27-08-1969 అవ్యక్త మురళి

 27-08-1969                    ఓంశాంతి                 అవ్యక్త బాప్ దాదా           మధువనము

సహాయం తీసుకునేటందుకు సాధనం - ధైర్యం

                 ఈ రోజు చిన్న తోటలో విహరించడానికి వచ్చాను. ఆత్మిక పిల్లలని కలుసుకోవడానికి వచ్చాను. వీరు నా కంటిరత్నాలు అని బాబా భావిస్తున్నారు. నయనరత్నాలైన పిల్లలు సదా ఆత్మిక గులాబీ సదృశ్యంగా సువాసన ఇస్తున్నారు. పిల్లలలో ఇంత ధైర్యం ఉందా? బాబాకి పిల్లలపై ఎంత నమ్మకం ఉందో అంత ధైర్యం ఉందా? ఈరోజు పిల్లలు పిలవలేదు. పిలవకుండానే బాబా వచ్చారు. ఇది కూడా అనాదిగా తయారైపోయిన నియమం. సంగమయుగంలో పిల్లలని అలంకరించడానికి బాబా అడగకుండానే రావలసి వస్తుంది. ఈ రోజు పిల్లలను ప్రశ్న అడుగుతున్నారు - ఈరోజు ఈ తోటలో కూర్చున్నవారు మిమ్మల్ని మీరు పుష్పగుచ్ఛంలో పుష్పమై శోభనివ్వడానికి యోగ్యులం అని భావిస్తున్నారా? రాఖీ ప్రతి ఒక్కరు కట్టుకున్నారా? పైకి ఎక్కడం మరియు పడటం మరలా ఎక్కటం ఇది ఎవరి పని? జంతువులకే ఈ పని ఉంటుంది. జాలం వేయటం క్రిందకి రావటం, మరలా పైకి వెళ్ళటం, మరలా జాలంలో కూర్చోవటం, పిల్లలైన మీరు జాలంలో చిక్కుకుని ఉన్నారా? లేక విడిపించుకున్నారా? మీకు ఏదైతే లక్ష్యం ఉంటే దానిలో ఉంటున్నారా? మీరు స్వమానం ధారణ చేసి ఇతరులచే కూడా చేయిస్తున్నారా? రక్షాబంధనం ఏదైతే కట్టుకున్నారో దాని రహస్యం ఏమిటి? ఈరోజు బాబా పిల్లలను కలుసుకోవడానికి వచ్చారు. చాలా పెద్ద భాధ్యత తీసుకున్నారు. చిన్న చిన్న భాధ్యతలు తీసుకుంటే ఎంతగానో అలసిపోతున్నారు. మొత్తం సృష్టి యొక్క భాధ్యత ఎవరిపై ఉంది? బరువు తలపై పెట్టుకోవాలి మరియు దించేయాలి కానీ అలసిపోకూడదు. పిల్లలకి అలసట ఎందుకు అనుభవం అవుతుంది? ఎందుకంటే స్వయాన్ని ఆత్మిక గులాబీగా భావించడం లేదు. అత్మగా భావిస్తే దేహానికి అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు. ఎలా అయితే బాబాయో పిల్లలు కూడా అలాగే ఉండాలి.                
                 ఎంత ధైర్యం ఉంటుందో అంతగానే బాబా కూడా సహాయం ఇస్తూ ఉన్నారు. ధైర్యం ద్వారా సహాయం లభిస్తుంది. మరియు సహాయం ద్వారానే పర్వతం ఎత్తగలరు. కలియుగ మట్టి పర్వతం ఎత్తి సత్యయుగీ బంగారు పర్వతంగా చేయాలి. ఎలా తయారుచేయాలనే ప్రశ్నలో ఉన్నారు. ఈ రోజు కొంచెం సమయం సంభాషణ చేయడానికి బాబా రావలసి వచ్చింది. బాబాకి కోరిక ఉంటుందా? బాబా అయితే కోరికకి అతీతంగా మరియు కోరిక రహితంగా ఉంటారు. అయినప్పటికీ కోరిక ఎందుకు? మీరందరు కోరికకి అతీతంగా అవుతుంటే బాబాకి కోరిక ఉంటుందా? బాబా ఎవరిని ఎలా సంభాళించేవారో మరియు సంభాళిస్తున్నారో మీకు తెలియదా? మీరు కూడా సంభాళించబడుతున్నారు. ఇంత భాధ్యతను ఏవిధంగా రమణీయంగా సంభాళిస్తూ బాబా యొక్క కోరికను పూర్తి చేసారు. ఇప్పుడు పిల్లల కోరిక కూడా పూర్తి చేస్తున్నారు. ఇటువంటి వారినే తెలివైన రమణీయత కలవారు అని అంటారు. బాబాకు ప్రతి ఒక పిల్లవాని కోరిక పూర్తి చేయవలసి ఉంటుంది. అలా చేస్తూ కూడా అక్కడక్కడ తన ఆజ్ఞపై నడిపిస్తారు. పిల్లల కోరిక ఎందుకు పూర్తి చేస్తారు? పిల్లలందరు బాబా యొక్క శిరోమణులు. శిరోమణులను అప్పుడప్పుడు తలపై కూర్చోపెట్టుకోవలసి వస్తుంది. పిల్లలకు సంతోషం ఇవ్వవలసి ఉంటుంది. అందుకే ముందు పిల్లలు తర్వాత తండ్రి. పురుషార్ధం చేస్తూ చేస్తూ చల్లబడిపోతే తిరిగి పురుషార్ధమును తీవ్రం చేసుకునేటందుకు ప్రయత్నించండి. ప్రశ్న అడుగుతున్నారు - కంకణం పూర్తిగా కట్టుకున్నారా? భూమి విచలితం అయినా ధర్మం వదలకూడదు. ఈనాడు విరోధి కూడా శత్రువు నుండి మిత్రుడిగా అయిపోతున్నారు. పాండవులకి మహిమ ఉండనే ఉన్నది. శత్రువుల నుండి మిత్రులుగా అయితే అయ్యారా? రాత్రిని చూడకుండా సదా వగలులో ఉండండి. రాత్రిని చూస్తే పంచవికారాల శత్రువులు రాత్రి పని చేసేవి వచ్చేస్తాయి. పిల్లలు సదా అడుగు ముందుకే వేయాలి. లభించబోయే కిరీటం, సింహాసనంపై దృష్టి ఉండాలి. కేవలం మేము ఇలా అవుతాము అని చెప్పటం వరకు కాదు. కానీ ఇప్పుడు ధారణ చేయాలి - లక్ష్మీనారాయణులు ఎలా నడుస్తారు, ఎలా అడుగువేస్తారు, ఎలా నయనాలు కదుపుతారో అటువంటి నడవడిక ఉందా? అప్పుడే లక్ష్మీనారాయణులు అవుతారు. నయనాలు పైకి ఎత్తి నావంటి వారు ఎవరు లేరు అనే దేహాభిమానం వచ్చేస్తుంది. నాది, నీది అనేది వచ్చేస్తుంది. భక్తి మార్గంలో కూడా నమ్రత మనుష్యుల నయనాలను క్రిందకి ఉండేలా చేస్తుంది. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలి, సదా సువాసన ఇస్తూ ఉండండి. ఏదైతే లక్ష్యం లభించిందో అలా లక్ష్మి నారాయణులుగా అవ్వాలి, సత్యమార్గంలో నడవాలి. అడుగు మున్ముందుకి వేయాలి.  బాబా దగ్గరికి ఈ రోజు సందేశి బోగ్ తీసుకువస్తే బాబా అన్నారు - మీరు ఇక్కడ ఉండగానే రాజు అయిపోయారు అని. బాబా యొక్క బెగ్గర్ (బీద) టోలీ (ప్రసాదం) మర్చిపోయారు. వైభవాలు అయితే సత్యయుగంలో లభిస్తాయి. సంగమయుగంలో బెగ్గర్ టోలీ స్మృతి వస్తుంది. అదే బాబాకి ప్రియమనిపిస్తుంది. సుదాముని అటుకులకి విలువ ఉంది కదా! ఆ టోలీలో ప్రేమ నిండి ఉంటుంది. తయారు చేసేవారు ప్రేమ నింపితే బాబా మరింత ప్రేమ నింపి పిల్లలకి తినిపిస్తారు. (సింధు హల్వా తినిపించారు) దీదీ సర్వీస్ పూర్తి చేసుకొని వచ్చారు. అందరు మంచిగా ఉన్నారు. అందరు నియమానుసారం నడుస్తున్నారా? భయపడవలసిన విషయం ఏమి లేదు. సమయం యొక్క విధి, పిల్లలు ప్రతి విషయంలో పురుషార్థం చేయాలి. సమయాన్ని చూసి అవినాశి జ్ఞాన యజ్ఞ కుండాన్ని నింపాలి, స్వాహా చేసేయాలి. యజ్ఞం సదా స్థిరంగానే ఉండాలి. అక్కడ యజ్ఞాలైతే 10-12 రోజులు జరుగుతాయి అంతే కానీ ఇది అవినాశి యజ్ఞం. శివబాబా ఖజానా నిండుగా ఉంటుంది, కష్టాలన్నీ దూరం అవుతాయి. క్రొత్త ప్రపంచంలోకి వెళ్ళినప్పుడే అన్నీ దూరం అవుతాయి. అన్నీ మంచిగా నడుస్తాయి. కేవలం పిల్లల బుద్ది దృఢంగా మరియు దూరదేశీగా ఉండాలి. దూరదేశీ అవ్వడానికి కిరీటం, సింహాసనం ఇచ్చాను.

Comments

  1. ఓంశాంతి, స్వయంలో అలసట రావడానికి కారణం ఏమిటి? లక్ష్మీనారాయణులుగా ఎలా అవుతారు? దేహాభిమానం ఎప్పుడు వస్తుంది? బాబాకి ఏది ప్రియమనిపిస్తుంది? ఈ విషయాలన్నీ బాప్ దాదా ఈ అవ్యక్తమురళిలో తెలిపించారు. ఓంశాంతి.

    ReplyDelete
  2. Om shanthi Mera Bapdada. Thank you Pyare Baba.

    ReplyDelete

Post a Comment