02-02-1976 అవ్యక్త మురళి

02-02-1976         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

బాబాకి స్నేహి అయిన దానికి గుర్తు - ఫరిస్తా స్వరూపంగా అవ్వటం.

                  ఫరిస్తా స్థితి యొక్క యోగ్యతలు నింపేవారు, సర్వ గుణాల భండారా అయిన శివబాబా మాట్లాడుతున్నారు -
                       సదా మీ భవిష్యతు ఎదురుగా ఉంటుందా? ఎంతెంత నిమిత్తంగా అయిన టీచర్ భవిష్యత్తుని ఎదురుగా పెట్టుకుంటారో అంతగా ఇతరాత్మలకు కూడా తమ భవిష్యత్తులో తయారుచేసుకునే ప్రేరణను ఇవ్వగలరు. మీ భవిష్యత్తు స్పష్టంగా లేకపోతే ఇతరులకు కూడా స్పష్టంగా తయారుచేసుకునే మార్గం చెప్పలేరు. మీ భవిష్యత్తు స్పష్టంగా ఉందా? మహారాజుగా లేదా మహారాణిగా ఏదైనా అవ్వండి. కానీ దాని కంటే ముందు భవిష్యత్తు కర్మాతీతంగా, ఫరిస్తాగా అవ్వటం. అది ఎదురుగా స్పష్టంగా ఉందా? ఇలా అనుభవం అవుతుందా - నేను ప్రతీ కల్పంలో ఫరిస్తా స్వరూపంలో ఈ పాత్ర అభినయించాను మరియు ఇప్పుడు కూడా అభినయిస్తానని, ఆ మెరుపు ఎదురుగా వస్తుందా? ఎలాగైతే అద్దంలో మీ స్వరూపం యొక్క మెరుపు చూసుకుంటారో అలాగే జ్ఞానం అనే దర్పణంలో మీ పురుషార్ధం ద్వారా ఫరిస్తా స్థితి యొక్క మెరుపు స్పష్టంగా కనిపిస్తుందా? ఎప్పటి వరకు ఫరిస్తా స్థితి యొక్క మెరుపు స్పష్టంగా కనిపించదో అప్పటి వరకూ భవిష్యత్తు కూడా స్పష్టమవ్వదు. బహూశా నేను ఇలా అవ్వచ్చునేమో లేదా అలా అవ్వచ్చునేమో అనే సంకల్పాలు వస్తాయి. కానీ ఫరిస్తా స్థితి యొక్క మెరుపు స్పష్టంగా కనిపిస్తే అది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి అది కనిపిస్తుందా లేక ఇంకా పరదాలో ఉందా? చిత్రాన్ని విడుదల చేసినట్లుగా మీ ఫరిస్తా స్వరూపం యొక్క విడుదల ఎప్పుడు చేస్తారు? మీరే చేస్తారా లేక ముఖ్య అతిథిని పిలుస్తారా? పురుషార్థం యొక్క బలహీనత అనే పరదాని తొలగిస్తే ఫరిస్తా రూపం స్పష్టంగా కనిపిస్తుంది.
                ఇప్పుడు నడుస్తూ, తిరుగుతూ సాకార బాబాని చూసినట్లుగా అనుభవం చేసుకోవాలి. సాకార బాబా ద్వారా నడుస్తూ, తిరుగుతూ ఫరిస్తా స్వరూపం లేదా భవిష్య రూపం అనుభవం చేసుకునేవారు, అప్పుడే ఇతరులకి కూడా అనుభవం అయ్యేది. నేను టీచర్ని, నేను సేవాధారిని అని అనుకుంటున్నారు. అంటే ఎలాంటి సమయమో అలాంటి స్వరూపంగా అవుతున్నారు. కాని ఇప్పుడు స్వయాన్ని ఫరిస్తా రూపంలో అనుభవం చేసుకోండి, అప్పుడే సాక్షాత్కారం అవుతుంది. సాక్షాత్కార రూపం ఏది? ఫరిస్తా రూపంగా అవ్వటం. నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా స్వరూపం. ఒకవేళ సాక్షాత్తు ఫరిస్తాగా కానట్లయితే సాకాత్కారం ఎలా చేయించగలరు? కనుక టీచర్స్ కోసం ఇప్పుడు విశేష పురుషార్థం ఏమిటి? ఫరిస్తాను నేను, సేవార్థం ఈ సాకార సృష్టికి వచ్చాను, ఫరిస్తా కనిపిస్తుంది మరలా మాయం అయిపోతుంది. ఫరిస్తా ఎల్లప్పుడూ ఈ సృష్టిలోనే ఉండిపోదు. కర్మ చేసేస్తుంది మరలా మాయం అయిపోతుంది. ఎప్పుడైతే ఇలా ఫరిస్తాగా అయిపోతారో అప్పుడు ఈ దేహం మరియు దేహ సంబంధం లేదా పురాతన ప్రపంచ పాదం ఉండదు. మేము బాబాకి స్నేహీ అని అంటున్నారు. కానీ బాబా సూక్ష్మవతన వాసి. మీరేమో రోజంతా స్థూలవతన వాసిగా ఉంటే బాబాకి స్నేహీ ఎలా అయ్యారు? కనుక సూక్ష్మవతనవాసి ఫరిస్తాగా అవ్వండి. సర్వ ఆకర్షణలు, తగుల్పాటుల యొక్క సంబంధ మార్గాలను బంద్ చేసేయండి. అప్పుడే బాబాకి స్నేహీ అని అంటారు. ఇక్కడ ఉంటూ కూడా ఉండకూడదు. ఇదే అంతిమ స్థితి. విశేష సేవార్థం నిమిత్తం అయ్యారు. కనుక పురుషార్థం కూడా విశేషంగా చేయాలి. నడుస్తూ, తిరుగుతూ మీరు ఫరిస్తా వలె ఇతరులు అనుభవం చేసుకుంటేనే అది ఇతరులకు కూడా ప్రేరణనిస్తుంది. ఒకవేళ సాకార సృష్టి నుండి అతీతంగా అయిపోతే చిన్న చిన్న విషయాలలో సమయం వ్యర్ధంగా పోవటం అనేది ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం దుమకాలి (హై జంప్). సాకారి సృష్టి నుండి ఒకేసారి ఫరిస్తాగా ఫరిస్తా ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి. దానినే దుమకటం అని అంటారు. కనుక చిన్న చిన్న విషయాలు శోభించవు. ఇది బాబా యొక్క విశేష బహుమతి. బహుమతి తీసుకోవటం అంటే ఫరిస్తా స్వరూపంగా అవ్వటం. కాబట్టి బాబా కూడా ఫరిస్తా స్వరూపం యొక్క చిత్రాన్ని బహుమతిగా ఇస్తున్నారు. ఈ బహుమతితో పాత విషయాలన్నీ సమాప్తి అయిపోతాయి. ఎందుకు? ఏమిటి? అని అనకూడదు. నిర్ణయ శక్తి, పరిశీలనా శక్తి, పరివర్తనా శక్తి ఈ మూడు శక్తులు ఉంటే ఒకరికి ఒకరు శుభవార్త చెప్పగలరు. ఒకవేళ స్వయంలోనే పరివర్తన లేకపోతే ఇతరులలో కూడా పరివర్తన తీసుకురాలేరు.

ప్రశ్న :- ఏ ప్లానుని  అయినా అమలులోకి తీసుకురావాలంటే విశేషంగా ఏ శక్తి అవసరం?
జవాబు :- పరివర్తనా శక్తి, ఎప్పటి వరకూ పరివర్తన చేసుకునే శక్తి రాదో అప్పటివరకూ చేసిన నిర్ణయాన్ని అమలులోకి తీసుకురాలేరు. ఎందుకంటే ప్రతీ స్థానంలో, ప్రతీ స్థితిలో స్వయం పట్ల అయినా కానీ, సేవ గురించి అయినా పరివర్తన తప్పక చేసుకోవాలి. ఏవిధంగా అయితే సఫలతామూర్తులుగా అయ్యేటందుకు స్వభావ సంస్కారాలు పరివర్తన చేసుకోవలసి ఉంటుందో అదేవిధంగా సేవలో మీ సంకల్పాలను (ఆలోచనల) అక్కడక్కడ పరివర్తన చేసుకోవలసి ఉంటుంది. పరివర్తనా శక్తి ఉన్నవారు ఎటువంటి పరిస్థితిలోనైనా సఫలులు అయిపోతారు. ఎందుకంటే వారు బహురూపీగా ఉంటారు. ప్లాన్స్ ని  సేవలోకి తీసుకువస్తారు మరియు పాయింట్స్  జీవితంలోకి తీసుకువస్తారు. ఈ రెండింటి కోసం పరివర్తనా శక్తి కావాలి. జ్ఞానవంతులుగా ఉన్నారు. అందువలన ఇది ఇలా అవ్వాలి అనే నిర్ణయం చేస్తున్నారు. కానీ పరివర్తన కాలేకపోతున్నారు. దీనికి కారణం పరివర్తనా శక్తి లోపం. ఎవరిలో పరివర్తనా శక్తి ఉంటుందో వారు అందరికీ స్నేహీగా ఉంటారు మరియు సదా సఫలులుగా ఉంటారు. సంకల్పంలో దృఢత తీసుకువస్తే ప్రత్యక్షఫలం లభిస్తుంది. పరివర్తన చేసుకుని సఫలులుగా అవ్వాల్సిందే, ఇదే ధృఢసంకల్పం. సఫలత సఫలతామూర్తులని ఆహ్వానం చేస్తుంది, సఫలతామూర్తులు వస్తే నేను వారి కంఠహారంగా అయిపోతానని. మంచిది.

Comments