25-01-1970 అవ్యక్త మురళి

* 25-01-1970         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“స్మృతి చిహ్నమును స్థిరం చేసేందుకు విధి”

అవ్యక్త స్థితే ముఖ్యమైన సబ్జెక్టు. వ్యక్తములో ఉంటూ కర్మ చేస్తూ కూడా అవ్యక్త స్థితి ఉండాలి. ఈ సబ్జెక్టులోనే పాస్ అవ్వాలి. మీ బుద్ధి లైనును స్పష్టముగా ఉంచుకోవాలి. దారి స్పష్టముగా, ఖాళీగా ఉన్నప్పుడు త్వరత్వరగా పరుగెత్తి లక్ష్యమును చేరుకోవటము జరుగుతుంది. పురుషార్ధపు లైనులో ఏదేని ఆటంకము ఉన్నట్లయితే దానిని తొలగించి లైనును క్లియర్ చెయ్యటము - ఈ సాధన ద్వారానే అవ్యక్త స్థితి యొక్క ప్రాప్తి కలుగుతుంది. మధువనములోకి వచ్చి ఏదో ఒక విశేష గుణమును అందరికీ ఇవ్వటము ఇదే స్మృతి చిహ్నము. అదైతే జడమైన స్మృతి చిహ్నము, కానీ మీ గుణాల స్మృతిని ఇవ్వటము, ఇది చైతన్య స్మృతి చిహ్నము. దీనిని ఎల్లప్పుడూ స్మృతి చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఎక్కడకు వెళ్ళినా కానీ ఎక్కడకు వెళ్తే అక్కడ స్మృతి చిహ్నమును స్థిరము చెయ్యాలి అన్న లక్ష్యమునే ఉంచాలి. ఇక్కడి నుండి విశేషమైన స్నేహమును తమలో నింపుకుని వెళ్ళినట్లయితే స్నేహము రాతిని కూడా నీరుగా చేస్తుంది. ఈ ఆత్మిక స్నేహపు బహుమతిని తోడుగా తీసుకువెళ్ళాలి, దీని ద్వారా దేనిపైనైనా విజయము చేకూరగలదు. సమయము ఎక్కువగా ఉందని భావిస్తున్నారా లేక తక్కువని భావిస్తున్నారా? ఇప్పుడు తక్కువ సమయంలో 100 శాతము వరకు చేరుకునేందుకు ప్రయత్నము చెయ్యాలి. మీలో ఉన్న ధైర్యమునంతా పెట్టాలి. ఒక్క క్షణము కూడా వ్యర్ధముగా పోకూడదన్నంత ధ్యానమును ఉంచాలి. సంగమయుగములోని ఒక్క క్షణము ఎంత పెద్దది! మీ సంకల్పాలు, సమయము రెండింటిని సఫలము చెయ్యాలి. పెద్దవారు చెయ్యలేని పనిని చిన్నవారు చెయ్యగలరు. ఇప్పుడైతే ఆ కార్యము కూడా మిగిలి ఉంది. ఇప్పటివరకు ఏదైతే పరుగు తీసారో అదైతే ఉండనే ఉంది, కానీ ఇప్పుడు జంప్ చెయ్యాలి, అప్పుడు లక్ష్యమును పొందగలరు. క్షణములో అనేక విషయాలను పరివర్తన చెయ్యటము - ఇదే జంప్ చెయ్యటము అంటే. అంత ధైర్యము ఉందా? ఏదైతే విన్నారో దానిని జీవితములో తీసుకువచ్చి చూపించాలి. ఎవరిపై స్నేహమును ఉంచటం జరుగుతుందో వారిలాగా తయారవ్వవలసి ఉంటుంది. కావున బాప్ దాదా గుణాలేవైతే ఉన్నాయో వాటిని స్వయములో ధారణ చెయ్యాలి, ఇదే స్నేహ కర్తవ్యము. తండ్రిలో ఏ శ్రేష్ఠత అయితే ఉందో దానిని మీలో ధారణ చెయ్యాలి. ఇదే స్నేహము. ఒక్క విశేషతలో కూడా లోటు ఉండకూడదు. సర్వ గుణాలను మీలో ధారణ చేసుకున్నప్పుడే భవిష్యత్తులో సర్వగుణ సంపన్నులైన దేవతగా అవుతారు. సర్వగుణ సంపన్నంగా అవ్వాలి అన్న లక్ష్యమునే ఉంచాలి. తండ్రి గుణాలను ఎదురుగా ఉంచుకొని అవి ఎంతవరకు మీలో ఉన్నాయన్నది పరిశీలించుకోండి. తక్కువ శాతముగా కూడా ఉండకూడదు. శాతములో కూడా సంపూర్ణముగా ఉన్నప్పుడు అక్కడ కూడా సంబంధములో సమీపంగా రాగలరు.

ఇప్పుడు ఆత్మనే చూడాలి, దేహమును చాలా సమయము నుండి చూసి చూసి అలసిపోయారు. కావున ఇప్పుడు ఆత్మనే చూడాలి. దేహమును చూడటం వలన ఏం లభించింది? దుఃఖితులుగానే అయ్యారు. ఇప్పుడు ఆత్మ-ఆత్మను చూస్తుంది, కావున సుఖము లభిస్తుంది. శూరులు-వీరులు కదా! శూర-వీరుల గుర్తు ఏముంటుంది? వారికి ఏ విషయమునైనా దాటడము కష్టమనిపించదు, సమయము కూడా పట్టదు. వారి సమయము సేవకు తప్ప తమ విఘ్నాలు మొదలగువాటిని తొలగించుకునేందులో గడచిపోదు. వీరినే శూర-వీరులు అని అంటారు. మీ సమయాన్ని మీ విఘ్నాలలో కాకుండా సేవలో వినియోగించాలి. ఇప్పుడైతే సమయము చాలా ముందుకు వెళ్ళింది. ఈ లెక్కలో ఇప్పటివరకు ఆ విషయాలన్నీ చిన్ననాటివి. చిన్నపిల్లలు నాజూకుగా ఉంటారు, పెద్దవారు వీరులుగా ఉంటారు. మరి పురుషార్ధములో పిల్లలలా ఉండకూడదు, అలా వీరులుగా అవ్వాలి. పరిస్థితులు ఎటువంటివైనా- ఏవైనా, వాయుమండలము ఎటువంటిదైనా కానీ బలహీనులుగా అవ్వకూడదు, వారినే శూర-వీరులు అని అంటారు. శారీరిక బలహీనత ఉన్నా కూడా వాతావరణము, గాలి మొదలగువాటి ప్రభావము పడుతుంది. ఆరోగ్యవంతులకు ప్రభావము ఉండదు. కావున ఈ వాయుమండలపు ప్రభావము కూడా నాజూకు వారిపైనే ఉంటుంది. వాయుమండలమేమీ రచయిత కాదు, అదైతే రచన. రచయిత గొప్పదా లేక రచన గొప్పదా? (రచయిత). మరైతే రచయిత రచన అధీనములో ఎందుకు ఉన్నాడు? ఇప్పుడు శూర-వీరులుగా అయ్యేందుకు మీ స్మృతి దివసమును గుర్తు తెచ్చుకోవాలి. ఈ స్మృతిని మరచిపోకూడదు. ఇటువంటి మ్యాపును తయారుచేసుకొని వెళ్ళండి, మీ మ్యాప్ లో అందరూ తండ్రిని చూడాలి. సంపూర్ణతా మ్యాప్ ను మీరు చూపించాలి. ధైర్యము ఉన్నట్లయితే సహాయము తప్పక లభిస్తుంది. ఇక్కడకు వచ్చిన తరువాత ఢీలాతనములో చురుకుతనము వచ్చిందని ఇప్పుడు భావిస్తున్నారా? ఇప్పుడు పురుషార్ధములో ఢీలాగా అవ్వకూడదు. సంపూర్ణమైన హక్కును తీసుకునేందుకు సంపూర్ణ ఆహుతిని కూడా ఇవ్వాలి. ఏ యజ్ఞమునైనా రచించినప్పుడు అది సంపూర్ణ సఫలము ఎలా అవుతుంది? ఆహుతిని వేసినప్పుడు సంపూర్ణమవుతుంది. ఒకవేళ ఆహుతి తక్కువైనప్పుడు యజ్ఞము సఫలమవ్వజాలదు. ఇక్కడ కూడా ప్రతి ఒక్కరూ మేము ఆహుతిని వేసామా అన్నది చూసుకోవాలి. కొంచెమన్నా ఆహుతిలో తక్కువ ఉన్నట్లయితే సంపూర్ణ సఫలత ఉండదు. ఎంత చేస్తే అంత అన్న లెక్క ఉంటుంది. లెక్క వేయటంలో ధర్మరాజు కూడా ఉన్నారు. వారినుండి ఎటువంటి లెక్కా మిగిలి ఉండజాలదు. కావున ఆహుతిలో ఏదైతే ఇచ్చేది ఉందో దానిని సంపూర్ణంగా ఇవ్వాలి మరియు సంపూర్ణంగా తీసుకోవాలి. ఇవ్వటములో సంపూర్ణత లేనప్పుడు తీసుకోవటములో కూడా ఉండదు. ఎంతగా ఇస్తారో అంతగానే తీసుకుంటారు. సఫలత ఎందులో ఉంది అన్నది కూడా తెలిసినాకానీ, సఫలము చెయ్యకపోతే ఏమవుతుంది? లోటు ఉండిపోతుంది. ఎక్కడా ఏదీ మిగిలి ఉండలేదు కదా అన్నదానిపై ఎల్లప్పుడూ ధ్యానమును ఉంచండి. మనసులో, వాణిలో, కర్మలో ఎక్కడ కూడా ఏదీ ఉండకూడదు. ఏదైనా కార్యమునకు సమాప్తి రోజు వచ్చినప్పుడు ఆ సమయములో ఇంకేమీ మిగిలిలేవు కదా అని నలువైపులా చూస్తారు. అలాగే ఇప్పుడు కూడా సమాప్తి సమయము . ఒకవేళ ఏదైనా మిగిలి ఉన్నట్లయితే అది అలాగే మిగిలిపోతుంది. ఇక స్వీకారమవ్వజాలదు. దానిని సంపూర్ణ ఆహుతి అని కూడా అనరు, కావున అంతగా ధ్యానమును ఉంచాలి. ఇప్పుడు లోటును ఉంచుకునే సమయము జరిగిపోయింది. ఇప్పుడు సమయము చాలా త్వరగా వస్తూ ఉంది. సమయమేమో త్వరత్వరగా వెళ్ళిపోయి స్వయమేమో ఢీలాగా ఉండిపోతే ఏమవుతుంది? గమ్యమునకు చేరుకోగలరా? సత్యయుగ గమ్యమునకు బదులుగా త్రేతాయుగములోకి వెళ్ళవలసి ఉంటుంది. సమయమెంత స్పీడుగా పరుగులు పెడ్తుందో అలాగే స్వయము కూడా పరుగెత్తాలి. స్థూలములో కూడా ఏదైనా వాహనాన్ని అందుకోవాలంటే సమయాన్ని చూసుకోవటము జరుగుతుంది. లేకపోతే అక్కడే ఉండిపోతారు. సమయమైతే నడుస్తూనే ఉంటుంది, ఎవరికోసమూ సమయము ఆగదు. ఇప్పుడు ఢీలాగా నడిచే రోజులు వెళ్ళిపోయాయి, పరుగెత్తే రోజులు కూడా వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఇవి జంప్ చేసే రోజులు. ఏ విషయములోనైనా లోటును అనుభవము చేసినప్పుడు దానిని ఒక్క క్షణములో పరివర్తనలోకి తీసుకురావటము - దీనినే జంప్ చెయ్యటము అని అంటారు. చూడటానికి పెద్దగా అనిపిస్తుంది కానీ నిజానికి చాలా సహజమైనది. కేవలము నిశ్చయము మరియు ధైర్యము కావాలి. నిశ్చయము కలిగినవారి విజయము కల్పపూర్వము కూడా జరిగింది, ఇప్పుడు కూడా ఉండనే ఉంది. ఇంత దృఢంగా మిమ్మల్ని తయారుచేసుకోవాలి. క్షణక్షణము మనసు, వాణి మరియు కర్మలను చూసుకోవాలి. దీనిని చూడటము బాప్ దాదాకు కష్టమేమీ కాదు. చూడటానికి ఇప్పుడు ఏదేని ఆధారము తీసుకోవలసిన ఆవశ్యకత లేదు. ఎక్కడి నుండైనా చూడగలరు. మేము చేసి చూపిస్తాము అన్న ఉల్లాసము పాతవారి కంటే క్రొత్త వారిలో ఎక్కువగా ఉంది. అటువంటి తీవ్రమైన విద్యార్థులు కూడా ఉన్నారు. క్రొత్త వారే అద్భుతమును చెయ్యగలరు, ఎందుకంటే వారికి సమయము కూడా స్పష్టముగా కనిపిస్తూ ఉంది. సమయపు సహయోగము కూడా ఉంది, పరిస్థితుల సహయోగము కూడా ఉంది. పురుషార్థము ఎలా చెయ్యాలన్నదానిని పరిస్థితులు కూడా చూపిస్తున్నాయి. పరీక్షలు మొదలైనప్పుడు పురుషార్థము చెయ్యలేరు. ఇక ఫైనల్ పేపరు మొదలైపోతుంది. పేపరు కంటే ముందు చేరుకున్నారు, ఎవరైతే సరియైన సమయానికి చేరుకున్నారో వారు అది కూడా తమ సౌభాగ్యముగా భావించాలి. పేపరు ఇచ్చేందుకు నమోదు చేసుకుంటారు. పేపరు మొదలవుతుంది, అప్పుడిక గేటు బంద్ అయిపోతుంది. మొదట్లో ఎవరైతే వచ్చారో వారికి వైరాగ్యమును కలిగించటం జరిగేది, కానీ నేటి పరిస్థితులే వైరాగ్యమునిస్తున్నాయి. మీ ధరణిని తయారు చెయ్యటములో ఆలస్యము లేదు. కేవలము జ్ఞాన నిశ్చయమునే దృఢమైన బీజాన్ని వేస్తారు, ఫలము తయారైపోతుంది. చాలా త్వరగా ఫలమును ఇవ్వగలిగిన బీజము ఇది. బీజము శక్తివంతమైనది. మిగిలిన పాలన చెయ్యటము, పర్యవేక్షణ చెయ్యటము మీ పని. తండ్రేమో సర్వ శక్తివంతుడు, పిల్లలకేమో సంకల్పాలను ఆపేందుకు కూడా శక్తి లేదా! తండ్రి సృష్టిని మారుస్తారు, పిల్లలు తమనుకూడా మార్చుకోలేరా! తండ్రి ఎటువంటివారు, మనము ఎటువంటివారము అన్నది ఆలోచించండి. అప్పుడు మీపై మీకే సిగ్గు కలుగుతుంది. మీ నడవడికను పరివర్తనలోకి తీసుకురావాలి. వాణి ద్వారా అంతగా తెలుసుకోరు. పరివర్తనను చూసి మిమ్మల్ని ఇలా తయారుచేసినవారు ఎవరు అని వారు స్వయమే అడుగుతారు. ఎవరైనా మారి చూపించినట్లయితే ఏమైంది, ఎలా చేసారు అని వారు అనుకోకుండానే ప్రశ్నిస్తారు, కావున మీ నడవడికను చూసి కూడా స్వయము ఆకర్షింపబడతారు.

ఇదైతే నిమిత్త సేవా కేంద్రము. అందరి ముఖ్య కేంద్రమైతే ఒక్కటే. అటువంటి అనంతమైన దృష్టిలో ఉంటారు కదా! ముఖ్య కేంద్రముతోనే అందరి సంబంధము ఉంటుంది. ఆత్మలందరికీ వారితో కనెక్షన్ ఉంది, సంబంధము ఉంది, ఒక్కరితో సంబంధము ఉన్నట్లయితే స్థితి కూడా ఏకరసంగా ఉంటుంది. ఒకవేళ మరెక్కడికైనా సంబంధపు బంధము వెళ్ళినట్లయితే ఏకరస స్థితి ఉండదు. కావున ఏకరస స్థితిని తయారుచేసుకొనేందుకు ఒక్కరిని తప్ప ఇతరమైనవి చూస్తున్నా చూడకుండా ఉండండి. ఏదైతే చూస్తున్నారో ఆ వస్తువులేవీ ఉండేవి కావు. తోడుగా వచ్చే అవినాశీ వస్తువు ఆ ఒక్క తండ్రి మాత్రమే. ఒక్కరి స్మృతిలోనే సర్వ ప్రాప్తులు ఉండగలవు మరియు సర్వుల స్మృతితో ఎటువంటి ప్రాప్తి ఉండదు, మరి ఏ వ్యాపారము బాగుంది? పర్యవేక్షణ చేస్తూ వ్యాపారము చెయ్యటము ఉంటుందా లేక అనటంపై చెయ్యటము ఉంటుందా? ఈ మాయ సదాకాలము కొరకు వీడ్కోలు తీసుకునేందుకు కొద్ది సమయము కొరకు ముఖము చూపిస్తుంది అన్న తెలివి కూడా లభించింది. ఇప్పుడు వీడ్కోలు తీసుకొనేందుకు వస్తుంది, కానీ ఓడించటానికి కాదు. సెలవు తీసుకోవటానికి వస్తుంది. ఒకవేళ గాభరా వచ్చినట్లయితే దానిని బలహీనత అని అంటారు. బలహీనత కారణంగా మాయ యుద్ధము చేస్తుంది. ఇప్పుడైతే శక్తి లభించింది కదా! సర్వశక్తివంతునితో సంబంధముంది, మరి వారి శక్తి ముందు మాయ శక్తి ఏపాటిది? సర్వశక్తివంతుని పిల్లలము అన్న ఈ నషాను మర్చిపోకూడదు. మర్చిపోవటము వలననే మళ్ళీ మాయ యుద్ధం చేస్తుంది. బేహోష్ గా (స్పృహ లేనివారిగా) అవ్వకూడదు. హోషియార్ గా (తెలివిగలవారిగా) ఎవరైతే ఉంటారో వారు హోష్(స్పృహ)ను ఉంచుతారు. ఈ రోజుల్లో బందిపోట్లు కూడా ఏవేవో వస్తువుల ద్వారా సృహలేనివారిగా చేసేస్తారు. మరి మాయ కూడా అలా చేస్తుంది. చతురులైనవారు ఎవరైతే ఉంటారో వారు వీరి పద్ధతి ఇది అని ముందుగానే తెలుసుకుంటారు, కావున ముందునుండే జాగరూకులై ఉంటారు. తమ స్పృహను పోగొట్టుకోరు. ఈ సంజీవనీ మూలికను ఎల్లప్పుడూ తోడు ఉంచుకోవాలి. ఒక్క నెల నుండి వచ్చినవారైనా గానీ అదికూడా ఎక్కువే. ఒక్క క్షణములో కూడా పరివర్తన రాగలదు. మేమైతే ఇప్పుడే వచ్చాము, క్రొత్త అని ఇలా భావించవద్దు. ఇక్కడ ఇది క్షణకాలపు వ్యాపారము. క్షణములో జన్మసిద్ధ అధికారమును తీసుకోగలరు. కావున అలా తీవ్ర పురుషార్థము చెయ్యండి, ఈ యుక్తి లభిస్తుంది. ఏ విషయము ముందుకు వచ్చినా ఒక్క క్షణములో మారిపోవాలి అన్న లక్ష్యమును ఉంచండి. మొత్తము కల్పములో ఇదే సమయము. ఇప్పుడు కాకున్న మరెప్పుడూ లేదు - అన్న మంత్రమును గుర్తు ఉంచుకోవాలి. పాత సంస్కారాలు, పాత నడవడిక ఏదైతే ఉందో వాటిని మార్చి ఈశ్వరీయమైనవిగా తయారుచెయ్యాలి. ఎటువంటి పాత సంస్కారాలు, పాత అలవాట్లు ఉండకూడదు. మీ పరివర్తన ద్వారా అనేకులు సంతుష్టులవుతారు. మా నడవడిక ద్వారా ఎవ్వరికీ దుఃఖము కలుగకూడదు అన్నదాని గురించే ఎల్లప్పుడూ ప్రయత్నము చెయ్యాలి. నా నడవడిక, సంకల్పము, వాణి, ప్రతి కర్మ సుఖదాయిగా ఉండాలి. ఇదే బ్రాహ్మణకుల రీతి. వీరు మాకంటే అతతీతమైనవారు అని ఎవరైనా దూరము నుండే అనుకోవాలి. అతీతము మరియు ప్రియముగా ఉండటము - ఇదే పురుషార్థము. ఇతరులను కూడా అలా తయారుచెయ్యాలి. తయారవ్వటము మరియు తయారు చెయ్యటము - ఈ లక్ష్యమునే ఉంచాలి. ఎవరు ఎంతగా తయారవుతారో అంతగా తయారుచేస్తారు. మీ జీవితములో అలౌకికత ప్రకాశిస్తుందా? మనుష్యులనుండి అతీతముగా మిమ్మల్ని భావించుకుంటున్నారా అని మిమ్మల్ని మీరు చూసుకోవాలి. ఒకవేళ స్మృతిని మర్చిపోయినట్లయితే బుద్ధి ఎక్కడ ఉంటుంది? కేవలము ఒకవైపు నుండి మర్చిపోయినట్లయితే మరొకవైపు నిమగ్నమవుతుంది కదా! అవ్యక్త స్థితి నుండి కిందకు వచ్చినట్లయితే ఏ వ్యక్తము వైపుకు బుద్ధి వెళుతుంది అన్నదానిని మీరు పరిశీలించుకోండి. తప్పకుండా ఏదో ఉండి ఉంది. అప్పుడే బుద్ధి అటువైపుకు వెళుతుంది. కొన్ని విషయాలు లాగితే లాగబడతాయి, మరికొన్ని విషయాలలో ఢీలాగా వదిలితే లాగబడతాయి! గాలిపటాన్ని పైకి ఎగరవేయటానికి వదులుగా వదలవలసి ఉంటుంది. ఈ విధముగా పైకి రావడం లేదని గమనించినప్పుడు ఢీలాగా వదలాలి, తద్వారా అది దానంతట అదే పైకి లేస్తుంది. విఘ్నాలను తొలగించుకునే యుక్తులు సదా గుర్తు ఉన్నట్లయితే పురుషార్థములో ఢీలాతనము ఉండదు. యుక్తులను మర్చిపోతారు కనుకనే పురుషార్థము కూడా ఢీలా అయిపోతుంది. ప్రతి ఒక్క విషయానికీ ఎన్ని యుక్తులు లభించాయి! ప్రాప్తి ఎంత పెద్దది మరియు దారి ఎంత సరళమైనది! అనేక జన్మలు పురుషార్థము చేసినా కూడా పొందలేని దానిని ఒక్క జన్మలో కొన్ని క్షణాలలో ప్రాప్తింపజేసుకుంటున్నారు. అంత నషా ఉంటుంది కదా! “ఇచ్ఛా మాత్రం అవిద్యా" ఇటువంటి స్థితిని ప్రాప్తించుకునే విధానమును తెలిపారు. అటువంటి ఉన్నతమైన జ్ఞానము మరియు ఎంతటి సూక్ష్మమైనది! నేను దేవతగా అవ్వగలను అన్న ఇంతటి ఉన్నతమైన లక్ష్యమును ఎవ్వరూ తమ జీవితములో ఉంచలేరు. మేమే దేవతలుగా ఉండేవారము అన్నది ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించినది ఏమిటి మరియు తయారైనది ఎలా? అడగకుండానే అమూల్యరత్నాలు లభిస్తాయి. ఇలా మిమ్మల్ని పదమాపదమ భాగ్యశాలురుగా భావిస్తున్నారా? ప్రెసిడెంటు కూడా మీముందు ఎంత? ఇంతటి ఉన్నత దృష్టి, ఇంత ఉన్నత స్వమానము గుర్తు ఉంటుందా లేక మర్చిపోవటము కూడా చేస్తారా? స్మృతి-విస్మృతిల మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉంటారా? అపరిశుభ్రత నుండి దోమలు మొదలైనవి వస్తాయి కావున వాటిని తొలగించటం జరుగుతుంది. అలాగే మీ బలహీనత ద్వారా మాయ పురుగులు పట్టేసుకుంటాయి. బలహీనతను రానివ్వకపోతే మాయ రానే రాదు. సర్వశక్తివంతునితో మా సంబంధము ఉంది అన్నదానిని ఎల్లప్పుడూ గుర్తు ఉంచుకోండి, మరిఇక బలహీనత ఎందుకు? సర్వశక్తివంతుడైన తండ్రి పిల్లలైయుండి కూడా మాయశక్తిని అంతము చెయ్యలేరా! నా తండ్రి సర్వశక్తివంతుడు, మేము అందరికంటే శ్రేష్ఠమైన సూర్యవంశము వారము. మాపై మాయ ఎలా యుద్ధము చెయ్యగలదు! అన్న ఈ ఒక్క విషయమును ఎల్లప్పుడూ గుర్తు ఉంచుకోండి. మీ తండ్రి, మీ వంశమును గుర్తు ఉంచుకున్నట్లయితే మాయ ఏమీ చెయ్యలదు. స్మృతి స్వరూపులుగా అవ్వాలి. ఇన్ని జన్మలు విస్మృతిలో ఉన్నారు, అయినాగానీ విస్మృతి మంచిగా అనిపిస్తుందా? 63 జన్మలు విస్మృతిలో మోసపోయారు, ఇప్పుడు ఒక్క జన్మ కొరకు మోసము నుండి రక్షింపబడటము కష్టంగా అనిపిస్తుందా? ఒకవేళ పదే పదే బలహీనులుగా అవుతూ ఉంటే, పరిశీలించుకోకపోతే వారి స్వభావము కూడా బలహీనముగా తయారవుతుంది. స్థితిని పరిశీలించుకుని స్వయమును శక్తివంతమైనవారిగా తయారుచేసుకోవాలి, బలహీనతను మార్చి శక్తిని తెచ్చుకోవాలి. అచ్ఛా!

Comments

  1. ఓంశాంతి, బ్రాహ్మణ కులం యొక్క విధానం, ఆచారం ఏమిటి? విఘ్నాలను తొలగించుకునే యుక్తి ఏమిటి?యుక్తులును మర్చిపోతే ఏమవుతుంది? ప్రతి కార్యం చేస్తున్నప్పుడు ఏ స్థితిలో ఉండి కార్యం చేయాలి? చాలా సమయం యొక్క అభ్యాసం కోసం ఎలా కావాలి? ఈ విషయాలన్నీ బాప్ దాదా ఈ అవ్యక్తమురళిలో తెలిపించారు. శివబాబా యాద్ హై?

    ReplyDelete

Post a Comment