24-07-1969 అవ్యక్త మురళి

 24-07-1969                    ఓంశాంతి                 అవ్యక్త బాప్ దాదా           మధువనము

బిందు రూపం యొక్క అభ్యాసం

              మధురాతి మధురమైన పిల్లలూ! ఎవరి ఎదురుగా కూర్చున్నారు? మరియు ఎలా అయ్యి కూర్చున్నారు? బాబా అయితే మిమ్మల్ని బిందురూపంగా తయారుచేయడానికి వచ్చారు. నేను ఆత్మను, బిందు రూపాన్ని, బిందువు ఎంత చిన్నగా ఉంటుంది మరియు బాబా కూడా ఎంత చిన్నగా ఉంటారు? ఇంత చిన్న విషయం కూడా బుద్ధిలోకి రావటం లేదా? బాబా అయితే పిల్లల ఎదురుగానే ఉన్నారు. దూరంగా లేరు. దూరంగా ఉన్నవారిని మర్చిపోవచ్చు కానీ దగ్గరగా ఉన్నవారిని మర్చిపోతే మంచిగా అనిపించదు. ఒకవేళ పిల్లలు బిందువునే మర్చిపోతే ఇక దేని ఆధారంగా నడుస్తారు చెప్పండి? ఆత్మ ఆధారంగానే శరీరం నడుస్తుంది. నేను ఆత్మను, బిందువుని, బిందువు యొక్క సంతానాన్ని అనే నషా ఉండాలి. సంతానం అనుకోవటం ద్వారానే స్నేహం అనుభవం అవుతుంది. కనుక ఈరోజు పిల్లలైన మీకు బిందు రూపంలో స్థితులయ్యే అభ్యాసం చేయించనా? నేను ఆత్మను దీనిలో మర్చిపోవలసిన విషయం లేదు. మీ తండ్రిని మీరు మర్చిపోతారా? పరిచయం చెప్పడానికి అయితే నా నామం, రూపం, గుణం, కర్తవ్యం ఏమిటి అనేవి చెప్పాలి. మరియు నేను ఎప్పుడు వస్తాను? ఎవరి తనువులో వస్తాను? పిల్లలైన మీకే నా పరిచయాన్నిస్తాను. బాబా మీ పరిచయాన్ని మర్చిపోతారా? పిల్లలు కూడా అటువంటి స్థితిలో ఒక్క సెకను అయినా ఉండలేకపోతున్నారా? మీ నామం, రూపం, దేశం కూడా మర్చిపోతున్నారా? ఇది మొట్టమొదటి విషయం . మీరు అందరికీ చెప్తున్నారు కదా - నేను ఆత్మను, శరీరం కాదు అని వారిని ఆత్మగా భావించి కూర్చోమని చెప్పినప్పుడే వారు తమ శరీరాన్ని మర్చిపోతారు. ఒకవేళ ఆత్మగా భావించి కూర్చోకపోతే దేహ సహితంగా దేహం యొక్క సర్వ సంబంధాలను మర్చిపోగలరా? వారిని మీరు మరిపించి కూర్చోబెడుతున్నప్పుడు మీరు మీ శరీరానికి అతీతమై అతీత తండ్రి యొక్క స్మృతిలో కూర్చోలేరా? ఇప్పుడు పిల్లలందరు మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి కూర్చోండి. ఎదురుగా ఎవరిని చూడాలి? ఆత్మల తండ్రిని చూడాలి. ఈ స్థితిలో ఉండటం ద్వారా వ్యక్తానికి అతీతంగా అవ్యక్తస్థితిలో ఉండగలరు. నేను ఆత్మను, బిందురూపాన్ని అనేది స్మృతి రావటంలేదా? ఇలా అభ్యాసాన్ని పెంచుకుంటూ వెళ్తే ఒక్క సెకను ఏమిటి ఎన్ని గంటలైనా ఆ స్థితిలో స్థితులై ఆ స్థితి యొక్క రసం తీసుకోగలరు. ఈ స్థితిలో ఉండటం ద్వారా ఇక మాట్లాడే అవసరమే ఉండదు. బిందువు అయి కూర్చోవటం అనేది జడమైన స్థితి కాదు. ఎలా అయితే బీజంలో మొత్తం వృక్షం యొక్క సారం అంతా ఇమిడి ఉంటుందో అలాగే ఆత్మనైన నాలో బాబా స్మృతి ఇమిడి ఉంది అని భావించి కూర్చోవటం ద్వారా అన్ని రసనలు వస్తాయి. మరియు వెనువెంటే మేము ఎవరి ఎదురుగా ఉన్నాము అనే నషా కూడా ఉంటుంది. బాబా మనల్ని కూడా తన వెంట ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? బాబా తన పిల్లలని ఒంటరిగా వదలడం లేదు. బాబా మరియు పిల్లలైన మన ఇంటికి వెంటే తీసుకువెళ్తారు, అందరు కలసి వెళ్ళవలసిందే. ఆత్మగా భావించి మరలా శరీరంలోకి వచ్చి కర్మ కూడా చేయాలి. కర్మ చేస్తూ కూడా అతీతం మరియు ప్రియంగా అయి ఉండాలి. బాబా కూడా పిల్లలైన మిమ్మల్ని చూస్తున్నారు. చూస్తూ కూడా బాబా అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు కదా!

Comments

  1. 🌸☘️🌸☘️🌸☘️🌸☘️🌸☘️🌸
    *Date 27/05/2020*
    ---------------------------
    *24)24-07-1969 అవ్యక్తమురళి*

    ఈరోజు పిల్లలైన మనకు ఏలా బిందు రూపంలో స్థితులై వుండాలి? ఎవరి ఎదురుగా కూర్చోవాలి? మరియు ఎలా అయ్యి కూర్చోవాలి? ఈ విషయాలన్నీ బాప్ దాదా ఈ అవ్యక్త మురళిలో వివరించారు. ఓం శాంతి.

    *🎼 మురళి చదవాలి అనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయండి.👇🏻👇🏻👇🏻*
    https://bkteluguavyakthmurli.blogspot.com/2020/03/24-07-1969_23.html
    ©©©©©©©©©©©©©©©©©©©©
    *🎻 మురళి వినాలి అనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయండి.*👇🏻👇🏻👇🏻
    https://bkteluguavyakthmurli.blogspot.com/2020/05/24-07-69-mp3.html
    ©©©©©©©©©©©©©©©©©©©©©

    *🌹😊 శివ బాబా యాద్ హై??😊🌹*

    🌸☘️🌸☘️🌸☘️🌸☘️🌸☘️🌸

    ReplyDelete
  2. 🍁🌸🍁🌸🍁🌸🍁🌸🍁🌸🍁

    *https://bkteluguavyakthmurli.blogspot.com/2020/03/24-07-1969_23.html*

    *24-07-1969*
    *అవ్యక్త మురళి యొక్క ప్రశ్నలు*

    *1) ఎటువంటి నషా ఉండాలి?*
    *జ) నేను ఆత్మను, బిందువుని, బిందువు యొక్క సంతానాన్ని అనే నషా ఉండాలి.

    *2) బాబా పిల్లలను ఏలా తయారు చేయడానికి వచ్చారు?*
    *జ) బిందురూపంగా తయారుచేయడానికి వచ్చారు.

    *3) స్నేహం యొక్క అనుభవం ఎప్పుడు అవుతుంది?*
    *జ) సంతానం అనుకోవటం ద్వారానే స్నేహం అనుభవం అవుతుంది.

    *4) తండ్రి యొక్క పరిచయమును ఎలా తెలుసుకుంటాము*
    *జ) నామం, రూపం, గుణం, కర్తవ్యం తండ్రి యొక్క పరిచయమును తెలుసుకుంటాము.

    *5) ఏ స్థితిలో ఉండటం ద్వారా వ్యక్తానికి అతీతంగా అవ్యక్త స్థితిలో ఉండగలుగుతారు?*
    *జ) మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి ఆత్మల తండ్రిని చూడాలి. ఈ స్థితిలో ఉండటం ద్వారా వ్యక్తానికి అతీతంగా అవ్యక్తస్థితిలో ఉండగలరు.

    *6) ఎప్పుడు ఆత్మిక స్థితి యొక్క రసం తీసుకోగలుగుతారు?*
    *జ) నేను ఆత్మను, బిందురూపాన్ని అనేది స్మృతి అభ్యాసాన్ని పెంచుకుంటూ వెళ్తే ఒక్క సెకను ఏమిటి ఎన్ని గంటలైనా ఆ స్థితిలో స్థితులై ఆ స్థితి యొక్క రసం తీసుకోగలరు.

    *7) బాబా పిల్లలను ఎక్కడికి తీసుకెళ్తున్నారు?*
    *జ) బాబా పిల్లలైన మనల్ని ఇంటికి వెంటే తీసుకువెళ్తారు.

    *8) కర్మ చేస్తూ ఎలాంటి స్థితి ఉండాలి?*
    *జ) అతీతంగా మరియు ప్రియంగా ఉండాలి.

    🎊🌹🎊🌹 *ఓం శాంతి*🌹🎊🌹🎊

    ReplyDelete

Post a Comment