01-10-1975 అవ్యక్త మురళి

01-10-1975         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

ఫిర్యాదులను సమాప్తి చేసి సంపూర్ణంగా తయారయ్యేటందుకు ప్రేరణ.

                    అతీంద్రియ సుఖం యొక్క ఊయలలో ఊపేవారు, సర్వ సంబంధాల యొక్క అలౌకిక అనుభవాన్ని ఇచ్చేవారు, సర్వాత్మల హితకారి శివబాబా తన పిల్లలతో మాట్లాడుతున్నారు -
                    బాబా సమానంగా నిరాకారి, దేహం యొక్క స్మృతికి అతీతంగా, ఆత్మిక స్వరూపంలో స్థితులై, సాక్షి అయ్యి మీ యొక్క మరియు సర్వాత్మల యొక్క పాత్రను చూసే అభ్యాసం గట్టిగా అవుతూ ఉందా? సదా సాక్షి స్థితి స్మృతి ఉంటుందా? ఎప్పటి వరకు సాక్షి స్వరూపం యొక్క స్మృతి సదా ఉండదో అప్పటి వరకు బాప్ దాదాని కూడా మీ తోడుగా తయారుచేసుకోలేరు. సాక్షి స్థితి అనేది బాబా తోడుని అనుభవం చేయిస్తుంది. స్వయాన్ని ఈశ్వరునికి స్నేహిగా భావిస్తున్నారు. అనగా మీ మనోమిత్రునిగా బాప్ దాదాని చేసుకున్నారు కదా! మనస్సు యొక్క మనోభిరామునిగా బాబానే చేసుకున్నారు కదా! మనోభిరాముడైన బాబాతో తప్ప మరెవ్వరితోను మనస్సుని ఇచ్చిపుచ్చుకోవటం అనేది సంకల్పమాత్రంగా కూడా లేదు కదా! ఈ విధంగా అనుభవం చేసుకుంటున్నారా? ఒకవేళ సర్వసంబంధాల యొక్క సుఖాన్ని సర్వసంబంధాల ప్రీతి యొక్క ప్రాప్తిని అనుభవం చేసుకున్నట్లయితే ఎక్కడా కూడా ఏ సంబంధంలోకి బుద్ధి వెళ్ళలేదు. ప్రతీ శ్వాస, ప్రతీ సంకల్పంలో సదా బాబా యొక్క సర్వసంబంధాలలోనే బుద్ధి నిమగ్నమై ఉండాలి. వ్యర్ధ సంకల్పాలు చాలా వస్తున్నాయి, బుద్ది బాబా వైపు జోడించబడటం లేదు, వద్దనుకున్నా కానీ బుద్ధి యొక్క తగుల్పాటు అటుఇటు వెళ్ళిపోతుంది లేదా స్థూల ప్రవృత్తి యొక్క బాధ్యత బుద్ధిని ఏకాగ్రం కానివ్వటం లేదు అని కొంతమంది పిల్లలు ఫిర్యాదు చేస్తున్నారు. పాత ప్రపంచం యొక్క సంప్రదింపులు, వాతావరణం వృత్తిని చంచలంగా తయారుచేస్తున్నాయి. ఎంత తీవ్ర పురుషార్థం చేయాలనుకుంటున్నామో అంత చేయలేకపోతున్నాం ఇలా రోజంతటిలో ఇలాంటి ఫిర్యాదులు బాప్ దాదా దగ్గరకి చాలా వస్తున్నాయి. మాస్టర్ సర్వశక్తివంతులుగా పిలవబడుతూ కూడా తమ స్వభావ సంసారాలతో గట్టిగా అయిపోతున్నారు. బాప్ దాదాకి కూడా ఇలాంటి విషయాలు వినినప్పుడు మధురమైన నవ్వు వస్తుంది మరియు దయ కూడా వస్తుంది. మీ స్వభావ సంస్కారాలనే తొలగించుకోలేకపోతే మొత్తం విశ్వం నుండి తమోప్రదాన ఆసురీ సంస్కారాలను తొలగించేవారిగా ఏవిధంగా అవుతారు? తమ సంస్కారాలకి తామే వశం అయిపోయేవారు, స్వయం యొక్క సంస్కారాలతో స్వయమే అలజడి అయిపోతూ ఉంటే ఇతరుల అలజడులను ఏవిధంగా తొలగించగలరు? ఇలాంటి సంస్కారాల నుండి ముక్తి పొందే సరళమైన యుక్తి ఏమిటి? కర్మలోకి వచ్చే ముందు మొదట సంస్కారం అనేది సంకల్పంలో వస్తుంది. ఇలా చేస్తాను, ఇలా అవాలి, వీరు ఏమనుకుంటున్నారో నాకు కూడా అన్నీ చేయటం తెలుసు... ఇలా ఈ రూపంలో సంకల్పాలలో సంస్కారం ఉత్పన్నమవుతుంది. ఈ సమయంలో సంస్కారం అనేది సంకల్పాల రూపంలో తన రూపాన్ని చూపిస్తుంది అని కూడా తెలుసు. కనుక సదా ఈ అలవాటు చేస్కోండి లేదా అభ్యాసం చేయండి, అదేమిటంటే ప్రతీ సంకల్పాన్ని మొదట పరిశీలించుకోవాలి - ఈ సంకల్పం బాబా సమానంగా ఉందా? ఏవిధంగా అయితే కొంతమంది పెద్దవ్యక్తులు ఏదైనా తినే ముందు ఆ పదార్థాన్ని పరిశీలన చేయించుకుంటారు. ప్రెసిడెంట్ లేదా ఎవరైనా విశేష వ్యక్తులు లేదా ఎవరైనా రాజులు ప్రతీ భోజనానికి ముందు పరిశీలన చేస్తారు. ఆ తరువాత వారు స్వీకరిస్తారు, అలాగే వారికి ఎవరైనా ఏదైనా వస్తువు ఇవ్వాలన్నా కానీ పరిశీలిస్తారు. దాంట్లో ఏవిధమైన అశుద్ధత కలవలేదు కదా! కల్తీ జరగలేదు కదా అని పరిశీలిస్తారు. కానీ ఆ గొప్ప వ్యక్తులు మీ ముందు ఎవరు? మీ రాజ్యంలో ఈ గొప్ప వ్యక్తులు పాదం కూడా పెట్టలేరు, ఇప్పుడు కూడా మీ పాదాలపై పడేవారు. కనుక మీరు రాజులకు కూడా రాజుగా అవుతున్నారు. మరియు సృష్టి అంతటిలో విశేషాత్మలుగా పిలవబడుతున్నారు. అలాంటి విశేష ఆత్మలైన మీ సంకల్ప రూపి బుద్ధి యొక్క భోజనం కొరకు కూడా పరిశీలన జరగాలి కదా! పరిశీలించకుండా స్వీకరిస్తున్నారు. అందువలన మోసపోతున్నారు. కనుక ప్రతీ సంకల్పాన్ని మొదట పరిశీలించండి. బంగారాన్ని పరిశీలించే యంత్రం ఉంటుంది కదా! బంగారం ఎంత స్వచ్చమైనది, ఎంత కల్తీ ఉంది, అసలైన బంగారమా లేక నకిలీ బంగారమా అని పరిశీలిస్తారు. అదేవిధంగా ఈ సంకల్పం బాప్ దాదా సమానంగా ఉందా లేక లేదా అని పరిశీలించుకోండి. ఈ ఆధారంతో పరిశీలించుకోండి, ఆ తర్వాత వాణి మరియు కర్మలోకి తీసుకురండి. ఆధారాన్ని మర్చిపోతున్నారు. అప్పుడే శూద్ర సంస్కారాలు లేదా విషము యొక్క కల్తీ అయిపోతుంది. ఎలాగైతే భోజనంలో విషం కలిసిపోతే అది మూర్చితులుగా చేసేస్తుందో అదేవిధంగా సంకల్ప రూపి ఆహరంలో లేదా భోజనంలో పాత శూద్రత్వం యొక్క విషం కలిసిపోతే బాబా యొక్క స్మృతి మరియు సమర్థ స్వరూపం నుండి మూర్చితులు అయిపోతారు. స్వయాన్ని విశేషాత్మగా భావిస్తూ మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. అర్థమైందా! విశేష ఆత్మను అనే గౌరవంలో ఉండండి, అప్పుడు అలజడి అవ్వరు. మంచిది. సంస్కారాలను తొలగించుకునేటందుకు ఇదే యుక్తి. ఈ కార్యంలో సదా బిజీగా ఉంటే లేదా సదా పవిత్రహంస యొక్క స్థితిలో స్థితులైతే శుద్దం లేదా అశుద్ధం; శూద్రత్వం లేదా బ్రాహ్మణత్వం వీటిని సహజంగానే పరిశీలించగలరు. మరియు బుద్ది ఈ కార్యంలో బిజీగా ఉన్న కారణంగా వ్యర్ధ సంకల్పాలు అనే ఫిర్యాదు నుండి కూడా ముక్తులు అయిపోతారు. రెండవ విషయం రోజంతటిలో బాబా నుండి సమయప్రమాణంగా సర్వసంబంధాల సుఖాన్ని పొందలేకపోతున్నారు. గోపగోపికలు మరియు పాండవుల గురించి చరిత్ర ఉంది. బాబా నుండి సర్వ సంబంధాల యొక్క సుఖాన్ని తీసుకోవాలి మరియు నిమగ్నమై ఉండాలి. అనగా సర్వసంబంధాల ప్రేమలో లవలీనమై ఉండాలి. ఆ అనుభవం ఇప్ప్పుడు చేసుకోలేదు తండ్రి మరియు శిక్షకుడు... ఈ విశేష సంబంధాల యొక్క సుఖాన్ని అనుభవం చేసుకుంటున్నారు కానీ సర్వసంబంధాల సుఖాల యొక్క ప్రాప్తిని తక్కువగా అనుభవం చేసుకుంటున్నారు. అందువలన ఏ సంబంధం యొక్క సుఖాన్ని అనుభవం చేసుకోలేదో ఆ సంబంధం ద్వారా బుద్ధి యొక్క తగుల్పాటు వెళ్ళిపోతుంది. ఆ ఆత్మతో తగుల్పాటు బుద్ధి యొక్క సంలగ్నతలో విఘ్న రూపం అయిపోతుంది. కనుక రోజంతటిలో భిన్న భిన్న సంబంధాల యొక్క అనుభవం చేసుకోండి. ఒకవేళ ఈ సమయంలో బాబాతో సర్వ సంబంధాల యొక్క సుఖం పొందకపోతే సర్వ సుఖాల ప్రాప్తిలో, సర్వ సంబంధాల రసన పొందటంలో లోటు వచ్చేస్తుంది. ఈ సుఖాన్ని ఇప్పుడు పొందకపోతే ఎప్పుడు పొందుతారు? ఆత్మలతో సర్వ సంబంధాలను అయితే కల్పమంతా చేసుకుంటారు కానీ బాబాతో సర్వ సంబంధాల యొక్క అనుభవం ఇప్పుడు చేసుకోకపోతే మరెప్పుడు చేసుకోలేరు. కనుక ఈ సర్వ సంబంధాల సుఖంలో రాత్రి పగలు మిమ్మల్ని మీరు బిజీ చేసుకోండి. ఈ సుఖంలో నిరంతరం ఉండటం ద్వారా ఇతర సర్వ సంబంధాలు నిస్సారంగా మరియు నీరసంగా అనుభవం అవుతాయి. అందువలన బుద్ది ఒకే గమ్యం వైపు స్థితి అవ్వటం ద్వారా భ్రమించటం అనేది సమాప్తి అయిపోతుంది మరియు మీరు ఈ సుఖాల యొక్క ఊయలలో ఇలాంటి స్థితి తయారుచేసుకోవటం ద్వారా తీవ్రపురుషార్ధిగా స్వతహగా మరియు సహజంగా అయిపోతారు. ఫిర్యాదులు అన్నీ సమాప్తం అయిపోయి సంపూర్ణం అయిపోతారు. మీ ఫిర్యాదులకి జవాబు అర్ధమైందా! మంచిది. ..
                    ఈవిధంగా సదా అతీంద్రియ సుఖాల యొక్క ఊయలలో ఊగేవారికి, సదా బాబాతో సర్వ సంబంధాలను నిలుపుకునేవారికి, సదా స్వయాన్ని సాక్షిగా మరియు బాబా తోడుగా భావించేవారికి, ఈశ్వరునికి స్నేహి అయిన వారికి, సదా అదృష్టవంతులకు, బాబా సమానమైన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments