23-01-1970 అవ్యక్త మురళి

 *23-01-1970         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“సేవలో సఫలతను పొందేందుకు యుక్తులు".
                     
సేవ కారణంగా తప్పని పరిస్థితుల్లో మాట్లాడవలసి వస్తోంది, కాని సేవ సమాప్తమవ్వగానే శబ్దపు స్థితి కూడా సమాప్తమైపోతుంది అని అనుభవం చేసుకుంటున్నారా! (ముంబాయి నుండి వచ్చిన పార్టీ ముంబయిలో జరుగనున్న సమ్మేళనం కొరకు బాప్ దాదా నుండి డైరెక్షన్లు తీసుకుంటున్నారు) ఈ రోజుల్లో మీరు చేస్తున్న ఈ సేవ కొరకు ఏ విశేషత కావాలి? భాషణలైతే సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు కాని ఇప్పుడు భాషణలో కూడా ఏ అవ్యక్త స్థితిని నింపాలి? మీరు మాట్లాడే సమయంలో కూడా వీరు అశరీరులుగా ఉన్నారు, శబ్దం నుండి అతీతమైన స్థితిలో స్థితులై మాట్లాడుతున్నారు అని అనుభవం చేసుకోవాలి. ఇప్పుడు ఈ సమ్మేళనంలో ఈ నవీనత రావాలి. ఆ స్పీకర్లు మరియు బ్రాహ్మణ స్పీకర్లు దూరం నుండే వేరుగా కనిపించాలి, అప్పుడే సమ్మేళనంలో సఫలత పొందినట్లు. ఎవరైనా తెలియని వ్యక్తులు సభలోకి ప్రవేశించినా, ఎవరో అద్భుతమైన వారు మాట్లాడుతున్నారు అనే అనుభవం చేసుకోవాలి. కేవలం వాణి శక్తి కర్ణరసం వరకు ఉండిపోతుంది. కాని, అవ్యక్త స్థితిలో ఉండి ఏదైతే మాట్లాడుతారో అది కేవలం కర్ణరసంగా కాక మనోరసంగా కూడా ఉంటుంది. కర్ణరసమును వినిపించేవారు ఎంతోమంది ఉంటారు, కాని మనోరసమును ఇచ్చేవారు ఇప్పటివరకు ప్రపంచంలో ఎవ్వరూ లేరు. బాబా పిల్లలైన మీ ముందు ప్రత్యక్షమయ్యారు, కాని పిల్లలైన మీరు మళ్ళీ బయట ప్రత్యక్షమవ్వాలి. కావున ఈ సమ్మేళనము సాధారణ రీతిలో జరిపేది కాదు. చిత్రాలలో కూడా చైతన్యత ఉండాలి అని మీటింగ్ లో చెప్పండి. ఏ విధంగా చైతన్యమైనవారు వ్యక్తభావనను స్పష్టంచేస్తారో అలాగే చిత్రాలు చైతన్యంగా అయి సాక్షాత్కారాలు చేయించాలి. చిత్రాలలో చైతన్యతాభావం ప్రత్యక్షమైనప్పుడు ఆ చిత్రాలే మంచిగా అనిపిస్తాయి. ఇది బైటి కళ యొక్క విషయం కాదు. బైటతోపాటు లోపల కూడా అలాగే ఉండాలి. బాప్ దాదా ఈ నవీనతనే చూడాలనుకుంటున్నారు. తక్కువగా మాట్లాడుతూ కూడా పెద్ద కర్తవ్యమును చేసి చూపించడమే బ్రాహ్మణుల విధానము. ఈ సమ్మేళనము అద్భుతంగా ఎలా జరగాలి అన్న ఆలోచనను ఉంచాలి. చిత్రాలలో కూడా అవ్యక్త  చైతన్యత ఉండాలి, దూరంనుండే అటువంటి అనుభూతి కలగాలి లేకపోతే ఇంతమంది ప్రజలు ఎలా తయారౌతారు? కేవలం నోటితో కాదు ఆంతరంగిక స్థితితో ప్రజలెవరైతే తయారవుతారో వారిదే అతీంద్రియ సుఖపు అనుభవము అని అంటారు. ఎవరైతే అవ్యక్త స్థితి యొక్క అనుభవంతో వచ్చారో వారు ప్రారంభం నుండే సహజంగా నడుస్తున్నారని, నిర్విఘ్నంగా ఉన్నారని మీరు ఇప్పటివరకు రిజల్టులో చూశారు మరియు ఎవరైతే అవ్యక్త స్థితితోపాటు ఇంకేదైనా ఆధారముపై నడుస్తున్నట్లయితే వారి మధ్య విఘ్నాలు, కష్టాలు మొదలైన కఠిన పురుషార్థాలు కనిపిస్తూ వస్తున్నాయి. కావున ఇప్పుడు ఇటువంటి ప్రజలను తయారుచేయాలి. వారు అవ్యక్త శక్తి ఆధారంపై చాలా కొద్ది సమయంలో మరియు సహజంగానే తమ లక్ష్యాన్ని పొందాలి. ఎంతగా స్వయం సహజ పురుషార్థులుగా ఉంటారో, అవ్యక్త శక్తిలో ఉంటారో అంతగానే ఇతరులను కూడా మీ సమానంగా తయారుచేయగలుగుతారు. కావున ఈ సమ్మేళనపు రిజల్టును చూడాలి. టాపిక్ ఏదైనా కాని స్థితి టాప్ గా (ఉన్నతోన్నతముగా) ఉండాలి. స్థితి టాప్ గా ఉన్నట్లయితే టాపిక్ ను ఎటువైపైనా మరలించవచ్చు. ఇప్పుడు భాషణపై కాక స్థితిపై సఫలత యొక్క ఆధారము నిలిచి ఉంది. ఎందుకంటే భాషణ అనగా భాషా ప్రావీణ్యత ప్రపంచంలో ఎంతగానో ఉంది. కాని, ఆత్మకు శక్తిని అనుభవము చేయించేవారు మీరే. కావున ఇప్పుడు ఈ నవీనతనే తీసుకురావాలి. ఎప్పుడు ఏ కార్యమును చేసినా మొదట వాయుమండలమును అవ్యక్తంగా తయారుచేయడం ఎంతో అవసరం. ఏవిధంగా ఇతర అలంకరణల విషయంలో ధ్యానమును ఉంచుతారో అలా ఇది కూడా ముఖ్యమైన అలంకరణయే. కాని ఏమి జరుగుతుంది? నడుస్తూ, నడుస్తూ ఆ సమయంలో బాహ్యముఖత అధికమైపోతుంది. కావున వాయుమండలము చివరిగా ఉన్న కారణంగా రిజల్టయితే వెలువడాలో అది వెలువడదు. ఇలా చేస్తాము, అలా చేస్తాము అని మీరు ఎంతగానో ఆలోచిస్తారు. కాని చివరి సమయంలో కర్తవ్యము ఎక్కువగా ఉండడం చూసి బాహ్యముఖతలోకి వచ్చేస్తారు. అలాగే వినేవారు కూడా ఆ సమయంలో చాలా బాగుంది, చాలా బాగుంది అని అంటారు. కాని, మళ్ళీ వెంటనే బాహ్యముఖతలోకి వచ్చేస్తారు. కావున ఎవరు వచ్చినా కాని మొదట అవ్యక్త ప్రభావం యొక్క అనుభవము కలిగే విధంగా అటువంటి ప్రోగ్రాంను ఉంచాలి. ఇది సమ్మేళనపు సఫలతకు సాధనము, కొద్దిరోజుల ముందునుండే ఈ వాయుమండలమును తయారుచేయవలసి ఉంటుంది. కేవలం అదేరోజు చేయాలని కాదు. వాయుమండలమును శుద్ధంగా చేసినప్పుడే ఏదైనా నవీనత కనిపిస్తుంది. సాకార శరీరంలో కూడా అలౌకికత దూరం నుండే కనిపించేది కదా! అలాగే పిల్లల ఈ వ్యక్త శరీరం నుండి అలౌకికత కనిపించాలి.

ప్రెస్ కాన్ఫరెన్స్ రిజల్టు మంచిగా ఉన్నట్లయితే అది చేయడంలో నష్టమేమీ లేదు. కాని మొదట వారిని కలిసి వారిని సహాయకులుగా చేయాలి - ఇది ఎంతో అవసరం. అవసరమైన సమయంలో వారితో పనిచేయించుకోవడం మరియు సమయానికి ముందే వారిని సహాయకులుగా చేయడం ఇందులో కూడా తేడా ఉంటుంది. ఎక్కువగా సమయంవైపుకు అటెన్షన్ వెళుతుంది. ఇప్పుడు మీ బుద్ధి లైన్ లో క్లియర్ చేసుకున్నట్లయితే అన్నీ స్పష్టమవుతూ ఉంటాయి. మీ ప్రదర్శినిలో- స్విచ్ ఆన్ చేసినట్లయితే జవాబు లభిస్తుంది అని ఉంది కదా! అలాగే పురుషార్థపు లైన్ క్లియర్ గా ఉండడం ద్వారా సంకల్పముల స్విచ్ ను నొక్కగానే చేసేస్తారు. ఈ విధంగా అనుభవం చేసుకుంటూ ఉంటారు. కేవలం వ్యర్థ సంకలాల కంట్రోలింగ్ పవర్ కావాలి. వ్యర్థ సంకల్పాలు కలగడం వలన బాప్ దాదా ద్వారా వాస్తవికంగా ప్రాప్తించిన ప్రేరణ అనండి లేక శుద్ధమైన బదులు ఏదైతే లభిస్తుందో అది కలిసిపోతుంది. ఎందుకంటే వ్యర్థ సంకల్పాలు అధికంగా ఉంటాయి. వ్యర్థ సంకల్పాలను కంట్రోల్ చేసే శక్తి ఉన్నట్లయితే మనస్సులోకి ఒక్క ఆ జవాబు మాత్రమే స్పష్టముగా కనిపిస్తుంది. అలాగే బుద్ధి పారదర్శకంగా ఉన్నట్లయితే అందులో ప్రతి విషయపు రెస్పాన్స్ స్పష్టంగా కనిపిస్తుంది మరియు యథార్థంగా ఉంటుంది, కల్తీ ఉండదు. ఎవరికైతే వ్యర్థ సంకల్పాలు కలుగవో వారు తమ అవ్యక్త స్థితిని ఎక్కువగా పెంచుకోగలుగుతారు. శుద్ధ సంకల్పాలు కూడా కలగాలి, కాని వాటిని కూడా కంట్రోల్ చేసుకునే శక్తి ఉండాలి. వ్యర్థ సంకల్పాల తుఫాను మెజారిటీలో ఎక్కువగా ఉంది.

ఏదైనా కార్యమును ప్రారంభించేటప్పుడు చాలా మంచి శాంపుల్ ను తయారుచేయడం జరుగుతుంది. అలాగే ఈ సమ్మేళనపు శాంపుల్ ను కూడా అందరి ముందు ఉంచాలి. అవ్యక్త స్థితి ఏమిటో దాని అనుభవం చేయించాలి. మీ నడవడికలో అందరూ సమయపు గడియారమును చూడాలి. మీరు సమయపు గడియారంగా అయి వెళుతున్నారు. సాకార బాబా కూడా సమయపు గడియారంగా అయ్యారు కదా! అలా శరీరంలో ఉంటూ అవ్యక్త స్థితి అనే గంటను మ్రోగించే గడియారంగా అవ్వాలి. ఈ సేవ అన్నింటికన్నా మంచిది. వ్యక్తంలో అవ్యక్త స్థితి యొక్క అనుభవము ఎలా ఉంటుంది అన్న దానిని అందరికీ ప్రాక్టికల్ పాఠంగా నేర్పించాలి. అచ్ఛా!

బాప్ దాదా మరియు దైవీ పరివారమందరి స్నేహసూత్రంలో మణిగా అయి తిప్పబడాలి. నేను స్నేహ సూత్రంలో స్మరింపబడిన మణిని అన్న నషా ఉండాలి. మణిని ఎక్కడ ఉంచుతారు? మాలలోని మణులను ఎంతో శుద్ధంగా ఉంచుతారు, వాటిని ఎంతో శుద్ధతాపూర్వకముగా చేతిలోకి తీసుకుంటారు. మనం కూడా ఇటువంటి అమూల్య మణులము అన్నది అర్థం చేయించాలి. (సేవ గురించి ఒకరు సలహా అడిగారు) వారి సేవ వాణి ద్వారా జరుగదు, ఎప్పుడైతే చరిత్ర ప్రభావశాలిగా ఉంటుందో, మార్పును చూస్తారో అప్పుడు వారు స్వయం ఆకర్షింపబడి వస్తారు. కొందరికి తమ అహంకారం కూడా ఉంటుంది కదా! అప్పుడు వాటితో వాణి అహంకారపు ఘర్షణలోకి వచ్చేస్తుంది. కాని ప్రత్యక్ష జీవితముతో ఘర్షణలోకి రాలేరు. కావున ఇటువంటివారికి అర్థం చేయించేందుకు ఇదే సాధనము. వాయుమండలమును అవ్యక్తంగా తయారుచేయండి. సేవా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి వాయుమండలము ఆకర్షణామయంగా చేయాలి. వారికి అందులో అవ్యక్త వతనము కనిపించాలి. ఎవరైనా దూరం నుండి కూడా ఈ ఇంటి మధ్యలో ఏదో దీపము ఉంది అని అనుభూతి చేసుకోవాలి. దీపము దూరం నుండే తన వెలుతురును ఇస్తుంది, తనవైపుకు ఆకర్షిస్తుంది. కావున ఒక దీపంలా దూరం నుండి ప్రకాశిస్తూ కనిపించాలి, అప్పుడే సఫలత లభిస్తుంది. అవ్యక్త బట్టీలోకి వచ్చాక అవ్యక్త స్థితి అనుభవమవుతోందా? ఇక్కడ ఏదైతే అనుభవమవుతోందో దానిని ఏం చేస్తారు? మీతోపాటు తీసుకువెళతారా లేక ఇక్కడే వదిలివెళతారా? వారిని ఎటువంటి సహచరులుగా చేసుకోవాలంటే, ఎవరు ఎంతగా ఈ అవ్యక్త ఆకర్షణ తోడును వదలాలనుకున్నా వదలలేకపోవాలి. లౌకిక పరివారమును అలౌకిక పరివారంగా చేసుకున్నారా? కొద్దిగా కూడా లౌకికత ఉండకూడదు. ఏ విధంగా ఒక శరీరమును వదిలి ఇంకొక శరీరమును తీసుకుంటారో, అప్పుడు ఆ జన్మను గూర్చిన ఎటువంటి విషయము స్మృతిలో ఉండదో, అలా ఇక్కడ కూడా మరజీవాగా అయ్యారు కదా! కావున గత జీవితపు స్మృతి మరియు దృష్టి అలాగే సమాప్తమైపోవాలి. లౌకికంలో అలౌకికం నిండడం ద్వారానే అలౌకిక సేవ జరుగుతుంది. మీరు ఏ అలౌకిక సేవను చేస్తారు? ఆత్మ సంబంధమును పవర్ హౌస్ తో జోడించే సేవను చేస్తారు. ఏదైనా వైరును మరొక వైరుతో జోడించవలసినప్పుడు రబ్బరును తొలగించవలసి ఉంటుంది కదా! అలాగే స్వయమును ఆత్మగా భావిస్తూ శరీరపు అభిమానము నుండి వేరుగా ఉండడము మీ మొదటి కర్తవ్యము మరియు ఇతరులను కూడా శరీరపు భావన నుండి వేరుగా చేయాలి. ఇక్కడి ముఖ్యమైన సబ్జెక్టులు ఎన్ని మరియు అవి ఏవి? ఇక్కడి ముఖ్యమైన సబ్జెక్టులు నాలుగు- జ్ఞానము, యోగము, ధారణ మరియు సేవ. వీటిలో కూడా ముఖ్యమైనది ఏమిటి? ఇక్కడి నుండే శాంతి స్టాకును పోగు చేసుకున్నారా? ఆశీర్వాదాలు ఎలా లభిస్తాయో తెలుసా? ఎంతెంతగా ఆత్మాభిమానులుగా అవుతారో అంతంతగా ఆశీర్వాదాలు కోరుకోకపోయినా లభిస్తాయి. ఇక్కడ స్థూలములో ఆశీర్వాదాలేమీ లభించవు, ఇక్కడ స్వతహాగానే లభిస్తాయి. బాప్ దాదాల ఆశీర్వాదాలు లేకపోతే ఇక్కడివరకు ఎలా చేరుకోగలిగేవారు? ప్రతిక్షణము బాప్ దాదా పిల్లలకు ఆశీర్వాదాలు ఇస్తున్నారు. కాని, తీసుకునేవారు ఎంతగా తీసుకుంటారో అంతగా తమ వద్ద నిలిపి ఉంచుకుంటారు.

మీకు ఇంకెవరైనా యుగళ్ ఉన్నారా? సదా తోడుగా ఉండే యుగళ్ ఎవరు? ఇక్కడ సదా యుగళ రూపంలో ఉన్నట్లయితే అక్కడ కూడా యుగళ రూపంలో రాజ్యం చేస్తారు. కావున ఎప్పుడూ యుగళుని వేరుగా చేయకండి. ఏవిధంగా చతుర్భుజుడు కంబైండ్ గా ఉంటారో అలాగే వీరు కూడా కంబైండ్ గా ఉన్నారు. శివబాబాను ఎప్పుడూ మీ నుండి వేరుచేయకండి. 84 జన్మలలో, 84 యుగళులలో ఇటువంటి జీవిత భాగస్వామి ఎప్పుడైనా లభించారా? కావున ఎవరైతే కల్పంలో ఒక్కసారి లభిస్తారో వారితో పూర్తిగా తోడును ఉంచాలి కదా! ఇప్పుడు మేము యుగళులుగా ఉన్నాము, ఒంటరిగా లేము అని గుర్తుంచుకోవాలి. ఏవిధంగా స్థూల కార్యంలో కష్టపడుతున్నారో అలాగే మనస్సు స్థితిలో కూడా అలాగే దృఢంగా ఉండాలి, ఏ పరిస్థితీ మిమ్మల్ని చలింపజేయకూడదు. దృఢమైన వస్తువు కరిగిపోదు, అలాగే స్థితి మరియు కర్మ రెండూ దృఢముగా ఉండాలి. ఎవరితోనైతే అతి స్నేహము ఉంటుందో వారిని తోడుగా ఉంచుకోవడం జరుగుతుంది, కావున సదా నేను యుగళమూర్తిని అని భావించండి. మీ యుగళ తోడుగా ఉన్నట్లయితే మాయ రాజాలదు. యుగళమూర్తిగా భావించడమే అతి పెద్ద యుక్తి. అడుగడుగులోను తోడుగా ఉన్న కారణంగా సాహసం ఉంటుంది, శక్తి ఉంటుంది అప్పుడిక మాయ మళ్ళీ రాజాలదు. మీరు ఈశ్వరీయ విద్యార్థులేనా? డబల్ విద్యార్థులుగా అయి భవిష్య లక్ష్యమునేమి ఉంచారు? ఉన్నత పదవి అని దేనిని భావిస్తున్నారు? లక్ష్మీనారాయణులుగా అవుతారా? లక్ష్యమును ఉంచినప్పుడు ఆ లక్ష్యముతోపాటు ఇంకేమి ధారణ చేయవలసి ఉంటుంది. లక్షణములు అనగా దైవీగుణములు. ఇంత ఉన్నతమైన లక్ష్యమును ఉంచినప్పుడు అంత ఉన్నతమైన లక్షణాలపై కూడా ధ్యానమునుంచాలి. చిన్న కుమారీలు కూడా చాలా పెద్ద కార్యము చేయగలరు. మీ ప్రత్యక్ష స్థితిలో స్థితులై ఎవరికైనా కూర్చొని వినిపించినట్లయితే దాని ప్రభావము పెద్దవారికన్నా కూడా అధికంగా ఉండగలదు. చిన్నవారమైన మేము పెద్ద కర్తవ్యమును చేసి చూపించాలి అన్న లక్ష్యమును ఉంచాలి. దేహము చిన్నగా ఉన్నా కాని ఆత్మశక్తి పెద్దది. ఎవరైతే ఎక్కువ పురుషార్థం చేసే కోరికను ఉంచుతారో వారికి సహాయం కూడా లభిస్తుంది. కేవలం మీ కోరికను దృఢంగా ఉంచుకోండి, అప్పుడు సహాయం కూడా దృఢంగా లభిస్తుంది. ఎవరు ఎంత చలించేందుకు ప్రయత్నించినా కాని ఈ సంకల్పము పక్కాగా ఉంచుకోవాలి. సంకల్పంపక్కాగా ఉన్నట్లయితే సృష్టి కూడా అలా తయారౌతుంది. దైహికమైన సేవను కూడా చేస్తూ ఉండండి, దైహిక సేవ కూడా ఒక సాధనమే. ఈ సాధనం ద్వారాసేవ చేయవచ్చు. ఈ సేవా సంబంధంలోకి ఏ ఆత్మలు వచ్చినా, వారికి సందేశమును ఇచ్చేందుకు ఇది సాధనము అని భావించండి. సేవలో అనేక ఆత్మలు సంబంధంలోకి వస్తాయి. ఇక్కడికి ఎవరైతే వచ్చారో వారిని కూడా సేవ కొరకు సంబంధీకుల వద్దకు పంపించారు కదా! అలాగే సేవ కొరకు ఈ స్థూలమైన సర్వీసు చేస్తున్నామని భావించండి. కావున అప్పుడు మనస్సు కూడా అందులో నిమగ్నమవుతుంది మరియు సంపాదన కూడా జరుగుతుంది. లౌకికమును కూడా అలౌకికముగా భావిస్తూ చేయండి. అప్పుడిక ఇంకే వాతావరణంలోకి రారు. ఎలా ఎలా అవ్యక్త స్థితి ఏర్పడుతూ ఉంటుందో అలా మాట్లాడడం కూడా తక్కువవుతుంది. తక్కువ మాట్లాడడం ద్వారా ఎక్కువ లాభం కలుగుతుంది. మళ్ళీ ఈ యోగశక్తితో సేవ చేస్తారు. యోగబలము మరియు జ్ఞానబలము రెండూ కలిసి ఉంటాయి. ఇప్పుడు జ్ఞానబలం ద్వారా సేవ జరుగుతోంది. యోగబలము గుప్తంగా ఉంది. కాని, ఎంతెంతగా యోగబలమును మరియు జ్ఞానబలమును రెండింటినీ సమానతలోకి తీసుకువస్తారో అంతంతగా సఫలత కూడా లభిస్తుంది. రోజంతటిలో యోగశక్తి ఎంత ఉందో, జ్ఞానశక్తి ఎంత ఉందో పరిశీలించండి. అప్పుడు తేడా ఎంత ఉందో అర్థమవుతుంది. సేవలో బిజీ అయిపోయినట్లయితే విఘ్నాలు మొదలైనవి కూడా తొలగిపోతాయి. దృఢనిశ్చయం ముందు ఎటువంటి అవరోధము రాజాలదు. సరిగ్గా నడుచుకుంటున్నారు, అలసట లేనివారిగాను ఉన్నారు మరియు ఏకరసముగాను ఉన్నారు. రెండు గుణాలూ ఉన్నాయి. సదా బాబాను అనుసరించండి. ఏ విధంగా సాకార రూపంలో కూడా అలసటలేని వారిగాను మరియు ఏకరసముగాను ఉన్నారో ఉదాహరణ మూర్తిగా అయి చూపించారో అలాగే ఇతరులపట్ల ఉదాహరణ మూర్తులుగా అవ్వాలి, ఇదే సేవ. సేవ చేసేందుకు సమయం లభించకపోయినా కాని చరిత్ర కూడా సేవ చేయగలుగుతుంది. చరిత్ర ద్వారా కూడా సేవ జరుగుతుంది, కేవలం వాణి ద్వారా కాదు. మీ చరిత్రలు ఆ విచిత్రుడైన తండ్రి స్మృతిని కలిగిస్తాయి. ఇది సహజమైన సేవ కదా! కొంతమంది తమ గురువుల ఫొటోలను, భార్య తన భర్త ఫొటోను లాకెట్లో పెట్టుకున్నట్లు... ఇది కూడా స్నేహానికి గుర్తు. కావున మీ ఈ మస్తకం కూడా ఆ విచిత్రుని చరిత్రను చూపించాలి. ఈ నయనాలు ఆ విచిత్రుని చిత్రాన్ని చూపించాలి. ఇటువంటి అవినాశి లాకెట్ ను ధరించండి. అప్పుడు మీ స్మృతి ఉంటుంది మరియు సేవ కూడా జరుగుతుంది. అచ్ఛా!

Comments

  1. ఓంశాంతి, బ్రాహ్మణుల పద్ధతి, ఆచారం ఏమిటి? ఇతరులను కూడా మీ సమానంగా ఎప్పుడు చేయగలరు? మహాబలి అని దేనిని పిలుస్తారు? బాప్ దాదా ఏ మూడు వారసత్వాలు ఇస్తున్నారు? ఉన్నతోన్నతమైన యుక్తి ఏమిటి? ఈ విషయాలన్నీ బాప్ దాదా ఈ అవ్యక్తమురళిలో తెలిపించారు. శివబాబా యాద్ హై?

    ReplyDelete

Post a Comment