01-02-1975 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
స్వచింతకులు, శుభచింతకులు మరియు విశ్వ పరివర్తకులు.
విశ్వకళ్యాణకారి శివబాబా మాట్లాడుతున్నారు -
ఈరోజు బాప్ దాదా సేన అంతటి యొక్క వర్తమాన సమయం యొక్క ఫలితం చూస్తున్నారు. ఈ ఫలితాన్ని విశేషంగా మూడు విషయాల్లో చూడండి. ఎలాగైతే ముఖ్యమైన సబ్జెక్టులు నాలుగో, అలాగే ఈ నాలుగు సబ్జెక్టుల యొక్క రిజల్టు మూడు స్థితుల్లో చూశారు. ఆ మూడు స్థితులు ఏవి? మొదటి స్థితి - స్వయం పట్ల స్వ చింతకులుగా ఎంత వరకు అయ్యారు? రెండవది - సమీప సంబంధ మరియు సంప్రదింపుల్లో శుభ చింతకులుగా ఎంత వరకు అయ్యారు? మూడవ స్థితి విశ్వసేవ కోసం విశ్వపరివర్తకులుగా ఎంత వరకు అయ్యారు? పరివర్తన యొక్క స్థితి ఎంత శాతంలో ప్రత్యక్ష రూపంలో ఉంది? ఈ మూడు స్థితుల యొక్క ఫలితంతో నాలుగు సబ్జెక్టుల యొక్క ఫలితం స్పష్టం అవుతుంది. ముఖ్యంగా మొదటి స్థితి స్వచింతకులుగా ఎంత వరకు అయ్యారు. దీనిపైనే మూడు సబ్జెక్టుల ఫలితం ఆధారపడి ఉంది. రోజంతటిలో పరిశీలించుకోండి స్వచింతకులుగా ఎంత సమయం ఉంటున్నారు. విశ్వ పరివర్తకులు అయిన కారణంగా విశ్వ పరివర్తన యొక్క ప్లాన్లు ఎలాగైతే తయారు చేస్తూ ఉంటారో, సమయాన్ని కూడా నిర్ణయించుకుంటారో, విధి ద్వారా వృద్ధిని పొందేటందుకు రకరకాల ప్లాన్లు లేదా సంకల్పాలు కూడా నడుస్తూ ఉంటాయో అదేవిధంగా స్వ చింతకులు అయి, సంపూర్ణంగా అయ్యే విధిని ప్రతి రోజు కొత్త రూపంలో, కొత్త యుక్తులతో ఆలోచిస్తున్నారా? ఫలితం అనుసారంగా మూడవ స్థితి యొక్క ప్లాన్లు ఎక్కువగా తయారు చేసున్నారు. మొదటి స్థితి యొక్క ప్లాన్లు చేయడానికి అప్పుడప్పుడు ఉత్సాహ ఉల్లాసాల్లోకి వస్తున్నారు, అప్పుడప్పుడు సమయం ధ్యాసను ఇప్పిస్తుంది లేదా ఏదోక సమస్య వచ్చి ఏదో ఒక సబ్జెక్టు యొక్క ఫలితం ధ్యాసను ఇప్పిస్తుంది. కానీ ఆ ద్యాస తీవ్ర గతి స్వరూపంలో అల్పకాలికంగానే ఉంటుంది. రెండవ స్థితి - శుభ చింతకులు, ఈ ఫలితం స్వ చింతన కంటే కొంచెం శాతం ఎక్కుగా వర్తమాన సమయంలో కనిపిస్తుంది. కానీ మొదటి స్థితి తీవ్ర రూపం యొక్క ఫలితానికి చేరుకోనంత వరకు సఫలత లేదా కార్యం యొక్క సంపన్నత లేదా స్వయం యొక్క సంపూర్ణ స్థితి రాదు. దీనికోసం స్వయం కోసం స్వయమే ప్లాన్ తయారు చేసుకోండి. కార్యక్రమం ద్వారా ఉన్నతి జరుగుతుంది కానీ అది అల్పకాలిక ఉన్నతి. తప్పక జరుగుతుంది, కానీ సదాకాలిక ఉన్నతికి సాధనం - స్వ చింతకులుగా అవ్వడం. వర్తమాన సమయాన్ని అనుసరించి పురుషార్థం యొక్క వేగం చింతనకు బదులు చింతా స్వరూపంలో ఉండాలి. సేవ కోసం విశేష కార్యక్రమాలు తయారు చేస్తున్నారు. ఎలా సఫలం చేయాలా అని రాత్రి పగలు చింత చేస్తున్నారు. సేవ కోసం రాత్రి పగలును సమానంగా చేసుకుంటున్నారు. కానీ ఈ చింత సుఖ స్వరూప చింత, అనేక రకాల చింతలను తొలగించే చింత. సర్వ బంధనాల నుండి ముక్తి అయ్యేటందుకు ఒక్క శుభ బంధనలో స్వయాన్ని బంధించుకుంటున్నారు. దీని పేరు బంధన, కానీ ఇది నిర్బంధనగా తయారు చేస్తుంది. అదేవిధంగా దీని పేరు కూడా చింత కానీ దీని ద్వారా బాబా నుండి వారసత్వం ప్రాప్తిస్తుంది. ఇలాంటి చింత ద్వారా సదా సంతుష్టంగా, సదా హర్షితంగా మరియు సదా కమలపుష్ట సమానంగా ఉండే స్థితి సహజంగా తయారవుతుంది. వర్తమాన సమయంలో సంకల్పం వస్తుంది మరియు చింతన కూడా నడుస్తుంది, ఎలా అవుతుందోనని. కానీ ఎలా అవ్వాలో అలా అవ్వడం లేదు. ఇలా అవ్వాలి, ఇది చేయాలి. ఇలా చేయాలి, ఇలా చింతన రూపం ఉంది. కానీ చింతా స్వరూపం అంటే నడవడం మరియు చేయటం ఉంటుంది. తయారవడం మరియు తయారుచేయడం ఉంటుంది. అవ్వాలి అని అనుకోవడం చింతా స్వరూపం కాదు, స్వయం కోసం విశేష విధిని తయారు చేసుకోనంత వరకు అది చింతా స్వరూపం అవ్వదు. ఆ విశేష విధి ఏమిటి తెలుసా? ఏ కొత్త విషయం చేస్తారు, ఆ విధి ద్వారా సిద్ధి కనిపించాలి, పాత విధి చేస్తూ.. చేస్తూ విధి యొక్క రూపం లేకుండా అయింది. ఇక ఏమి మిగిలింది. చేసిన కొద్ది సమయం తరువాత సోమరితనం ఎందుకు వస్తుంది. ముఖ్య విషయం ఏమిటంటే ఇప్పటి వరకు సమయం యొక్క సమాప్తి అనే దానిపై బుద్దిలో నిశ్చయం లేదు. నిశ్చయం లేని కారణంగా నిశ్చింతగా ఉంటున్నారు. సేవా ప్లాన్లు వేసే సమయంలో నిశ్చితం చేసుకుంటున్నారు కనుకనే నిశ్చింతగా ఉండడం సమాప్తి అయిపోతుంది. అదేవిధంగా స్వ ఉన్నతి కోసం కూడా సమయం నిశ్చితం చేసుకోవడం ద్వారా దాని యొక్క విశేష ఫలితాన్ని అనుభవం చేసుకుంటారు. విశేషంగా ఒక నెల స్మృతియాత్ర యొక్క కార్యక్రమం నిశ్చయం చేసుకున్నారు. అప్పుడు నలువైపులా విశేష వాయుమండలం మరియు ఫలితం, విధి యొక్క సిద్ది స్వరూపాన్ని ప్రత్యక్షఫల రూపంలో చూశారు. అదే విధంగా మీ ఉన్నతి కోసం ఎప్పటి వరకు సమయాన్ని నిశ్చితం చేసుకోరో, అనగా ఇంత సమయంలో ప్రతి విశేషత యొక్క సఫలతా స్వరూపంగా అవ్వాల్సిందే. లేదా సమయం యొక్క వాతావరణాన్ని అనుసరించి స్వ చింతనతో పాటు శుభ చింతకులుగా కూడా అవ్వాల్సిందే, అని అనుకోకపోతే సఫలతా స్వరూపులుగా ఏ విధంగా అవుతారు? సంపూర్ణంగా కూడా అవ్వలేరు. స్వయానికి స్వయమే శిక్షకులై ఎంత వరకు స్వయాన్ని ఈ బంధనలో బంధించుకోరో అంత వరకు ఇతరాత్మలను కూడా సర్వ బంధనాల నుండి సదాకాలికంగా ముక్తులను చేయలేరు అర్థమైందా!
ఇప్పుడు ఏం చేస్తారు? సేవలో రకరకాల విషయాల యొక్క సప్తాహిక కోర్సులు లేదా నెలవారీ కోర్సులు పెట్టుకుంటారో అదేవిధంగా సేవతో పాటు స్వయం కోసం కూడా భిన్న భిన్న యుక్తుల ఆధారంగా సమయాన్ని నిశ్చితం చేసుకోండి. ఈ సంవత్సరం విశేష పురుషార్ధం చేయాలి, ఇప్పుడు కూడా సమయం తక్కువ అయిపోతుంది. మరియు ఇక ముందు కూడా స్వయం కోసం విశేష సమయం అనేది మరింత తక్కువ అయిపోతుంది. అప్పుడేం చేస్తారు. ఈనాటి మనుషులు ఏమంటున్నారు, ఇకముందైతే కొంచెం సమయం దొరికేది, కానీ ఇప్పుడు అసలు సమయం ఉండడం లేదు అంటున్నారు కదా, అదేవిధంగా స్వయం కోసం కూడా ఈ నింద మిగిలిపోకూడదు, స్వయం కోసం ఏది చేసుకోవాలో, అది చేసుకోలేదు అని అనకూడదు. ఎందుకంటే సమయం ఎంత సమీపంగా వస్తూ ఉందో, దాని అనుసారంగా విశ్వంలోని ఆత్మలకు మహదానము మరియు వరదానము యొక్క ప్రసాదం పంచిపెట్టడంలో సమయం వెళ్ళిపోతుంది. అందువలన స్వచింతకులుగా అయ్యే సమయం ఎక్కువగా లేదు. మంచిది.
ఈవిధంగా సదా మహదాని, సర్వ వరదాని, స్వచింతకులు మరియు శుభ చింతకులకు, విశ్వం యొక్క ప్రతి ఆత్మ పట్ల సదా దయాహృదయులుగా ఉండేవారికి, మాస్టర్ సర్వశక్తిసాగరులకు, సంకల్పం మరియు ప్రతి మాట ద్వారా విశ్వకళ్యాణార్థం నిమిత్తమైన ఆత్మలకు, విజయీ రత్నాలైన ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment