22-01-1970 అవ్యక్త మురళి

 *22-01-1970         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

అంతిమ కోర్సు - మనస్సులోని భావాలను తెలుసుకోవటం.

                          అందరూ ఎక్కడ కూర్చున్నారు మరియు ఏమి చూస్తున్నారు? అవ్యక్త స్థితిలో స్థితులై అవ్యక్తరూపాన్ని చూస్తున్నారా లేక వ్యక్తంలో అవ్యక్తమును చూసే ప్రయత్నం చేస్తున్నారా? ఈ ప్రపంచంలో శబ్దము ఉంది. అవ్యక్త ప్రపంచంలో శబ్దము లేదు. కావున బాబా పిల్లలందరికీ శబ్దం నుండి అతీతంగా తీసుకువెళ్ళే డ్రిల్లును నేర్పిస్తున్నారు. ఒక్క క్షణంలో శబ్దంలోకి రావడము, ఒక్క క్షణంలో శబ్దం నుండి అతీతంగా అయిపోవడము ఇటువంటి అభ్యాసము ఈ వర్తమాన సమయంలో ఎంతో అవసరము. ఆ సమయం కూడా వస్తుంది. ఎంతెంతగా అవ్యక్త స్థితిలో స్థితులవుతూ ఉంటారో అంతంతగా నయనాల సంజ్ఞల ద్వారా మనస్సులోని భావాలను తెలుసుకుంటారు. ఎవరితోనైనా మాట్లాడవలసిన లేక వినవలసిన అవసరం ఉండదు. ఇటువంటి సమయం ఇప్పుడు రానున్నది. బాప్ దాదా ముందుకు వచ్చినప్పుడు మీరు ఏమీ వినిపించకుండానే వారు మీ మనస్సులోని సంకల్పాలను, మీ మనస్సులోని భావాలను తెలుసుకుంటారు. అలాగే పిల్లలైన మీరు కూడా ఈ అంతిమ కోర్సును చదవాలి. ఏ విధంగా నోటి భాషను మాట్లాడతారో అలాగే ఆత్మలది ఆత్మికంగా ఉంటుంది. దానినే ఆత్మిక సంభాషణ అని అంటారు.కావున ఆత్మలు  కూడా ఆత్మలతో మాట్లాడతాయి. కాని ఎలా మాట్లాడతాయి? ఆత్మల మాటలు నోటితో జరుగుతాయా? ఎంతెంతగా ఆత్మిక స్థితిలో స్థితులవుతూ ఉంటారో అంతంతగా ఆత్మ ఆత్మల విషయాలను అంతే సహజంగా మరియు స్పష్టంగా తెలుసుకోగలరు. ఏవిధంగా ఈ ప్రపంచంలో నోటి ద్వారా వర్ణన చేయడంతో పరస్పర భావాలను తెలుసుకుంటారో అలా దీనికొరకు ఇక్కడ ఏ విషయపు ధారణ అవసరము? సదా బుద్ధిలైను క్లియర్ గా ఉండేందుకు విశేషంగా ఈ విషయము అవసరము - తమ మనస్సులో లేక బుద్ధిలో ఏదైనా డిస్ట్రబెన్స్ (ఆటంకాలు) ఉన్నా లేక లైను క్లియర్ గా లేకపోయినా పరస్పర సంకల్పాలను మరియు భావాలను తెలుసుకోలేరు. లైన్ క్లియర్ గా లేని కారణంగా తమ సంకల్పాల కల్తీ జరుగవచ్చు. కావున ప్రతిఒక్కరూ తమ బుద్ధిలైను క్లియర్ గా ఉందా అని పరిశీలించుకోవాలి. బుద్ధిలో ఎటువంటి విఘ్నము విసిగించడం లేదు కదా? తెగిపోని విధంగా, స్థిరముగా, అలసటలేని విధంగా ఉండాలి. ఈ మూడు విషయాలు జీవితంలో ఉన్నాయా? ఈ మూడింటి నుండి ఒక్క విషయంలో లోటు ఉన్నా, బుద్ధిలైను క్లియర్ గా లేదని అర్థం చేసుకోవాలి. బుద్ధిలైను క్లియర్ గా అయిపోతే దాని స్థితి, స్మృతి ఎలా ఉంటుంది? ఎంతెంతగా బుద్ధిలైను అనగా పురుషార్థపు లైను క్లియర్ గా ఉంటుందో అంతంతగా స్మృతిలో ఏమి ఉంటుంది? ఏ విషయంలోనైనా వారి ముందు
వర్తమానము స్పష్టంగా ఉన్నట్లే భవిష్యత్తు కూడా స్పష్టంగా ఉంటుంది. వారికొరకు వర్తమానము మరియు భవిష్యత్తు సమానమైపోతుంది. ఈనాటి వైజ్ఞానికులు ఎక్కడెక్కడి విషయాలనో దూరపు వస్తువు కూడా సమీపంగా కనిపించే విధంగా స్పష్టంగా చూపించారు, అదేవిధంగా ఎవరి పురుషార్థమైతే స్పష్టంగా ఉంటుందో వారికి భవిష్యత్తులోని ప్రతి విషయము దూరంగా ఉంటూ కూడా సమీపంగా కనిపిస్తుంది. ఈ రోజుల్లో టెలివిజన్లో చూస్తే అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా! కావున వారి బుద్ధి మరియు వారి దృష్టి టెలివిజన్ వలే అన్ని విషయాలను స్పష్టంగా చూస్తుంది మరియు తెలుసుకుంటుంది. ఇంకే విషయంలోను పురుషార్థపు కష్టము ఉండదు. కావున ఈ అనుభవము మరియు అంతిమస్థితి స్థితి యొక్క పరిశీలనతో ఎంతవరకు అంతిమ స్థితికి సమీపంగా చేరుకున్నాము అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. సూర్యుడు తన పూర్తి ప్రకాశ స్థితిని చేరుకున్నప్పుడు ప్రతి వస్తువు స్పష్టంగా కనిపిస్తుంది. అంధకారము, మసక ఏవైతే ఉన్నాయో అవన్నీ అంతమైపోతాయి. అదేవిధంగా ఎప్పుడైతే సర్వశక్తివంతుడు, జ్ఞాన సూర్యుడు అయిన తండ్రితో తెగిపోని సంబంధం ఉంటుందో అప్పుడు మీలో మీకు కూడా అలాగే ప్రతి విషయము స్పష్టంగా కనిపిస్తుంది. నడుస్తూ, నడుస్తూ పురుషార్థంలో మాయ అంధకారము లేక మసక ఏదైతే వచ్చేస్తుందో, ఏదైతే సత్యమైన విషయమును దాచివేస్తుందో అది తొలగిపోతుంది. దీనికొరకు సదా రెండు విషయాలను గుర్తుంచుకోండి. నేటి ఈ అలౌకిక మేళాలోకి ఏ పిల్లలైతే వచ్చారో వారికి ఏవిధంగా లౌకిక తండ్రి తమ పిల్లలను ఏదైనా మేళాలోకి తీసుకువెళ్ళినప్పుడు స్నేహీ పిల్లలకు ఏదో ఒక వస్తువును కొని ఇస్తారో అలా బాప్ దాదా కూడా ఈనాటి ఈ అద్భుతమైన మేళాలో పిల్లలైన మీ అందరికీ ఏ అద్భుతమైన వస్తువును ఇస్తారు?

ఈనాటి ఈ మధుర మిలనపు మేళాకు స్మృతి చిహ్నంగా సదా శుభచింతకులుగా ఉండండి మరియు శుభచింతనలో ఉండండి అన్న స్మృతి చిహ్నమును బాబా ఇస్తున్నారు. శుభచింతన మరియు శుభచింతకులు. ఈ రెండు విషయాలను సదా గుర్తుంచుకోండి. శుభచింతనతో మీ స్థితిని తయారుచేసుకోగలుగుతారు మరియు శుభచింతకులుగా అవ్వడం ద్వారా అనేక ఆత్మల సేవ చేస్తారు. కావున నేడు ఇక్కడకు వచ్చిన పిల్లలందరికీ ఇది వతనం నుండి లభించే అవినాశీ కానుక. బాప్ దాదాలకు ఎక్కువ స్నేహము ఉందా లేక పిల్లలకు ఎక్కువ స్నేహము ఉందా? మా అందరి స్నేహము బాప్ దాదాకన్నా ఎక్కువగా ఉంది అని కొంతమంది పిల్లలు భావిస్తూ ఉండవచ్చు. కొందరు అలా ఉన్నారు కూడా. కాని, మెజారిటీ అలా లేరు. స్నేహము ఉంది కాని తెగిపోని మరియు ఏకరసమైన స్నేహము లేదు. పిల్లల స్నేహరూపము ఎంతగానో మారుతూ ఉంటుంది. కాని బాప్ దాదాల స్నేహము తెగిపోని విధంగా మరియు ఏకరసంగా ఉంటుంది. కావున ఎవరి స్నేహము ఎక్కువగా ఉందో ఇప్పుడు చెప్పండి. బాప్ దాదా పిల్లలను చూసినప్పుడు త్రినేత్రి అయిన కారణంగా వారు మూడు రూపాలతో చూస్తారు. అవి ఏ మూడు రూపాలు? పిల్లలైన మీరు బాబాను మూడు రూపాలతో చూస్తారు కదా! వాటిని గూర్చి అందరికీ తెలుసు. కాని బాబా కూడా పిల్లలను మూడు రూపాలతో చూస్తారు. ఒకటేమో పురుషార్థ రూపము, రెండవది- ఇప్పటి సంగమ రూపపు భవిష్య ఫరిస్తా రూపమేదైతే ఉందో అది, మూడవది భవిష్య దేవతా రూపము. ఈ మూడింటి సాక్షాత్కారము జరుగుతూ ఉంటుంది. ఈ మూడు రూపాలు ఒక్కొక్కటి ఎలా స్పష్టంగా కనిపిస్తాయంటే వర్తమానపు ఈ దేహరూపము ఈ కనుల ద్వారా స్పష్టంగా కనిపించినట్లుగా కనిపిస్తాయి. అదేవిధంగా దివ్యనేత్రం ద్వారా ఈ మూడు రూపాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ కనుల ద్వారా చూడబడిన వస్తువు యొక్క వర్ణణ చేయడం సహజమౌతుంది కదా! విన్న విషయాలను వర్ణన చేయడం కొంత కష్టం. కాని, చూసిన విషయాన్ని వర్ణన చేయడం సహజము మరియు అది స్పష్టంగా ఉంటుంది. కావున ఈ దివ్యనేత్రము లేక అవ్యక్త నేత్రముల ద్వారా ప్రతి ఒక్కరి మూడు రూపాలను కూడా అంతే సహజముగా వర్ణన చేయవలసి ఉంటుంది. అలాగే మీ అందరికీ కూడా పరస్పరం ఈ మూడు రూపాలు కనిపిస్తాయి. ఇప్పుడు యథా యోగ్యంగా, యథా శక్తిగా ఉన్నారు. కాని కొద్ది సమయం తరువాత ఈ యథాశక్తి అన్న పదము కూడా అంతమైపోతుంది మరియు ప్రతి ఒక్కరూ తమ తమ నెంబరు అనుసారంగా సంపూర్ణతను పొందుతారు. కావున బాప్ దాదా మీ అందరి సంపూర్ణ ముఖములను చూస్తారు. సంపూర్ణత నెంబర్‌ వారీగా ఉంటుంది. మాలలోని 108 మణులు ఏవైతే ఉన్నాయో వాటిలోని మొట్టమొదటి మణిని మరియు 108వ మణిని ఇరువురినీ సంపూర్ణులు అనే అంటారు కదా! విజయీ రత్నాలు అని అంటారు కదా? విజయీ రత్నాలు అనగా తమ నెంబర్ అనుసారంగా సంపూర్ణతను పొందేవారు. వారికొరకు మొత్తం డ్రామాలో అదే సంపూర్ణత యొక్క మొట్టమొదటి స్థితి. సత్యయుగంలో 8వ వారిని కూడా విశ్వమహారాజు అనే అంటారు. కాని, మొట్టమొదటి విశ్వమహారాజు యొక్క సృష్టిలోని సంపూర్ణ సుఖము మరియు 8వవారి సంపూర్ణతా సుఖంలో తేడా ఉంటుంది కదా! అలాగే ఇక్కడ కూడా ప్రతిఒక్కరూ తమ తమ నెంబరు అనుసారంగా సంపూర్ణతను పొందుతున్నారు. కావున బాప్ దాదా సంపూర్ణ స్థితిని చూస్తూ ఉంటారు మరియు వర్తమాన సమయపు పురుషార్థమును కూడా చూస్తూ ఉంటారు. ఎలా ఉన్నారు మరియు ఎలా అవ్వనున్నారు అన్నది గమనిస్తూ ఉంటారు.

వతనంలో కూర్చొని ఏమిచేస్తూ ఉంటారు అని మీరు అడిగారు కదా! ఇదే చూస్తూ ఉంటారు మరియు అవ్యక్త సహయోగమునిచ్చే సేవను చేస్తారు. బాప్ దాదా వతనంలో కూర్చొని ఏమి చేస్తుంటారో తెలియదు అని అందరూ భావిస్తూ ఉంటారు. కాని, సేవ వేగము సాకార వతనము కన్నా అక్కడ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సాకార తనువు లెక్కాపత్రాలు కూడా తోడుగా ఉండేది. ఇప్పుడు ఆ బంధనం నుండి కూడా ముక్తులుగా ఉన్నారు. తమపట్ల కాక సర్వాత్మల పట్లా ఉన్నారు. ఏ విధంగా ఈ శరీరమును వదలడము మరియు శరీరమును తీసుకోవడము ఈ అనుభవము అందరికీ ఉందో, అలాగే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు శరీరపు అభిమానమును పూర్తిగా వదిలి అశరీరులుగా అయిపోవాలి మరియు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు శరీరమును ఆధారం చేసుకొని కర్మ చేయాలి. ఈ అనుభవము ఉందా? ఈ అనుభవాన్ని ఇప్పుడు పెంచాలి. ఈ స్థూల శరీరము వేరు మరియు దీనిని ధారణ చేసే ఆత్మ వేరు అని పూర్తిగా అనుభవమవుతుంది. ఈ అనుభవము ఇప్పుడు ఎక్కువగా ఉండాలి. ఇప్పుడిక వెళ్ళిపోనున్నాము అనే సదా గుర్తుంచుకోండి. కేవలం సేవా నిమిత్తం శరీరమును ఆధారంగా తీసుకున్నాము. కాని, ఈ సేవ సమాప్తమైపోగానే మిమ్మల్ని మీరు పూర్తిగా తేలిక చేసేసుకోవచ్చు. మీరు డ్యూటీకి ఎక్కడకు వెళ్ళినా మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు తేలికగా భావిస్తారు కదా! డ్యూటీలోని వస్త్రాలను మార్చుకొని ఇంటి వస్త్రాలను ధరిస్తారు. అలాగే సేవకోసం ఈ శరీరరూపీ వస్త్రాన్ని ఆధారంగా తీసుకొని మళ్ళీ సేవ సమాప్తమవ్వగానే ఈ వస్త్రపు భారం నుండి తేలికగా అయి అతీతంగా అయిపోయే ప్రయత్నం చేయండి. ఒక్క క్షణంలో ఈ శరీరం నుండి ఎవరు వేరుగా అవ్వగలరు? బిగుతుగా ఉన్నట్లయితే వేరుగా అవ్వలేరు. ఏ వస్తువైనా అతుక్కుపోయి ఉంటే, దానిని తెరవడం ఎంతో కష్టం. తేలికగా ఉన్నట్లయితే సహజంగానే వేరైపోతుంది. అలాగే తమ సంస్కారాలలో ఏదైనా తేలికదనము లేకపోతే, అశరీర స్థితిని అనుభవం చేసుకోలేరు. కావున ఎలా అవ్వాలో తెలియజేశారు కదా! ఈజీగా మరియు ఎలర్ట్ గా అవ్వాలి. మాయ కూడా ఈజీగా వచ్చేసేంతగా కూడా ఈజీగా అవ్వకూడదు. కొన్నిసార్లు ఈజీగా ఉండవలసి ఉంటుంది, మరికొన్ని సార్లు ఎలర్ట్ గా ఉండవలసి ఉంటుంది. కావున ఈజీ మరియు ఎలర్ట్ - ఇలా ఉండేవారే ఈ అభ్యాసంలో ఉండగలుగుతారు. బాప్ దాదా పిల్లలను క్రొత్తగా ఏమీ చూడడం లేదు. వారికి మూడు కాలాలను గూర్చి తెలుసు, మరి వారిని క్రొత్త అని ఎలా అనగలరు? కావున అందరూ చాలా పాతవారే. ఎంత పాతవారు అన్నది లెక్కవేయలేదు. కావున స్వయమును క్రొత్తగా భావించకండి. మీరు అతి పాతవారు మరియు ఆ పాతవారే ఇప్పుడు మళ్ళీ తమ హక్కును తీసుకునేందుకు వచ్చారు. ఈ నషా సదా స్థిరముగా ఉండాలి. మేము పురుషార్థం చేస్తాము, చూస్తాము అని కూడా ఎప్పుడూ అనకండి. ఎవరైతే చివరిలో వచ్చారో, వారు మేము ఫాస్ట్ గా ముందుకు వెళతాము అనే ఆలోచించాలి. ఫాస్ట్ గా ముందుకు వెళ్ళాలి అనే లక్ష్యమును ఉంచినట్లయితే పురుషార్థం కూడా అలాగే జరుగుతుంది. కావున మేము వెనుక వచ్చాము కాబట్టి ప్రజలుగా అయిపోతాము అని ఎప్పుడూ భావించకండి. వెనుకవచ్చిన వారికి కూడా రాజ్యపదవిని పొందే అధికారము ఉంది. అచ్ఛా! అవ్యక్త మిలనము కూడా మిలనమే. కావున మేము రాజ్యపదవిని తప్పకుండా పొంది తీరుతాము అన్న నిశ్చయమునే అందరూ ఉంచాలి. మేము అవ్వకపోతే మరి ఎవ్వరు అవుతారు! కోట్లాదిమందిలో ఏ ఒక్కరో అని ఏ ఆత్మలు లెక్కింపబడతారు? ఇటువంటి కోట్లాదిమందిలో ఏ ఒక్కడిగానో ఉన్న ఆత్మలైన మనము డ్రామాలో ఉన్నాము. ఈ మీ నిశ్చయమును మరిచిపోకూడదు. బాప్ దాదా పిల్లలందరి భవిష్యత్తును చూసి హర్షిస్తున్నారు. ఒక్కొక్కరినీ కలుసుకోవడం, మనస్సులోని విషయము ఇదే. నిజానికి బాప్ దాదాకు ఇప్పుడిది వ్యక్త ప్రపంచం కూడా కాదు, కాని మీ అందరి సమానంగా ఈ వ్యక్త ప్రపంచంలో మీ ప్రపంచము అనుసారంగా సమయమును కూడా చూడవలసి ఉంటుంది కాని వతనంలో సమయమనేది ఉండదు, గడియారము ఉండదు. కాని ఈ వ్యక్త ప్రపంచంలో ఈ విషయాలన్నింటినీ చూడవలసి ఉంటుంది. అక్కడ సూర్య చంద్రులే లేనప్పుడు రాత్రిపగలు అన్నవి ఏ లెక్కలో ఉంటాయి. కావున సమయము అన్న బంధన లేదు. అచ్చా!

Comments

  1. ఓంశాంతి, బుద్ధి లైన్ స్పష్టంగా లేదు అని ఎలా తెలుసుకోవచ్చు? ఒక సెకనులో ఈ శరీరము అనే వస్త్రం నుంచి వేరుగా ఎవరు కాగలరు? బాప్ దాదా వతనంలో కూర్చుని ఏమి చేస్తారు? అంతిమ స్థితికి పరిశీలన ఏమిటి? ఈ విషయాలన్నీ బాప్ దాదా ఈ అవ్యక్తమురళిలో తెలిపించారు. శివబాబా యాద్ హై?

    ReplyDelete

Post a Comment