01-10-1975 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
ఏకాంతము, ఏకాగ్రత మరియు దృఢ సంకల్పం ద్వా రా సిద్ధి యొక్క ప్రాప్తి.
సిద్ది స్వరూపంగా తయారుచేసేవారు, భవిష్యఫలంతో పాటు వర్తమాన ప్రత్యక్షఫలం ఇచ్చేవారు, ప్రాణేశ్వరుడైన శివబాబా మాట్లాడుతున్నారు -
ఈరోజు బాప్ దాదా ఏయే విశేష ఆత్మలను ఏ కార్యార్థం ఎంచుకుంటున్నారో తెలుసా? ఈరోజు బాప్ దాదా సృష్టి అంతా విహరించడానికి బయలుదేరారు. విశేషంగా విదేశీ పిల్లల ద్వారా విదేశ సేవ మరియు రకరకాలుగా మారిపోయిన పిల్లలను చూసేటందుకు బయలుదేరారు. (ఇతర ధర్మాలలోకి మారిపోయిన పిల్లలను) సేవాకేంద్రాలు మరియు సేవాధారి పిల్లలు. వీరి మనసులో రాత్రి పగలు ప్రత్యక్షత యొక్క మాటలు మరియు బాబాని ప్రత్యక్షం చేయాలనే ఒకే సంకల్పం ఉంటుంది. ఇలాంటి సేవాధారులే అలసిపోని సంలగ్నతతో రేయింబవళ్ళు శ్రమలో నిమగ్నమై ఉన్నారు. ఇలాంటి పిల్లల్ని చూసి బాప్ దాదా హర్షిస్తున్నారు. కొత్త కొత్త పిల్లల యొక్క తీవ్ర సంలగ్నత యొక్క ఉల్లాసం కలుసుకోవాలనే తపన గాలిపటాల మాదిరిగా హైజంప్ చేసేటటువంటి ముఖకవళికలు చూశారు. మంచి పుష్పగుచ్ఛం రకరకాల పువ్వుల యొక్క అందం చాలా సుందరంగా అనిపిస్తుంది. మొగ్గలు మరియు ఆకులు వెరైటీగా ఉన్నాయి. మధురంగా నిందించే కొంతమంది ఆత్మలను కూడా చూశారు. కొంతమంది ఆత్మలు కలయిక యొక్క ఆనందంలో కన్నీళ్ళ ముత్యాల మాలలు బాప్ దాదాకు ధరింపచేస్తూ చూశారు. తరచుగా బాబా మిలనం యొక్క పాటలు పాడుకునేవారు కూడా ఉన్నారు. ఆ తరువాత విదేశం అంతా విహరించారు. మరోవైపు నలువైపులా ఉన్న అజ్ఞాని లేదా భక్తి ఆత్మలను కూడా చూశారు. వారిలో ఏమి చూశారు? ఒకవైపు అనేక ఆత్మలు తమ శరీర నిర్వహణార్ధం జీవన సాధనాల కోసం ఏదో ఒక యంత్రాల ద్వారా స్వయం నిమగ్నం అయి ఉన్నారు. దాంతోపాటు కొంతమంది ఆత్మలు వినాశనార్థం నిమిత్తమైన యంత్రాలను ఇంకా ఉన్నతి చేయడంలో నిమగ్నమై ఉన్నారు. రెండవవైపు కొంత మంది గృహస్థీలు మరియు భక్తాత్మలు జంతర్ మంతర్ తమ భావన యొక్క ఫలం పొందేటందుకు లేదా అల్పకాలిక ప్రత్యక్ష పాప్తి పొందేటందుకు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. విశేషంగా భారతదేశం మరియు కొన్ని విదేశీ స్థానాల్లో సిద్ధి పొందాలనే కోరికతో దేవీలను విశేషంగా ఆహ్వానిస్తున్నారు. ఎక్కువమంది సిద్ది వెనుక పడుతున్నారు. సిద్ధి పొందేటందుకు స్వయాన్ని సమర్పణ చేసుకునేటందుకు కూడా తయారవుతున్నారు. సిద్ది యొక్క విధిలో ముఖ్యంగా రెండు విషయాలు చేస్తున్నారు. ఏ సిద్ధి కొరకైనా 1. ఏకాంతం 2. ఏకాగ్రత. ఈ రెండు విధుల ద్వారా సిద్ధిని పొందుతారు.
ఈరోజు బాప్ దాదా సిద్ధి స్వరూప పిల్లలను ఎంచుకుంటున్నారు. వారి యొక్క స్మృతిచిహ్న చిత్రాల ద్వారా కూడా ఇప్పటి వరకు అనేకానేక మంది సిద్ధులను పొందుతున్నారు. సిద్దులను ప్రాప్తింపచేసుకునే దృశ్యం చూసేదిగా ఉంది. ఎలాగైతే మీరు బాబా స్మృతి ద్వారా అతీంద్రియ సుఖం యొక్క అనుభవం చేసుకుంటారో అలాగే భక్తులు కూడా సిద్ధి ప్రాప్తింపచేసుకునే సమయంలో అల్పకాలిక సుఖం తక్కువగా ఏమీ అనుభవం చేసుకోవడం లేదు. ఇలా అంతా విహరించిన తరువాత సాకార స్వరూపంలో ఉన్న పిల్లలను చూశారు. భక్తులు ఏ దేవీల ద్వారా అయితే సిద్ధులను ప్రాప్తింపచేసుకుంటున్నారో ఆ దేవీలు స్వయం సిద్ధిని పొందాలనే సంకల్పం ఎప్పుడు పెట్టుకుంటారు? నడుస్తూ.. నడుస్తూ.. ఈ సంకల్పం తప్పకుండా ఉత్పన్నం అవుతుంది, అది ఏమిటంటే శ్రమిస్తున్నా కానీ సిద్ది ఎందుకు లభించడం లేదని. సమయం అనుసరించి సంపూర్ణ స్థితి యొక్క ప్రత్యక్షత ఎందుకు తక్కువగా ఉంది? బాబా కూడా ప్రశ్నిస్తున్నారు ఎందుకని? సిద్ది స్వరూపంగా అయ్యేటందుకు ఏ ముఖ్య విషయాన్ని ధారణ చేయాలి? పాండవుల గురించి కల్పపూర్వపు మహిమ ఉంది కదా - ఎక్కడ బాణం వేస్తే అక్కడ సెకెనులో గంగ వచ్చిందని. అనగా సెకెనులో అసంభవం కూడా సంభవం అయిపోయి ప్రత్యక్షఫల రూపంలో కనిపించాలి, దీనినే సిద్ది అని అంటారు. ఇలా ఇప్పుడు అవ్వడం లేదు, ఎందుకంటే ప్రత్యక్షఫలం యొక్క ప్రాప్తి కొరకు ప్రతి సెకెను మీ సంపూర్ణ సర్వశక్తి సంపన్న స్వరూపం యొక్క స్మృతి ప్రత్యక్షంగా సంకల్పం రూపంలో ఉండడం లేదు. నేను పురుషార్ధిని సంపన్నం అయిపోతాను, అవ్వడం అయితే తప్పనిసరి, నెంబర్ వారీగా అవుతారు, శ్రమించడం మనపని, అదైతే శక్తిని అనుసరించి చేస్తున్నాము. ఇలా ప్రతి సెకెను సంకల్ప రూపీ బీజం సర్వశక్తి సంపన్నంగా ఉండడం లేదు. అయిపోతాను అని సంకల్పం చేస్తున్నారు అంటే అది భవిష్య సంకల్పం. ధృఢ నిశ్చయం లేదా ప్రత్యక్ష ఫలం యొక్క రసం యొక్క బలం నిండిన సంకల్పం లేని కారణంగా సిద్ధి కూడా ప్రత్యక్షంలో లభించడం లేదు. రెండు ఘడియల తరువాత, కొన్ని గంటల తరువాత లేదా కొన్ని రోజుల తరువాత ఇలా భవిష్యత్తులో ప్రాప్తిస్తుంది, మరి దీనికి కారణం అర్ధమైందా? మీ సంకల్ప రూపీ బీజం కారణంగా ప్రత్యక్ష సిద్ది లభించడం లేదు. అనేక రకాలైన సాధారణ సంకల్పాలు ఉంటున్నాయి. సమయప్రమాణంగా అవుతాము, ఇప్పుడు అందరూ ఎక్కడ తయారైపోయారు.. ఇలాంటి సంకల్పాలు చేస్తున్నారు. ముందు నెంబరు వారే తయారవ్వలేదు, అంతిమంలో ఎనిమిదిమందే ఉంటారు, ఇలా భవిష్య జ్ఞానానికి సంబంధించి సాధారణ సంకల్పాలు చేస్తున్నారు. బీజాన్ని బలహీనం చేస్తున్నారు. భవిష్య సంకల్పం ఆ సమయంలో ఉపయోగించకూడదు. అయినప్పటికీ ఉపయోగించేస్తున్నారు, దాని కారణంగా ప్రత్యక్షఫలం కూడా భవిష్య ఫల స్వరూపంలోకి పరివర్తన అయిపోతుంది. ప్రత్యక్షఫలం పొందేటందుకే సంకల్ప రూపీ బీజాన్ని ధృఢ నిశ్చయం అనే నీటితో తడపాలి. ఇది అవ్వాల్సిందే, ఇది జరగాల్సిందే... అనే నీటితో శక్తిశాలిగా తయారుచేయండి. అప్పుడే ప్రత్యక్ష సిద్ధి స్వరూపంగా అయిపోతారు. మీ స్మృతిచిహ్న చిత్రాల ద్వారా సిద్ధిని ప్రాప్తింప చేసుకునేవారికి విశేషంగా రెండు విషయాల యొక్క విధి చెప్పబడింది. ఏకాంతవాసి మరియు ఏకాగ్రత. ఇదే విధిని కల్పపూర్వం వలే సాకారంలోకి తీసుకురండి. ఏకాగ్రత తక్కువగా ఉన్న కారణంగానే దృఢ నిశ్చయం కూడా తక్కువగా ఉంది. ఏకాంతవాసిగా తక్కువగా అవుతున్న కారణంగానే సాధారణ సంకల్పాలు బీజాన్ని బలహీనం చేసేస్తున్నాయి. అందువలన ఈ విధి ద్వారా సిద్ధి స్వరూపంగా అవ్వండి. బాబా విహరించినప్పుడు ఎవరినైతే చూశారో వారు మీరే కదా! కనుక మీ స్మృతిచిహ్న రూపాన్ని ఇప్పుడు స్మృతి రూపంగా తయరు చేసుకోండి. పాండవుల సృతిచిహ్నం ద్వారా కూడా భక్తులు సిద్ధిని అడుగుతూ ఉంటారు.
ఈవిధంగా అనేకాత్మలకు సిద్ధిని ప్రాప్తింపచేసేవారికి, సర్వ సిద్ధి స్వరూప మాస్టర్ విధాత మరియు వరదాతలకు తమ యొక్క ప్రతి సంకల్పం ద్వారా అనేకుల యొక్క అనేక కోరికలను పూర్తి చేసేవారికి, సర్వ ప్రాప్తి స్వరూపులకు, సర్వ మహనాత్మలకు, విదేశీ ఆత్మల సహితంగా సర్వులకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment