* 01-11-1970 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
బాబా సమానంగా అయ్యేటందుకు యుక్తులు.
ఈరోజు పిల్లల ధైర్యము మరియు తండ్రి సహాయముల ప్రత్యక్ష ప్రమాణమును చూస్తున్నారు. గాయనమేదైతే ఉందో దాని సాకార రూపమును చూస్తున్నారు. పిల్లలు ఒక్క అడుగు ముందుకు వచ్చినట్లయితే వెయ్యిరెట్లుగా తండ్రి కూడా ఎంతో దూరము నుండి సమ్ముఖమునకు వస్తారు. మీరు ఎన్ని మైళ్ళ నుండి వచ్చారు? బాప్ దాదా ఎంత దూరము నుండి వచ్చారు? ఎవరు ఎక్కువ స్నేహులు?పిల్లలా లేక తండ్రా? ఇందులో కూడా తండ్రి పిల్లలను ముందు ఉంచుతారు. ఇప్పుడు కూడా ఈ పాత ప్రపంచములో తండ్రి కంటే అధికంగా ఆకర్షితము చేసే వస్తువేంటి? ఇది పాత ప్రపంచము, సర్వ సంబంధాలు, సర్వ సంపదలు, సర్వ పదార్థాలు అన్నీ అల్పకాలికమైనవి మరియు ప్రదర్శనకు మాత్రమే అని తెలిసినాగానీ ఇంకా ఎందుకు మోసపోతారు? లిప్తులుగా ఎందుకని ఉంటారు? మీ గుప్త స్వరూపమును మరియు తండ్రి గుప్త స్వరూపమును ప్రత్యక్షము చెయ్యండి, అప్పుడే తండ్రి గుప్త కర్తవ్యమును ప్రత్యక్షము చెయ్యగలరు. మీ శక్తిస్వరూపము ప్రఖ్యాతమైపోతుంది. ఇప్పుడు గుప్తంగా ఉంది. కేవలము ఒక్క పదమును గుర్తు ఉంచుకున్నట్లయితే మీ గుప్తరూపమును ప్రాక్టికల్ లోకి తీసుకురాగలరు. అది ఏ పదము? కేవలము 'అంతరము' అన్న పదము. అంతరము అన్నమాటలో రెండు రహస్యాలూ వచ్చేస్తాయి. అంతరము అని కాంట్రాస్ట్ (తేడా)ను కూడా అంటారు, అలాగే అంతరము అని లోపల అన్న అర్ధానికి కూడా వాడతారు, అంతర్ముఖి, అంతర్యామి అని అంటుంటారు కదా! కావున అంతరము అన్న పదము ద్వారా రెండు అర్థాలు నిరూపణ అవుతాయి. అంతరము అన్న పదము గుర్తుకు రావటంతోనే ఒకటేమో, ఇది శ్రేష్ఠమైనదా, కాదా అని ప్రతి విషయములో కాంట్రాస్ట్ చేస్తారు. రెండవది, అంతర స్థితిలో ఉండటం ద్వారా లేక అంతర స్వరూపములో స్థితులవ్వటం ద్వారా మీ గుప్త స్వరూపము ప్రత్యక్షమైపోతుంది. ఒక్కమాటను గుర్తు ఉంచుకోవటం ద్వారా జీవితమును మార్చుకోవచ్చు. ఇప్పుడు ఏవిధంగా సమయము తీవ్రగతితో నడుస్తూ ఉందో దాని ప్రమాణంగా చూస్తే ఇప్పుడు ఈ పాదమును పృధ్విపై ఉంచకూడదు. ఏ పాదము? దీనితోనే స్మృతియాత్రను చేస్తారు. ఫరిస్తాల పాదము పృధ్విపై ఉండదు అని నానుడి ఉంది కదా! కావున ఇప్పుడు ఈ బుద్ధి అనే పాదము పృధ్విపై అనగా ప్రకృతి ఆకర్షణ నుండి దూరంగా అయిపోవాలి, ఇక ఏ వస్తువు కూడా కిందకు తీసుకొని రాజాలదు. అప్పుడిక ప్రకృతికి అధీనులయ్యేవారిగా కాకుండా ప్రకృతిని అధీనము చేసేవారుగా అయిపోతారు. భూమి నుండి దూరంగా వెళ్ళేందుకు ఏవిధంగా సైన్సు వారు ప్రయత్నము చేస్తున్నారో, అలాగే సైలెన్సు శక్తి ద్వారా ఈ ప్రకృతి ఆకర్షణ నుండి దూరంగా వెళ్ళి, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆధారమును తీసుకోవటము ఉండాలి. అంతేగానీ ప్రకృతి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అధీనము చేసుకోవటము కాదు. మరి అటువంటి స్థితి ఎంతవరకు తయారైంది? ఇప్పుడైతే బాప్ దాదా తోడుగా తీసుకువెళ్ళేందుకు సూక్ష్మవతనములో తమ కర్తవ్యమును చేస్తున్నారు, కానీ అది కూడా ఎంతవరకు? వెళ్ళటమైతే మన ఇంటికే వెళ్ళేదుంది కదా! కావున ఇప్పుడు త్వరత్వరగా స్వయమును ఉన్నతమైన స్థితిలో స్థిరం చేసుకునేందుకు ప్రయత్నము చెయ్యండి. తోడుగా నడవటము, తోడుగా ఉండటము మరియు తోడుగా రాజ్యము చెయ్యటము ఉండాలి కదా! తోడుగా ఎలా ఉంటారు? సమానంగా అవ్వటం ద్వారా. సమానంగా అవ్వకపోతే తోడుగా ఎలా ఉండగలరు? ఇప్పుడు తోడుగా ఎగరాలి, తోడుగా ఉండాలి. దీనిని స్మృతిలో ఉంచుకున్నప్పుడే స్వయమును త్వరగా సమానంగా తయారుచేసుకోగలరు, లేదంటే కొంత దూరం ఉండిపోతుంది. తోడుగా ఉంటాము, తోడుగా నడుస్తాము మరియు తోడుగా రాజ్యము చేస్తాము అన్నది మీ ప్రతిజ్ఞ కదా! కేవలము రాజ్యము చేసే సమయములో తండ్రి గుప్తమైపోతారు, మరి తోడుగా ఎలా ఉంటారు? సమానంగా అవ్వటం ద్వారా, సమానతను ఎలా తీసుకువస్తారు? సాకార తండ్రి సమానంగా అవ్వటం ద్వారా. ఇప్పుడు బాప్ దాదా అని అంటారు కదా, వారిలో సమానత ఎలా వచ్చింది? సమర్పణత ద్వారా సమానత క్షణములో వచ్చింది. అలా సమర్పణ చేసే శక్తి అవసరము. ఎప్పుడైతే సమర్పణ చేసేసారో అప్పుడిక తనదిగానీ లేక అన్యుల అధికారముగానీ సమాప్తమైపోతుంది. ఎవరికైనా ఏదైనా వస్తువు ఇచ్చేసినట్లయితే ఇక దానిపై మీ అధికారముగానీ లేక ఇతరుల అధికారముగానీ సమాప్తమైపోతుంది. ఒకవేళ ఇతరులెవరైన అధికారమును ఉంచినా కూడా దానినేమంటారు? దీనిని నేను సమర్పణ చేసాను అని అంటారు. అలా ప్రతి వస్తువునూ మొత్తము సమర్పణ చేసిన తరువాత తన లేక ఇతరుల అధికారము ఎలా ఉండగలదు? ఎప్పటివరకైతే తన లేక ఇతరుల అధికారము ఉంటుందో అప్పుడు సర్వ సమర్పణలో లోటు ఉంది అని నిరూపణ అవుతుంది. అందువలన సమానత రాదు. ఎవరైతే ఆలోచించి ఆలోచించి సమర్పణ అవుతారో దాని రిజల్టుగా ఇప్పుడు కూడా పురుషార్థములో ఆ ఆలోచనే అనగా వ్యర్ధ సంకల్పము విఘ్నరూపంగా అవుతుంది. అర్థమైందా? అచ్ఛా!
Comments
Post a Comment