20-12-1969 అవ్యక్త మురళి

 20-12-1969         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

స్వచ్ఛమైన స్మృతి ద్వారా ప్లాన్స్(పద్ధతులు) యొక్క సఫలత

                       ఈరోజు బాప్ దాదా ఏమి చూస్తున్నారు? ఏమి చూడడానికి మరియు చేయడానికి వచ్చారు? ఈరోజు బాప్ దాదా తన అతి స్నేహీ పిల్లలతో ఒక ప్రతిజ్ఞ చేయించడానికి వచ్చారు. ప్రతిజ్ఞ చేయటంలో అయితే ఈ ఆత్మలు ఆది నుండి ప్రవీణులే. ఎలా అయితే ఆదిలో ప్రతిజ్ఞ చేయటంలో ఆలస్యం చేయలేదు, ఏమి ఆలోచించలేదు. అదేవిధంగా ఇప్పుడు కూడా బాప్ దాదా ప్రతిజ్ఞ తీసుకోవడానికి వచ్చారు. మొత్తం డ్రామాలో అనేకాత్మల మధ్య మీరే ధైర్యవంతులుగా ప్రసిద్ధం అయ్యారు. ధైర్యం పెట్టుకుని బాప్ దాదాకి సమీపంగా ఉన్నారు మరియు స్నేహం పొందారు. సహాయం కూడా తీసుకున్నారు మరియు చేశారు కూడా. ఆ సంస్కారాలనే మరలా పరీక్ష చేయడానికి వచ్చారు. అందరు ఎవరెడీ కదా! ప్రతిజ్ఞ ఏమిటంటే ఇప్పటి నుండి ఏకత, స్వచ్ఛత, మహీనత, మధురత మరియు మనసా, వాచా, కర్మణా మహానత ఈ అయిదు విషయాలు ఒక్కొక్కరి ప్రతి అడుగులోనూ కనిపించాలి. చెప్పాను కదా - భట్టీ తర్వాత సేవాస్థానాలకి వెళ్ళాలి. ఆ రోజులు స్మృతి ఉన్నాయి కదా! ప్రజలు కూడా ఏమి అనేవారు! అందరి నోటి నుండి ఇదే వచ్చేది - వీరు ఒకే నమూనా నుంచి వచ్చారు అని. అందరి విషయం ఒకటే. అందరి నడవడిక ఒక్కటే, అందరి ఆకర్షణ ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది. వారికి దేని ప్రభావం పడేది? అవ్యక్త పాలన యొక్క ప్రభావం కనిపించేది. వ్యక్తంలో ఉంటూ అందరూ అవ్యక్త ఫరిస్తాగా కనిపించేవారు. సాధారణ రూపంలో ఉంటూ కూడా ఆకర్షణ మూర్తి మరియు అలౌకిక వ్యక్తులుగా కనిపించేవారు. అది 16 సం॥ల భట్టీ , ఇది 16 రోజుల భట్టీ, ఇప్పటి నుండి అందరికి తెలియాలి - వీరు మారి ప్రపంచాన్ని మార్చడానికి వచ్చారని. మొత్తం దైవీ పరివారం యొక్క కళ్ళు ఈ గ్రూపుపై ఉన్నాయి. కనుక విశేష ఆత్మలకు మీ విశేషతను చూపించాలి, ఏ విశేషత చూపించాలి? అయిదు విషయాలు వినిపించాను. ఎప్పుడైతే ఈ అయిదు విషయాలు ప్రతి సంకల్పం, ప్రతి మాట, ప్రతి కర్మలో స్మృతి ఉంచుకుంటారో అప్పుడే విశేష ఆత్మలుగా అందరికీ కనిపిస్తారు. ఎప్పుడైతే మీలో విశేషత తీసుకువస్తారో అప్పుడు బాబాని కూడా ప్రత్యక్షం చేయగలరు. మీ సంపూర్ణ సంస్కారాల ద్వారానే బాబాని ప్రత్యక్షం చేయగలరు. కేవలం సేవా పద్ధతుల ద్వారా కాదు, మీ సంపూర్ణ సంస్కారాల ద్వారా, మీ సంపూర్ణ శక్తి ద్వారా బాబాని ప్రత్యక్షం చేయాలి. పద్దతులైతే తయారు చేయవలసి ఉంటుంది కానీ మీ సంలగ్నత పూర్తిగా ఉన్నప్పుడే పద్ధతులలో కూడా సఫలత వస్తుంది. ఏ కల్తీ ఉండకూడదు. స్వచ్చమైన స్మృతి ఉండాలి. స్వచ్ఛమైన స్మృతి ద్వారానే సఫలం అవుతాయి. పద్ధతికి ముందు పరిశీలించుకోండి - ప్లానులో స్మృతి ఉందా? ఆదిలో ఏమి ప్రతిజ్ఞ చేసేవారు? పాట స్మృతి ఉంది కదా! దానిని మరలా సాకారంలోకి తీసుకురావాలి. అంటే బుద్ధి యొక్క సంలగ్నత ఒకనితోనే ఉంది అనేది సాక్షాత్తు సాకార రూపంలో అందరికీ ఉండాలి. ఏమి చేయడానికి వచ్చారు మరియు ఏమి చూడడానికి వచ్చారో ఇప్పుడు అర్ధమయ్యిందా? రకరకాల విషయాలు బాబాకి మంచిగా అనిపిస్తున్నాయి. ఆత్మిక సంభాషణ దీనిలో కొంతమంది ఫెయిల్ అవుతున్నారు. ఫెయిల్ అవ్వటం లేదు, ఫెయిల్ అవ్వనివటం లేదు. ఇది కూడా మంచిదే. కానీ ఫీల్ అవుతున్నారు. విషయాలలో విజయీ అయ్యే కళ నేర్చుకోవాలంటే పిల్లలైన మీ నుంచే నేర్చుకోవాలి. మీలో ఉన్న ఈ కొంచెం తేడా తొలగిపోతే మొత్తం ఆత్మలు  మీపై బలి అయిపోతారు. ఎలా అయితే మీరు బాబాపై బలి అయ్యారో అలాగే మీ భక్తులు మీ శక్తిపై బలి అయిపోతారు. కానీ కేవలం ఈ విషయం తొలగిపోవాలి, ఫీల్ అవ్వటం తొలగిపోవాలి. మీరు అందరికంటే తెలివైనవారు ఎందుకంటే వెంటనే వ్యాపారం చేసేసారు. మొత్తం సృష్టి  ఆత్మలలో మీరు ధైర్యవంతులు కూడా మరియు తెలివైనవారు కూడా. అందువలన బాప్ దాదా ఇది తెలివైన పిల్లల యొక్క సంఘటన అని అంటున్నారు. ధైర్యవంతులు కూడా. బయటి వారికి ఎంత ధైర్యం ఉన్నా కానీ తక్షణ దానం ద్వారా మహాపుణ్యం పొందే ధైర్యం ఎవరూ పెట్టుకోలేరు. నదులలో స్నానం అందరూ చేస్తున్నారు కానీ మీరు సాగరంలో స్నానం చేశారు. సాగరంలో మరియు నదిలో స్నానం చేయటంలో తేడా ఉంటుంది కదా! దీనిలో అయితే పాస్ అయిపోయారు. ఇప్పుడు మరొక విషయంలో పాస్ అవ్వాలి. ఆ ఒక్క విషయం ద్వారానే మార్కులు వస్తాయి. 
                            ఏదైనా ఆజ్ఞ ఎప్పుడైనా, ఏ రూపంలో అయినా, ఎక్కడైనా లభిస్తుంది. ఎంత సమయంలోనైనా లభిస్తుంది. ఒక్క సెకనులో కూడా ఆజ్ఞ లభిస్తుంది. అందువలన ఇలా అందరూ సదా తయారుగా అయ్యారా? అశుద్ద కుటుంబాన్ని వదలడానికి మరేమీ ఆలోచించలేదు కదా! నగలు, బట్టలు, పిల్లలు ఎవరినీ చూడలేదు కదా! ఇది పవిత్రమైన కుటుంబం. దీనిలో ఆ విషయాలు చూడవల్సిన అవసరం ఏమిటి? ఆదిలో కేవలం స్నేహంతో ఉండేవారు. స్నేహంతో ఇవన్నీ చేశారు కానీ జ్ఞానంతో కాదు. కేవలం స్నేహమే ఇలా ఎవరెడీగా చేసింది. ఇప్పుడు స్నేహంతో పాటూ శక్తి కూడా ఉంది. స్నేహం మరియు శక్తి ఉన్నా కానీ ఎవరెడీ అవ్వడంలో ఆలస్యం ఎందుకు? ఎలాగైతే ఆదిలో అందరినీ ఈ ఘడియకి మైదానంలోకి రండి అని దండోరా వేసేవారు కదా! అలాగే ఇప్పుడు కూడా అది రకరకాల రూపాలలో రిపీట్ అవుతుంది. బాప్ దాదా భవిష్యత్తుని తెలుసుకుని హెచ్చరిక చేస్తారు అని అనుకుని మిమ్మల్ని మీరు సేవాబంధనలో బంధించుకోకండి. బంధన ఉన్నప్పటికీ బంధనలో ఉండకూడదు. ఏదైనా ఆత్మకి బంది అయిపోవటం నిర్పందనకి గుర్తు కాదు. అందువలన అందరూ ఒక విషయంలో గౌరవయుక్తముగా పాస్ అవ్వాలి. ఏ విషయాలు అయితే మీకు ధ్యాసలో, స్వప్నంలో ఉండవో ఆ విషయాలే హెచ్చరిక ఇస్తారు. ఎవరైతే ఈ పేపర్ లో పాస్ అవుతారో వారే గౌరవయుక్తంగా పాస్ అవుతారు. అందువలన ముందుగానే చెప్తున్నాను, ముందుగానే సైగ లభిస్తుంది. దీనినే లోతులోకి వెళ్ళటం అని అంటారు. ఎవరైతే మహీనబుద్ధి కలిగి ఉంటారో వారి గుర్తు ఏమిటి? లోతైన బుద్ధి కల్గిన ఆత్మలు ఎటువంటి పరిస్థితులలోనైనా తమని తాము మలుచుకుంటారు. ఎటువంటి పరిస్థితి అయినా దానిలో స్వయాన్ని మలుచుకుంటారు. ఎదుర్కోడానికి వారిలో ధైర్యం ఉంటుంది. ఎప్పుడూ భయపడరు. దాని లోతులోకి వెళ్ళి స్వయాన్ని అలా నడిపించుకుంటారు. ఎప్పుడైతే తేలికగా ఉంటారో అప్పుడే మలుచుకోగలరు. చల్లదనం మరియు వేడి రెండూ సమానంగా ఉన్నప్పుడే మలుచుకోగలరు. ఏ ఒక్కటి లోపంగా ఉన్నా మలుచుకోలేరు. ఏ వస్తువునైనా వేడి చేసి చల్చార్చిన తర్వాత మలుస్తారు. ఇక్కడ ఏ వేడి, ఏ చల్లదనం? నిర్మాణత చల్లదనం, వేడి అంటే శక్తి రూపం, నిర్మాణత అంటే స్నేహరూపం. ఎవరిలో అయితే ప్రతీ ఆత్మపట్ల స్నేహం ఉంటుందో వారే నిర్మాణతగా ఉండగలరు. స్నేహం లేకపోతే దయాహృదయులుగా నమ్రచిత్తులుగా కాలేరు. అందువలన నిర్మాణత మరియు శక్తి రూపం అంటే ఎంత నిర్మాణతయో అంత యజమాని స్థితి, శక్తి రూపంలో యజమాని స్థితి మరియు నమ్రతలో సేవాగుణం ఉండాలి. సేవ కూడా చేయాలి మరియు యజమాని స్థితి కూడా ఉండాలి. సేవాధారిగా కూడా ఉండాలి మరియు విశ్వ యజమాని స్థితిని యొక్క నషా కూడా ఉండాలి. ఎప్పుడైతే ఈ చల్లదనం మరియు వేడి రెండు ఉంటాయో అప్పుడే ప్రతి విషయంలో మలుచుకోగలరు. ప్రతి ఒక్కరు ఇది చూసుకోవాలి - మా బుద్ధి యొక్క త్రాసు చల్లదనం మరియు వెచ్చదనం రెండింటికి సమానంగా ఉంటుందా అని. అక్కడక్కడ అతి నిర్మాణత కూడా నష్టం చేస్తుంది మరియు అతి యజమాని స్థితి కూడా నష్టం చేస్తుంది. అందువలన రెండింటి సమానత కావాలి. ఎంత సమానత ఉంటుందో అంత మహానత కూడా ఉంటుంది. ఏ విషయంలో పాస్ విత్ ఆనర్  అవ్వాలో ఇప్పుడు అరమైందా? అంతిమ పేపర్ కంటే ముందుగానే చెప్పేస్తున్నాను. ప్రతి సమయం నిర్బంధనగా ఉండాలి. సేవాబంధన నుండి కూడా నిర్భందనగా అవ్వాలి. దండోరా వినిపించగానే ఎవరెడీ అయ్యి మైదానంలోకి రావాలి. ఇది అంతిమ పేపర్ సమయానికి ప్రత్యక్షంలోకి వస్తుంది. ఈ పేపర్లో పాస్ అయితే ఇక ఏ గొప్ప విషయం లేదు. ఈ పేపర్లో పాస్ అవ్వటం అంటే అవ్యక్త స్థితిలో ఉండటం. శరీర అభిమానికి అతీతంగా అవ్వటం కంటే గొప్ప విషయం లేదు. దీని ద్వారానే పరిశీలించుకోవచ్చు - ఎంత వరకు జీవన నౌక యొక్క త్రాళ్ళు వదిలాము అని. 1.బంగారు సంకెళ్ళు 2. ఇనుప సంకెళ్ళు, ఇనుప సంకెళ్ళు వదిలేశారు కానీ ఇప్పుడు బంగారు లోతైన సంకెళ్ళు ఉన్నాయి. ఇవి కనిపించని విధంగా ఉంటాయి.
                     అందువలన ఎలా అయితే ఇతరబంధనాల నుండి ముక్తి అవుతున్నారో అలాగే సహజంగా ఈ శరీరం యొక్క బంధన నుండి కూడా ముక్తి అవ్వాలి. లేకపోతే శరీర బంధన నుండి కూడా చాలా కష్టంగా ముక్తి అవుతారు. అంతిమ పేపర్ అంతిమతి సోగతి. అంతిమంలో సహజంగా శరీరం యొక్క బంధన నుండి ముక్తి అవ్వాలి. ఇదే పాస్ విత్ ఆనర్ కి గుర్తు. కానీ మీ వస్త్రం బిగువుగా లేనప్పుడే సహజంగా ముక్తి కాగలరు. ఒకవేళ బిగుతుగా ఉంటే సహజంగా ముక్తి కాలేరు. బిగుతు స్థితి అంటే అర్థం - ఎవరొకరితో తగుల్బాటు. అందువలన కేవలం ఒక విషయం పరిశీలించుకోండి - ఒక సెకనులో వస్త్రాన్ని వదిలేయగలిగేటంత లూజ్ గా వస్త్రం ఉండాలి. ఒకవేళ ఎక్కడైనా తగులుకుని ఉంటే తీయటంలో కూడా తగుల్కొంటుంది. అలా తగుల్పాటు లేనివారినే ఎవరెడీ అంటారు. ఎవరైతే ప్రతీ విషయంలో ఎవరెడీగా ఉంటారో వారే ఈ విషయంలో ఎవరెడీగా ఉంటారు. ప్రత్యక్షంలో చూసారు కదా - పిలవగానే ఒక సెకనులో ఎవరెడీ అయ్యి చూపించారు. పిల్లలు ఏమంటారో, పిల్లలను కలుసుకోకుండా వెళ్తే ఎలా అని ఆలోచించారా? హెచ్చరిక రాగానే ఎవరెడీ అయ్యారు. శరీరంతో సహజంగా ఉంటే శరీరం వదలడం కూడా సహజంగా ఉంటుంది. అందువలన ఈ ప్రయత్నం ప్రతి సమయం చేయాలి. ఎలా ఉంటున్నా కానీ అతీతంగా ఉండేవారు. అందువలనే ఒక్క సెకనులో అతీతం అయిపోయారు. చాలా సమయం నుండి అతీతంగా ఉండేవారు, ఒక్క సెకనులో అతీతం అయిపోతారు. చాలా సమయం నుండి అతీతంగా కాకపోతే ఈ శరీరం యొక్క ప్రేమ పశ్చాత్తాపం తీసుకువస్తుంది. అందువలన దీనితో ప్రేమ ఉండకూడదు. ఈ దేహంతో ఎంత అతీతం అవుతారో అంత విశ్వానికి ప్రియంగా అవుతారు. అందువలన ఇప్పుడు ఇదే పురుషార్ధం చేయాలి. ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు ఆ సమయంలో మంచిగా చేసుకుంటాము అని భావించకండి. ఇలాంటి విషయమేమి లేదు. మున్ముందు ఇలాంటి అమూల్య మృత్యువులు రానున్నవి. ఆ మృత్యువుల ద్వారా కూడా తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. అందరికీ ఒకే విధంగా ఉండదు. కొంతమంది పిల్లలు డ్రామాలో మృత్యువు అనే అమూల్య పాత్రలో కూడా తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. ఎవరిలో అయితే ఒక విశేష గుణం ఉంటుందో వారే ఇలా చేయగలరు. ఈ పాత్ర కూడా చాలా కొద్ది మందికే ఉంటుంది. అంతిమం వరకు కూడా బాబాని ప్రత్యక్షం చేస్తూ ఉంటారు. ఇది కూడా చాలా పెద్ద సబ్జక్ట్. అంతిమ ఘడియలో కూడా బాబా ప్రత్యక్షం అవుతూ ఉంటారు. ఎవరికైతే చాలా సమయం నుండి అశరీరి అయ్యే అభ్యాసం ఉంటుందో ఆ ఆత్మలు చాలా శక్తిశాలిగా ఉంటారు. వారు ఒక సెకనులో అశరీరి అయిపోతారు. మీరు స్పృతిలో కూర్చుంటున్నారు. విఘ్నం వచ్చినా, ఏ పరిస్థితులు ఎదురుగా వచ్చినా కూడా కూర్చుంటున్నారు. సాధారణంగా అయితే ఒక్క సెకనులో అశరీరీ అవ్వటం చాలా సహజం. కానీ ఒక సెకనులో ఆలోచించగానే అశరీరి అయిపోవాలి. ఏ సమయంలో అయితే ఏదైనా విషయం ఎదురుగా వచ్చినా, సేవలో ఏ జంజాటం అయినా ఎదురుగా వచ్చినా కాని ఈ విధమైన అభ్యాసం ఉండాలి? ఒక సెకనులో, సెకను కూడా ఎక్కువ. ఆలోచించటం మరియు చేయటం వెనువెంట ఉండాలి. ఆలోచించిన తర్వాత పురుషార్థం చేయటం కాదు. ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు, ఆ తర్వాత ఆ స్థితిలో సితులవుతున్నారు. కానీ వారు ఆలోచించడం మరియు స్థితిలో స్థితులవ్వటం వెనువెంట చేస్తారు. వారి ఆలోచన మరియు స్థితిలో తేడా ఉండదు. ఆలోచించారు మరియు అయిపోయింది. ఇలా అభ్యాసిగా ఉన్నవారే మృత్యువు ద్వారా సర్వీస్ చేసే బాధ్యత తీసుకుంటారు. ఇలా కొద్దిమందే నిమిత్తం అవుతారు. ఎక్కువమంది కాదు. తక్కువమంది ఉంటారు వారి పైన ఇక్కడే పువ్వులు పడతాయి. ఇలా ఎవరైతే పాస్ విత్ ఆనర్ అవుతారో వారిపై ద్వాపరయుగం యొక్క భక్తులు ఇక్కడ అంతిమంలో సాకారరూపంలో పూలవర్షం కురిపిస్తారు. వారు అంతిమ వరకు తండ్రినే ప్రత్యక్షం చేసి వెళ్తారు. ఈ విధంగా సేవ జరిగే మృత్యువు ఉంటుంది. వారి మృత్యువు ద్వారా కూడా సేవ జరుగుతుంది. ఈ సేవ కోసం పిల్లలే నిమిత్తమవ్వాలి. తల్లి, తండ్రి కాదు! వారు గుప్తరూపంలో ఉంటారు. సేవలో తల్లి, తండ్రి వెన్నెముకగా ఉంటారు మరియు పిల్లలు ఎదురుగా ఉంటారు. ఈ సేవా పాత్రలో తల్లి, తండ్రి యొక్క పాత్ర లేదు. దీనిలో పిల్లలే తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. సేవ యొక్క అంతిమంలో ఈ మెడల్ లభిస్తుంది. ఇలాంటి మెడల్ డ్రామాలో కొద్దిమంది  పిల్లలకే లభిస్తుంది. ఇప్పుడు ఆ మెడల్ పొందడానికి నిమిత్తంగా కాగలమా? అని ప్రతి ఒక్కరు మీకు మీరు నిర్ణయించుకోండి. పాత అక్కయ్యలే అవుతారు అనుకోకండి. ఎవరైనా కాగలరు. క్రొత్త క్రొత్త రత్నాలు కూడా అద్భుతం చేసి చూపిస్తారు. 
                          ఇప్పుడు సేవలో క్రొత్త దనం తీసుకురావాలి. ఎలా అయితే మీలో క్రొత్తదనం తీసుకువస్తున్నారో అలాగే సేవలో కూడా క్రొత్తదనం తీసుకురావాలి. క్రొత్తదనం తీసుకువచ్చే  అయిదు విషయాలను స్మృతిలో ఉంచుకోవాలి. వీరు ఎక్కడి నుండి వచ్చారు అని అందరి నోటి నుండి రావాలి. ఆదిలో వచ్చేది కానీ ఆదిలో వాక్కు బలం ఉండేది కాదు. ఇప్పుడు వాక్కు యొక్క బలం ఉంది. కానీ అలౌకికస్థితి యొక్క బలం గుప్తం అయిపోయింది, దాగి ఉంది. అందువలన ఇప్పుడు అందరికీ ఈ అలౌకికత చూపించాలి. ఎలా అయితే ఆదిలో భట్టీ మండి వెళ్ళిన ఆత్మలు ఎంత సేవ చేసారు. ఇప్పుడు మరలా సృష్టి యొక్క దృశ్యాన్ని పరివర్తన చేయడానికి నిమిత్తం అవ్వాలి. ఇలా శక్తి రూపంగా మరియు స్నేహ రూపంగా అవ్వాలి. ఎన్ని వేల మంది మధ్యలో ఉన్నా ఒక అలౌకిక వ్యక్తి వలె కనిపించాలి. సాకారంలో బాబాని ఈయన ఎవరో అలౌకిక వ్యక్తి అని అజ్ఞాని ఆత్మలు కూడా వర్ణన చేసేవారు. వేలమందిలో ఆ వజ్రం మెరుస్తూ ఉండేది. ఈ విషయంలో బాబాని అనుసరించండి. వారి వైబ్రేషన్ లోకి మీరు వెళ్ళకూడదు. మీ వైబ్రేషన్స్ ద్వారా వారిని అలౌకికంగా చేయాలి. ఈ క్రొత్తదనం తీసుకురావాలి. ఇప్పుడు సేవ కారణంగా కొంచెం ప్రపంచ ప్రజలతో కలుస్తున్నారు. సేవ కోసం సంబంధంలో ఉంటూ కూడా అతీతంగా ఉండే మంత్రం ఏదైతే లభించిందో దానిని మర్చిపోకూడదు. ఇప్పుడు ఏదైతే సంబంధం పెట్టుకోవాలో అది పెట్టుకున్నారు కానీ సేవ కోసం మిమ్మల్ని మీరు తక్కువ (లూజ్) చేసుకోవలసిన అవసరం లేదు. ఆ సమయం గడిచిపోయింది. ఇప్పుడు లౌకికం మధ్యలో అలౌకికంగా కనిపించండి. అనేక వ్యక్తుల మధ్యలో అలౌకిక మూర్తిగా అనిపించాలి. వారు వ్యక్తంగా కనిపిస్తారు, మీరు అవ్యక్తంగా కనిపించాలి - ఇదే పరివర్తన, ఆదిలో ఎవరి వైబ్రేషన్స్ యొక్క సాంగత్యంలో తమలో పరివర్తన తెచ్చుకునేవారు? అందువలన బ్రహ్మకుమారీలలో చాలా హఠం ఉంది అని అనుకునేవారు. కానీ ఆ హఠం మంచిది కదా. ఇది ఈశ్వరీయ హఠం, అందువలన ఇప్పుడు ఈ వైబ్రేషన్ మధ్యలో ఉంటూ మిమ్మల్ని మీరు అతీతంగా మరియు ప్రియంగా చేసుకోవాలి. ఈ సేవ చేయలేరా? కేవలం వాచా ద్వారా చెప్తే బలిహారం అవ్వరు. మీరందరూ ఎలా బలిహారం అయ్యారు? అంతరంగిక ఆత్మిక స్నేహం ద్వారా పరివర్తన అయ్యారు. ప్రజలు అయితే చాలామందిని తయారు చేశారు కానీ ఇప్పుడు బలి చేయాలి. ఈ సేవ మిగిలి ఉంది. వారసులు తక్కువ, ప్రజలు ఎక్కువ తయారు చేశారు. ఎందుకంటే వాచా ద్వారా ప్రజలు తయారవుతారు. కానీ ఈశ్వరీయ స్నేహం మరియు శక్తి ద్వారా వారసులు తయారవుతారు. కనుక వారసులను తయారుచేయాలి. ఇది మొదటి స్థితి యొక్క పురుషార్థం. వాణి ద్వారా ఎవరికీ రసాన్ని ఇవ్వలేరు. కానీ స్నేహం మరియు శక్తి ద్వారా ఒక్క సెకనులో స్వాహా చేయించగలరు. దీనికి కూడా అంతిమంలో మార్కులు లభిస్తాయి. వారసులను ఎంతమంది తయారుచేశారు? ప్రజలను ఎంతమందిని తయారుచేశారు? ఏ రకంగా ఎంత మందిని తయారుచేశారు మరియు వారసులను కూడా ఏ రకమైనవారిని తయారుచేశారు? ఎంత సమయంలో తయారుచేశారు? ఈరోజు అంతిమ పేపర్ వినిపిస్తున్నాను. ఏయే ప్రశ్నలలో మార్కులు లభిస్తాయో చెప్తున్నాను. అంతిమ ఫలితంలో ఈ ప్రశ్న ఉంటుంది. అంతిమం వరకూ సేవ చేయటం, ఆది నుండి అంతిమం వరకు ఏదైతే స్థితి నడుస్తూ వచ్చిందో దానిలో ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు అనే పూర్తి ఖాతా చెప్పబడుతుంది. ఎన్నిసార్లు విజయీ అయ్యారు మరియు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు మరియు విజయం పొందడంలో ఎంత సమయం పట్టింది? ఏదైనా సమస్యను ఎదుర్కోవడంలో ఎంత సమయం పట్టింది? వీటన్నింటికీ మార్కులు లభిస్తాయి. కనుక మొత్తం జీవితంలో చేసిన సేవ మరియు స్వస్థితి మరియు అంతిమం వరకూ సేవా ప్రత్యక్షత ఆ మూడు విషయాలను చూస్తారు. ఇక్కడ కూడా పరస్పరం స్పష్టంగా చూస్తారు. ఈ మూడు విషయాలలో లెక్కలఖాతా ఎలా ఉంది మరియు దానిని ఎదురుగా తెచ్చుకుని మీ ఫలితాన్ని కూడా ముందుగానే పరిశీలించుకోవచ్చు. ఏదైతే లోపం ఉందో దానిని పూర్తి చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా అలంకరణ చేసుకోవచ్చు. అలంకరణ చేసుకుంటున్నారా? ఏదైనా వాహనానికి ఆరుగంటలలో కూడా అవ్వని అలంకరణ ఒక అరగటంలో చేసేస్తున్నారు. అలాగే ఇప్పుడు అలంకరించుకోవడానికి అంతిమ అవకాశం. ఎలాగైతే ఆదిలో ఎంతో ఉన్నతమైన ఆత్మలు మా దగ్గరికి వచ్చారు అనే సమాచారం వచ్చేదో అలాగే ఇప్పుడు కూడా రావాలి. భట్టీ యొక్క అర్థం - పరివర్తన.

Comments

  1. ఓంశాంతి, విశ్వానికి ప్రియంగా అవ్వటానికి ఇప్పుడు ఏ పురుషార్ధం చేయాలి? మృత్యువు ద్వారా కూడా సర్వీస్ చేసే బాధ్యత ఎవరు తీసుకుంటారు? విశ్వానికి ప్రియంగా అవ్వటానికి ఇప్పుడు ఏ పురుషార్ధం చేయాలి? ఈ విషయాలన్నీ బాప్ దాదా ఈ అవ్యక్తమురళిలో తెలిపించారు.

    ReplyDelete
  2. Om shanthi Mera Bapdada. Thank you Pyare Baba.

    ReplyDelete
  3. Om shanthi Mera Bapdada. Thank you Mera Baba.

    ReplyDelete
  4. Om shanthi Mera Bapdada. Thank you Pyare Baba.

    ReplyDelete

Post a Comment