26-01-1970 అవ్యక్త మురళి

 * 26-01-1970         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“స్మృతియాత్ర యొక్క సంపూర్ణ స్థితి"

బాప్ దాదా కూడా ఇక్కడ కూర్చున్నారు, మీరు కూడా కూర్చున్నారు. కానీ బాప్ దాదా మరియు మీలో ఏ అంతరము ఉంది? మొదట కూడా సాకార రూపములో ఇక్కడ కూర్చున్నారు కానీ ఇప్పుడు కూర్చున్నప్పుడు ఎలా అనుభవమవుతుంది? సాకారరూపంలో తండ్రి అద్దెకు తీసుకుని వచ్చారు అని భావించేవారు. అదే సమానమైన అనుభవము ఇప్పుడు ఉంది, అతిథిగా అయి ఇప్పుడు వస్తారు. మీరందరు కూడా స్వయాన్ని అతిథిలుగా భావిస్తారు. కానీ మీరు అనుకోవటములో మరియు తండ్రి అనుకోవటములో తేడా ఉంది. ఎవరైతే వచ్చి వెళ్ళిపోతారో వారిని అతిథి అని అంటారు. మరల వెళ్ళేందుకే ఇప్పుడు వస్తారు. అప్పుడు ఉన్నది బుద్ధియోగపు అనుభవము, ఇది ప్రాక్టికల్ అనుభవము. మరొక శరీరములో ప్రవేశించి ఎలా కర్తవ్యమును చెయ్యటము జరుగుతుందో, ఆ అనుభవమును తండ్రి సమానంగా చెయ్యాలి. దిన ప్రతిదినము పిల్లలైన మీ సమాన స్థితి కలుగుతూ ఉంటుంది. మీరు కూడా అలా అనుభవము చేస్తారు. నిజంగా అద్దెకు తీసుకున్నట్లుగా, కర్తవ్యము కొరకు అతిధులుగా భావిస్తారు. ఎప్పటివరకైతే మిమ్మల్ని అతిథిగా భావించరో అప్పటివరకు అతీతమైన అవస్థ ఉండజాలదు. ఎవరైతే ఎక్కువ అతీత స్థితిలో ఉంటారో వారి స్థితిలో ఏ విశేషత ఉంటుంది? వారి మాటల నుండి, నడవడిక నుండి ఇతరులకు ఉపరామ(అతీత) స్థితి యొక్క అనుభవము కలుగుతుంది. స్థితి ఎంతగా ఊపర్ (పైకి) వెళ్తుందో, అంతగా ఉపరామముగా అవుతూ ఉంటారు. శరీరములో ఉంటూ కూడా ఈ ఉపరామ స్థితివరకు చేరుకోవాలి. దేహము మరియు దేహీ(ఆత్మ) పూర్తి వేరుగా అనుభవమవ్వాలి, దీనినే సృతియాత్ర యొక్క సంపూర్ణ స్థితి లేక యోగపు ప్రాక్టికల్ సిద్ధి అని అంటారు. మాట్లాడుతూ మాట్లాడుతూనే అతీతత్వము ఆకర్షించాలి, మాటలను వింటూ కూడా విననట్లు ఉండాలి. అటువంటి భావము ఇతరులకు కూడా రావాలి. ఇటువంటి స్థితి కలిగిన అవస్థను కర్మాతీత అవస్థ అని అంటారు. కర్మాతీతము అనగా దేహ బంధనాల నుండి కూడా ముక్తి కావటము. కర్మ చేస్తున్నారు కానీ వారి కర్మల ఖాతా తయారవ్వదు, అతీతంగా ఉంటారు, ఎటువంటి అటాచ్ మెంట్ ఉండదు. కర్మ చేసేవారు వేరు మరియు కర్మ వేరు. ఇటువంటి అనుభవము రోజు రోజుకు కలుగుతూ ఉంటుంది. ఈ స్థితిలో ఎక్కువ బుద్ధిని నడిపించే ఆవశ్యకత కూడా ఉండదు. సంకల్పము చేసారు మరియు ఏది జరగాలో అదే జరుగుతుంది. ఇటువంటి స్థితిలోకి అందరూ రావలసి ఉంటుంది. మూలవతనమునకు వెళ్ళే ముందు వయా సూక్ష్మవతనము వెళ్తారు. అక్కడకు వచ్చి అందరినీ కలవాలి, మళ్ళీ మీ ఇంటికి వెళ్ళి, తరువాత మీ రాజ్యములోకి వచ్చేస్తారు. సాకారవతనములో ఏవిధంగా మేళా జరిగిందో అలాగే సూక్ష్మవతనములో ఉంటుంది. ఆ ఫరిస్తాల మేళా సమీపములో ఉంది. ఫరిస్తాలు పరస్పరములో కలిసేవారు, ఆత్మ ఆత్మతో మాట్లాడుతుంది అని కథలు చెప్తుంటారు కదా! దానినే అనుభవము చేస్తారు. కావున ఏ కథలైతే గాయనము చెయ్యబడినవో ప్రాక్టికల్ లో వాటి అనుభవము ఉంటుంది. ఆ మేళా రోజుల కొరకు ఎదురుచూస్తున్నారు.

ఇప్పుడు సేవకు నిమిత్తులుగా ఉన్నారు, అన్నింటినీ మరచిపోయి కూర్చున్నారు ఆ అవ్యక్త స్థితిలో
మనస్సు మరియు తనువు వ్యక్త దేశములో ఉన్నాయి. అటువంటి అనుభవము కలుగుతోందా? అచ్ఛా!

మిమ్మల్ని ఎక్కడి నివాసీలుగా భావిస్తున్నారు? పరంధామ నివాసులుగా భావిస్తున్నారా? ఈ సృతి ఎంతసేపు ఉంటుంది? పరంధామ నివాసీ ఆత్మలమైన మేము ఈ వ్యక్త దేశములోకి ఈశ్వరీయ కార్యమును చేసేందుకు నిమిత్తమై వచ్చి ఉన్నాము అన్న ఈ ఒకే విషయము గుర్తు ఉన్నట్లయితే ఉపరామముగా ఉంటారు. మధువనమునకు వచ్చి విశేషంగా ఏ గుణమును తీసుకున్నారు? మధువనపు విశేష గుణము మధురత. మధువు అనగా మధురత. స్నేహి, ఎంత స్నేహీలుగా ఉంటారో అంత అనంతమైన వైరాగ్యము ఉంటుంది. ఇదే మధువనమునకు అర్థము. అతి స్నేహీలు మరియు అంతగానే, అనంతమైన వైరాగ్యవృత్తి. ఒకవేళ మధువనపు విశేషతను జీవితములో ధారణ చేసి వెళ్ళినట్లయితే సహజముగానే సంపూర్ణమవ్వగలరు. మరల ఎవరైనా ఆత్మిక టీచర్లుగా అవ్వాలనుకుంటే నంబర్ వన్ టీచరుగా అవ్వగలరు ఎందుకంటే మీ ధారణ ఎలా ఉంటుందో అలా ఇతరులను అనుభవములోకి తీసుకురాగలరు. ఈ రెండు గుణాలను మీలో ధారణ చేసుకోవాలి. మధువనపు రేఖ నుండి బయటకు వెళ్ళేముందు పూర్తిగా వీటిని నింపుకొని వెళ్ళాలి. ఒకటి స్నేహము, మరొకటి అనంతమైన వైరాగ్య వృత్తుల ద్వారా ఎటువంటి పరిస్థితినైనా సహజముగానే ఎదుర్కొంటారు. సఫలతా సితారలుగా అయ్యేందుకు ముఖ్యంగా ఈ రెండు గుణాలను మధువనపు బహుమతులుగా తీసుకుని వెళ్ళాలి. ఎలా అయితే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అక్కడకు వెళ్ళటంతోనే, ఇక్కడి విశేషమైన వస్తువులు ఏమిటి అని అడగడం జరుగుతుంది. ప్రసిద్ధమైన విశేష వస్తువులను తప్పకుండా తమతోటి తీసుకువెళ్లారు. కావున ఇక్కడి
మధువనపు రెండు విశేష గుణాలను మీతోటి తీసుకువెళ్ళాలి. స్థూలమైన మధువు(తేనె)ను ఏవిధంగా తీసుకువెళ్తారో అలా ఈ సూక్ష్మమైన మధురత కలిగిన మధువును తీసుకువెళ్ళాలి, అప్పుడిక సఫలతయే సఫలత, అసఫలత మీ జీవితము నుండి తొలగిపోతుంది. మీ మస్తకముపై సఫలతా సితార మెరుస్తూ ఉండటము చూస్తారు.

 మీరు సఫలతా సితారలా లేక పురుషార్థపు సితారలా? ఏమని భావిస్తున్నారు? సఫలతా సితారలా? లక్ష్యము ఏవిధంగా ఉంటుందో లక్షణము ఆవిధంగానే ఉంటుంది. ఒకవేళ ఇప్పటివరకు కూడా మేము పురుషార్థులము అని ఆలోచిస్తూ ఉన్నట్లయితే అలా భావించటము ద్వారా అనేక చిన్న చిన్న పొరపాట్లను క్షమించేసుకుంటారు. మేమైతే పురుషార్థులము అని భావిస్తారు. కావున ఇప్పుడు పురుషార్థులుగా కాకుండా సఫలతా స్వరూపులుగా అవ్వాలి. పురుషార్థములో ఎప్పటివరకు ఉంటారు? ఎప్పుడైతే స్వయము సఫలతా స్వరూపులుగా అవుతారో అప్పుడు ఇతర ఆత్మలకు కూడా సఫలతా మార్గమును చూపించగలరు. ఒకవేళ స్వయమే అంతిమము వరకు పురుషార్థిగానే నడుస్తూ ఉన్నట్లయితే సంగమయుగ ప్రాలబ్దపు అనుభవమును ఎప్పుడు చేసుకుంటారు? సంగమయుగ పురుషార్థపు ఫలము ఏమిటి? (సఫలత) కావున సఫలతా స్వరూపమును కూడా నిశ్చయము చేసుకోవటము ద్వారా సఫలత లభిస్తూ ఉంటుంది. నేను ఉన్నదే సఫలతా సితారగా అని భావించినప్పుడు అసఫలత ఎలా రాగలదు? సర్వశక్తివంతుని పిల్లలకు ఏ కార్యములోనూ అసఫలత ఉండజాలదు. మీ మస్తకముపై విజయ సితారను చూస్తున్నారా లేక చూస్తారా? విజయమైతే నిశ్చితమే కదా! విజయము అనగా సఫలత, ఇప్పుడు సమయము మారుతూ ఉంది. సమయము మారుతున్నప్పుడు మీ పురుషార్థమును కూడా మార్చుకోవాలి కదా! ఇప్పుడు తండ్రి సఫలతా రూపమును చూపించినప్పుడు పిల్లలు కూడా రూపములో, వ్యక్తదేహములో ఉంటూ సఫలతారూపమును చూపించరా? స్వయాన్ని ఎల్లప్పుడూ సఫలతామూర్తులుగా భావించండి. నిశ్చయమునే విజయము అని అంటారు. ఎటువంటి విశ్వాసము ఉంచటము జరుగుతుందో అటువంటి కర్మనే జరుగుతుంది. నిశ్చయములో లోపము ఉన్నప్పుడు కర్మలో కూడా లోపము ఏర్పడుతుంది. స్మృతి శక్తివంతముగా ఉన్నట్లయితే స్థితి మరియు కర్మ కూడా శక్తివంతమవుతాయి. కావున ఎప్పుడు కూడా మీ స్మృతిని బలహీనముగా ఉంచుకోకూడదు. శక్తిదళము లేక పాండవులకు ఎప్పుడైనా అసఫలత లభించగలదా? పాండవులు ఏం చేసారు అన్న మీ కల్పపూర్వపు విషయము గుర్తుందా? విజయులుగా అయ్యారు. కావున ఇప్పుడు మీ స్మృతిని శ్రేష్ఠముగా తయారుచేసుకోండి. ఇప్పుడు సంగమయుగములో విజయ తిలకము లభిస్తుంది మళ్ళీ ఈ విజయ తిలకము ద్వారా రాజ్య తిలకము లభిస్తుంది. ఈ విజయ తిలకమును ఎవ్వరూ చెరిపేయజాలరు. అంతటి నిశ్చయము ఉందా? విజయరత్నాలెవరైతే ఉంటారో వారి ప్రతి మాటలో విజయమే విజయము ఉంటుంది. వారి ఓటమి జరుగజాలదు. ఓటమినైతే అనేక జన్మలు పొందుతూ ఉన్నారు. ఇప్పుడు వచ్చి విజయులుగా అయిన తరువాత కూడా ఇంకా ఓటమి
ఎందుకు? "విజయము మాదే” అలా ఒకే బలము ఒకే నమ్మకముగా ఉండాలి.

(పిల్లలు జ్ఞానములో నడవకపోతే ఏం చెయ్యాలి?) ఒకవేళ ఎవరైనా ఈ మార్గములో నడవలేకపోయినట్లైతే వివాహము చెయ్యవలసి ఉంటుంది. వారి బలహీనతను కూడా మీపై నుండి
తొలగించుకోవాలి. సాక్షిగా అయ్యి ఇష్టము లేకపోయినా చెయ్యవలసి ఉంటుంది. అది కర్తవ్యము అవుతుంది, ప్రేమ కాదు. కర్తవ్యమును పాలన చేస్తారు. లగ్నమై చెయ్యటము ఒకటి, నిమిత్తముగా కర్తవ్యమును నిర్వర్తించటము మరొకటి. ఆత్మలందరికీ ఒకే సమయములో ఈ జన్మసిద్ధ అధికారమును పొందే పాత్ర లేదు. పరిచయమైతే తప్పక లభించాలి, గుర్తించాలి కూడా కానీ కొందరి పాత్ర ఇప్పుడు కొందరి పాత్ర తరువాత. విత్తనాలలో కూడా కొన్ని వెంటనే ఫలాన్ని ఇస్తాయి, కొన్ని ఆలస్యంగా ఫలాన్ని ఇస్తాయి. అలాగే ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికీ తమ సమయమునందు పాత్ర ఉంటుంది. కర్తవ్యముగా భావించి చేసినట్లయితే మాయ ప్రభావము పడజాలదు. లేదంటే వాయుమండలపు ప్రభావము పడగలదు. అందుకని కేవలం భాధ్యతగా భావించి చెయ్యాలి. ఈ రెండింటికీ కేవలము ఒక్క బిందువు అంతరము ఉంది, కానీ బిందువు రూపములో ఉండని కారణంగా బాధ్యత కూడా మర్జ్ అయిపోతుంది. సహాయకారులుగా ఎవరైతే ఉంటారో వారికి ఎల్లప్పుడూ సహాయమైతే లభిస్తుంది. తండ్రి సహాయము ప్రతి కార్యములో ఎలా లభిస్తుంది అన్న ఈ అనుభవము ఉందా? పరస్పరములోని విశేష గుణమును చూసి ఒకరినొకరు ముందు ఉంచుకోవాలి. ఎవరినైనా ముందు ఉంచటము కూడా తమనుతాము ముందుకు తీసుకు
వెళ్ళటమే.

శివజయంతి సమయంలో శబ్దమును వ్యాపింపజేయడము సహజమౌతుంది, ఎంత ధైర్యముంటే అంతగా చెయ్యండి ఎందుకంటే ఎటువంటి సమయము వచ్చేదుందంటే ఈ సేవా అవకాశము కూడా తక్కువగా లభిస్తుంది. కావున ఎంత చెయ్యగలరో అంత చెయ్యండి. పొరపాట్లు ఎందుకు జరుగుతాయి? దాని లోతులలోకి వెళ్ళాలి. ఈ పొరపాటు ఎందుకు జరిగింది అని అంతర్ముఖులై ఆలోచించాలి. ఇదైతే మాయ రూపము, నేనైతే, రచయిత అయిన తండ్రి సంతానమును..... మీతోటి మీరు ఏకాంతములో ఇటువంటి మాటలు మాట్లాడుకోండి. నెమరువేసుకొనేందుకు ప్రయత్నము చెయ్యండి. ఎక్కడికైనా వెళ్ళేది ఉంటే అక్కడ మీ స్మృతి చిహ్నమును వదలవలసి ఉంటుంది మరియు ఏదో ఒకటి తీసుకువెళ్ళవలసి ఉంటుంది. మరి మధువనములో విశేషంగా ఏ స్మృతి చిహ్నమును వదిలారు? ప్రతి ఒక్క ఆత్మదగ్గర ఈ ఈశ్వరీయ స్నేహము మరియు సహయోగపు స్మృతి చిహ్నమును వదలాలి. ఎంతగా ఇతరులకు స్నేహీ, సహయోగులుగా అవుతారో అంతగానే మాయ విఘ్నాలను తొలగించేందులో సహయోగము లభిస్తుంది. సహయోగమును ఇవ్వటము అనగా సహయోగమును తీసుకోవటము. పరివారములో ఆత్మిక స్నేహమును ఇవ్వాలి మరియు మాయపై విజయమును పొందేందుకు సహయోగమును తీసుకోవాలి. ఈ ఇచ్చిపుచ్చుకునే లెక్క సరిగ్గా ఉంటుంది. ఈ సంగమ సమయములోనే అనేక జన్మల సంబంధమును జోడించాలి. సంబంధమును జోడించేందుకు సాధనము స్నేహము. బట్టలను కుట్టేందుకు దారము. ఏవిధముగా సాధనమౌతుందో అలాగే భవిష్య సంబంధమును జోడింపజేసేందుకు సాధనము స్నేహమనే దారము. ఇక్కడ ఎలా జోడిస్తారో అలా అక్కడ జోడింపబడినవి లభిస్తాయి. జోడించే సమయము మరియు స్థానము ఇదే. ఎప్పుడైతే అనేకమందితో స్నేహము సమాప్తమౌతుందో అప్పుడే ఈశ్వరీయ స్నేహము కూడా కలవగలదు. కావున ఇప్పుడు అనేకమందితో స్నేహమును సమాప్తము చేసి ఒక్కరితో స్నేహమును జోడించాలి. అనేకమందితో గల ఆ స్నేహము కూడా వ్యాకులపరిచేది, కానీ ఒక్కరితో గల ఈ స్నేహము సదాకాలమునకు పరిపక్వముగా తయారుచేసేది. అనేకవైపుల నుండి తొలగించాలి మరియు ఒక్కవైపు జోడించాలి. తొలగించకపోతే ఎప్పుడు కూడా జోడింపబడజాలదు. ఇప్పుడు లోటును కూడా నింపుకోగలరు, ఇక తరువాత నింపుకొనే సమయము కూడా సమాప్తమైపోతుంది. ఇలా భావించి అడుగులను ముందుకు వేయాలి.

అందరూ తీవ్ర పురుషార్థులా లేక పురుషార్థులా? తీవ్ర పురుషార్థుల మనసులోని సంకల్పములో కూడా ఓటమి కలుగజాలదు, అటువంటి స్థితిని తయారుచేసుకోవాలి. ఎవరికైతే సంకల్పములో కూడా మాయ నుండి ఓటమి ఉండదో వారినే తీవ్ర పురుషార్థులు అని అంటారు. వారు మొదటనుండే శుద్ధ సంకల్పాలతో మనసును బిజీగా ఉంచుకున్నప్పుడు ఇక వారికి ఇతర సంకల్పాలు రావు. పూర్తిగా నిండిపోయి ఉన్నప్పుడు ఒక్క చుక్క కూడా ఎక్కువ పట్టలేదు, లేకపోతే పొరలిపోతాయి. కావున వ్యర్థ సంకల్పము వచ్చేందుకు స్థలమే లేదు అన్న సంకల్పము మనస్సులో ఉండాలి. అంతగా మిమ్మల్ని మీరు బిజీగా ఉంచండి. మనసును బిజీగా ఉంచే పద్ధతి ఏదైతే లభించిందో, దానిని మీరు పూర్తి ప్రయోగములోకి తీసుకురాలేదు, కావున వ్యర్థ సంకల్పాలు వచ్చేస్తాయి. ఒకవైపునుండి బిజీగా ఉంచటం ద్వారా మరొకవైపు నుండి స్వయమే తొలగిపోతారు.

మంథనము చేసేందుకైతే చాలా ఖజానా ఉంది. ఇందులో మనస్సును బిజీగా ఉంచాలి. సమయపు వేగము ఎక్కువగా ఉందా లేక మీ పురుషార్థపు వేగము ఎక్కువగా ఉందా? ఒకవేళ సమయము చాలా త్వరగా నడుస్తూ మీ పురుషార్థము ఢీలాగా ఉన్నట్లయితే దాని రిజల్టు ఏమవుతుంది? సమయము ముందుకు వెళ్ళిపోతుంది, పురుషార్థి ఉండిపోతాడు. సమయపు బండి వెళ్ళిపోతుంది. సవారీ చేసేవారు ఉండిపోతారు. సమయపు ఏ తీవ్రతను చూస్తారు? జరిగిపోయినదానికి ఫుల్ స్టాప్ పెట్టే సామర్థ్యము సమయములో ఉంది. అదే విషయాన్ని మరల సమయమెప్పుడన్నా రిపీట్ చేస్తుందా? కావున పురుషార్థపు లోట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో జరిగిపోయినదానికి బిందువును పెట్టేసి, రాబోవు ప్రతి క్షణములో ఉన్నతిని తీసుకువస్తూ ఉన్నట్లయితే సమయములాగా తీవ్రముగా నడవగలరు. సమయమైతే రచన కదా! రచనలో ఈ గుణము ఉన్నప్పుడు రచయితలోకూడా ఉండాలి. డ్రామా క్రియేషన్ అయినప్పుడు క్రియేటర్ పిల్లలు మీరే కదా! మరి క్రియేటర్ పిల్లలు క్రియేషన్ కన్నా ఎందుకు ఢీలా అవుతారు? డ్రామాలో ప్రతి క్షణము లేక ఏ విషయమైతే జరిగిపోయిందో, ఏ రూపంతో జరిగిపోయిందో అది మరల రిపీట్ అవ్వదు, తిరిగి 5000 సంవత్సరాల తరువాతనే రిపీట్ అవుతుంది అన్న ఈ ఒక్క విషయమును గురించి ధ్యానమును ఉంచాలి. అలాగే బలహీనతలను కూడా మాటిమాటికీ ఎందుకు రిపీట్ చేస్తారు? ఒకవేళ ఈ బలహీనతలను రిపీట్ చెయ్యనివ్వకపోతే ఇక పురుషార్థము తీవ్రమైపోతుంది. ఎప్పుడైతే బలహీనత సర్దుకోబడుతుందో అప్పుడు బలహీనత స్థానంలో శక్తి నిండుతుంది. ఒకవేళ బలహీనతలు రిపీట్ అవుతూ ఉన్నట్లయితే శక్తి నిండదు. కావున ఏదైతే జరిగిందో అది అయిపోయింది. బలహీనమునకు చెందిన జరిగిపోయిన విషయాలను మరల సంకల్పములోకి కూడా రాకూడదు. ఒకవేళ సంకల్పము వచ్చినట్లయితే వాణి మరియు కర్మలో కూడా వచ్చేస్తుంది. సంకల్పములోనే సమాప్తము చేసినట్లయితే వాణి, కర్మలలో రావు. అప్పుడిక మనస్సు-వాణి-కర్మ మూడూ శక్తిశాలిగా అయిపోతాయి. చెడు వస్తువులను ఎప్పుడూ వెంటనే పారవేయటం జరుగుతుంది, మంచి వస్తువులను ప్రయోగించటం జరుగుతుంది. కావున చెడు వస్తువులను ఎలా పారవేయటం జరుగుతుందో అలా చెడు విషయాలను పారవేయండి. అప్పుడు సమయము పురుషార్థము కంటే ముందుకు వెళ్ళదు. సమయము ఎదురుచూడటమును మీరు చేసినట్లయితే మేము తయారుగా కూర్చున్నాము. సమయము వస్తే మేము వెళ్తాము, అటువంటి స్థితి అయిపోతుంది. ఒకవేళ మీరు సిద్ధముగా లేకపోతే సమయము మా కొరకు కొంచెము ఆగాలి అని ఆలోచిస్తారు. అచ్ఛా!

Comments

  1. ఓంశాంతి, రాజ్య తిలకం ఎలా లభిస్తుంది?ఈ తిలకం గొప్పతనం ఏమిటి? మధువనం యొక్క విశేషగుణం ఏమిటి? ప్రతి విషయంలో విజయమే విజయం ఎవరికి లభిస్తుంది? ఈ విషయాలన్నీ బాప్ దాదా ఈ అవ్యక్తమురళిలో తెలిపించారు. శివబాబా యాద్ హై?

    ReplyDelete

Post a Comment