01-09-1975 అవ్యక్త మురళి

01-09-1975         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సమీపము మరియు సమానము  మహీనము మరియు మహనము(మహాన్)

                     సదా కర్మ బంధనాలకు అతీతమైన శివబాబా పిల్లలకు కర్మాతీత స్థితిని పొందేటందుకు ఆహ్వనం చేస్తూ అన్నారు -
                    ఇప్పుడు స్వయాన్ని కర్మాతీత స్థితికి సమీపంగా అనుభవం చేసుకుంటూ వెళ్తున్నారా? కర్మాతీత స్థితికి సమీపంగా చేరుకున్న దానికి గుర్తు ఏమిటో తెలుసా? సమీపానికి  గుర్తు సమానత. దేనిలో? ధ్వనిలోకి రావడము మరియు ధ్వనికి అతీతంగా వెళ్ళడము, సాకార స్వరూపంలో కర్మయోగి అవ్వటము మరియు సాకార స్మృతికి అతీతంగా నిరాకారి స్థితిలో స్థితులవ్వడం, వినటము మరియు స్వరూపంగా అవ్వటము, మననం చేయడం మరియు మగ్న స్థితిలో ఉండటము, ఆత్మిక సంభాషణ చేయడం మరియు ఆత్మీయతలో స్థితులవ్వడం, ఆలోచించడం మరియు చేయడం, కర్మేంద్రియాల్లోకి రావడం అనగా కర్మేంద్రియాలను ఆధారం తీసుకోవడం మరియు కర్మేంద్రియాల నుండి అతీతం అయిపోవడం. ప్రకృతి ద్వారా ప్రాప్తించిన సాధనాలను స్వయం కోసం ఉపయోగించటం మరియు సమయ ప్రమాణంగా ప్రకృతి సాధనాలు నుండి నిరాధారమవ్వడం. చూడడము, సంప్రదింపుల్లోకి రావడము మరియు చూస్తూ కూడా చూడకపోవడం. సంప్రదింపుల్లోకి వస్తూ కమలపుష్ప సమానంగా ఉండడం. ఈ అన్ని విషయాల్లో సమానత రావాలి. దానినే కర్మాతీత స్థితికి సమీపంగా రావడం అని అంటారు. ఇలాంటి మహీన (లోతైన) మరియు మహన్ (గొప్ప) స్థితిని పొందారా? అలజడి ఉందా లేక అచంచలంగా ఉన్నారా? అంతిమ పరీక్షలో నలువైపులా అలజడి ఉంటుంది. ఒకవైపు వాయుమండలం వాతావరణం యొక్క అలజడి, రెండవవైపు వ్యక్తుల ద్వారా అలజడి, మూడవవైపు సంబంధాలలో అలజడి, నాల్గవవైపు అవసర సాధనాల లోటు యొక్క అలజడి ... ఇలా నలువైపులా  అలజడుల మధ్యలో అచంచలంగా ఉండండి. ఇదే అంతిమ పరీక్ష. ఏదో ఒక ఆధారంగా స్థితిలో స్థితులవ్వటం అనేది ఇలాంటి పురుషార్థం అంతిమ పరీక్షా సమయంలో సఫలతామూర్తులుగా అవ్వనివ్వదు. వాతావరణం బావుంటే స్మృతియాత్రలో ఉండడం. పరిస్థితి లేకపోతే స్థితిలో ఉండడం అనగా  పరిస్థితి ఆధారంగా స్థితి లేదా ఏదో ఒక సాధనం ఆధారంగా సఫలత ఇలాంటి పురుషార్థం అంతిమ పరీక్షలో ఫెయిల్ చేసేస్తుంది. అందువలన స్వయాన్ని తీవ్ర వేగంతో బాబా సమానంగా తయారుచేసుకోండి. త్వరగా అంతిమ పరీక్ష అయిపోతే సూర్యవంశీ ప్రాలబ్దం పొందుతాము అని భావిస్తున్నారా? పరీక్ష కోసం తయారేనా? అవ్వాల్సిందేనా లేక అయిపోతుందా? లేక సమయం తయారు చేస్తుంది. ఇలాంటి సోమరితనం యొక్క సంకల్పాలు సమర్థంగా కానివ్వవు. సమర్థ సంకల్పాల ముందు రకరకాలైన వ్యర్థ లేదా సోమరితనం యొక్క సంకల్పాలు సమాప్తం అయిపోతాయి. సోమరితనం లేదు కదా? జాగ్రత్తగా తెలివైనవారిగా ఉన్నారా? ఎవరెడీ అనగా ఇప్పుడిప్పుడే ఎలాంటి పరిస్థితిలోనైనా లేదా వాతావరణంలోనైనా ఆజ్ఞ లభించగానే లేదా శ్రీమతం లభించగానే ఒక్క సెకెనులో సర్వ కర్మేంద్రియాల ఆధీనత నుండి అతీతం అయిపోవాలి. కర్మేంద్రియాజీత్ అయ్యి ఒకే సమర్థ సంకల్పంలో స్థితి అయిపోవాలి. శ్రీమతం లభించడం మరియు స్థితులవ్వడం రెండూ వెనువెంటే జరిగిపోవాలి. బాబా చెప్పారు మరియు పిల్లలు సెకెనులోనే అలాంటి స్థితిని తయారు చేసుకున్నారు వారినే ఎవరెడీ అంటారు. సమానత గురించి ఇంతకు ముందు చెప్పిన విషయాల ఆధారంగానే సమీప స్థితి తయారవుతుంది. ఈ విధంగా అన్ని విషయాల్లో ఎంత వరకు సమానంగా తయారయ్యారు? అనేది పరిశీలించుకోండి. ఆజ్ఞను ప్రత్యక్షంలోకి తీసుకురవాడంలో ఒక సెకెనుకు బదులు ఒక నిమిషం పట్టినా మొదటి తరగతిలో పాస్ అవ్వలేరు ఎక్కుతూ, దిగుతూ లేదా స్వయాన్ని సెట్ చేసుకుంటూంటే మొదటి తరగతి యొక్క పదవిని పోగొట్టుకుంటారు. అందువలన సదా ఎవరెడీ. కేవలం ఎవరెడీ కాదు, సదా ఎవరెడీ. వర్తమాన సమయం వరకు ఏమి ఫలితం కనిపిస్తుందో తెలుసా? పాండవులు తీవ్ర పురుషార్థం యొక్క వరుసలో ఉన్నారా లేక శక్తులు ఉన్నారా? తీవ్ర పురుషార్థం  యొక్క వరుసలో ఎక్కువమంది ఎవరున్నారు? పాండవులందరూ శక్తులకే ఎక్కువగా ఓటు వేస్తున్నారు, కానీ పురుషార్థం  యొక్క లెక్కతో పాండవులు కూడా శక్తి రూపులే, అందరూ సర్వశక్తివంతుని శక్తులు. బాప్ దాదా పాండవుల వైపు మాట్లాడుతున్నారు. ఒకవేళ పాండవులను ముందు పెట్టకపోతే వేటాడవలసిన వారిని శక్తుల ముందుకు ఎలా తీసుకువస్తారు? అందువలన పాండవులు విశేషంగా బ్రహ్మబాబా వారసుల యొక్క సంబంధంతో పురుషార్థంలో  తండ్రిని అనుసరించాలి. పాండవులు లౌకిక బాధ్యత తీసుకోవడంలో కూడా ముందుంటారు. కేవలం లౌకిక బాధ్యతకు బదులు బేహద్ విశ్వకళ్యాణం యొక్క బాధ్యతను కూడా తీసుకోవాలి. హద్దులోని సంపాదన చేసుకోవాలనే సంలగ్నత ఎలా ఉంటుందో, అలాగే బేహద్ సంపాదన చేసుకోవాలనే సంలగ్నతలో నిమగ్నం అవ్వండి. సంపాదన కోసం స్వయం యొక్క సుఖ సాధనాలను కూడా త్యాగం చేసే అనుభవీలు. మరైతే  బేహద్ సంపాదన కోసం దేహ సౌకర్యాలను త్యాగం చేయడం లేదా దేహ స్మృతిని త్యాగం చేయడం గొప్ప విషయమా? అందువలన పాండవులు తీవ్ర పురుషార్ధం యొక్క వరుసలో మొదటి నెంబర్ తీసుకోవాలి, అర్థమైందా! వెనుక ఉండకూడదు శక్తుల కంటే వెనుక ఉండిపోతే బ్రహ్మబాబా వారసులుగా తండ్రి యొక్క గౌరవాన్ని నిలబెట్టలేనట్లే. ఇది బాగుంటుందా? అందువలన ఈ సంవత్సరంలో వచ్చే సంవత్సరం కోసం ఎదురు చూడకండి. ఈ సంవత్సరంలోనే మొదటి నంబర్ తీసుకోండి. అయితే మేము రెండో నెంబర్ అయిపోతామా అని శక్తులు అనుకుంటున్నారు. శక్తులు లేకుండా కూడా శివతండ్రి యొక్క ఏ పని నడవదు, నడుస్తుందా? దీంట్లో కూడా శక్తులు త్యాగం చేయాల్సి ఉంటుంది. శక్తుల త్యాగం పూజింపబడుతుంది. ఏదైతే త్యాగం చేస్తారో దానికి భాగ్యం స్వతహగానే తయారవుతుంది. కనుక ఇద్దరూ సోదరుల రూపంలో తీవ్ర పురుషార్థం  చేయండి. వార్తల ఆధారంగా పురుషార్థం  చేయడం కాదు, మీ పురుషార్థం ద్వారానే వినాశనం యొక్క సమాచారం నలువైపులా వ్యాపిస్తుంది. మొదట పురుషార్థం తరువాత వార్తలు. మొదట వార్తలు తరువాత పురుషార్థం కాదు. మంచిది.

Comments