01-06-1973 అవ్యక్త మురళి

* 01-06-1973         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

 "సర్వశక్తుల ఖజానా"

          స్వయమును విఘ్నప్రూఫ్ గా భావిస్తున్నారా? ఎప్పుడైతే స్వయం విఘ్నప్రూఫ్ గా అవుతారో అప్పుడే ఇతరులను భిన్న భిన్న రకాల విఘ్నాల నుండి రక్షించగలుగుతారు. స్వయంలో కూడా ఏవైనా మనసా విఘ్నాలు ఉన్నట్లయితే ఇతరులను విఘ్నప్రూఫ్ తయారుచేయలేరు. ఎప్పుడైతే మొత్తం ఈ నరకమంతటికీ మంటలు అంటుకుంటాయో అప్పుడు ఆ మంటల నుండి రక్షించేందుకు కొన్ని ముఖ్యమైన విషయాలు అవసరము. ఇప్పుడు అటువంటి సమయము రానున్నది. ఎప్పుడైనా ఆ మంటలు అంటుకోవచ్చు కావున ఆ మంటల నుండి రక్షించుకునేందుకు మొదట ఏ వస్తువు యొక్క అవసరం ఉంటుంది? ఎప్పుడైతే ఈ వినాశ జ్వాల నలువైపులా అంటుకుంటుందో ఆ సమయంలో శ్రేష్ఠ ఆత్మలైన మీ యొక్క మొట్టమొదటి కర్తవ్యము ఏమిటి? శాంతి దానమును అనగా శీతలత యొక్క జలమును ఇవ్వాలి. నీరు పోసిన తర్వాత మళ్ళీ ఏమేమి చేస్తారు? ఎవరికి ఏది అవసరమో వారి అవసరాలను పూర్తి చేస్తారు. కొందరికి విశ్రాంతి కావాలి, మరికొందరికి ఆధారము కావాలి అనగా ఎవరికి ఏది అవసరమో దానినే పూర్తి చేస్తారు. మీరు ఏ అవసరాలను పూర్తి చేయాలో అవి మీకు తెలుసా? ఆ సమయంలో ప్రతి ఒక్కరికీ వేరు వేరు శక్తుల అవసరం ఉంటుంది. కొందరికి సహనశీలత యొక్క అవసరము, మరికొందరికి సర్దుకునే శక్తి యొక్క అవసరము, కొందరికి నిర్ణయము చేసే శక్తి యొక్క అవసరము, మరికొందరికి తమను తాము పరిశీలించుకునే శక్తి యొక్క అవసరం ఉంటుంది. కొందరికి ముక్తిని పొందే అవసరం ఉంటుంది, ఆ ఆత్మలకు ఆ సమయంలో భిన్న భిన్న శక్తుల అవసరం ఉంటుంది. బాబా పరిచయం ద్వారా క్షణంలో అశాంత ఆత్మలను శాంతింపజేసే శక్తి కూడా ఆ సమయంలో అవసరము. దానిని ఇప్పటినుండే పోగుచేసుకోవాలి, లేకపోతే ఆ సమయంలో అంటుకున్న మంటల నుండి ఎలా రక్షించుకోగలరు, ప్రాణదానమును ఎలా ఇవ్వగలరు? స్వయమును సిద్ధం చేసుకునేందుకు మొదటినుండే చూసుకోవలసి ఉంటుంది.

          ఏ విధంగా 6 మాసాలలో ఈ ఈ వస్తువుల అవసరం ఉంటుంది అని ఏ విధంగా 6 మాసాల స్టాకును ఉంచుతారో, పరిశీలించుకొని వాటిని నింపుతారో అదేవిధంగా ఈ స్టాకును కూడా పరిశీలించుకుంటున్నారా? మొత్తం విశ్వంలోని ఆత్మలందరికీ శక్తిదానమును ఇవ్వవలసి ఉంటుంది. తమనుతామే శక్తి యొక్క ఆధారముపై నడిపించగలగాలి మరియు ఇతరులకు కూడా శక్తిని ఇవ్వగలగాలి తద్వారా ఎవ్వరూ వంచితులుగా ఉండకూడదు మరి అంతటి శక్తిని నింపుకున్నారా? స్వయము వద్ద శక్తులు జమ అయి లేకపోతే మరియు ఒక్క ఆత్మ అయినా వంచితమై ఉన్నట్లయితే ఆ భారమంతా ఎవరిపై ఉంటుంది? ఎవరైతే నిమిత్తులై ఉంటారో వారిపైనే ఆ భారం ఉంటుంది. ఎల్లప్పుడూ మీ సర్వశక్తుల స్టాకును పరిశీలించుకోండి. ఎవరి వద్దనైతే సర్వశక్తుల స్టాకు జమ అయి ఉంటుందో వారే ముఖ్యమైనవారిగా గాయనము చేయబడతారు.

          నక్షత్రాలను చూపిస్తారు కదా! వాటిలో కూడా నెంబర్ వారీగా ఉంటాయి. ఎవరి వద్దనైతే స్టాకు జమ అయి ఉంటుందో వారే లక్కీ సితారల రూపంలో విశ్వ ఆత్మల ముందు ప్రకాశిస్తూ కనిపిస్తారు. కావున సర్వశక్తుల స్టాకు ఉందా అని పరిశీలించుకోవాలి. మహారథులకు తమ ప్రతి సంకల్పము పైన ముందే అటెన్షన్ ఉంటుంది. మహారథుల పరిశీలించుకునే విధానమే అతీతంగా ఉంటుంది. యోగశక్తి ఉన్న కారణంగా ఆటోమేటిక్ గానే యుక్తియుక్తమైన సంకల్పాలు, మాటలు మరియు కర్మలు ఉంటాయి. ఇప్పుడు ఇది సహజరూపంగా అయిపోయింది. మహారథుల పరిశీలించుకునే రూపం కూడా ఇదే. సర్వశక్తులలో ఏ శక్తికి ఎంత స్టాకు జమ అయి ఉంది? ఆ జమ చేసి ఉన్న స్టాకు ద్వారా ఎంతమంది ఆత్మల కళ్యాణమును చేయగలుగుతారు? ఏ విధంగా స్థూల స్టాకును పరిశీలించడం మరియు జమ చేసుకోవడం మీ డ్యూటీయో అలాగే సర్వశక్తుల స్టాకును జమ చేసుకునే బాధ్యత కూడా ఉంది. ఇది ఆల్ రౌండర్ పాత్ర, ప్రతి వస్తువు యొక్క స్టాకు అవసరానుసారంగా జమ చేసుకోవాలి. అమృతవేళ లేచి స్వయమును అటెన్షన్ యొక్క పట్టీపై నడపాలి అప్పుడు ఆ పట్టీపై బండి సక్రమంగా నడుస్తుంది. అప్పుడిక పైకీ క్రిందికీ అవ్వడం సంభవమే కావు. కావున ఇప్పుడు ఈ స్టాకును జమ చేసుకునే చెకింగ్ చేసుకోవాలి. మొత్తం విశ్వపు బాధ్యత పిల్లలైన మీపై ఉంది. కేవలం భారతదేశానికి కాదు, మహారథుల ప్రతి కర్మ మహాన్ గా ఉండాలి. ఎవరికన్నా మహాన్‌గా ఉండాలి? గుర్రపు స్వారీ మరియు కాల్బలము కన్నా మహాన్‌గా ఉండాలి. అచ్ఛా!

Comments

Post a Comment