23-07-1969 అవ్యక్త మురళి

 23-07-1969                    ఓంశాంతి                 అవ్యక్త బాప్ దాదా           మధువనము

సఫలతకి ఆధారం - పరిశీలనా శక్తి

                       బాప్ దాదా ఒక్కొక్కరినీ చూస్తూ ఏమి చూస్తున్నారు? బాప్ దాదా ప్రతి ఒక్కరిలో నాలుగు విషయాలు చూస్తున్నారు. ఈ నాలుగు విషయాలు ఏమిటి? (ప్రతి ఒక్కరు తమ ఆలోచన చెప్పారు). 1.కిరీటం 2. సింహాసనం 3. పురుషార్ధం మరియు 4. అదృష్టం. ఈ నాలుగు విషయాలే ప్రతి ఒక్కరిలో చూస్తున్నారు. సంగమయుగం యొక్క కిరీటం ఏమిటి? తెలుసా? కనుక ఈరోజు బాప్ దాదా సింహాసనాధికారి లేక కిరీటధారి పిల్లల సభలోకి వచ్చారు. కిరీటధారులనే ఈ సంఘటనలోకి పిలిచాను. కానీ ప్రతి ఒక్కరి కిరీటం తమ శక్తిననుసరించి ఉంది. ఇది చూస్తున్నారు - ఈ సంగమయుగంలో ఎవరెవరు ఏయే కిరీటము, సింహాసనాధికారి అయ్యి కూర్చున్నారు అని! ఎవరెవరు ఎంత పెద్ద కిరీటం ధారణ చేసారు లేక చిన్నది ధారణ చేసారు మరియు కిరీటాన్ని సదా తలపై ఉంచుకుని నడుస్తున్నారా లేక అప్పుడప్పుడు కిరీటాన్ని తొలగించేస్తున్నారా? మీరందరూ కూడా మిమ్మల్ని మీరు తెలుసుకుంటున్నారు కదా! ఎందుకంటే అందరూ బాబా ఎన్నుకున్న రత్నాలు అయితే ఇంత గ్రహింపు తప్పకుండా ఉంటుంది కదా! మీ పురుషార్ధం మరియు అదృషాన్ని పరిశీలించుకున్నారా? మిమ్మల్ని మీరు పూర్తిగా పరిశీలించుకుంటున్నారా? ఉదాహరణకి ఇప్పుడు మీరు ఎడ్వాన్స్ పార్టీలోకి వెళ్తే  ఇప్పుడిప్పుడే మీ పురుషార్ధం ప్రకారం మీ అదృష్టం ఎలా ఉంటుంది! దానిని తెలుసుకుంటున్నారా? మీ వర్తమాన పురుషార్ధం మరియు అదృషాన్ని తెలుసుకుంటున్నారా? ఎప్పుడైతే మిమ్మల్ని మీరు పరిశీలించుకోగలరో అప్పుడే ఇతరులని పరిశీలించగలరు. ఇది తెలుసుకోవటం కూడా అవసరం. ఎందుకంటే ఇప్పటి సమయం ఎలాంటిదంటే - మీకు పరిశీలనా శక్తి చాలా అవసరం. సర్వీస్లో సఫలత పొందడానికి ముఖ్య సాధనం ఇదే. ఎంతెంత పరిశీలనా శక్తి తీవ్రం అవుతుందో అంతంతగానే సఫలత కూడా లభిస్తూ ఉంటుంది. పరిశీలన పూర్తిగా లేని కారణంగా ఎవరికి ఏది కావాలో, ఏ రూపం ద్వారా వారి అదృష్టం మేల్కొంటుందో ఆ రూపంగా అదృష్టం లభించటం లేదు. అందువలనే సర్వీస్ యొక్క సఫలత తక్కువ లభిస్తుంది. తక్కువ సేవ చేసే వారి ఫలితం ఎలా వస్తుందంటే ప్రజలు చాలా మంది తయారవుతారు. కానీ వారసులు తక్కువ తయారవుతారు. వారసులు తక్కువ తయారవ్వడానికి కారణం ఇదే - వారి స్థితిని పూర్తిగా పరిశీలించడంలేదు. ఆరోగ్యాన్ని పూర్తిగా పరిశీలిస్తేనే మంచి మందు లభిస్తుంది కదా! ఆ తర్వాత రోగం కూడా సమాప్తి అయిపోతుంది. రోగం సమాప్తి అయితే తర్వాత ఏమౌతుంది! విశేషంగా నిమిత్తమైన పాండవులకు భవిష్యత్తులో వచ్చే విషయాలను పరిశీలించే శక్తి ఉండాలి మరియు నిర్ణయించే శక్తి కూడా కావాలి. నిర్ణయం తర్వాత మరలా నివారణాశక్తి కావాలి. అప్పుడే ఎదుర్కోగలరు మరియు ఎదుర్కొన్న తర్వాత యజ్ఞ ప్రత్యక్షత యొక్క సఫలత పొందుతారు. మిమ్మల్ని బాబా ఎందుకోసం పిలిచారు? లెక్క చేస్తారు కదా! మెట్లు ఎక్కడం మరియు దిగడం యొక్క జ్ఞానం నేర్పించడానికి పిలిచాను. ఇప్పుడు ఏ విషయంలో దిగాలి మరియు ఏ విషయంలో ఎక్కాలి! పెద్దవారిగా అయితే అయ్యారు కానీ ఒకవేళ పెద్దవారిగా ఉంటూ కూడా ఎక్కడైనా చిన్నతనం యొక్క మెట్లు దిగాలంటే అక్కడ వెంటనే దిగటం లేదు. ఒక సెకనులో యజమాని మరియు ఒక సెకనులో పిల్లలు అయ్యే అవసరం ఉంది. ఎక్కడ పిల్లలు అవ్వాలో అక్కడ యజమానిగా అవుతన్నట్లు కనిపిస్తుంది. కానీ ఏవిధమైన సమయమో ఆవిధమైన స్వరూపం ఎలా తయారు చేసుకోవాలో నేర్పించడానికే పిలిచాను. ఉదాహరణకి మీరు ఏదోక సంఘటన మధ్యలో ఉంటున్నారు! సంఘటనలో ఏదైనా విషయం వస్తే అప్పుడు మీ ఆలోచన చెప్పే సమయంలో యజమాని అయ్యి ఆలోచన ఇవ్వాలి కానీ ఎక్కడ సంఘటన యొక్క నిర్ణయం జరుగుతుందో, నిమిత్తం అయిన అన్నయ్యలు, అక్కయ్యలు ఏదైతే నిర్ణయం చేస్తారో ఆ సమయంలో మీ బుద్ధిని పూర్తిగా పిల్లవాని స్థితిలోకి తీసుకురావాలి. పిల్లవాని స్థితి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? అప్పుడే చాలా ఫోర్సుతో మాట్లాడుతారు, మరలా పూర్తి నిస్సంకల్పంగా అయిపోతారు. ఈ విధంగా సంఘటన మధ్యలో నిమిత్తంగా అయిన వారి ఎదురుగా మీ యజమాని బుద్ధి ద్వారా సలహా ఇవ్వాలి, మరియు వెంటనే పిల్లవాని స్థితి యొక్క బుద్ధి తయారుచేసుకోవాలి. దీనిలోనే లాభం కూడా ఉంది. కానీ అక్కడ యజమాని స్థితి ఉంటే దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది? సమయం పాడవుతుంది మరియు శక్తి కూడా వ్యర్ధం అయిపోతుంది. మరియు పరస్పరంలో స్నేహం వృద్ధి అవ్వటంలో లోపం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు బాధ్యతలు తీసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ మెట్లు దిగే మరియు ఎక్కే అవసరం ఉంటుంది. కనుక భవిష్య సేవ యొక్క సఫలత కొరకు ముందుగానే శిక్షణ ఇస్తున్నారు. మీరందరు అనుభవీలు కూడా. సమయం అనుసరించి ప్రతి ఒక్కరు అనగా చిన్నవారు, పెద్దవారు కూడా తమ శక్తి మరియు స్వమానం ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు, మరియు మున్ముందు ఇలాంటి సమస్యలు కూడా రానున్నాయి. అందువలన ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో వారు చాలా నిర్మానచిత్త్ గా ఉండవలసి ఉంటుంది. నిర్మానం అంటే మీ గౌరవాన్ని కూడా త్యాగం చేయాలి. ఈ త్యాగం ద్వారా భాగ్యం లభిస్తుంది. మీరు ఎంత త్యాగం చేస్తారో అంత ఇంకా మీకు స్వమానం లభిస్తుంది. ఎంత మీరు స్వమానం ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారో అంత స్వమానం పోవడానికి కారణం అవుతుంది. అందువలన పిల్లవాడు మరియు యజమాని స్థితి యొక్క మెట్లు త్వరత్వరగా ఎక్కే మరియు దిగే అభ్యాసం పెంచుకోండి. అందువలనే మిమ్మల్ని పిలిచాను. పరిస్థితులను పరిశీలించే శక్తి ఉన్నప్పుడే దీనిలో సఫలత వస్తుంది. పరిస్థితిని పరిశీలించడం ద్వారా మంచి ఫలితం వస్తుంది. పరిశీలించటం లేదు అందువలనే ఫలితం తారుమారు అయిపోతుంది. పరిశీలనా శక్తి పెంచుకోవడానికి ఏమి పురుషార్ధం చేయాలి? మనస్సు యొక్క స్వచ్చత అంటే ఈ విషయంలో బుద్ధి యొక్క స్వచ్చత ఎక్కువ ఉండాలి. సంకల్పశక్తికి బ్రేక్ వేసే శక్తి. మనస్సు మరియు బుద్ధికి శక్తిశాలి బ్రేక్ వేయాలి మరియు మలిచే శక్తి కూడా ఉండాలి. ఈ రెండు శక్తులు చాలా అవసరం. దీనినే స్మృతి శక్తి లేదా అవ్యక్తశక్తి అంటారు. ఒకవేళ బ్రేక్ వేయలేకపోయినా అది మంచిగా ఉండదు. ఒకవేళ మలచటం రాకపోయినా సరిగ్గా ఉండదు. బ్రేక్ వేయటం మరియు మలిచేశక్తి ఉంటేనే బుద్ధి యొక్క శక్తిని వ్యర్థంగా పోగొట్టుకోరు. శక్తి వ్యర్థం కాకుండా జమ అవుతూ ఉంటుంది. ఎంత జమ అవుతుందో అంతగానే పరిశీలనా శక్తి మరియు నిర్ణయశక్తి పెరుగుతాయి. ఈ అభ్యాసం కూడా భట్టీలో చేయాలి. కనుక మీ మనస్సు మరియు బుద్ధికి ఎంతవరకు బ్రేక్ వేస్తున్నారు మరియు మలుచుకుంటున్నారు? మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి, ఎక్కడైనా ప్రమాదం జరగడానికి ఈ రెండు విషయాలే కారణం అవుతాయి. విశేషంగా పాండవులకి బాప్ దాదా ఈ విశేష సైగ చేస్తున్నారు. మంచిది. భట్టీలో చాలా విని ఉంటారు. కానీ చాలా విన్నకారణంగా బిందురూపంలో స్థితులవ్వటం కష్టం అయ్యే విధంగా ఉండకూడదు. కానీ బిందురూప స్థితిలో లోపానికి కారణం ఇదే - మొదటి పాఠం గట్టిగా లేదు. కర్మ చేస్తూ మిమ్మల్ని మీరు అశరీరి ఆత్మగా అనుభవం చేసుకోవాలి. రోజంతటిలో ఈ అభ్యాసం చాలా చేయాలి. ప్రత్యక్షంలో అతీతం అయ్యి కర్తవ్యంలోకి రావాలి. ఇది ఎంతెంత అనుభవం చేసుకుంటారో అంతగానే బిందురూప స్థితిలో స్థితులవుతారు. కానీ ఈ ధ్యాస తక్కువ ఉంటుంది. మీరు సమయం లేదు అంటున్నారు కానీ లక్ష్యం ఉంటే సమయాన్ని తీయవచ్చు. ఎలా అయితే ఏదైనా విశేష పనికి వెళ్తున్నప్పుడు దానిపై ఎక్కువ ధ్యాస పెట్టుకుని సమయం తీస్తారు కదా! అలాగే సంగమయుగం యొక్క కొద్ది సమయం ఏదైతే మిగిలి ఉందో దానిలో ఇది విశేష పని. విశేష పనిగా భావించి మధ్యమధ్యలో సమయం తీస్తే సమయం లభిస్తుంది, కానీ అభ్యాసం లేదు. అందువలన ఆలోచిస్తూనే సమయం చేతుల నుండి వెళ్ళిపోతుంది. ధ్యాస పెట్టుకుంటే ఎట్టి పరిస్థితిల్లోనైనా మీ అభ్యాసాన్ని పెంచుకుంటారు. ఈ అభ్యాసంలో అందరూ పిల్లలుగానే ఉన్నారు. వాస్తవంలో బిందు రూపంలో స్థితులవ్వటం కష్ట విషయం కాదు. ఎంతెంత అతీతం అవుతారో అంత బిందువు కాగలరు. బిందురూపమే అతీతం మరియు నిరాకారి. మీరు కూడా నిరాకారి మరియు అతీత స్థితిలో స్థితులైతే బిందు రూపం యొక్క అనుభవం చేసుకుంటారు. నడుస్తూ, తిరుగుతూ అవ్యక్త స్థితిని అనుభవం చేసుకోగలరు. అభ్యాసం ద్వారా ఈ స్థితి ఎంత సహజం అవుతుందంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అవ్యక్త స్థితిలో స్థితులైపోగలరు. ఒక సెకను అనుభవం ద్వారా ఎంత శక్తి మీలో నింపుకోగలరు అనేది కూడా అనుభవం చేసుకుంటారు. మరియు బ్రేక్ వేసే కార్యాలలో మరియు మలుచుకునే శక్తి కూడా అనుభవం అవుతుంది. కనుక బిందురూపం యొక్క అనుభవం కష్టం కాదు. సంకల్పమే క్రిందకి తీసుకువస్తుంది. సంకల్పానికి బ్రేక్ వేసే శక్తి ఉంటే ఎక్కువ సమయం అవ్యక్త స్థితిలో స్థితులవ్వగలరు. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి ఆ స్వరూపంలో స్థితులవ్వాలి. ఎప్పుడైతే స్వస్థితిలో స్థితులవుతారో అప్పుడు మీలో ఉన్న గుణాలు కూడా అనుభవం అవుతాయి. ఎటువంటి స్థానానికి వెళ్తే అటువంటి గుణం స్వతహాగానే అనుభవం అవుతుంది కదా! మీరు ఏదైనా శీతల స్థానానికి వెళ్ళినప్పుడు స్వతహాగానే శీతలత అనుభవం అవుతుంది. ఇది కూడా అంతే. ఆత్మాభిమాని అంటే అవ్యక్తబాబా స్మృతి. ఆత్మిక స్వరూపంలో బాబా స్మృతి లేకపోవటం అనేది ఉండదు. ఎలా అయితే బాబా-దాదా ఇద్దరు వేరు కాదో అలాగే ఆత్మిక నిశ్చయబుద్ది నుండి బాబా స్మృతి వేరు కాదు. ఒక సెకనులో మిమ్మల్ని మీరు బిందురూప స్థితిలో స్థితులు చేసుకోలేరా? ఈ వ్యాయామం చేయండి అని ఇప్పుడు మీ అందరికీ చెప్తే చేయగలరా? బిందురూపంలో స్థితులవ్వటం ద్వారా అతీత స్థితి అనుభవం అవుతుంది. మరియు ఆత్మ యొక్క వాస్తవిక గుణాలు కూడా అనుభవం అవుతాయి. ఇది కూడా అభ్యాసం చేయండి, ఎందుకంటే ఇప్పుడు సమయం తక్కువగా ఉంది, కార్యం ఎక్కువ చేయాలి. ఇప్పుడు సమయం ఎక్కువ మరియు పని తక్కువ చేస్తున్నారు. మున్ముందు ఇలాంటి సమయం రానున్నది - మీ అందరి జీవితం చాలా బిజీ అయిపోతుంది మరియు సమయం తక్కువ కనిపిస్తుంది. రాత్రి మరియు పగలు రెండు గంటల వలె అనుభవం చేసుకుంటారు. ఇప్పటి నుండే తక్కువ సమయంలో ఎక్కువ పని చేసే అభ్యాసం చేయండి. సమయాన్ని సఫలం చేసుకోవటం కూడా చాలా గొప్ప శక్తి. ఎలా అయితే మీ శక్తిని వ్యర్థం చేసుకోవటం మంచిది కాదో అలాగే సమయాన్ని వ్యర్థం చేసుకోవటం కూడా మంచిది కాదు. ఒక్కొక్కరి ప్రజలు ప్రఖ్యాతి అవుతారు. ప్రజలు ప్రఖ్యాతి అయినప్పుడే పదవి కూడా ప్రఖ్యాతి అవుతుంది. ప్రతి ఒక్కరి ప్రజలు మరియు భక్తులు ప్రఖ్యాతి అవుతారు. భవిష్య పదవికి ముందు సంగమయుగం యొక్క సర్వీస్లో సఫలతా స్వరూపం యొక్క స్మృతి చిహ్నం ప్రఖ్యాతి అవుతుంది, భవిష్య పదవి ప్రఖ్యాతి అవుతుంది. ఇలాంటి సమయం కూడా రానున్నది - మీరు మీ సంపాదన చేసుకోలేరు కానీ ఇతరుల కోసం చాలా బిజీ అయిపోతారు. ఇప్పుడు మీ సంపాదనకు చాలా తక్కువ సమయం ఉంది. తర్వాత ఇతరుల సర్వీస్ చేయడంలో మీ సంపాదన అవుతుంది. ఇప్పుడు ఏదైతే కొద్ది సమయం లభించిందో దాని పూర్తి లాభం పొందండి. లేకపోతే మరలా ఈ సమయమే స్మృతి వస్తుంది. అందువలన ఎలా ఉన్నా, ఎక్కడ ఉన్నా పరిస్థితులు మారవు. కష్టాలు తేలిక అయిపోతే సంపాదన చేసుకుంటాము అని ఆలోచించకండి. ఇవి రోజు రోజుకి చాలా విశాల రూపం ధారణ చేస్తాయి. వీటిలో ఉంటూ కూడా మీ స్థితి యొక్క పరిపక్వత ఉండాలి. అందువలనే సమయం యొక్క ధ్యాస మరియు స్వరూపం యొక్క స్మృతి మరియు దీని తర్వాత స్థితి వీటిపై ధ్యాస పెట్టుకోవాలి. భాధ్యతాకిరీటం గురించి చెప్పాను సింహాసనం ఏమిటి? నమ్రచిత్త్ యొక్క సింహాసనం. దీనిపై విరాజమానం అవ్వటం ద్వారానే అన్ని పనులు మంచిగా చేయగలరు. శక్తి సేనకి అయితే ఏకరసం యొక్క సింహాసనం ఇచ్చారు. మరియు పాండవ సేనకి నిర్మానచిత్త్ యొక్క సింహాసనం ఇచ్చారు. దీనిపై కూర్చుని బాధ్యతా కిరీటాన్ని ధరించి భవిష్య పదవిని తయారు చేసుకోండి. సింహాసనం నుండి దిగిపోకండి. దీనిపైనే కూర్చుని పని చేస్తే కార్యం సఫలం అవుతుంది. రోజంతటిలో మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఏ నాలుగు వస్తువులు లేదా విషయాలు మీ వెంట ఉంటాయి. సాధారణ మరియు స్థూల విషయం అడుగుతున్నాను. 1.కుర్చీ వెంట ఉంటుంది మరియు 2.పెన్ను 3.ఫైల్ 4.అటు ఇటు తిరుగుతూ ఉండాలి. ఈ నాలుగు లౌకికం నుండి అలౌకికంలోకి తీసుకురండి. కుర్చీపై కూర్చుంటున్నప్పుడు సింహాసనం స్మృతి చేయండి, కలంతో వ్రాస్తున్నప్పుడు కమలపుష్పాన్ని స్మృతి చేయండి. కమలపుష్పంగా అయ్యి కలంతో వ్రాయాలి. మరియు ఫైల్ చూసి మీ లెక్కలఖాతాను జ్ఞాపకం చేస్కోండి. ఇప్పుడు నా ఫైల్లో బాప్ దాదా ఏమి సంతకం చేస్తున్నారని మరియు తిరుగుతూ ఉండటం అంటే మెట్లు ఎక్కడం మరియు దిగడం ఈ అభ్యాసం చేయండి. ఎక్కడ బుద్ధి ఉపయోగించాలని అనుకుంటున్నారో అక్కడ ఉపయోగిస్తున్నారా లేదా? కాళ్ళని ఎలా నడిపించాలంటే అలా నడిపిస్తారు కదా! అలాగే మీ బుద్ధి రూపి పాదాన్ని కూడా నడిపించాలి. ఇప్పుడు బుద్ధిని లౌకిక విషయాల నుండి అలౌకిక విషయాలలోకి పరివర్తన చేయాలి. అప్పుడు స్థితిలో కూడా పరివర్తన వచ్చేస్తుంది. ఈ సంఘటన రత్నాలలో ఏ విశేష అలంకరణ ఉంది? 1. అందరికీ స్నేహి మరియు 2. ఎక్కువమంది సమర్పణ బుద్ది కలిగినవారు. సర్వీస్ కోసం ప్రతి సమయం తయారుగా ఉంటారు. అందువలనే ఎవరెడీ. ఇప్పుడు బాధ్యతా కిరీటం లభిస్తుంది. దానిలో ఈ విశేషతలని రత్నాల వలె అలంకరించాలి. అప్పుడే బాధ్యతను పూర్తిగా సంభాళించగలరు. ఈ గుణాలు కిరీటంలో మణులవంటివి అనగా అందం. వీటిని స్థిరంగా ఉంచుకోవాలి. ఎలాంటి కర్మ మీరు చేస్తారో మిమ్మల్ని చూసి అందరు అనుసరిస్తారు. ఒక స్లోగన్ జ్ఞాపకం ఉంచుకోవాలి - చిన్నవారికి మరియు పెద్దవారికి గౌరవం ఇవ్వాలి, ప్రేమ ఇవ్వాలి మరియు గౌరవం తీసుకోవాలి. అది ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ సంఘటనలోని వారు బంగారంలాంటి వారు. బంగారానికి కూడా అప్పుడప్పుడు మెరుగు అవసరం కదా! అదేవిధంగా మీ మెరుగు కొరకే మధ్యమధ్యలో మధువనాన్ని సంఘటన స్థానంగా పెట్టుకోండి. నిమిత్తంగా అయిన అక్కయ్యల ద్వారానే సమయానుసారంగా సంఘటన ఉంటుంది. ప్రదర్శినీలో కూడా కొత్తదనం రావాలి. ఇప్పుడైతే జనం మంచిదే అనే వరకు వచ్చారు. కానీ చూడగానే ఏమీ చెప్పవలసిన అవసరం లేకుండా ఇప్పుడు సహజ మార్గం లభించింది అని భావించాలి. టాపిక్లో కూడా ఆకర్షణ ఉండాలి, పరమాత్మ పరిచయం ఉండాలి. ఎవరైతే దూరంగా పరుగు పెడుతున్నారో వారిని కూడా సమీపంగా తీసుకురావాలి. వారు ధర్మ విచారం వారైనా లేక ఏ రకం వారైనా కానీ వారిని తీసుకురావాలి. సేవ యొక్క రూపురేఖ ఏవిధంగా ఉండాలి?

Comments

Post a Comment