11-02-1971 అవ్యక్త మురళి

* 11-02-1971         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

 “అంతఃవాహక శరీరము ద్వారా సేవ.”

           ఒక్క క్షణములో ఎంత దూరము నుండి ఎంత దూరము వరకు వెళ్ళగలరు, లెక్క వెయ్యగలరా? మరణించిన తరువాత ఆత్మ ఏవిధంగా ఒక్క క్షణములో ఎక్కడికో చేరుకుంటుందో, అలా మీరు కూడా అంత:వాహక శరీరము ద్వారా..., అంత:వాహక శరీరమని దేనినైతే అంటున్నామో దాని భావార్థము ఏమిటి? అంత:వాహక శరీరము ద్వారా చాలా దూరము విహరిస్తారని మీ గాయనమేదైతే ఉందో దాని అర్థము ఏమిటి? ఈ గాయనము కేవలము దివ్యదృష్టి కలవారిదే కాదు, మీ అందరిది. వారైతే అంతః వాహక శరీరమునకు వారి అర్థమును తెలియజేస్తారు. కానీ యధార్థము ఇదే - అంతిమ సమయములోని మీ కర్మాతీత స్థితి ఏదైతే ఉందో అది వాహనమౌతుంది! ఏదో ఒక వాహనము ద్వారా షైరు(విహారము) చేస్తారు. ఎక్కడి నుండి ఎక్కడికో చేరుకుంటారు. అలా ఎప్పుడైతే కర్మాతీత స్థితి తయారవుతుందో అప్పుడు ఈ స్థితి కలగటం ద్వారా క్షణకాలములో ఎక్కడి నుండి ఎక్కడికో చేరుకోగలరు కావుననే అంతః వాహక శరీరమని అంటారు. వాస్తవానికి ఇది అంతిమ స్థితి యొక్క గాయనము. ఆ సమయములో మీరు ఈ స్థూల స్వరూపపు భానము నుండి దూరముగా ఉంటారు, కావున దీనిని సూక్ష్మ శరీరమని కూడా అన్నారు. ఎగిరే గుర్రమని ఒక నానుడి కూడా ఉంది. కావున ఈ సమయములో మీ అందరి అనుభవమునకు చెందిన విషయాలు కథల రూపంలో తయారు చెయ్యబడ్డవి. ఇక్కడకు చేరుకో అని ఒక్క క్షణములో ఆర్డర్ చేసినట్లయితే అక్కడకు చేరిపోతుంది. అలా మీరు అనుభవము చేసుకుంటున్నారా? ఏవిధంగా ఈ రోజుల్లో సైన్సు కూడా స్పీడ్ ను వేగవంతం చెయ్యటంలో నిమగ్నమై ఉంది. ఎంతవరకు వీలైతే అంతగా సమయము తక్కువ మరియు సఫలత ఎక్కువగా ఉండే పురుషార్థము చేస్తున్నారు. అలాగే మీ పురుషార్థము కూడా ప్రతి విషయములో స్పీడును పెంచేందుకు నడుస్తోంది. ఎంతెంతగా ఎవరి స్పీడ్ పెరుగుతుందో అంతగానే వారి ఫైనల్ స్టేజ్ కు సమీపంగా వస్తారు. స్పీడ్ ద్వారా స్టేజ్ వరకు చేరుకుంటారు. మీ స్పీడ్ ద్వారా స్టేజ్ ను పరిశీలించుకోగలరు.

           ఇప్పుడు అందరూ శివరాత్రి మహాపర్వమును జరుపుకొనే ప్లాన్ ను తయారుచేస్తున్నారు, మరి ఏ నవీనతను ఆలోచించారు? (జెండా ఎగురవేస్తాము) మీ మీ సేవా కేంద్రాలలో జెండాను బాగా ఎగురవేయండి, కానీ ఆత్మలు ప్రతి ఒక్కరి హృదయాలలో తండ్రి ప్రత్యక్షతా జెండాను ఎగురవేయండి. ఎప్పుడైతే శక్తి స్వరూపపు ప్రత్యక్షత జరుగుతుందో అప్పుడే అది జరుగుతుంది. శక్తి స్వరూపము ద్వారానే సర్వశక్తివంతుని ప్రత్యక్షము చెయ్యగలరు. శక్తి స్వరూపము అనగా సంహారి మరియు అలంకారి. ఏ సమయములో అయితే స్టేజ్ పైకి వస్తారో ఆ సమయములో మొదట మీ స్థితి యొక్క స్టేజ్ ను మంచిగా తయారుచేసుకొని అప్పుడు ఆ స్టేజ్ పైకి రండి. దీని ద్వారా అందరికీ మీ ఆంతరిక స్టేజ్ యొక్క సాక్షాత్కారము జరుగుతుంది. ఏవిధంగా ఇతర ఏర్పాట్లను చేస్తారో అలాగే ఇది కూడా, అలంకారిగా అయ్యి స్టేజ్ పైకి వస్తున్నానా అని మీ ఏర్పాట్లను చూసుకోండి. లైట్ హౌస్, వైట్ హౌస్... రెండు స్వరూపాలూ ఇమర్జ్ రూపంలో ఉండాలి. ఎప్పుడైతే రెండు స్వరూపాలు ఉంటాయో అప్పుడే మంచి గైడ్ గా అవ్వగలరు. “బాబా” అన్న మీ మాటలో ఎంత స్నేహము మరియు శక్తి నిండి ఉండాలంటే ఈ మాట జ్ఞాన అంజనంలా పనిచెయ్యాలి. అనాథలను సనాథలుగా తయారుచెయ్యాలి. ఈ ఒక్క పదములో అంతగా శక్తిని నింపండి. ఏ సమయములో అయితే స్టేజ్ పైకి వస్తారో ఆ సమయములోని స్థితి ఎలా ఉండాలంటే, ఒకవైపు దయ ఉండాలి, రెండవవైపు కల్యాణ భావన, మూడవవైపు అతి స్నేహపు శబ్దము, నాల్గవవైపు స్వరూపములో శక్తి స్వరూపపు ప్రకాశము ఉండాలి. మీ స్మృతి మరియు స్థితిని అంత శక్తిశాలిగా తయారుచేసుకొని, చాలా కాలము నుండి పిలుస్తున్న మీ భక్తులకు మీ ద్వారా తండ్రి సాక్షాత్కారము చేయించేందుకు వచ్చాను అని భావించండి. ఈవిధంగా మీ ఆత్మిక రూపము, ఆత్మిక దృష్టి, కల్యాణకారీ వృత్తి ద్వారా తండ్రిని ప్రత్యక్షము చెయ్యగలరు. ఏం చెయ్యాలో అర్థమైందా? కేవలము భాషణ చేసే ఏర్పాట్లను చెయ్యటం కాదు, కానీ భాషణ ఏర్పాట్లను ఎలా చెయ్యాలంటే ఆ భాషణ ద్వారా భాష నుండి కూడా దూరంగా ఉండే స్థితిలోకి తీసుకొని వెళ్ళే అనుభవమును చేయించండి. భాషణకు ఏర్పాట్లను ఎక్కువగా చేస్తారు, కానీ ఆత్మిక ఆకర్షణ స్వరూపపు స్మృతిలో ఉండే ఏర్పాట్లపై తక్కువ అటెన్షన్ ను ఇస్తారు, కావున ఈసారి ఎక్కువ ఏర్పాట్లను ఈ విషయంపై చెయ్యాలి. ప్రతి ఒక్కరి హృదయాలలో తండ్రి సంబంధము యొక్క స్నేహముద్రను వెయ్యాలి.

           అచ్ఛా - మధువనము వారు ఏ సర్వీసును చేస్తారు? మధువనము వారికి ముఖ్యంగా ఆరోజు అవ్యక్తవతనములోకి వచ్చేందుకు బాప్  దాదా ఆహ్వానమును ఇస్తున్నారు. వతనములోకి వచ్చి అన్ని వైపుల గల సేవను చూడగలరు. సాయంత్రము 7 గంటలనుండి 9 గంటల వరకు ఈ రెండు గంటలు విశేషంగా షైర్ (విహారము) చేయిస్తారు. అన్ని స్థానాల షైర్ చేసేందుకు ఏవిధంగా సందేశీలను తీసుకువెళ్తారో అదేవిధంగా మధువనము వారికి ఇక్కడ కూర్చుని ఉంటూనే సర్వ స్థానాల సేవ యొక్క షైర్ ను చేయిస్తారు. ఒకవేళ, శ్రమ లేకుండానే మొత్తము షైర్ చేసినట్లయితే ఇంకేం కావాలి! కావున మధువనము వారు ఆరోజున తమను తాము ఈ స్థూలదేహము నుండి అతీతమై అవ్యక్త వతనవాసిగా భావించుకొని కూర్చున్నట్లయితే మొత్తము రోజంతటిలో చాలా అనుభవములను పొందుతారు. ఏ అనుభవమును చేసారో అప్పుడు వినిపించండి. ఆరోజు ఒకవేళ కొంచెము పురుషార్థము చేసినాగానీ సాటిలేని భిన్న భిన్న అనుభవములను చేసేందుకు వరదానమును పొందగలరు. అర్థమైందా - సాయంత్రము 7 నుండి 9 గంటల వరకు విశేషముగా స్మృతి ప్రోగ్రామును పెట్టుకోండి. మొత్తము రోజంతటికి ఆహ్వానమును ఇస్తున్నారు కానీ విశేషంగా అది షైర్ చేసే సమయము. ఇటువంటి సమయములో ప్రతి ఒక్కరూ యథాశక్తి అనుభవము చెయ్యగలరు. మధువనము వారు విశేష స్నేహులు కావున వారికి విశేష నిమంత్రణ. కేవలము బుద్ధి ద్వారా మీ ఈ దేహ భానము నుండి వేరుగా అయ్యి కూర్చోవాలి. తరువాత డ్రామాలో ఏది అనుభవమయ్యేదుందో అది అవుతూ ఉంటుంది. సందేశీలకైతే సాక్షాత్కారము మామూలు విషయమే, కానీ బుద్ధి ద్వారా కూడా అటువంటి అనుభవమును చెయ్యగలరు. ఈ కండ్లతో చూసినంత స్పష్టంగా అనుభవముంటుంది. అచ్ఛా

*టీచర్లతో మిలనము*

           ఈ గ్రూపును ఏ గ్రూపని అనాలి? (స్పీకర్స్ గ్రూపు) స్పీకర్స్ అనగా స్పీచ్ (భాషణ) చేసేవారు. స్పీచ్ తో పాటు స్పీడ్ కూడా ఉందా? ఎందుకంటే స్పీచ్ తో పాటు ఒకవేళ పురుషార్థపు స్పీడ్ కూడా ఉన్నట్లయితే అటువంటి స్పీచ్ ఇచ్చేవారి ప్రభావము ద్వారా విశ్వ కల్యాణము జరగగలదు. ఒకవేళ స్పీడ్ లేకుండా స్పీచ్ ఉన్నట్లయితే విశ్వ కల్యాణము జరగటము కష్టమైపోతుంది. కావున ఈ గ్రూపును స్పీచ్ మరియు స్పీడ్ లో వెళ్ళేవారి గ్రూపు అని అంటాము. ఎవరి స్పీచ్ కూడా శక్తిశాలీగా, స్పీడ్ కూడా శక్తిశాలిగా ఉంటుందో వారినే విశ్వ కల్యాణకారులు, మాస్టర్ దుఃఖ హర్త-సుఖ కర్తలు అని అంటారు. కావున అటువంటి కార్యములో నిమగ్నమై ఉన్నారా? ఎవరైతే దుఃఖ హర్త-సుఖకర్తలుగా ఉంటారో వారు స్వయము కూడా ఈ ప్రపంచపు అల నుండి దూరంగా ఉంటారు మరియు వారి స్పీచ్ కూడా దు:ఖపు అల నుండి దూరంగా తీసుకువెళ్ళేదిగా ఉంటుంది. అటువంటి స్టేజీపై నిలిచియుండి స్పీచ్ చేస్తారా? స్పీచ్ నైతే స్టేజ్ పైన ఉండే ఇవ్వటం జరుగుతుంది, కావున మీరు ఏ స్టేజ్ పైన ఉండి స్పీచ్ ఇస్తారు? బయట తయారుచేయబడిన స్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ స్టేజ్ పైనా? స్పీకరు ఏదైనా స్థూల స్టేజ్ పైకి వెళ్ళేది ఉంటే, ఆ సమయంలో మొదట తన స్థితిరూపీ స్టేజ్ తయారుగా వుందా, లేదా అన్నది పరిశీలించుకుంటాడు. అటువంటి స్టేజ్ పై నిలబడి స్వీచ్ ఇచ్చేవారినే శ్రేష్ఠ స్పీకర్లు అని అంటారు. ఈ విధంగా స్థూల స్టేజ్ ను తయారుచేసేందుకు కూడా ఎంత సమయము మరియుఎంత పరిశ్రమ చేస్తారో అలాగే మీ స్థితి రూపీ స్టేజ్ ఎల్లప్పుడూ తయారై ఉండేందుకు కూడా అంతగానే పురుషార్థము చేస్తున్నారా? అటువంటి శక్తిశాలీ స్టేజిపై నిలబడి స్పీచ్ చేసేవారి స్మృతిచిహ్నము ఇక్కడ ఆబూలో ఉంది. అది ఏది? (దిల్ వాడా), దిల్ వాడా మందిరమైతే సృతియాత్ర యొక్క స్మృతి చిహ్నము. గౌముఖమును చూడలేదా? గౌముఖము దేని స్మృతి చిహ్నము? ఇది నోటి యొక్క స్మృతి చిహ్నము. తండ్రి స్మృతి చిహ్నము గౌముఖము ఎందుకంటే నోటి ద్వారానే మొత్తము స్పష్టము చేస్తారు, కావున నోటి యొక్క స్మృతి చిహ్నము. స్పీకరు పని అంతా నోటితోనే ఉంటుంది, కానీ ఎవరైతే ఇటువంటి శ్రేష్ఠ స్టేజ్ పై ఉండి స్పీచ్ చేస్తారో వారిది ఆ స్మృతి చిహ్నము. ఎల్లప్పుడూ ఎవర్ రెడీ స్టేజ్ ఉండాలి. సమయము వచ్చినప్పుడు తయారుచేసుకునే పరిస్థితి ఉండకూడదు. ఎవర్ రెడీ స్టేజ్ గా ఉండటం ద్వారా ఏ ప్రభావమైతే ఉంటుందో అది చాలా బాగా పడుతుంది. కావుననే ప్రభావశాలురేనా అని అడిగాము. ఈ గ్రూపును ప్రభావశాలీ గ్రూపు అని అందామా? అందరూ సర్టిఫికేట్ ఇస్తారా? (మంచి గ్రూపు) ఒకవేళ మీరు సర్టిఫికేట్ ఇచ్చినట్లయితే, వీరు సర్వులను సాటిస్ ఫై చేసే(తృప్తి పరిచే) వారిగా ఉంటారు. సంతుష్టమణులే కదా! ఇందులో అవును అని అంటారా? ఒకవేళ స్వయం సతుష్టమణులైనట్లయితే ఇతరులను కూడా సంతుష్టము చేస్తారు. టీచర్లకు కూడా పరీక్ష ఉంటుంది, ఎలా? (టీచర్ల పరీక్ష సూక్ష్మవతనమునుండి జరుగుతుంది) టీచర్ల పరీక్ష అడుగడుగులో ఉంటుంది. ఏ అడుగు వేస్తున్నా కూడా, పరీక్ష హాల్ లో కూర్చుని అడుగు వేస్తున్నాను అని భావించి అడుగు వెయ్యాలి. ఎందుకంటే స్పీకర్ అనగా స్టేజ్ పైన కూర్చొని ఉండటం. కావున ఎవరైతే ఎదురుగా స్టేజ్ పైన ఉంటారో వారిపై అందరి దృష్టి ఉంటుంది. మీరు కూడా ఉన్నతమైన స్టేజ్ పై కూర్చున్నారు. అనేక ఆత్మల దృష్టి మీ అడుగులపై ఉంటుంది. కావున మీరు అడుగడుగు అటువంటి అటెన్షన్ తో వెయ్యాలి. ఒకవేళ ఒక్క అడుగైనా కూడా ఢీలాగా లేక కిందకు పైకి వేసినట్లయితే అనేకులు మిమ్మల్ని అనుసరిస్తారు. కావున టీచర్లు ఏ అడుగును వేసినా, దానిని ఆలోచించి వెయ్యాలి ఎందుకంటే కిరీటధారిగా అయ్యారు కదా! ఏ కిరీటము లభించింది? బాధ్యతా కిరీటము. ఎంత పెద్ద బాధ్యతనో అంత పెద్ద కిరీటము. కావున పెద్ద బాధ్యత ఏదైతే లభించి ఉందో దాని అనుసారముగా మిమ్మల్ని మీరు అటువంటి నిమిత్తమైనవారిగా భావించి అడుగులు వేయండి. ఇప్పుడు నిర్లక్ష్యము ఉండకూడదు. కిరీటము మరియు సింహాసనాధికారిగా అయిన తరువాత నిర్లక్ష్యము సమాప్తమైపోతుంది. నిర్లక్ష్యము అనగా పురుషార్థములో నిర్లక్ష్యము. ఏ అడుగు వేసినా మరియు కర్మ జరిగినా, ఆ ప్రతి కర్మ విశ్వముకొరకు ఒక ఉదాహరణగా అయ్యి ఉండాలి అని ఈ గ్రూపు ఎల్లప్పుడూ భావించాలి. ఎందుకంటే మీ ఈ కర్మలు కథల రూపంలో సృతి చిహ్నాలుగా తయారవుతాయి. మీ చరిత్రలు గాయనయోగ్యమవుతాయి, ఇంత బాధ్యతగా భావించి నడుస్తారా? ఇవి ఈ బాధ్యతాయుత గ్రూపు విశేషతలు. ఎవరు ఎంతటి బాధ్యత కలవారుగా ఉంటారో అంతగానే తేలికగా కూడా ఉంటారు. అచ్ఛా!

Comments