02-02-1972 అవ్యక్త మురళి

* 02-02-1972         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

ప్రీతి బుద్ది ఆత్మల యొక్క గుర్తులు.

అందరూ అవ్యక్త రూపంలో స్థితులై ఉన్నారా? అవ్యక్త మిలనము అవ్యక్త స్థితిలో స్థితులై ఉండడం ద్వారానే చేయగలుగుతారనైతే మీకు తెలుసు. అవ్యక్త స్థితిలో స్థితులయ్యే అనుభవీమూర్తులుగా ఎంతవరకు అయ్యాము అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అవ్యక్త స్థితిలో స్థితులై ఉండేవారి ప్రతి సంకల్పము, ప్రతి కార్యము సదా అలౌకికముగా ఉంటుంది. ఈ విధంగా అవ్యక్త భావంలో, వ్యక్త దేశము మరియు కర్తవ్యములో ఉంటూ కూడా కమలపుష్ప సమానంగా అతీతంగా మరియు ఒక్క బాబాకు సదా ప్రియముగా ఉంటారు. ఈ విధంగా అలౌకిక అవ్యక్త స్థితిలో సదా ఉండేవారిని అల్లాకు చెందినవారు అని అంటారు. ఇతర టైటిళ్ళు కూడా ఉన్నాయి. ఇటువంటివారినే ప్రీతి బుద్ధి కలవారు అని అంటారు. మీరు ప్రీతి బుద్ధి  మరియు విపరీత బుద్ధి ఈ రెండింటి యొక్క అనుభవజ్ఞులుగా ఉన్నారు, కావుననే మీరు వినాశకాలే ప్రీతి బుద్ధి గల పాండవుల విజయంతి మరియు వినాశకాలే విపరీతబుద్ధి వినశ్యంతి అన్న ముఖ్య స్లోగన్ ను వ్రాస్తారు. ఈ స్లోగన్ ను రోజంతటిలో ఎంత సమయము ప్రీతిబుద్ధిగలవారిగా అనగా విజయులుగా అవుతున్నాము మరియు ఎంత సమయము విపరీత బుద్ధులుగా అవ్వడం ద్వారా ఓటమిని పొందుతున్నాము అని మీతో మీరు జోడిస్తున్నారా? మాయతో ఓడిపోయినప్పుడు మరి మీరు ప్రీతిబుద్ధి కలవారేనా? ప్రీతి బుద్ధి అనగా విజయులు. వినాశకాలంలో విపరీతబుద్ధి కలవారిగా అవ్వకండి, ప్రీతిబుద్ధి కలవారిగా అవ్వండి అని ఇతరులకు వినిపించేటప్పుడు మరి ఈ సమయంలో మేము ప్రీతిబుద్ధి కలవారిగా ఉన్నామా లేక విపరీతబుద్ధి కలవారిగా ఉన్నామా అని మిమ్మల్ని మీరు కూడా చూసుకుంటున్నారా? ప్రీతిబుద్ధి కలవారు ఎప్పుడూ శ్రీమతానికి విరుద్ధంగా ఒక్క సంకల్పమును కూడా చేయజాలరు. శ్రీమతానికి విరుద్ధంగా సంకల్పాలు లేక మాటలు లేక కర్మలు జరుగుతున్నట్లయితే మరి వారిని ప్రీతిబుద్ధి కలవారు అని అంటారా? ప్రీతి బుద్ధి అనగా బుద్ధి యొక్క లగనము లేక ప్రీతి ఒక్క ప్రియునితో సదా జోడింపబడి ఉండాలి. ఎప్పుడైతే ఒక్కరితో సదా ప్రీతి ఉంటుందో అప్పుడు ఇతర వ్యక్తులు లేక వైభవాలతో ప్రీతి జోడింపబడజాలదు. ఎందుకంటే ప్రీతిబుద్ధి అనగా సదా బాప్ దాదాలను తమ సన్ముఖంగా వారు అనుభవం చేసుకుంటారు. ఎప్పుడైతే బాబా సదా సన్ముఖంగా ఉంటారో అప్పుడు ఇలా సన్ముఖంగా ఉండేవారు ఎప్పుడూ విముఖంగా అవ్వజాలరు. విముఖంగా అవుతున్నారు అంటే బాబా సన్ముఖంగా లేనట్లే. ప్రీతి బుద్ధి కలవారు ఎల్లప్పుడూ బాబా సన్ముఖంగా ఉన్న కారణంగా వారి ముఖము నుండి, వారి హృదయం నుండి ఎల్లప్పుడూ మీతోనే కలిసి తింటాము, మీతోనే కలిసి కూర్చుంటాము, మీ నుండే వింటాము, మీతోనే సర్వసంబంధాలను నిర్వర్తిస్తాము, మీ నుండే సర్వప్రాప్తులను పొందుతాము అని అంటారు. వారి నయనాలు, వారి ముఖము ఏమి మాట్లాడకుండా కూడా మాట్లాడుతాయి. కావున ఈ విధంగా వినాశకాలంలో ప్రీతి బుద్ధి కలవారిగా అయ్యారా? అనగా ఒక్కరి లగనంలో ఏకరస స్థితి కలవారిగా అయ్యారా? ఏ విధంగా సాకార రూపంలో, సాకార దేశంలో, కర్మభూమిలో సన్ముఖంగా వచ్చినప్పుడు ఎలాగైతే విన్నారో అలాగే సదా ప్రీతి బుద్ధి యొక్క అనుభవమును పొందుతారు కదా! అనుభవాన్ని వినిపిస్తారు కదా! అలాగే బుద్ధియోగము ద్వారా సదా బాప్ దాదాల సన్ముఖంగా ఉండే అభ్యాసము చేసినట్లయితే మరి సదా ప్రీతి బుద్ధి కలవారిగా అవ్వలేరా? ఎవ్వరి సన్ముఖంగానైతే సదా బాప్ దాదా ఉంటారో, ఏ విధంగా సూర్యుడిని చూడడం ద్వారా సూర్యుని కిరణాలు తప్పకుండా వస్తాయో అదేవిధంగా జ్ఞాన సూర్యుడైన బాబాకు సదా సన్ముఖంగా ఉన్నట్లయితే జ్ఞాన సూర్యుని సర్వగుణాల కిరణాలను స్వయములో అనుభవమవ్వవా! జ్ఞాన సూర్యుని కిరణాలు కోరుకోకపోయినా స్వయములో ధారణ అవుతున్నట్లుగా అనుభవం చేసుకుంటారు. కాని, అది కూడా ఎప్పుడైతే సదా బాబాకు సన్ముఖంగా ఉంటారో అప్పుడు అనుభవం చేసుకుంటారు. ఎవరైతే సదా బాబాను సన్ముఖంగా అనుభవం చేసుకుంటారో వారి ముఖముపై ఏమి కనిపిస్తుంది? దానిద్వారా వీరు సదా బాబా సన్ముఖంగా ఉన్నారని మీరు స్వయమే అర్థం చేసుకోగలుగుతారు. ఎవరైతే సాకారంలో కూడా  సన్ముఖంగా ఉంటారో వారి ముఖముపై ఏమి ఉంటుంది? సాకారంలో సన్ముఖంగా ఉండే అనుభవమును సహజంగా పొందగలుగుతారు. ఇది చాలా పాత పదము. రివైజ్ కోర్సు నడుస్తోంది కదా! కావున పాత పదాలు కూడా రివైజ్ అవుతున్నాయి, ఇది కూడా బుద్ధి యొక్క డ్రిల్లు, బుద్ధిలో మననం చేసే శక్తి వచ్చేస్తుంది. అచ్చా!  ఒకటేమో వారి ముఖముపై అంతర్ముఖత యొక్క లేక అంతర్ముఖి స్థితి యొక్క ప్రకాశము ఉంటుంది మరియు ఇంకొకటి తమ సంగమ యుగం యొక్క మరియు భవిష్యత్తు యొక్క సర్వస్వమానాల ప్రకాశమూ ఉంటుంది. అర్థమైందా? ఒకటేమో ప్రకాశము కనిపిస్తుంది, ఇంకొకటి నషా కనిపిస్తుంది. కావున ఈ విధంగా ఎల్లప్పుడూ కేవలం ప్రకాశమే కాదు నషా కూడా కనిపించాలి. హర్షితముఖతతో పాటు అంతర్ముఖత కూడా కనిపించాలి. ఇటువంటివారినే సదా బాబా సన్ముఖంలో ఉండే ప్రీతిబుద్ధి కలవారు అని అంటారు. ఈ తనువు ఏ సమయంలోనైనా వినాశనమవ్వవచ్చు అన్న స్మృతి సదా ఉన్నట్లయితే ఈ వినాశకాలము స్మృతిలో ఉండడం ద్వారా ప్రీతి బుద్ధి కలవారిగా స్వతహాగా అయిపోతారు. వినాశకాలము ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అజ్ఞానులు కూడా బాబాను స్మృతిచేసే ప్రయత్నము తప్పకుండా చేస్తారు. కాని, పరిచయము లేకుండా ప్రీతి జోడింపబడదు. ఇది అంతిమ ఘడియ, అంతిమ జన్మ కాదు అంతిమ ఘడియ అని సదా గుర్తున్నట్లయితే ఇంకేమీ గుర్తుకురావు. మరి ఈవిధంగా సదా ప్రీతి బుద్ధి కలవారిగా ఉన్నారా? శ్రీమతానికి విరుద్ధంగా అయితే నడవడం లేదు కదా! మనసులో కూడా శ్రీమతానికి విరుద్ధంగా వ్యర్థ సంకల్పాలు లేక వికల్పాలు కలుగుతున్నట్లయితే మరి వారిని ప్రీతిబుద్ధి కలవారు అని అంటారా? ఈ విధంగా సదా ప్రీతిబుద్ధిగలవారిగా ఉండేవారు విజయీరత్నాలుగా అవ్వగలుగుతారు. విజయీరత్నాలుగా అయ్యేందుకు స్వయమును సదా ప్రీతి బుద్ధి కలవారిగా చేసుకోండి, లేకపోతే ఉన్నత పదవిని పొందేందుకు బదులుగా తక్కువ పదవిని పొందేందుకు అధికారులుగా అయిపోతారు. కావున అందరూ స్వయమును విజయీ రత్నాలుగా భావిస్తున్నారా? ఎక్కడా ఎవ్వరితోను ప్రీతి ఉండకూడదు, లేకపోతే విపరీతబుద్ధి కలవారి లిస్ట్ లోకి వచ్చేస్తారు. ఏ విధంగా ప్రదర్శినిలో సంగమయుగపు చిత్రం ముందు నిలుచోబెట్టి ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు మరియు మీరు ఎవరు అని అడుగుతారు కదా! సంగమయుగ చిత్రం ముందు నిలుచోబెట్టి ఎందుకు అడుగుతారు? ఎందుకంటే సంగమము ఉన్నతోన్నతమైన స్థానము లేక యుగము. అదేవిధంగా స్వయమును ఉన్నతోన్నతమైన స్థితిలో నిలుచోబెట్టి, మరి నేను సదా ప్రీతిబుద్ధి కలిగి ఉన్నానా లేక అప్పుడప్పుడు ప్రీతిబుద్ధిగా అవ్వడం లేదా అని పరిశీలించు కోవాలి. అనగా ఎక్కడో అక్కడ సూక్ష్మరూపంలో లేక స్థూలరూపంలో ఎవరితోనైనా, ఎక్కడైనా ప్రీతి జోడింపబడి ఉన్నట్లయితే వర్తమాన సమయంలో చదువు యొక్క కోర్సు సమాప్తమై రివైజ్ కోర్సు నడుస్తున్న సమయంలో పరీక్షా సమయం ఎంత సమీపంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఏ విధంగా ఈ రోజుల్లో ఆ గవర్నమెంట్ కూడా మధ్యమధ్యలో పరీక్ష తీసుకుంటూ ఆ మార్కులను ఫైనల్ పరీక్షలో జమ చేస్తుందో అదేవిధంగా వర్తమాన సమయంలో మీరు ఏ కర్మలనైతే చేస్తారో అవన్నీ ప్రాక్టికల్ పరీక్షలుగా వ్రాస్తున్నారని అర్థం చేసుకోండి మరియు ఈ సమయం యొక్క పరీక్ష రిజల్టు ఫైనల్ పరీక్షలో జమ అవుతుంది. ఇప్పుడు ఇంకొద్ది సమయంలో ఏ వికర్మ చేసేవారికైనా సూక్ష్మరూపంలో శిక్షల అనుభవము కలుగుతుంది అన్నది అనుభవం చేసుకుంటారు. ఏవిధంగా ప్రీతిబుద్ధి కలవారు నడుస్తూ తిరుగుతూ బాబా యొక్క మరియు బాబా చరిత్రలు మరియు కర్తవ్యాల స్మృతిలో ఉన్న కారణంగా బాబా మిలనమును ప్రత్యక్షంగా అనుభవం చేసుకుంటారో అలాగే, విపరీతబుద్ధి కలవారు విముఖంగా ఉన్న కారణంగా సూక్ష్మ శిక్షలను అనుభవం చేసుకుంటారు. కావున  బాప్ దాదా ముందే వినిపిస్తున్నారు, ఆ శిక్షల అనుభవము చాలా కఠినంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ ఆత్మ శిక్షలను అనుభవిస్తోంది అని వారి ముఖము ద్వారా అందరూ అర్థం చేసుకుంటారు. వారు ఎంతగా దాచేందుకు ప్రయత్నించినా గాని దాచలేరు. ఆ ఒక్క క్షణకాలపు శిక్ష అనేక జన్మల దుఃఖాన్ని అనుభవం చేయించేదిగా ఉంటుంది. ఏ విధంగా బాబాకు సన్ముఖంగా రావడం ద్వారా ఒక్క క్షణకాలపు  మిలనము ఆత్మ యొక్క అనేక జన్మల దాహార్తిని తీర్చివేస్తుందో అలాగే విముఖంగా అయ్యేవారికి కూడా అనుభవమవుతుంది. మళ్ళీ ఆ శిక్షల నుండి విముక్తులై తమ ఆ స్థితిలోకి వచ్చేందుకు ఎంతో కష్టపడవలసి  వస్తుంది. కావున ఇప్పుడు పరీక్షా సమయము కొనసాగుతోందని ముందే వార్నింగ్ ఇస్తున్నారు. కావున ఈ కర్మకు ఇంతటి గుహ్యమైన గతి ఉంటుందని మాకేమి తెలుసు అని మళ్ళీ ఫిర్యాదు చేయకండి. కావున సూక్ష్మ శిక్ష నుంచి రక్షించుకునేందుకు మీ నుండి మీరే సదా అప్రమత్తంగా ఉండండి. ఇప్పుడిక పొరపాట్లు చేయకండి. కొద్దిగా పొరపాటు చేసినా ఒకటికి వంద రెట్ల లాభమూ లభిస్తుంది, ఒకటికి వంద  రెట్ల దండన కూడా లభిస్తుంది. ఇప్పుడిక ఈ మాటలు ప్రాక్టికల్ గా అనుభవమవ్వనున్నాయి. కావున సదా బాబా సన్ముఖంగా, సదా ప్రీతిబుద్ధి కలవారిగా అయి ఉండండి. అచ్ఛా!

సదా సన్ముఖంగా ఉండే అదృష్టతారలకు బాప్ దాదా కూడా నమస్కరిస్తారు. అచ్ఛా!

Comments