూహంలో ఏమేమి చేయాలి అన్నది వారికి కూడా స్పష్టంగా లేదు. కావున ఎప్పుడైతే సహజమవ్వగలదో అప్పుడు సహచరులను కూడా పిలవండి. ఎప్పుడైతే మీరు పిలుస్తారో అప్పుడు బాప్ దాదా వస్తారు. బాప్ దాదాకు రావడంలో సమయముపట్టదు. మీ గ్రూప్ ను ఎప్పుడైనా పరిశీలించుకున్నారా? పాండవుల గ్రూపు మరియు శక్తుల గ్రూపు. వీరు సర్వీసబుల్ గ్రూపు. కాని, పాండవుల గ్రూపు మరియు యజ్ఞ మాతల గ్రూపు వారి స్థితిగతులేమిటి? ముఖ్య కేంద్రాలకు సమీపంగా రావడం ద్వారా వారి పాలనను చేయగలరు. ఈ గ్రూపుకు తమ కర్తవ్యము ఉంది. కేవలం 8 రోజులది కాదు (సమ్మేళనము రిజల్టు). భట్టీ రిజల్టును ఏదైతే తెలియజేశారో అదే సమ్మేళనపు రిజల్టు కూడా. నాలుగు శక్తులు సమానంగా ఉండాలి. వాటిలో 25 శాతం లోటును గూర్చి వినిపించారు కదా! అర్థమైందా! పాస్ విత్ హానర్ గా అయితే మరి ఏమైపోతుందో తెలియదు! అందరూ సమానంగా వచ్చేస్తారు. ఇప్పుడు కేవలం శబ్దం వినిపించారు, గర్జన చేయలేదు. దీనికోసం నాలుగు శక్తులలో సమానత కావాలి అన్న యుక్తిని కూడా తెలియజేయడం జరిగింది. ఒక్కోసారి ఒక్కో శక్తి యొక్క విశేషత, కాని నాలుగు శక్తులను సమానంగా ఉంచుకొని సేవ చేయడం ద్వారా అది గర్జన అవుతుంది. అలా గర్జన జరగకపోవడానికి కూడా కారణముంది. సమ్మేళనం గూర్చి చెప్పడం లేదు కాని, పూర్తిగా శబ్దం వెలువడుతోంది కాని గర్జన వెలువడడంలేదు. శబ్దం వ్యాపిస్తోంది. నిదురించేవారిని లేపలేదు, కేవలం పక్కకు తిప్పారు. ఇలా గర్జన అవ్వకపోవడానికి కారణం ఏమిటో చెప్పండి. ఎప్పుడైతే ఏదైనా విషయాన్ని వారు అంగీకరించరో అప్పుడే అది గర్జన అవుతుంది. ఇప్పుడేమౌతుంది? అవి స్టూలమైనా లేక సూక్ష్మమైనా, అనేక విషయాలను స్వీకరిస్తున్నారు! ఎప్పుడైతే ఏదైనా సంకల్పంలోనైనా స్వీకరించనప్పుడు, అంగీకరించనప్పుడు అది గర్జన అవుతుంది. ఇప్పుడు అందరూ మిక్స్ గా ఉన్నారు, కాబట్టి రిజల్టు కూడా మిక్సయిపోయింది. ఏదైతే కల్పపూర్వం ఫిక్సయిన రిజల్టుగా ఉందో అది ఇప్పుడు లేదు. అలా ఫిక్సయిన దానిని గూర్చి కూడా మీకు తెలుసు. ఇప్పుడు మిక్సయి ఉన్నారు. అర్థమైందా!' నేను ఇలా ఉన్నాను. నేను సర్వీసబుల్ గా ఉన్నాను... నేను మహారధిని, నేను ఇది చేస్తున్నాను. ఇది చేశాను... అన్న నేను అన్నది కూడా స్వీకరించకూడదు. ఈ అన్ని విషయాలలోను నేను, నేను అన్నదానిని తొలగించి "బాబా బాబా" అన్న పదమును తీసుకువచ్చినప్పుడు అది సింహనాదం అవుతుంది. పరమాత్మలోనే పరమ శక్తి ఉంటుంది. ఆత్మలలో యథాశక్తి ఉంటుంది, కావున బాబా అని అనడం ద్వారా పరమ శక్తి వస్తుంది. నేను అని అనడం ద్వారా బలము యథాశక్తిగానే వస్తుంది. కావున రిజల్టు కూడా యథా శక్తిగానే ఉంటుంది. ఇప్పుడు భాష కూడా మారాలి. సాకార రూపంలో అన్నీ చూపించారు. నేను దీనిని నడుపుతున్నాను, నేను మురళి బాగా వినిపించాను అని ఎప్పుడైనా అన్నారా? నేను సేవ చేశాను, నేను పిల్లలకు టచింగ్ ఇచ్చాను అని ఎప్పుడైనా అన్నారా! ఇలాంటిది స్వీకరించడం కూడా అంతమైపోవాలి, దీనినే ఏ ప్రతిజ్ఞనైతే చేశారో దానిని నిర్వర్తించడము అని అంటారు. మీపై బలిహారమవుతాము, మీకోసం సురణిస్తాము, అంతమౌతాము అని మీరు ఒక గీతమును గానం చేసేవారు.... అది గుర్తొస్తోందా! ఇలా మరణించడం అని దేనిని అంటారు? నేను అన్న దానిని అంతం చేయడమే మరణించడము, అంతమవ్వడము. అంగీకరించకపోతే మీరు సింహనాదం చేయగలరు. ఏ విషయమునూ నిందా-స్తుతిని, నాదీ- నీది, నేను-నువ్వు... దేనినీ స్వీకరించనప్పుడు అది సింహనాదమౌతుంది. మీరు మనస్సులో సంకల్పమును తరువాత చేస్తారు, మీ మనస్సులో సంకల్పం ఉత్పన్నమవ్వగానే అక్కడకు చేరుకుంటుంది. ఎందుకు ముందే చేరుకుంటుంది? ఇది కూడా గుహ్యమైన చిక్కు ప్రశ్న. మీరు మనస్సులో ఏ సంకల్పమునైతే చేస్తారో అది మీ మనస్సులోకి తరువాత వస్తుంది, అంతకన్నా ముందే బాప్ దాదాల ముందు స్పష్టమైపోతుంది, ఎందుకంటే సంపూర్ణంగా అవ్వడం ద్వారా డ్రామాలోని ప్రతి దృశ్యము స్పష్టంగా కనిపిస్తుంది. కావున డ్రామాలో రచింపబడినదానిని ముందే స్పష్టంగా చూడగలుగుతారు. కావున భవిష్యత్తును చూసి ముందే మాట్లాడుతారు. ముందే చేరుకున్నట్లుగా ఉంటారు! మళ్ళీ ఎప్పుడైతే మీరు పాత్రను అభినయిస్తారో అప్పుడు బాప్ దాదా కూడా పాత్రను పోషిస్తారు. మీరు ఆత్మిక సంభాషణ చేస్తారు. మీరు ఆత్మిక సంభాషణ చేసే పాత్రను పోషిస్తారు, బాప్ దాదా దానిని వినే పాత్రను పోషిస్తారు, అర్థమైందా! ఎవరు ఎలా ఉన్నారో అలా స్వయమును గూర్చి తెలుసుకోలేకపోయినా వారిని గూర్చి బాప్ దాదా తెలుసుకోగలరు. కావున ఇప్పుడు ఈ నాలుగు శక్తులను సమానతలోకి తీసుకురావాలి, అప్పుడు సాకారుని సమానంగా అయిపోతారు. ఎంతగా సంస్కారాలను సమానతలోకి తీసుకువస్తారో అంతగానే సమీపంగా వస్తారు. ఏ సంస్కారాలు? సాకారరూపపు సంస్కారాలు. అతీతంగా ఉండే సాక్షీద్రష్టాగా ఉండే సంస్కారాలు సాకారుని సంపూర్ణ స్థితి యొక్క శ్రేష్ఠ లక్షణంగా ఉండేవి. ఈ సంస్కారాలలో సమానతను తీసుకురావాలి. ఈ గుణాల ద్వారా సర్వుల హృదయాలపై విజయులుగా అవుతారు. ఎవరైతే సంగమ యుగంలో సర్వుల హృదయాలపై విజయులుగా అవుతారో వారే భవిష్యత్తులో విశ్వమహారాజులుగా అవుతారు. విశ్వంలో సర్వులు వచ్చేస్తారు కావున బీజమును ఇక్కడ నాటాలి మరియు ఫలమును అక్కడ తీసుకోవాలి. అచ్ఛా!

Comments

  1. ఓంశాంతి, సంపూర్ణ స్థితికి గుర్తు ఏమి? సాక్షాత్కారం ఎప్పుడు అవుతుంది? సదా స్పష్టంగా ఎవరు ఉంటారు? చదువు యొక్క అంతిమ స్థితి ఏది? స్పష్టం అవ్వటం అంటే ఏమిటి? ఈ విషయాలన్నీ బాప్ దాదా ఈ అవ్యక్తమురళిలో తెలిపించారు. శివబాబా యాద్ హై?

    ReplyDelete

Post a Comment