* 01-02-1971 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“కిరీటము, తిలకము మరియు సింహాసనములకు అధికారులుగా అయ్యేందుకు విధి”
బాప్ దాదా పిల్లలందరినీ చూసి హర్షితమవుతున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరినీ నంబర్ వారీగా కిరీటము మరియు సింహాసనములకు అధికారులుగా చూస్తున్నారు. మీకు మీరు కిరీటము మరియు సింహాసనమును చూస్తున్నారా? ఎన్ని రకాల కిరీటాలు ఉన్నాయి మరియు ఎన్ని రకాల సింహాసనాలు ఉన్నాయి? మీకు ఎన్ని కిరీటాలు ఉన్నాయి? (21 జన్మలలో 21 కిరీటాలు) ఇప్పుడు ఏదైనా కిరీటము ఉందా లేక కేవలము 21 కిరీటాలే కనిపిస్తున్నాయా? ఇప్పటి కిరీటమే అనేక కిరీటాలను ధరింపచేయిస్తుంది. కావున ఇప్పుడు స్వయాన్ని కిరీటధారులుగా చూస్తున్నారా? ఎన్ని కిరీటాలను ధరించారు? (లెక్కలేనన్ని) పాండవ సేనకు ఎన్ని కిరీటాలు ఉన్నాయి? (రెండు) శక్తులకేమో అనేకము మరియు పాండవులకు రెండు? ఇప్పుడు కిరీటాన్ని ధరించనట్లయితే భవిష్య కిరీటము కూడా ఎలా లభిస్తుంది! ఈ సమయములో పిల్లలందరినీ కిరీటము మరియు సింహాసనాధికారిగా తయారుచేస్తారు. ఒకవేళ సింహాసనాధికారిగా ఉన్నట్లయితే కిరీటధారిగా కూడా ఉంటారు. సింహాసనాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి? ఇప్పుడు హృదయ సింహాసనాధికారులుగా మరియు అకాల సింహాసనాధికారులుగా అయితే ఉండనే ఉన్నారు. అకాల సింహాసనాధికారులుగా ఉన్నట్లయితే పవిత్రత యొక్క ప్రకాశ కిరీటమును కూడా ఇప్పుడే ధరిస్తారు మరియు హృదయ సింహాసనాధికారులుగా అవ్వటం ద్వారా సేవాధారులుగా అవ్వటంతో బాధ్యతా కిరీటమును ధరిస్తారు. కావున ఇప్పుడు రెండు సింహాసనాలు మరియు రెండు కిరీటధారులుగా ఎంత సమయము ఉంటున్నాము అని ప్రతి ఒక్కరూ తమను తాము చూసుకోండి. కిరీటము మరియు సింహాసనము అందరికీ అయితే లభించాయి, కానీ ఎవరు ఎంత సమయము కిరీటధారులుగా మరియు సింహాసనాధికారులుగా అవుతారు అన్నది ప్రతి ఒక్కరి వారి వారి పురుషార్థము. కొందరికి స్థూల కిరీటమును ధరించే అనుభవము కూడా తక్కువగా ఉంటుంది, కావున పదేపదే తీస్తుంటారు. కానీ ఈ కిరీటము మరియు సింహాసనము అయితే ఎంత సరళమైనవి, సహజమైనవి అంటే ఎవరైనా అన్నివేళలా కిరీటము మరియు సింహాసనధారిగా తయారవ్వగలరు. ఎవరైనా సింహాసనాధికారిగా అయినట్లయితే సింహాసనముపై ఉపస్థితులవ్వటం ద్వారా రాజ్య కార్యకర్తలు వారి ఆర్డర్ పై నడుస్తారు. ఒకవేళ సింహాసనమును వదిలినట్లయితే అదే కార్యకర్తలు వారి ఆర్డర్ లో నడువరు. కావున అలా మీరు ఎప్పుడైతే కిరీటము మరియు సింహాసనమును వదిలివేస్తారో అప్పుడు ఈ కర్మేంద్రియాలు మీ ఆర్డర్ నే వినవు. సింహాసనాధికారులుగా ఉన్నట్లయితే ఈ కర్మేంద్రియాలే జీ హజూర్ అంటాయి. కావున ఈ కిరీటము మరియు సింహాసనమును ఎప్పుడూ వదలము అన్నదానిపైనే ఎల్లప్పుడూ ధ్యానమును ఉంచండి. కిరీటము మరియు సింహాసనములతో కూడిన మీ సంపూర్ణ చిత్రమును సదా గుర్తు ఉంచుకోండి. దానిని గుర్తు ఉంచుకోవటం ద్వారా అనేక చిత్రాలేవైతే తయారవుతాయో అవి తయారవ్వవు. ఒక్కరోజులోనే ప్రతిఒక్కరి భిన్నభిన్న రూపాలు మారే చిత్రాలు కనిపిస్తాయి. కావున మీ సంపూర్ణ చిత్రమునొక దానిని ఎదురుగా ఉంచుకోండి. కిరీటము మరియు సింహాసనాధికారులుగా అవ్వటం ద్వారా లక్ష్యము మరియు నషా స్వతహాగనే ఉంటాయి. ఎందుకంటే కిరీటము మరియు సింహాసనము ఉన్నదే నషా మరియు లక్ష్యములను గుర్తు తెప్పించేవిగా. కావున మీ కిరీటము మరియు సింహాసనమును ఎప్పుడు కూడా వదలవద్దు. ఎంతెంతగా ఇప్పుడు కిరీటము మరియు సింహాసనమును ధరించే అనుభవజ్ఞులుగా మరియు అభ్యాసులుగా అవుతారో అంతగానే అక్కడ కూడా అంత సమయము కిరీటము మరియు సింహాసనములను ధరిస్తారు. ఒకవేళ ఇప్పుడు కొద్ది సమయము కిరీటము మరియు సింహాసనాధికారులుగా అయినట్లయితే అక్కడ కూడా చాలా కొద్ది సమయము కిరీటము మరియు సింహాసనములను ప్రాప్తి చేసుకోగలరు. ఇప్పటి అభ్యాసము ప్రతి ఒక్కరికీ తమ భవిష్య సాక్షాత్కారమును చేయిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా కేవలము ఇతరుల కిరీటము మరియు సింహాసనములను చూస్తూ సంతోషపడుతూ ఉన్నట్లయితే అక్కడ కూడా చూస్తూనే ఉండవలసి వస్తుంది. కావున సదాకాలము కొరకు కిరీటము మరియు సింహాసనాధికారిగా అవ్వండి. ఇటువంటి కిరీటము మరియు సింహాసనము మళ్ళీ ఎప్పుడు లభిస్తాయి? ఇప్పుడే లభిస్తాయి. కల్పము తరువాత కూడా ఇప్పుడే లభిస్తాయి. ఇప్పుడు లేకున్న మరెప్పుడూ లేవు.
ఇంట్లో కూర్చుని ఉంటేనే ఎవరైనా కిరీటము మరియు సింహాసనమును ఇవ్వటానికి వచ్చినట్లయితే ఏం చేస్తారు? తండ్రి కూడా ఇప్పుడు ఆత్మల ఇంటికి అతిధిగా అయ్యి వచ్చారు కదా. ఇంట్లో కూర్చొని ఉంటూనే కిరీటము మరియు సింహాసనముల కానుకలను ఇచ్చేందుకు వచ్చారు. కిరీటము మరియు సింహాసనములను వదిలి ఎక్కడకు వెళ్తారు? తెలుసా? మాయ నివాస స్థానమేదైనా ఉందా? మీరు కూడ సర్వవ్యాపి అని అంటారా లేక మీ వద్ద తప్ప మిగిలిన అన్ని స్థానాలలో ఉందా? మీరు 63 జన్మలలో ఎన్నిసార్లు మాయకు ఆశ్రయమిచ్చి ఉండవచ్చు? దాని పరిణామమును కూడా ఎన్నిసార్లు చూసి ఉండచ్చు! అనేకసార్లు అనుభవజ్ఞులుగా అయినప్పటికి కూడా ఆవే మాట్లాడుతూ ఉంటే వారిని ఏమని అంటారు? కిరీటము మరియు సింహాసనాన్ని వదిలి అడవులకు వెళ్ళిపోయినట్లుగా చూపిస్తారు కదా, అలాగే ఇక్కడ కూడా ముళ్ళ అడవిలోకి వెళ్ళిపోతారు. సింహాసనమెక్కడ, ముళ్ళ అడవి ఎక్కడ! ఏది ఇష్టము? ఏవిధంగా ఎవరైనా భక్తులు గానీ లేక అలంకరించుకొనేవారు గానీ నియమ ప్రమాణంగా స్నానమాచరించి వారి మస్తకముపై తిలకాన్ని తప్పక దిద్దుకుంటారు. అలంకారము కారణంగా, భక్తి కారణంగా మరియు సౌభాగ్యము కారణంగా కూడా తిలకాన్ని తప్పక దిద్దుకుంటారు. అలాగే అమృతవేళ మీరు స్వయానికి జ్ఞాన స్నానము చేయిస్తారు, స్వయమును జ్నానముతో అలంకరించుకుంటారు, కావున అలాగే అమృతవేళ ఈ స్మృతి తిలకమును దిద్దవలసి ఉంటుంది. కానీ అమృతవేళ ఈ స్మృతి తిలకమును పెట్టుకోవటమును మర్చిపోతారు. ఒకవేళ ఎవరైనా తిలకాన్ని పెట్టినా కూడా మళ్ళీ దానిని తుడిచేసుకుంటూ ఉంటారు. కొంతమందికి పదేపదే మస్తకముపై చేతిని పెట్టుకొని తిలకాన్ని తొలగించుకోవటము అలవాటుగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే తిలకాన్ని పెట్టుకుంటారు, ఇప్పుడిప్పుడే తొలగించేస్తారు. ఈ విషయము కూడా అలాంటిదే. కొందరు తిలకాన్ని పెట్టుకోవటము మర్చిపోతారు, కొందరు పెట్టుకున్నా మళ్ళీ తొలగిస్తుంటారు. కావున దిద్దుకోవటము మరియు తొలగించుకోవటము రెండు పనులు జరుగుతూ ఉంటాయి. కావున అమృతవేళ ఈ స్మృతి గురించి ఇవ్వబడిన తిలకాన్ని ఎల్లప్పుడూ స్థిరంగా ఉంచుకుంటూ ఉన్నట్లయితే సౌభాగ్యము, అలంకారము మరియు యోగీతనముల గుర్తు ఎల్లప్పుడూ మీ మస్తకముపై కనిపిస్తుంది. ఏవిధంగా భక్తుల తిలకాన్ని చూసి, వీరు భక్తులని భావిస్తారో అదే విధంగా మీ స్మృతి తిలకము ఎంత స్పష్టంగా అందరికీ కనిపిస్తుందంటే వీరు యోగీ ఆత్మలని వారు వెంబడే అనుభవము చేసుకుంటారు. కావున తిలకము, కిరీటము మరియు సింహాసనములను అందరూ స్థిరంగా ఉంచుకోండి. తిలకాన్ని ఎప్పుడూ తుడిపేసుకోవద్దు. మిమ్మల్ని మీరు మాస్టర్ సర్వశక్తివంతులు అని చెప్పుకుంటారు, మరి మాస్టర్ సర్వశక్తివంతులకు కిరీటము మరియు సింహాసనములను ధరించటం కూడా రాదా! కర్మ చేస్తూ కూడా కేవలము రెండు విషయాలను గుర్తు ఉంచుకోండి. దాంతో ఎంతగా అభ్యాసమైపోతుందంటే ఎవరి మనసులో వచ్చిన సంకల్పమునైనా ఎంత సులభంగా క్యాచ్ చెయ్యగలరంటే, నోటితో మాట్లాడిన విషయాన్ని ఎంత సరళరీతితో క్యాచ్ చెయ్యగలరో అలా మనస్సులోని సంకల్పాన్ని కూడా అంత సహజంగానే క్యాచ్ చెయ్యగలరు. కానీ సమానతకు దగ్గరగా వచ్చినప్పుడే ఇది జరుగుతుంది. పరస్పరములోని స్వభావములో కూడా ఒకవేళ ఏదైనా సమానత ఉన్నట్లయితే వారి భావమును సహజంగా అర్థం చేసుకోగలరు. కావున ఇది కూడా తండ్రి సమానతకు సమీపంగా వెళ్ళటం ద్వారా మనస్సులోని సంకల్పాన్ని నోటి నుండి వచ్చిన వాణి లాగా క్యాచ్ చెయ్యగలరు. కానీ కేవలము మీ సంకల్పాల కల్తీ ఉండకూడదు. సంకల్పాల పైన కంట్రోలింగ్ పవర్ ఉండటము తప్పనిసరి. ఏవిధంగా బయటి వ్యవహారాలను కంట్రోల్ చేసే కంట్రోలింగ్ పవర్ కొందరిలో కొంత ఉంటే, కొందరిలో కొంత ఉంటుంది. అలాగే మనస్సులోని సంకల్పాల కార్యవ్యవహారమును కంట్రోల్ చేసే కంట్రోలింగ్ శక్తి నంబర్ వారీగా ఉంటుంది. కావున ఆ రెండు విషయాలు ఏమిటి?
ఒకటి, ప్రతి సమయము, ప్రతి క్షణము, ప్రతి కర్మ చేస్తూ నేను స్టేజ్ పైన ఉన్నాను అన్నదానిని ఎల్లప్పుడూ స్మృతిలో ఉంచుకోండి. ప్రతి కర్మపై అటెన్షన్ ను ఉంచటం ద్వారా సంపూర్ణతా స్టేజ్ కు సమీపంగా వస్తూ ఉంటారు. రెండవ విషయము - ఎల్లప్పుడూ మీ వర్తమాన మరియు భవిష్య స్టేటస్(హోదా)ను స్మృతిలో ఉంచుకోండి. కావున ఒకటి స్టేజ్, రెండవది స్టేటస్... ఈ రెండు విషయాలను ఎల్లప్పుడూ స్మృతిలో ఉంచుకోవటం ద్వారా స్టేటస్ కు విరుద్ధమైన ఎటువంటి కార్యమూ జరుగదు. మరియు తోడుతోడుగా మిమ్మల్ని మీరు స్టేజ్ పైన ఉన్నట్లుగా భావించుకోవటం ద్వారా ఎల్లప్పుడూ ఉన్నతమైన కర్తవ్యమును చేసే ప్రేరణ లభిస్తుంది. ఈ రెండు విషయాలను ఎల్లప్పుడూ స్మృతిలో ఉంచుకొని నడవండి. అచ్ఛా - మీరు దూరం నుండి వచ్చారా లేక బాప్ దాదా దూరం నుండి వచ్చారా? వేగము తీవ్రంగా ఉన్నాగానీ దూరమైతే ఎవరిది? మీరు ప్రయాణము చేసి వచ్చారు, బాప్ దాదా కూడా ప్రయాణము చేసి వచ్చారు. కావున ఇరువురూ ప్రయాణీకులే. కేవలము మీ ప్రయాణములో అలసట ఉంది మరియు ఈ ప్రయాణములో అలసట లేదు. మధువన నివాసులుగా అవ్వటము అన్నది కూడా డ్రామాలో చాలా చాలా సౌభాగ్యమునకు గుర్తు. ఎందుకంటే మధువనము వరదాన భూమి. కావున వరదాన భూమికి వచ్చారు. అది శ్రమతో కూడిన భూమి, ఇది వరదాన భూమి. కావున వరదాన భూమికి వచ్చి వరదాత నుండి లేక వరదాత ద్వారా నిమిత్తమై ఉన్న ఆత్మల ద్వారా ఎంతగా ఏ వరదానాలను తీసుకోవాలనుకుంటే అంతగా తీసుకోవచ్చు. నిమిత్తంగా అయి ఉన్న శ్రేష్ఠ ఆత్మల నుండి వరదానములను ఎలా తీసుకుంటారు? ఈ లెక్క తెలుసా? మధువనములో వరదానము లభిస్తుంది, వాయుమండలములో పవిత్ర, చరిత్ర భూమిలో వరదానాలైతే నిండి ఉన్నాయి కానీ నిమిత్తమైయున్న శ్రేష్ఠ ఆత్మల నుండి వరదానములను ఎలా తీసుకుంటారు? వరదానములో శ్రమ తక్కువగా ఉంటుంది. ఏవిధంగా మందిరాలలో పండాలు(పూజారులు) యాత్రికులను వరదానాన్ని ఇచ్చే దేవతల ముందుకు తీసుకొని వెళ్తారో అలా మీరు కూడా పండాలు. యాత్రికులకు వరదానాన్ని ఎలా ఇప్పిస్తారు? వరదానాన్ని తీసుకొనే సాధనము ఏది? శ్రేష్ఠ ఆత్మల ద్వారా వరదానము ఇందువలన లభిస్తుంది - ఎవరైతే నిమిత్తమైయుంటారో వారి కారణంగా వారి ప్రతి కర్మను చూసి సహజముగానే ప్రేరణ లభిస్తుంది. ఏ వస్తువునైనా సాకారములో చూసినట్లయితే త్వరగా దానిని గ్రహించవచ్చు. బుద్ధిలో ఆలోచించే విషయమును ఆలస్యంగా గ్రహిస్తారు.ఇక్కడ కూడా సాకారరూపములో ఎవరైతే సాకారుని చూసారో, వారికి స్మృతి చెయ్యటము సహజము మరియు బిందురూపమును స్మృతి చెయ్యటము కాస్త....... ఈ విధంగా ఎవరైతే నిమిత్తముగా అయి ఉన్నశ్రేష్ఠ ఆత్మలు ఉన్నారో వారి సేవ, త్యాగము, స్నేహము, సర్వుల సహయోగత్వపు ప్రాక్టికల్ కర్మను చూస్తున్నప్పుడు ఏ ప్రేరణ అయితే లభిస్తుందో అది వరదాన రూపములో సహజముగా ప్రాప్తిస్తుంది. కావున మధువన వరదాన భూమికి వచ్చి శ్రేష్ఠ ఆత్మలైన ప్రతి ఒక్కరి ద్వారా సహజముగా కర్మయోగిగా అయ్యే వరదానమును ప్రాప్తి చేసుకొనే వెళ్ళాలి. ఎందుకంటే కర్మ చేస్తూ స్మృతిలో ఉండటము కష్టము అని మీరు కూడా కష్టమైన సంగతిగా దీనినే చెప్తారు. కావున నిమిత్తముగా తయారైయున్న ఆత్మలను కర్మ చేస్తూ ఈ గుణాల ధారణలో చూస్తూ ఉంటే సహజంగానే కర్మయోగిగా తయారయ్యే ప్రేరణ లభిస్తుంది. కావున వారి ఒక్క వరదానమును కూడా వదిలి వెళ్ళవద్దు. సర్వ వరదానాలను ప్రాప్తి చేసుకుంటూ చేసుకుంటూ స్వయం కూడా మాస్టర్ వరదాతలుగా అయిపోతారు. అచ్ఛా!
Comments
Post a Comment