01-02-1975 అవ్యక్త మురళి

01-02-1975         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

ఈశ్వరుని తోడు మరియు సంలగ్నత అగ్ని యొక్క అనుభవం.

                   ప్రకృతిని దాసిగా చేసుకుని సదా ఉదాసీనతను దూరం చేసుకునే యుక్తులు చెప్పే శివబాబా మాట్లాడుతున్నారు -
                  ఎవరైతే సమీపంగా ఉంటారో వారే సమానంగా అవుతారు. ఏవిధంగా అయితే సాకార రూపంలో సమీపంగా ఉన్నారో అదేవిధంగా సంలగ్నత జోడించడంలో కూడా బాప్ దాదా యొక్క సింహాసనాధికారులేనా? తనువుతో ఎలాగైతే సమీపంగా ఉన్నారో, మనసుతో కూడా అలాగే సమీపంగా ఉన్నారా? విదేశాలలో ఉండేవారు తనువుతో దూరంగా ఉన్నా కానీ మనసుతో సదా సమీపంగా ఉంటారు. బాప్ దాదాకి సదా తోడుగా ఉంటారు. అంటే ప్రతి సమయం తోడుగా అయి తోడు యొక్క అనుభవం చేసుకుంటారు. అదేవిధంగా సదా సాక్షి అయ్యే మరియు తోడును నిలుపుకునే అనుభవం చేసుకుంటున్నారా? బంధనాల్లో ఉండే గోపికలు ప్రతి శ్వాస, ప్రతి సంకల్పం బాబా.. బాబా.. అనే సంలగ్నతలో లీనమై ఎలా ఉంటారో, బయటవారు మిలనం కోసం ఎలాగైతే తపిస్తున్నారో, అదేవిధంగా ప్రతి సమయం స్మృతి యొక్క తపనలో ఉంటున్నారా? లేక సాధారణ స్మృతిలో ఉంటున్నారా? మేము బాబా వారిగా అయిపోయాము, బాబాకి సమీపంగానే ఉన్నాము, సమర్పణ అయిపోయాము, మాకు ఒక్క శివబాబాయే, ఇలాంటి సంకల్పాలతో కేవలం సంతుష్టంగా అయిపోవడం లేదు కదా? మీ సంలగ్నతలో అగ్ని అనుభవంలోకి వస్తుందా? ఆ సంలగ్నత యొక్క అగ్నిలో స్వయం యొక్క పాత సంస్కారాలు మరియు స్వభావాలు మరియు ఇతరాత్మల దు:ఖదాయీ సంస్కారాలు లేదా స్వభావాలు భస్మం అయిపోగలిగి ఉండాలి. జ్ఞానం ద్వారా లేదా స్నేహం ద్వారా లేదా సంప్రదింపులు ద్వారా సంస్కారాలను పరివర్తన చేస్తున్నారా, లేక సమయం పడుతుందా? తొలగిపోయిన సంస్కారం మరలా కూడా అప్పుడప్పుడు ప్రత్యక్షం అవుతుందా? కానీ ఇప్పుడు సమయం ఎలాంటిదంటే సంలగ్నత అనే అగ్నిలో భస్మం చేసేయాలి, ఆ సంస్కారం యొక్క నామరూపాలు మిగలకూడదు. ఇలా ముక్తులవ్వాలంటే యుక్తి ఏమిటి? సంలగ్నత యొక్క అగ్నిని ఉత్పన్నం చేసే యుక్తి లేదా నిప్పు ఏమిటి? నిప్పుతోనే అగ్ని వెలుగుతుంది కదా! ఈ అగ్నిని ప్రజ్వలింపచేజే నిప్పు ఏది, ఒకే మాట అది ఏమిటి? దృఢ సంకల్పం. అంటే చనిపోతాము మరియు తొలగిపోతాము కానీ చేసే తీరుతాము. చేయాలి, అవ్వాలి, చేస్తున్నాము, అయిపోతుంది, ధ్యాస ఉంది, అనుభవం కూడా అవుతుంది. ఇలా ఆలోచించడం - ఆరిపోయిన నిప్పులాంటింది. మాటిమాటికి శ్రమిస్తున్నారు కూడా, సమయం ఉపయోగిస్తున్నారు కూడా, కానీ అగ్ని ప్రజ్వలితం అవ్వడం లేదు. కారణం ఇదే - సంకల్ప రూపి బీజం దృఢత రూపీ సారంతో సంపన్నంగా లేదు, అంటే ఖాళీగా ఉంది. ఈ కారణంగా ఫలం గురించి ఏదైతే ఆశ పెట్టుకుంటున్నారో లేదా భవిష్యత్తు గురించి ఏదైతే ఆలోచిస్తున్నారో అది పూర్తి అవ్వడం లేదు. ఇలా నడుస్తూ నడుస్తూ శ్రమ ఎక్కువ, ప్రాప్తి తక్కువగా రావటం చూసి మానసికంగా బలహీనం అయిపోతున్నారు లేదా సోమరిగా అయిపోతున్నారు. చేస్తున్నాము, కానీ ఫలం లభించడం లేదు. ఏం చేయము, మా పాత్ర ఇలా ఉంది అని అంటున్నారు. ఇవన్నీ మనో నిర్భలత లేదా సోమరితనం యొక్క మరియు ఫలం ఇవ్వకుండా చేసే సంకల్పాలు. సంగమయుగీ విశేషతలు ఏమిటో ఇతరాత్మలకు ఏమి చెబుతుంటారు మీరు. అందరికీ చెబుతారు కదా - సంగమయుగం అంటే అసంభవాన్ని సంభవం చేసేదని, ఏ విషయం అయితే ప్రపంచం అంతటికీ అసంభవం అనిపిస్తుందో. అది సంభవం చేసే యుగం ఇదే. స్వయానికి కూడా ఏదైతే కష్టంగా అసంభవంగా అనుభవం అవుతుందో దానిని ఒక్క సెకెనులో సంభవం అయ్యేలా చేయాలి. అదే దృఢ సంకల్పం. సహజమైన దానిని లేదా సంభవం అయిన దానిని చేసి చూపించడం గొప్ప విషయం కాదు. కానీ అసంభవాన్ని సంభవం చేయడం మరియు దృఢ సంకల్పంతో చేయడం ఇదే పాస్ విత్ ఆనర్ యొక్క గుర్తు. ఇప్పుడు ఈ నవీనత చేసి చూపించండి. అప్పుడే ఈ నవీనతకు మార్కులు ఇస్తారు. ఎలాగైతే విద్యార్థికి ప్రతి సంవత్సరం, ప్రతి సబ్జెక్టులో ఎంత శాతం ఉందో మొత్తం ఫలితాన్ని చూస్తారు కదా! అదేవిధంగా మీ ఫలితాన్ని కూడా చూసుకోవాలి, ఏ విషయంలో ఎక్కే కళలో ఉన్నాను, ఏ పురుషార్థం ఆధారంగా ఎక్కే కళ వచ్చింది, ఏ సబ్జెక్టులో లోపం ఉంది, పూర్తి లెక్క తీయండి. బాప్ దాదా సదా శుభాకాంక్షలు ఇస్తారు. ఎందుకంటే సృష్టిలో పండుగ ఇదే కదా! ప్రకృతి దాసి అవుతుంది, కానీ దాసీకి ఎప్పుడూ దాసీగా అవ్వకూడదు. దాసి అయిన దానికి గుర్తు ఉదాసీనత, ఏదో ఒక సంస్కారానికి లేదా స్వభావానికి దాసీ అయిపోతున్నారు. అందుకే ఉదాసీనం అయిపోతున్నారు. మంచిది.

Comments