01-12-1971 అవ్యక్త మురళి

* 01-12-1971         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

     “సర్వశక్తుల సంపత్తివంతులుగా అవ్వండి".

            విదేహీ, విదేశీ అయిన బాప్ దాదా పిల్లల సమానంగా దేహమును ఆధారంగా తీసుకొని దేశాన్ని బట్టి అటువంటి వేషాన్ని ధారణ చేయవలసి వస్తుంది. విదేహిని కూడా స్నేహీ, శ్రేష్ఠ ఆత్మలు తమ స్నేహంతో తమలా తయారయ్యేందుకు ఆహ్వానమును ఇస్తారు మరియు బాబా పిల్లల ఆహ్వానమును స్వీకరించి కలుసుకునేందుకు వస్తారు. ఈ రోజు బాబా కూడా పిల్లలందరికీ ఆహ్వానమును ఇచ్చేందుకు వచ్చారు. అది ఏ ఆహ్వానమో మీకు తెలుసా? ఇప్పుడు ఇంటికి వెళ్ళేందుకు పూర్తి ఏర్పాట్లు చేసుకున్నారా లేక ఇప్పుడు ఇంకా చేయాలా? ఇప్పుడు ఏర్పాట్లు చేస్తారా? ఏర్పాట్లు చేసేందుకు ఎంత సమయం పడుతుంది? ఈ క్రొత్త పూలతోట విశేషంగా నవీనతను చూపించాలి. క్రొత్తవారిమైన మేము ఏమి చేయగలము అనైతే భావించడం లేదు కదా! ఈ పురుషోత్తమ శ్రేష్ఠ సంగమయుగ సమయము తక్కువైపోతోంది అన్న స్మృతిని సదా ఉంచండి. ఈ కొద్ది సంగమ సమయమునకు వరదాత ద్వారా వరదానము లభించింది - ఏ ఆత్మ అయినా తమ తీవ్ర పురుషార్థం ద్వారా ఎంతగా వరదాత ద్వారా వరదానమును తీసుకోవాలనుకుంటే అంతగా తీసుకోవచ్చు. కావున క్రొత్త క్రొత్త పువ్వులెవరైతే సమ్ముఖంగా కూర్చున్నారో, సమ్ముఖముగా వచ్చిన పూలతోటలోని వారు ఎలా కావాలనుకుంటే అలా, ఎంత సమయంలో కావాలనుకుంటే అంత సమయంలో వరదాత అయిన బాబా ద్వారా వరదాన రూపంలో వారసత్వమును పొందగలరు. కావున విశేషంగా వరదాతకు ఈ క్రొత్త పూలతోటపై, స్నేహీ ఆత్మలపై విశేష స్నేహము మరియు సహయోగము ఉన్నాయి. ఈ బాబా యొక్క సహయోగమును సహజయోగ రూపంలో ధారణ చేస్తూ ముందుకు వెళ్ళండి. ఇదే వరదానము కొద్ది సమయంలో హైజంప్ ఇవ్వగలదు. కేవలం సదా, ఆత్మనైన నాకు ఈ డ్రామాలో విశేష పాత్ర ఉంది అన్న స్మృతిని సదా గుర్తు ఉంచుకోండి. అది ఏమిటి? సర్వశక్తివంతుడైన తండ్రి సహయోగిగా ఉన్నారు. ఎవరికైతే సర్వశక్తివంతుడైన తండ్రి సహయోగిగా ఉన్నారో వారు హైజంప్ చేయలేరా? సహయోగమును సహజయోగంగా మార్చండి. యోగ్యుడైన తండ్రికి సహయోగిగా అవ్వాలి, ఇదే యోగయుక్త స్థితి కదా! ఎవరైతే నిరంతర యోగిగా ఉంటారో వారి ప్రతి సంకల్పము, శబ్దము మరియు కర్మ బాబా యొక్క లేక తమ రాజ్యం యొక్క స్థాపనా కర్తవ్యంలో సదా సహయోగిగా ఉండే విధంగానే కనిపిస్తుంది. వారినే జ్ఞానీ ఆత్మ, యోగీ ఆత్మ మరియు సత్యమైన సేవాధారి అని అంటారు. కావున సదా సహయోగిగా అవ్వడమే సహజ యోగము. బుద్ధి ద్వారా సదా సహయోగిగా అవ్వడంలో కారణంగా లేక అకారణంగా అయినా ఏమైనా కష్టాలు అనుభవమైనట్లయితే వాచా లేక కర్మణా ద్వారా కూడా స్వయమును సహయోగిగా చేసుకున్నట్లయితే యోగులుగా ఉన్నట్లే. ఈ విధంగా నిరంతర యోగులుగా అవ్వగలరా లేక ఇది కష్టమా? మనస్సు ద్వారా కాకపోతే తనువు ద్వారా, తనువు ద్వారా కాకపోతే ధనము ద్వారా, ధనము ద్వారా కాకపోతే దేనిద్వారా సహయోగులుగా అవ్వగలరో దానిద్వారా వారు సహయోగులుగా అవ్వడం కూడా ఒక యోగమే.

           ఒకటేమో - స్వయముపై ధైర్యము, ఆ ధైర్యంతో సహయోగిగా చేయడము. ఒకవేళ ధైర్యము లేకపోతే తనువులోను ధర్మము లేక, మనస్సులోను ధైర్యము లేక, ధనములోను ధైర్యము లేకపోతే ఏం చేయాలి? అటువంటివారు కూడా సదా యోగులుగా అవ్వగలరు. కొందరికి స్వయముతో ధైర్యము ఉండదు కాని, ఉల్లాసంగా ఉంటారు, ఉత్సాహము ఉంటుంది. ధనము విషయంలో శక్తి లేకపోయినా, మనస్సులో కంట్రోలింగ్ పవర్ లేకపోయినా, వ్యర్థ సంకల్పాలు ఎక్కువగా కలుగుతున్నా కాని, జీవితపు అనుభవంలో ఉల్లాసమును మరియు ఉత్సాహమును కలిగించేది ఏదైనా ఉంటే దాని ద్వారా ఇతరులకు కూడా ఉత్సాహమును కలిగించండి, తద్వారా ఇతరులకు ధైర్యము రావడం ద్వారా మీకు కూడా భాగము లభిస్తుంది. ఆది నుండి లేక ఇప్పుడు వచ్చిన ఆత్మలెవరైతే ఉన్నారో ఆ ఆత్మలందరికీ తమ జీవితంలో ఏదో ఒక ప్రాప్తి యొక్క అనుభవము తప్పకుండా ఉంది, కావుననే వారు వచ్చారు. ఈ విశేష అనుభవమును అనేక ఆత్మలకు ఉత్సాహమును మరియు ఉల్లాసమును పెంచే పనిలో ఉపయోగించవచ్చు. ఈ ధనము నుండి ఎవ్వరూ వంచితులు కారు. ఏదైతే మనవద్ద ఉందో, ఎంతైతే ఉందో దాని ద్వారా ఇతరులను ధైర్యవంతులుగా చేయడం లేక సహయోగులుగా చేయడం, ఇది కూడా మీ సహయోగం యొక్క సబ్జెక్టులో మార్కులను జమ చేయిస్తుంది. మరి యోగము సహజమా లేక కష్టమా అన్నది ఇప్పుడు చెప్పండి! నిరంతర యోగులుగా అవ్వడము కష్టమా? ఎవరైతే బాబాకు చెందినవారిగా అయిపోయారో వారిలో పర్సంటేజ్ అయితే ఉండదు కదా! అందులో అయితే ఫుల్ పాస్ గా ఉన్నారు కదా! మీరు బాబాకు చెందినవారిగా ఉన్నప్పుడు ఒక్క బాబా మరియు ఇంకెవరున్నారు? బాబా మరియు మీరు, అంతే, మూడవవారు ఎవరూ లేరు. బాబాలో వారసత్వమైతే ఉంది. మూడవది ఏమైనా ఉందా? బాబా మరియు మీరు అనగా ఆత్మ (శరీరము కాదు) తప్ప మూడవవారు ఎవరైనా ఉన్నారా? కావున మీరు మరియు బాబాయే ఉన్నప్పుడు ఈ ఇరువురూ కలుసుకోవడంలో మూడవవారెవ్వరి అవరోధమూ లేదు. మరి మీరు నిరంతర యోగులుగా అయినట్లే కదా! మూడవవారే లేనప్పుడు మరి ఎక్కడినుండి వచ్చినట్లు? అప్పుడు వచ్చేస్తోంది, వచ్చినప్పుడు ఏమి చేయాలి అని ఎప్పుడూ అనరు, ఇక ఆ భాషయే సమాప్తమైపోతుంది. మేము ఉన్నదే సదా బాబా సహయోగులుగా అనగా సహజ యోగులుగా అన్నది సదా గుర్తుంచుకోండి. వియోగము అన్నది ఎలా ఉంటుందో తెలియనే తెలియనట్లుగా ఉండాలి. ఏ విధంగా భవిష్యత్తులో మాయ ఉంటుంది అన్నది కూడా తెలియదో, అలాంటి స్థితి ఇప్పుడు ఉండాలి. ఈ బాల్యపు విషయాలు గతించిపోయాయి. ఇప్పుడైతే నేరుగా ద్వారం ముందుకు వచ్చేసారు, ఎవరు ఎలా బాబా పిల్లలుగా ఉన్నారో అందులో ఎటువంటి శాతము ఉండదో, అలాగే నిరంతర సహయోగిగా లేక యోగిగా అయ్యే స్థితిలో కూడా ఇప్పుడు పర్సంటేజ్ సమాప్తమైపోవాలి. సహజంగా మరియు స్వభావికంగా అయిపోవాలి కొందరికి విశేషమైన స్వభావం ఉంటుంది, ఆ స్వభావానికి వశమై వద్దనుకున్నా అదేవిధంగా నడుస్తూ ఉంటారు. ఇది నా స్వభావము అని అంటారు కదా! నేను అలా కోరుకోను కాని అది నా స్వభావము అని అంటారు. అదేవిధంగా నిరంతర సహజయోగి లేక సహయోగి స్వభావము తయారవ్వాలి. అది స్వభావికంగా అయిపోవాలి. స్వభావము సహజమైపోవాలి. ఏం చేయను. ఎలా యోగమును జోడించను అన్న విషయాలు సమాప్తమైపోవాలి. సదా సహయోగులు అనగా యోగులు. ఈ ఒక్క విషయమును స్వభావంగా, సహజంగా చేసుకోవడం ద్వారా కూడా అన్ని సబ్జెక్టులు పర్‌ఫెక్ట్ గా అయిపోతాయి. పర్‌ఫెక్ట్ అనగా ఎఫెక్ట్ లేకుండా ఉండడం, డిఫెక్ట్ నుండి కూడా దూరమవ్వడం. కావున ఈ రోజు నుండి అందరూ నిరంతర సహజ యోగులుగా అవుతారా లేక ఇప్పుడు అవుతారా? ఎప్పుడైతే వరదాత అయిన బాబా వారసత్వముతో పాటు వరదానమును కూడా ఇస్తారో, అప్పుడు ఎవరికైతే వారసత్వం యొక్క అధికారం కూడా ప్రాప్తమవుతుందో, వరదానం కూడా ప్రాస్తమవుతుందో వారికి ఇది కష్టమా? ఎవరైనా వచ్చి కష్టము అని అన్నట్లయితే వారసత్వమును, వరదానమును గుర్తు చేయించండి. ఇక మిగిలింది ఒక్క అడుగు. ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు ప్రతి అడుగులోనూ పదమపతులుగా అయ్యారు. ఇన్ని వరదానాలను వరదాత ద్వారా ప్రాప్తించుకున్నారు. ప్రతి అడుగులోను పదమపతులుగా అయినప్పుడు అడుగులు వ్యర్థమవుతాయా?? ప్రతి అడుగులోను సమర్ధులుగా ఉన్నారు. వ్యర్ధము లేదు. స్మృతిలో సమర్ధతను తీసుకురండి, సాధారణతను సమాప్తం చేయండి మరియు స్మృతిలో సామర్థ్యతను తీసుకురండి ప్రతి అడుగులోను కోటాను రెట్ల భాగ్యమును తెచ్చుకుంటున్నట్లయితే అప్పుడే కదా విశ్వాధిపతులుగా అయ్యేది, అచ్ఛా!

          ఈరోజు విశేషంగా పూలతోట కోసం స్నేహంతో ఆకర్షింపబడి వచ్చారు. చిన్నవారిపై ఎల్లప్పుడూ అతి స్నేహము ఉంటుంది. కావున స్వయమును చాలాకాలం తరువాత కలిసిన అతిప్రియమైన వారిగా భావించండి. మీరు అతి ప్రియమైనవారు, కావున బాబా సమానంగా అయి చూపించండి. సోదరి సోదరులలా అవ్వకండి. బాబా సమానంగా అవ్వండి. ఏ విధంగా స్నేహంతో పిలిచారో అదే స్నేహంతో బాబా మిలనము కూడా జరుపుతారు మరియు నమస్తే కూడా చెబుతారు.

           శబ్దం లేకుండా రహస్యమును అర్థం చేసుకోగలరా? మీ మనసులో ఉన్న రహస్యమును ఇతరులకు శబ్దం లేకుండా అర్థం చేయించగలరా? చివరిలోని సేవలో శబ్దము ఇమిడిపోతుంది. రహస్యమునే అర్థం చేయించవలసి ఉంటుంది. కావున ఇటువంటి అభ్యాసమును చేయాలి. ఎప్పుడైతే సైన్స్ ఎంతో చేసి చూపిస్తోందో మరి అప్పుడు సైలెన్స్ లో ఆ శక్తి లేదా? ఎంతెంతగా స్వయం రహస్య యుక్తులుగా, యోగయుక్తులుగా అవుతూ ఉంటారో అంతంతగా ఇతరులను కూడా శబ్దం లేకుండా రహస్యమునెరిగిన వారిగా చేయగలుగుతారు. ఇంతమంది ప్రజలను ఎలా తయారుచేయగలరు? ఈ వేగముతోనే ఇంత మంది ప్రజలు తయారవ్వగలరు. చివరిలోని ప్రజలపై కూడా అంత కష్టపడతారా? ముద్రలు తయారుచేయబడి ఉంటే ఒక్క క్షణంలో ముద్రలను వేసేస్తూ ఉంటారు, అలాగే ఒక్క క్షణకాలపు శక్తిశాలీ స్థితి ఎలా ఉంటుందంటే, అది ఏమీ మాట్లాడకుండా, ఏ విధంగా కష్టపడకుండా దైవీరాజ్యపు ఆత్మ యొక్క ముద్ర వేసేస్తుంది. ఇదే సర్వశక్తివంతుని గాయనము. వరదానులుగా అయి ఒక్క క్షణంలో భక్తులకు వరదానమును ఇవ్వాలి. వరదానమును ఇవ్వడంలో శ్రమ ఉండదు. వారసత్వాన్ని పొందడంలోనే శ్రమ ఉంటుంది. వారసత్వాన్ని పొందేవారు కష్టపడుతున్నారు, శ్రమను తీసుకుంటున్నారు కానీ వరదానీ మూర్తులుగా ఎప్పుడైతే అయిపోతారో అప్పుడు శ్రమ తీసుకునేవారూ శ్రమ తీసుకోరు మరియు ఇచ్చేవారు కూడా శ్రమ పడరు. కావున మీ చివరి స్థితి వరదానమూర్త స్థితి. లక్ష్మి చేతుల నుండి స్థూలధనమును ఇస్తున్నట్లుగా చూపిస్తారు. ఇది చివరి శక్తి రూపమే కాని లక్ష్మిది కాదు. శక్తి రూపం ద్వారా సర్వశక్తివంతుని వరదానమును ఇస్తున్న చిత్రమిది. దానిని స్థూలధనము రూపంలో చూపిస్తారు. కావున ఈ విధంగా మీ స్వరూపమును సదా వరదానిగా స్వయమునకు సాక్షాత్కారమవుతోందా? దీని ద్వారానే సమయం ఎంత పడుతుంది అన్నది అందాజా వేయగలరు. ఆ తరువాత వరదానీమూర్తులైన శక్తుల ముందుకు అందరూ వస్తారు. అప్పుడు వరదానం యొక్క బీజము పడుతుంది. కావున స్వయంలో సర్వశక్తులను జమ చేసుకోవాలి. ఇటువంటి వరదానీమూర్తులుగా అవుతూ మరియు తయారు చేస్తూ ఉండండి. శబ్దం నుండి అతీతంగా వెళ్ళాలి. అచ్ఛా!

Comments