28-09-1969 అవ్యక్త మురళి

 28-09-1969         ఓంశాంతి        అవ్యక్త బాప్ దాదా      మధువనము

మొత్తం కోర్సు యొక్క సారం - చెప్పటం మరియు చేయటం సమానంగా ఉండాలి

                     ఏ రూపంలో అత్మిక సంభాషణ చేస్తున్నారు? అవ్యక్త రూపంతోనా లేక స్నేహ రూపంతోనా లేక శక్తి రూపంతోనా? తండ్రి రూపంలో అయితే సంభాషణ చేస్తూనే ఉన్నారు కానీ స్నేహ రూపంలోనా లేక శక్తి రూపంలోనా లేక అవ్యక్తరూపంలోనా? వర్తమాన సమయంలో రోజంతటిలో ఏ విశేష రూపం ఉంటుంది? ఈ మూడురూపాలలో ఎక్కువ ఏ రూపం ఉంటుంది? ఈ మూడింటిలో శ్రేష్టమైనది ఏది? (ప్రతి ఒక్కరు తమ సమాచారం వినిపించారు). ఇప్పుడు కేవలం ప్రశ్న అడుగుతున్నారు. ఆ తర్వాత స్పష్టం చేస్తాను. ఇప్పుడు అందరు ఏదైతే ఏక్సట్రా  ట్రైనింగ్ కోర్సు తీసుకున్నారో దానిలో అన్నింటికంటే శక్తిశాలి పాయింట్ ఏమి తీసుకున్నారు? ఏ పాయింట్ రాబోయే విఘ్నాలను ఒక్క సెకనులో సమాప్తి చేయగలదు? ప్రతి ఒక్కరు భిన్న భిన్న పాయింట్స్ వినిపించారు. ఇప్పుడు ఎవరైతే రకరకాల పాయింట్స్ చెప్పారో వారు వాటిని ఉపయోగించి వాటి ద్వారా ఎంత సమయంలో విఘ్నాలు దూరం అయ్యాయి? అని అనుభవం వ్రాసి పంపండి. ఏదైనా మందుని ఒకరు ఉపయోగించి చూస్తే తర్వాత అనేకమంది సహజంగా దాని లాభాన్ని తీసుకుంటారు. అలాగే ఇక్కడ రకరకాల పాయింట్స్ ఏవైతే వచ్చాయో వాటిన్నింటి సారం - రెండు మాటలలో స్మృతి చేయండి. వాటిలో మీ అందరి విషయాలు వచ్చేస్తాయి. 1.ఇప్పుడు ఏదైతే కోర్సు తీసుకున్నారో దాని సారం రెండు మాటలలో స్మృతి ఉంచుకోవాలి - ఏది చెప్తున్నారో అది చేయాలి. మేము బ్రహ్మకుమారీలం, మేము బాప్ దాదా పిల్లలం, ఆఙ్ఞాకారులం, సహాయకారులం ఇలా ఏ విషయాలైతే చెప్తున్నారో వాటిని ప్రత్యక్షంగా చేయాలి. చెప్పటం అంటే చేయటం, చెప్పటం మరియు చేయటంలో తేడా ఉండకూడదు. ఇదే కోర్సు యొక్క సారం. అనేక సం||లు నుండి వికారాలు అంటే చెడుగుణాలని ఇతరులకి వినిపిస్తున్నారు కానీ స్వయం గృహస్థం నుంచి అతీతం అయ్యి నడవటం లేదు. మీరు చెప్పటం మరియు చేయటంలో తేడా ఉంది. అందువలన ఈ రోజు నుండి ఈ విషయం స్మృతిలో ఉంచుకోండి - ఏది చెప్తానో అది  చేస్తాను, ఏదైతే ఆలోచిస్తున్నారో మరియు ప్రపంచం వారికి చెప్తున్నారో అది మీరు చేసి చూపించాలి. కేవలం చెప్పటమే కాదు, చేయాలి. ఇప్పుడు మిగిలి ఉన్న సేవ చెప్పటం ద్వారా జరగదు. మీరు చేయటం ద్వారా జరుగుతుంది. చెప్పటం, చేయటం మరియు ఉండటం అని అంటారు కదా! రోజంతటిలో ఏ కర్మ చేస్తున్నా, ఇంట్లో ఉంటున్నా చెప్పటం మరియు చేయటం మరియు ఉండటం ఈ మూడు ఒకే విధంగా ఉంటే త్వరగా కర్మాతీత స్థితికి చేరుకోగలరు. ప్రతి సమయం ఏది చెప్తున్నానో అది చేస్తున్నానా అని పరిశీలన చేస్కోండి. మేము సర్వశక్తివంతుని సంతానం అని చెప్తున్నారు కానీ ఏమి చేస్తున్నారు? బలహీన విషయాలు చేస్తున్నారు. ఈ రోజు నుండి ఏది చెప్తానో అది చేస్తాను అనే విషయం పక్కాగా చేస్కోండి. స్వయం ఇలా తయారైనవారిని చూసి ఇతరులు కూడా స్వతహాగానే చేస్తారు. మీరు శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. ఇప్పటివరకు మీరు చెప్పేది ఒకటి మరియు చేసేది ఇంకొకటి అని నింద చేస్తున్నారు. నిందని సమాప్తి చేసుకోవాలి. నింద సమాప్తి అయిపోతే ఏవిధంగా అయిపోతారు? ఉన్నతంగా అవుతారు. ఎంత ఉన్నతంగా అవుతారో అంత స్వతహాగానే పేరు ప్రఖ్యాతి అవుతుంది. మీరు తీసుకున్న కోర్స్ యొక్క ముఖ్య సారం - ఈ శిక్షణ. అందరికంటే భయంకరమైన మనుష్యులు ఎవరు? వారిని చూసి అందరు భయపడతారు. ప్రాపంచిక విషయం అయితే ప్రపంచంలోనే ఉంటుంది. కానీ దైవీ పరివారంలో అందరికంటే భయంకరమైనవారు, నష్టం చేసేవారు ఎవరంటే లోపల ఒకటి, బయటకి మరో రూపం ఉంచుకునేవారు. వీరు పరనిందకుల కంటే అతి భయంకరమైనవారు. వారి సమీపంగా ఎవరూ రాలేరు, వారికి ఎవరూ సమీపంగా కాలేరు. వారి నుండి అందరూ దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. అందువలన ఈ సభలో మీకు శిక్షణ లభించింది. దీనినే స్వచ్ఛత మరియు సత్యత అని అంటారు.
                 
                సత్యత ఏ విషయంలో ఉండాలి మరియు స్వచ్చత ఏ విషయంలో ఉండాలి? దీనికి కూడా చాలా గుహ్య రహస్యం ఉంది. సత్యత ఉన్నవారు ఏది చేస్తారో అదే వర్ణన చేస్తారు. ఏది ఆలోచిస్తారో అదే వర్ణన చేస్తారు. పైపైకి తయారుచేయరు. మనసా, వాచా, కర్మణా మూడు రూపాలలో ఉండాలి. ఒకవేళ మనస్సులో ఏదైనా సంకల్పం ఉత్పన్నం అయితే దానిలో కూడా సత్యత కావాలి. మరియు స్వచ్ఛత అంటే లోపల ఏ వికర్మ యొక్క మురికి ఉండకూడదు. ఏ భావ, స్వభావం, పాత సంస్కారాల మురికి ఉండకూడదు. స్వచ్చత ఉన్నవారే సత్యంగా ఉండగలరు. మరియు సత్యంగా ఉన్నవారి పరిశీలన ఏమిటి? సత్యంగా ఉన్నవారు అందరికీ ప్రియంగా అనిపిస్తారు. అందరికంటే ముందు ప్రభు ప్రియులుగా ఉంటారు. సత్యమైనవారికి యజమాని రాజీ అవుతారు. కనుక మొదట ప్రభు ప్రియులుగా అవుతారు, తర్వాత దైవీ పరివారానికి ప్రియంగా అవుతారు. వారి దృష్టి, వాణి, వారి కర్మలో పరిపక్వత ఉంటుంది ఎప్పుడూ స్వయం అలజడి అవ్వరు, ఇతరులని చేయరు. సత్యంగా ఉన్నవారే ప్రియంగా ఉంటారు. మేము సత్యమైనవారిమే కానీ మమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవటం లేదు అని కొంతమంది భావిస్తారు. సత్యమైన వజ్రం ఎప్పుడూ దాగదు. అందువలన నేను ఇలా ఉన్నాను కానీ ఎవరూ అర్ధం చేసుకోవటం లేదు అంటారు, ఇది కూడా సత్యత కాదు. సత్యం ఎప్పుడూ దాగదు. సత్యమైనవారు అందరికీ ప్రియంగా ఉంటారు. కొంతమంది మేము సమీపంగా లేము అందువలనే ప్రఖ్యాతి కావటం లేదు అని భావిస్తున్నారు. కానీ ఎవరైతే సత్వంగా మరియు పక్కాగా ఉంటారో వారు దూరంగా ఉంటూ కూడా తమ ప్రభావాన్ని దాచలేరు. ఎవరు ఎంత దూరంగా ఉన్నా కానీ బాప్ దాదాకి సమీపంగా ఉంటారు. ఎవరైతే బాబాకి సమీపంగా ఉంటారో వారు అందరికి సమీపంగా ఉంటారు. కనుక సత్యంగా అవ్వాలి. స్వచ్ఛత యొక్క ఋజువు నడవడికలో కనిపిస్తుంది. కేవలం అర్థం చేసుకోవటమే కాదు, కర్మలో చేసి చూపించాలి. ఏ కర్మ చేసినా ఇతరుల సేవకి నిమిత్తం అవ్వాలి. మీ మనసా, వాచా, కర్మణాని పరిశీలన చేస్కోండి. మిమ్మల్ని మీరు ఏమని పిలిపించుకుంటున్నారు? మరియు బాప్ దాదా కూడా మీ అందరికీ ఏ టైటిల్ ఇస్తున్నారో స్మృతి ఉందా? మీ టైటిల్ – సేవాధారి పిల్లలు, సేవాధారీల ప్రతి సంకల్పం, ప్రతి కర్మ, ప్రతీ మాట సేవ చేస్తుంది. ఉపన్యాసం చెప్పటం, ఎవరికైనా చెప్పటం కేవలం ఇది మాత్రమే సేవ కాదు. సేవాధారి ఆత్మలు అంటే ప్రతి సెకను సేవ చేస్తూ ఉంటారు. కనుక మా నడవడిక ప్రతి సెకను సేవాధారి నడవడిక వలె ఉంటుందా? అని మిమ్మల్ని మీరు చూసుకోవాలి. లేక ఎక్కడైనా డిస్ సర్వీస్ చేసేవిధంగా నడవడిక లేదు కదా? పేరు సేవాధారి కనుక కర్మ కూడా ఆవిధంగానే ఉండాలి కదా! అందువలన ఏది చెప్తున్నారో అది చేయాలి. ఇది స్మృతి ఉంచుకోవటం ద్వారా పురుషార్ధంలో సహజ సఫలత పొందుతారు. చాలా మంది మేము ఇంతమందికి చెప్పాం, ఇన్ని ఉపన్యాసాలు చెప్పాం , చాలా సేవ చేశాం అని సంతోష పడిపోతారు. కానీ అది హద్దు యొక్క సేవ అయ్యింది. ఇప్పుడు బేహద్ సేవ చేయాలి. మనసా, వాచా, కర్మణా మూడు రూపాలతో బేహద్ సేవ చేయాలి. వీరినే సేవాధారి అని అంటారు. మేము సేవాధారిగా అయ్యామా  అని మీకు మీరు చూస్కోండి. ఇలాంటి సేవాధారి ఆత్మలే చాలా స్నేహిగా ఉంటారు. ఇప్పుడు ఇలాంటి ముద్ర వేసుకున్నారా? లేక కొందరు ధైర్యం పెట్టుకుంటున్నారా? చేయాలి అనుకుంటే ముద్ర వేసుకున్నట్లే. మీపై మీరు సంశయం ఎందుకు పెట్టుకుంటున్నారు? పరీక్షలో పాస్ అవుతానో లేదో అనే సంశయం ఎందుకు? తెలివైన విద్యార్థి సదా నేను మొదటి నెంబరులో వస్తాను అని నిశ్చయంగా చెప్తారు. ఒకవేళ మొదటే మీలో సంశయం పెట్టుకుంటే సంశయం యొక్క ఫలితం ఎలా ఉంటుంది? విజయీ కాలేరు. కొంచెమైనా సంశయం ఉంటే విజయీ కాలేరు. నిశ్చయం లేనంతవరకు విజయం లభించదు. మీరు ఆదిలో వారసత్వం తీసుకునే వదులుతాం అనే నిశ్చయంలో ఉండేవారు కదా! లేక చూస్తాం అని అనుకున్నారా? నిశ్చయంతో అన్నారంటే అయిపోయినట్లే. నిశ్చయబుద్ది అంటే ఏ విషయంలోనూ అంటే బాబాపై లేదా బాబా జ్ఞానంపై, పరివారంపై సంశయం యొక్క సంకల్పం రాకూడదు. మేము శివబాబా పిల్లలం, సర్వశక్తివంతుని పిల్లలం కనుక నిశ్చయబుద్ది ఆత్మలం అని ఎవరు చెప్తారు? సర్వశక్తివంతుని పిల్లలే చెప్తారు. నిశ్చయం పెట్టుకోవటం ద్వారానే విజయీ అవుతారు. చేసిన తర్వాత ఏమౌతుందో తెలియదు అని లోపల అనుకున్నా కానీ మరలా నిశ్చయం ఉంటే విజయం తప్పకుండా లభిస్తుంది. ఒకవేళ నిశ్చయం లేకపోతే మీ కర్మ కూడా అలాగే ఉంటుంది. మేము చేయవలసిందే అనే నిశ్చయం ఉంటే కర్మ కూడా ఆవిధంగానే ఉంటుంది. చేస్తాం, చూస్తాం  అనుకుంటే కర్మ కూడా బలహీనం అయిపోతుంది. ఎప్పుడూ కూడా మీలో సంశయం యొక్క బలహీన సంకల్పం రాకూడదు. బలహీన సంకల్పమే సంశయం. ఇప్పుడు ఎంత వరకు పాత సంస్కారాలు మరియు స్వభావాలు ఉంటాయి? పాత సంస్కారాలు కూడా ఉండకూడదు. సంస్కారాలు అనేవి స్థూల విషయం. కానీ సూక్ష్మ పాత సంకల్పాలని కూడా సమాప్తి చేయాలి. అప్పుడే భట్టీ నుండి గట్టిగా అయ్యి వెళ్తున్నారు అని అంటారు. 

                 భట్టీ అంటే అర్థం ఏమిటి? భట్టీలో మొత్తం కాలి సమాప్తి అయిపోవాలి. రంగు, రూపమే మారిపోవాలి. ఏ వస్తువుని అయినా భట్టీలో వేస్తే దాని రంగు, రూపం మొదలైనవి అన్నీ మారిపోతాయి కదా! అలాగే మీరు కూడా భట్టీ చేసుకుంటున్నారు కనుక రంగు, రూపం, గుణం మారాలి. ఇటుకని కాల్చక ముందు మట్టిలా ఉంటుంది. కాలిన తర్వాత దాని రంగు, రూపం, గుణం మారిపోతాయి మరియు కర్తవ్యం కూడా మారిపోతుంది. ఈ విధంగా మీ రూపం, గుణం మరియు కర్తవ్యం మూడు మారాలి. ఇది భట్టీ యొక్క ఫలితం. ఇప్పుడు చెప్పండి, మారిపోయారా? లేక మారతారా? మీ ఉత్సాహానికి బాబా కూడా సహాయం చేస్తారు. ఎంత మీపై నిశ్చయం పెట్టుకుంటారో అంతగా బాప్ దాదా కూడా తప్పకుండా సహాయకారి అవుతారు. స్నేహీలకు తప్పక సహయోగం లభిస్తుంది. ఎవరి నుండి అయినా సహయోగం తీసుకోవాలంటే,స్నేహి అవ్వాలి. స్నేహీలకు సహయోగం అడగవలసిన అవసరం ఉండదు.బాప్ దాదాకి మరియు  పరివారానికి కూడా స్నేహి అవుతారు. కనుక అందరి సహయోగం స్వతహాగానే లభిస్తుంది. ముఖ్యమైనవి రెండు విషయాలు నిశ్చయబుద్ధి మరియు నష్టోమోహ. ఈ తిలకం మస్తకంపై పెట్టబడే ఉంది. స్లోగన్ కూడా స్మృతిలో ఉంచుకోవాలి. ఏది చెప్తామో అదే చేయాలి. ఇది మాతల అలంకరణ. మాతలు బాగా అలంకరణ చేసుకుంటారు కదా! ఈ మాతలకి రత్నాలతో అలంకరణ చేస్తున్నారు. అన్నింటికంటే రత్నాల అలంకరణ బాగా మెరుస్తుంది. బంగారంలో కూడా రత్నాలు ఉంటే ఎక్కువగా మెరుస్తుంది. కనుక బాప్ దాదా ఈ మాతలని రత్నాలతో అలంకరిస్తున్నారు. ఎందుకంటే సంగమయుగంలో బంగారం కంటే ఎక్కువగా వజ్రంగా అవ్వాలి. ఎంతెంత మిమ్మల్ని మీరు రత్నాలతో అలంకరింప చేసుకుంటారో అంతగా వద్దనుకున్నా ప్రపంచం వారి దృష్టి మీవైపు వస్తుంది. మా వైపు చూడండి అని ప్రపంచానికి మీరు చెప్పవలసిన అవసరం లేదు. ఈ జ్ఞానరత్నాల అలంకరణ దూరంగా ఉన్నవారిని కూడా ఆకర్షిస్తుంది. అందువలన ఈ రత్నాల శృంగారం సదాకాలికంగా స్థిరంగా ఉంచుకుంటాము అని నిశ్చయం పెట్టుకోవాలి. ఈరోజు అమృతవేళ విశేషంగా కొంతమంది పిల్లలు, సాకార రూపంలో వెంట ఉండే పిల్లలు స్మృతి వచ్చారు. ఈరోజు విశేషంగా వారి స్మృతి వచ్చింది. ఎందుకంటే వారి పురుషార్ధం ఇంతకు ముందు కంటే చాలా బావుంది. అందువలన పురుషార్థము యొక్క స్నేహంలో వారు జ్ఞాపకం వచ్చారు. వర్తమానంలో మధువనం వారిలో విశేష పరివర్తన కనిపిస్తుంది. ప్రతి స్థానంలో ఒక్కొక్క రత్నం మెరుస్తూ వెళ్తుంది. ఇప్పుడు ఒక్కొక్క స్థానం నుండి మెరిసే నక్షత్రం వెళ్ళి మరలా మీ సమానంగా ఇతరులను ఎలా తయారుచేస్తారో చూస్తాను. ఎప్పుడు ధైర్యహీనుల మాటలు మాట్లాడకూడదు. పురుషార్ధహీనంగా లేక ధైర్యహీనంగా అయ్యే రోజులు అయిపోయాయి. ఇప్పుడు సహాయకారి అవ్వాలి మరియు అయ్యి చూపించాలి ఇప్పుడు అందరి మనస్సులో ఇది ఉంటుంది - మేము కూడా త్వరత్వరగా వెళ్ళిపోవాలి అని. ఇంతకు ముందు అయితే సంగమయుగం ఎంత ఎక్కువ సమయం ఉంటే అంత మంచిది అనేవారు. ఎందుకంటే సాకార బాబా వెంటే ఉంటూ సంగమయుగి మజాలో ఉండేవారు. మీ నడవడిక మాటకంటే ఎక్కువ సేవ చేస్తుంది. డబల్ సర్వీస్లో సఫలత వచ్చినప్పుడే డబల్ కిరీటం లభిస్తుంది. చెప్పండి - ద్వి కిరీటధారులు అవ్వాలా లేక ఏక కిరీటధారులా? శక్తిరూపంగా అయ్యే సాధనం ఏమిటి? ఎప్పుడైతే అవ్యక్తస్థితి తయారవుతుందో అప్పుడే శక్తిరూపంగా అవుతారు. అవ్యక్త స్థితిలో ఉంటూ వ్యక్తంలోకి వస్తున్నా కేవలం సేవ కోసం రావాలి. సేవ సమాప్తి అయిపోయిన తర్వాత అవ్యక్త స్థితిలో స్థితులవ్వాలి. ఇటువంటి అభ్యాసం ఉండాలి. ఎవరైతే బలి అవుతారో వారికి రిటర్నులో  ఏమిలభిస్తుంది? బలి అయినవారికి చాలా ఈశ్వరీయబలం లభిస్తుంది! ఎవరైతే సంపూర్ణ స్వాహా అవుతారో వారు సదా సౌభాగ్యవంతులుగా అవుతారు. వారి సౌభాగ్యం సమాప్తి కాదు. ఎవరైతే సదా సౌభాగ్యశాలిగా ఉంటారో వారికి అవినాశి బిందువు సదా ఉంటుంది. ఆత్మ స్థితిలో స్థితులయ్యే తిలకం సౌభాగ్యశాలికి సదా మస్తకంలో ప్రతి సమయం స్మృతి ఉంటుంది. సదా సౌభాగ్యశాలికి మరో గుర్తు ఏమిటి? 1.బిందువు (తిలకం) 2. గాజులు అంటే కలయిక రూపి గాజులు. రెండూ ఎప్పుడూ తీయరు, కలయిక అనే గాజులు తీసేయటం ద్వారా సౌభాగ్యం సమాప్తి అయిపోతుంది. ఇప్పుడు విశేషంగా అద్భుతం చేసే సేవ చేయాలి. మీ కలయిక ద్వారా అందరికి ఎప్పుడు చెరగనటువంటి రంగు అంటించండి. మ్యూజియంలో అయితే కేవలం సందేశం తీసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ మీ సాంగత్యం రంగు ఎంత అవినాశి ఉండాలంటే వారికి అది చెరిగిపోకూడదు ఇంత ధ్యాస ఉండాలి. ఇప్పుడు జంప్ చేసి ముందుకి వెళ్ళాలి. మొదట నడిచేటువంటి సమయం ఉండేది. తర్వాత పరుగు పెట్టే సమయం వచ్చింది. ఇప్పుడు జంప్ చేసే సమయంలో ఒకవేళ పరుగు పెట్టి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తే టూలేట్ (బాగా ఆలశ్యం) అయిపోతుంది. జంప్ చేస్తే సమయం ఎక్కువ పట్టదు. ఏకరసస్థితిలో ఉండడానికి ఒకే శుద్ధ సంకల్పం ఉంచుకోవాలి. ఆ ఒక్క సంకల్పం ఏమిటి? 1.స్నేహి అవ్వాలి. 2.నేను సర్వీసబుల్ (సేవాధారి) అంతే. ఇవి తప్ప ఇంకే సంకల్పం ఉండకూడదు. సేవాధారులకు సేవ సంకల్పమే నడుస్తుంది. భట్టి యొక్క లక్ష్యం స్వయం మారి ఇతరులని మార్చాలి. ఈ లక్ష్యం సదా స్మృతి ఉండాలి - ఇదే నిశ్చయం యొక్క ముద్ర. మీ పై ఏ ముద్ర వేసుకున్నారు? నిశ్చయబుద్ది నష్టోమోహ మరియు సర్వీసబుల్. ఈ త్రిమూర్తి ముద్ర యొక్క గుర్తు వేయబడింది. మీకంటే ఉన్నతంగా గుర్తు స్థిరంగా ఉంచుకోవాలి. మీ సమానంగా ఇతరులని కూడా చేయాలి. తక్కువగా కాదు. మనకంటే ఉన్నతంగా ఎవరైనా అయ్యారంటే అది కూడా మీ ఉన్నత స్థితి కదా!

Comments

Post a Comment