18-01-1970 అవ్యక్త మురళి

 *18-01-1970         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“సంపూర్ణంగా విల్లు చేయడం ద్వారా విల్ పవర్ యొక్క ప్రాప్తి”

ఈ రోజు ఎందుకు పిలిచారు? ఈ రోజు బాప్ దాదా ఏమి చూస్తున్నారు? ఒక్కొక్క సితారను ఏ రూపంలో చూస్తున్నారు? సితారలలో కూడా ఏ విశేషతను చూస్తున్నారు? ప్రతిఒక్క సితారలో సంపూర్ణత యొక్క సామీప్యతను చూస్తున్నారు. మీరందరూ సంపూర్ణతకు సమీపంగా ఎంతవరకు చేరుకున్నారో మిమ్మల్ని గూర్చి మీకు తెలుసు. సంపూర్ణతకు సమీపంగా చేరుకుంటున్నాము అన్నది ఎలా గుర్తించగలము? వారు అన్ని విషయాలను అన్నివిధాలుగా, అన్నిరూపాలలో పరిశీలించగలరు, ఈ విధంగా గుర్తించగలరు. ఈ రోజు రోజంతటిలో ఏయే స్మృతులు కలిగాయి? చిత్రము స్మృతిలోకి వచ్చిందా లేక చరిత్ర సృతిలోకి వచ్చిందా? చిత్రముతో పాటు ఇంకేమైనా గుర్తుకు వచ్చాయా? (శిక్షణలు గుర్తుకువచ్చాయి, డ్రామా గుర్తుకు వచ్చింది). చిత్రునితో పాటు విచిత్రుడు కూడా సృతిలోకి వచ్చారా? ఎంత సమయము చిత్రుని స్మృతిలో ఉన్నారు, ఎంత సమయము విచిత్రుని స్మృతిలో ఉన్నారు లేక ఇరువురి స్మృతి కలిసి ఉందా? విచిత్రునితో పాటు చిత్రుడిని సృతి చేయడం ద్వారా స్వయము చరిత్రవంతులుగా అయిపోతారు. కేవలం చిత్రమును మరియు చరిత్రను స్మృతి చేసినట్లయితే చరిత్ర స్మృతి మాత్రమే ఉంటుంది. కావున విచిత్రునితో పాటు చిత్రము మరియు చరిత్ర కూడా స్మృతిలోకి రావాలి. నేడు ఇంకేదైనా విశేష కార్యమును చేశారా? కేవలం స్మృతిలోనే మగ్నమై ఉన్నారా లేక స్మృతితో పాటు ఇంకేమైనా చేశారా? వికర్మలు వినాశనమవ్వడమనేది స్మృతి పరిణామం. ఇంకే విశేష కర్తవ్యము చేశారు? పూర్తిగా ఒక సంవత్సరం మీ చార్టును పరిశీలించుకోండి. ఈ అవ్యక్త చదువును, ఈ అవ్యక్త స్నేహము మరియు సహయోగపు రిజల్టును పరిశీలించారా? ఈ అవ్యక్త స్నేహము మరియు సహయోగముల 12 మాసాల పరీక్ష ఏమిటి? పరిశీలించారా? చెకింగ్ చేసుకున్న తరువాతే మీపై మీరు అధిక అటెన్షన్‌ను ఉంచగలుగుతారు. కావున నేడు మీ పేపర్‌ను మీరే పరిశీలించుకోండి. వ్యక్తభావం నుండి అవ్యక్తభావం వైపుకు ఎంతవరకు చేరుకున్నారు అన్నది పరిశీలించుకోవాలి. అవ్యక్త స్థితి పెరిగినట్లయితే మీ నడవడిక కూడా అలౌకికంగా ఉంటుంది. అవ్యక్త స్థితికి ప్రత్యక్ష ప్రమాణము ఏమిటి? అలౌకిక నడవడిక. ఈ లోకంలో ఉంటూ అలౌకికంగా ఎంతవరకు అయ్యారు అన్నది పరిశీలించుకోవాలి. ఈ సంవత్సరంలో మొదటి పరీక్ష ఏమిటి? ఈ నిశ్చయపు పరీక్షలో, ప్రతి ఒక్కరూ ఎన్నెన్ని మార్కులు తీసుకున్నారు అన్నది తమకు తామే తెలుసు. నిశ్చయపు పరీక్ష అయితే జరిగిపోయింది. ఇప్పుడు ఏ పరీక్ష జరుగనున్నది? పరీక్షను గూర్చి తెలిసి కూడా ఫెయిలైపోతారు! కొందరి కొరకు ఇది పెద్ద పరీక్ష, కాని, మరికొందరికి ఇప్పుడు పెద్ద పరీక్ష జరుగనున్నది. ఏ విధంగా ఈ పరీక్షలో నిశ్చయముపై పరీక్ష జరిగిందో అలాగే ఇప్పుడు ఏ పరీక్ష జరగాలి? వ్యక్తంలో ఇప్పుడు కూడా ఆధారంగా ఉన్నారు. ఏ విధంగా ఇంతకుముందు కూడా నిమిత్తముగా అయి ఉన్న సాకార తనువు ఆధారంగా ఉండేదో అలాగే ఇప్పుడు కూడా డ్రామాలో నిమిత్తమై సాకారములో ఆధారము ఉంది. ఇంతకుముందు కూడా నిమిత్తులుగా ఉన్నారు, ఇప్పుడు కూడా నిమిత్తులుగా ఉన్నారు. పూర్తి పరివారపు సాకార ఆధారము చాలా శ్రేష్ఠంగా ఉంది. అవ్యక్తంలోనైతే తోడుగా ఉండనే ఉన్నారు. ఎంతగా స్నేహము ఉంటుందో అంతగా సహయోగం కూడా లభిస్తుంది. స్నేహము తక్కువగా ఉన్న కారణంగా సహయోగం కూడా తక్కువగా లభిస్తుంది. సాకారునితో స్నేహము అనగా మొత్తం వృక్షంతో స్నేహం. సాకారుడు ఒంటరిగా లేరు, ప్రజాపిత బ్రహ్మాతోపాటు వారి పరివారం కూడా ఉంది. మీరు మాలలోని మణులు కదా! మాలలో ఒంటరిగా ఒక్క మణి మాత్రమే ఉండదు. మాలలో ఒకే స్మృతి అనే సూత్రంలో, స్నేహంలో పరివారము ఇమిడి ఉంది, కావున మాలలో స్నేహ సూత్రంలో తిప్పబడి ఉన్నట్లుగా ఉన్నారు. దైవీకులము భవిష్యత్తులో ఉంటుంది కాని, ఈ బ్రాహ్మణ కులానికి ఎంతో మహత్వము ఉంది. ఎంతెంతగా బ్రాహ్మణ కులంతో స్నేహము మరియు సామీప్యత ఉంటుందో అంతగానే  దైవీ రాజ్యంలో సామీప్యత ఉంటుంది. సాకారంలో మీరు ఏ ప్రమాణమును చూశారు? బాప్ దాదా ఎవరిని ముందు ఉంచుతారు? పిల్లలను. ఎందుకంటే పిల్లలు లేకుండా తల్లిదండ్రుల పేరు ప్రఖ్యాతము కాజాలదు. కావున ఏ విధంగా సాకారంలో కర్మచేసి చూపించారో, దానినే ఇప్పుడు అనుసరించాలి. ఇక్కడ పరీక్షా పత్రమును ముందే వినిపించడం జరుగుతుంది. నిశ్చయపు పరీక్ష అయితే జరిగింది. కాని ఇప్పుడు ప్రతి ఒక్కరి స్నేహము, సహయోగము మరియు శక్తి యొక్క పరీక్ష జరుగనున్నది. అనేకరకాల సమస్యల పరివర్తనకొరకు సహయోగమునివ్వాలి. కలియుగ పర్వతమును ఎత్తవలసిందే. కాని ఈ సంవత్సరంలో మనస్సు సమస్యలు, తనువు సమస్యలు, వాయుమండలం సమస్యలు, సర్వ సమస్యల పర్వతాలకు స్నేహము మరియు సహయోగమనే వేలు(సహయోగము)ను ఇవ్వాలి. తనువు సమస్యా రానున్నది. లౌకిక సంబంధంలోనైతే పాసైపోయారు. కాని, ఈ అలౌకిక సంబంధమేదైతే ఉందో ఆ సంబంధం ద్వారా కూడా చిన్న చిన్న సమస్యలు వస్తాయి. కాని ఈ సమస్యలన్నింటినీ పరీక్షలుగా భావించండి, నిజమైన విషయాలుగా భావించకండి. వాటిని పరీక్షలుగానే భావించాలి. వాటిని పరీక్షలుగా భావిస్తూ దాటినట్లయితే పాసయిపోతారు. పేపర్ అవుతూ అవుతూ కూడా ఎంతమంది పాసవుతారో ఇప్పుడు చూడాలి. ఆ తరువాత ఈ పరీక్ష రిజల్టును వినిపిద్దాము. ఈ సమయంలో మీలో ఆత్మ స్థయిర్యాన్ని ధారణ చేయాలి. ఇప్పుడింకా ఆ విల్ పవర్ రాలేదు. యథా యోగ్యము తథా శక్తి మాత్రమే పవర్(శక్తి) ఉంది.

విల్ పవర్ ఎలా రాగలదు? విల్ పవర్ వచ్చేందుకు సాధనం ఏమిటి? విల్ పవర్ లో లోటు ఎందుకు ఉంది? దాని కారణం గూర్చి మీకు తెలుసా? స్మృతిలో కూడా లోటు ఎందుకు ఉంది? బాబా సాకారంలో కర్మ చేసి చూపించారు, విల్ పవర్ ఎలా వచ్చిందో చూపించారు. మొట్టమొదట ఏ అడుగునువేశారు? సర్వస్వమును విల్లు చేశారు. అలా విల్లు చేయడంలో ఆలస్యమైతే చేయలేదు కదా! లోపల కాని బయట కాని ఏ చెడు విషయాలైతే ఉన్నాయో వాటిని ఎప్పటివరకైతే సంపూర్ణంగా విల్లు చేయరో అప్పటివరకు విల్ పవర్ రాజాలదు. సాకార బాబా ఏదైనా ఆలోచించారా? ఎలా జరుగుతుంది, ఏమౌతుంది? ఎలా అవుతుంది? ఇది ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరైనా బాగా ఆలోచిస్తూ విల్లు చేసినట్లయితే దానికి అంతటి ఫలము లభించదు. ఒక్క వేటుతో బలి అవ్వడానికి, ఇంకో విధంగా బలి అవ్వడానికి తేడా అయితే ఉంటుంది కదా! మొట్టమొదట ఎవరు స్వీకరింపబడతారు? ఎవరైతే మొట్టమొదట స్వీకరింపబడతారో వారికి నెంబర్ వన్ శక్తి లభిస్తుంది. ఎవరైతే మొట్టమొదట స్వీకరింపబడరో వారికి శక్తి కూడా అంతగా లభించదు. దీనిని గూర్చి ఆలోచించండి. బాప్ దాదాకు వర్తమానంతోపాటు భవిష్యత్తును గూర్చి కూడా తెలుసు. కావున భవిష్య కర్మబంధన యొక్క తాళ్ళను చూసి ఇంతటి వేగపు పరుగును తీయించరు. కర్మబంధనపు తాళ్ళను తెంచడము మన కర్తవ్యము. ఏదైనా తాడు తెగిపోకపోతే మనస్సు యొక్క ఆకర్షణ జరుగుతూ ఉంటుంది. కావున ఆ తాళ్ళను తెంచేందుకు ఇంకా ఆగి ఉన్నారు. తాళ్ళు తెగిపోతే ఎవరైనా ఆగుతారా? స్వతంత్రులైనవారు ఎప్పుడూ ఏ బంధనలోనూ ఆగి ఉండజాలరు. ఈనాటి రోజున ఏం చేయాలి మరియు రానున్న సంవత్సరం కొరకు ఏం చేయాలి అన్నది అందరూ గుర్తుంచుకోండి. విదేహిని యుగళునిగా చేసుకున్నట్లయితే విదేహులుగా అవ్వడంలో సహయోగం లభిస్తుంది. విదేహిగా అవ్వడంలో సహయోగం తక్కువగా లభిస్తుంది, సఫలత తక్కువగా కనిపిస్తున్నట్లయితే విదేహిని యుగళునిగా చేసుకోలేదని అర్థం చేసుకోండి. ఎవరైతే కష్టమైన విషయమును సహజతరం చేస్తారో వారిదే అద్భుతము. సహజమైన విషయాలను దాటివేయడం కాదు. కష్టమైన విషయాన్ని దాటడమే అద్భుతము. కష్టమైన విషయాలను కష్టంగా భావించకుండా నడవడమే అద్భుతము. కష్టమైన పరిస్థితులలో కొద్దిగానైనా వాడిపోతే ఏమౌతుంది? ఒక్క క్షణంలో బేరము చేసేవారు ఎక్కడా చిక్కుకోరు, ఫాస్ట్ గా వెళ్ళేవారు ఎక్కడా చిక్కుకోరు, చిక్కుకుపోయేవారు వేగంగా వెళ్ళలేరు. చివరి స్థితిని చూసి ఫాస్ట్ గా వెళ్ళాలి. ఇప్పుడు కూడా ఫాస్ట్ గా వెళ్ళే అవకాశం ఉంది. కేవలం ఒక్క హైజంప్ చేయాలి. లాస్ట్ లో  ఫాస్ట్ గా వెళ్ళలేరు. అచ్ఛా!

సర్వప్రాప్తుల గని మధువనము. (వ్యక్తిగత మిలనము)

మధువనంలోకి వచ్చి ఏ ముఖ్య కర్తవ్యమును చేశారు? ఏ విధంగా ఏదైనా గని వద్దకు వెళ్ళినప్పుడు ఏమి చేస్తారు? గని నుండి ఎంతగా తీయగలిగితే అంతగా తీయడం జరుగుతుందే కాని కొద్దిగా కాదు. అలాగే మధువనము సర్వప్రాప్తుల గని. కావున మీరు అటువంటి గని వద్దకు వచ్చారు కదా! మిగిలిన సేవా కేంద్రాలు ఈ గనికి శాఖలు. గని వద్దకు వెళ్ళినప్పుడు ఎంత తీసుకుంటే అంత మంచిది అని ఆలోచిస్తారు. అలాగే ఇక్కడ కూడా మీరు ఎంతగా తీసుకోగలిగితే అంతగా తీసుకోవచ్చు. ఇక్కడి ఒక్కొక్క వస్తువు, ఒక్కొక్క బ్రాహ్మణ ఆత్మ ఎంతో శిక్షణను మరియు శక్తిని ఇస్తారు. ఎవరు వచ్చినా వారు ఏదో కొద్దిగాకాక సర్వమును తీసుకోవాలనే బాప్ దాదా కోరుకుంటారు. బాప్ దాదాకు పిల్లలపై స్నేహము ఉంది. కావున ఒక్కొక్కరినీ సంపన్నంగా చేయాలనుకుంటున్నారు. ఎంతగా ఇక్కడ తీసుకోవడంలో సంపన్నంగా అవుతారో అంతగానే భవిష్యత్తులో రాజ్యమును పొందడంలో సంపన్నంగా అవుతారు. కావున ఈ అమూల్యమైన రోజులను ఒక్క క్షణం కూడా పోగొట్టుకోకూడదు. ఒక్కొక్క క్షణంలో కోటానురెట్ల సంపాదన చేసుకోవచ్చు. మీరు కోటానురెట్ల సౌభాగ్యశాలురు. కావుననే ఈ భూమిపైకి వచ్చి చేరుకున్నారు. కాని, ఈ కోటానురెట్ల భాగ్యమును సదా నిలిపి ఉంచుకునేందుకు సదా సంపూర్ణత కోసం పురుషార్థము చేయాలి. బీజం ఎలా ఉంటుందో ఫలం అలా వెలువడతుంది. కావున మీరు బీజం వంటివారు. పునాది ఎంత బలంగా ఉంటుందో అంతగానే భవనం కూడా పక్కాగా ఉంటుంది. కావున మేము పునాది వంటివారము, మాపైన మొత్తం భవనమంతా నిలబడి ఉంది అని సదా భావించాలి.

స్మృతికి బదులు లభిస్తోందా? బాప్ దాదా ఇప్పుడు అందరి జతలో ఉన్నారు. ఎందుకంటే సాకారంలో ఉన్నప్పుడు ఒకే స్థానంలో ఉంటూ అందరి జతలో ఉండలేకపోయేవారు. ఇప్పుడైతే అందరికీ తోడుగా ఉండగలుగుతున్నారు. ఒకే మతం ద్వారా ఒకే రిజల్టు ఉంటుందని సదా ధ్యానంలో ఉంచుకోండి, ఈ గుణమును పరివర్తనలోకి తీసుకురావాలి. ఎటువంటి పరిస్థితి వచ్చినా కాని మిమ్మల్ని మీరు దృఢంగా ఉంచుకోవాలి. ఇతరులకు మీ గుణాల దానమును ఇవ్వాలి. ఏవిధంగా దానము చేయడం ద్వారా ప్రతిఫలం భవిష్యత్తులో లభిస్తుందో అలాగే ఈ గుణదానము చేయడం ద్వారా కూడా ఎంతో ప్రాలబ్దము లభిస్తుంది. ఎవరైతే ఐకమత్యంతో ఉంటారో వారే ఒక్కరికి ప్రియమైన వారిగా అనిపిస్తారు. బాప్ దాదాలు ఇరువురూ ఉంటూ కూడా ఒక్కరిగానే ఉన్నారు కదా! అలా ఎంతమంది ఉన్నాకాని ఐకమత్యతతో నడుచుకోవాలి. బాబా ఇంటికి వచ్చి విశేష ఖజానా తీసుకున్నారా? బాబా ఇంటిలో విశేషతలు నిండి ఉన్నాయి కదా! మీ ఇంట్లో వాస్తవిక
స్వరూపంలో స్థితులయ్యేందుకు వచ్చారు. మీ వాస్తవిక స్వరూపము మరియు వాస్తవిక స్థితి ఏమిటి అన్నది గుర్తుకువస్తోందా? ఆత్మ వాస్తవిక స్థితి ఏమిటి? ఆత్మ ఇంతకుముందు పరంధామ నివాసిగా సర్వగుణాల స్వరూపంగా ఉండేది, అలాగే ఇక్కడ కూడా మీ స్థితిని అనుభవం చేసుకునేందుకు వచ్చారు. మధువనంలోకి ఆ స్థితిని పరీక్షించుకునేందుకు వచ్చారు. పరీక్షించిన తరువాత దానిని సదాకాలికంగా ధారణ చేయాలి. దీనిపేరే మధువనము. మధు అనగా మధురత అనగా స్నేహము మరియు శక్తి రెండు వరదానాలు పూర్ణరూపంలో ప్రాప్తించుకోవడము. ఇక్కడ మధువనంలో రెండూ వరదాన రూపంలో లభిస్తాయి. మళ్ళీ బైటకు వెళ్ళినట్లయితే ఈ రెండింటి కోసము తమ పురుషార్థము చేయవలసి ఉంటుంది. కావున ఇక్కడ వరదాన రూపంలో ఏదైతే ప్రాప్తిస్తుందో దానిని అవినాశిగా ఉండే విధంగా ప్రాప్తించుకోవాలి. ఎప్పుడైతే వరదాన రూపంలో ప్రాప్తించగలదో అప్పుడు పురుషార్థం చేసి తీసుకోవలసిన అవసరమేముంది? గురువు వరదానమును ఇస్తుంటే అప్పుడు ఏంచేయాలి? స్వయమును వారిపై అర్పణం చేసుకోవలసి ఉంటుంది, అప్పుడే వరదానము ప్రాప్తమవుతుంది, అలాగే ఇక్కడ కూడా ఎంతగా స్వయమును అర్పణ చేసుకుంటారో అంతగా వరదానము ప్రాప్తమవుతుంది. వరదానమైతే అందరికీ లభిస్తుంది, కాని ఎవరైతే తమను తాము ఎక్కువగా అర్పణ చేసుకుంటారో అంతగానే వరదానానికి పాత్రులుగా అవుతారు. వరదానము ద్వారా మీ జోలిని ఎలా నింపుకోవాలంటే ఇక నిండి ఉన్న జోలి ఎప్పుడూ ఖాళీ అవ్వకూడదు. ఎవరు ఎంతగా నింపుకోవాలనుకుంటే అంతగా నింపుకోవచ్చు. అలాగే ధ్యానము నుంచి ఈ కొద్దిరోజుల్లో అలసట లేకుండా లాభాన్ని తీసుకోవాలి. ఒక్కొక్క క్షణము సఫలం చేసుకునే రోజులు ఇవి. ఇప్పటి ఈ ఒక్క క్షణము ఎంతో లాభదాయకమైనది మరియు ఎంతో నష్టదాయకమైనది కూడా. ఒక్క క్షణంలో అనేక సంవత్సరాల సంపాదనను కూడా పోగొట్టుకుంటారు కదా! కావున ఇక్కడి ఒక్క క్షణము అంతే పెద్దది.

త్యాగం ద్వారానే భాగ్యం తయారవుతుంది. కాని, త్యాగం చేసిన తరువాత మనస్సులో కూడా సంకల్పము ఉత్పన్నమవ్వకూడదు. బలి చేసేటప్పుడు ఆ ప్రాణి కొద్దిగా ఆర్తనాదం చేసినా లేక కంటినుండి నీరు వెలువడినా దానిని దేవి ముందు స్వీకరింపజేయరు. ఒక్క వేటుతో బలి అవ్వాలి అని విన్నారు కదా! ఏదైనా విషయాన్ని ఒక్క క్షణంలో సమాప్తం చేయడము మరియు దానిని పదే పదే ఖండిస్తూ ఉండడంలో తేడా ఉంటుంది కదా! ఒకేసారి అంతం చేసెయ్యాలి. బాప్ దాదా వద్ద కూడా ఎటువంటి పిల్లలు స్వీకరింపబడతారు? వారికి మనస్సులో కూడా సంకల్పము కలుగకూడదు. దీనినే మహాబలి అని అంటారు. ఇటువంటి మహాబలికే మహాబలపు ప్రాప్తి లభిస్తుంది. మీరు సర్వశక్తివంతుని పిల్లలు. అయినా మీకు శక్తి లేదా? బాబా పూర్తి ఆస్తికి హక్కుదారులుగా అవ్వాలి కదా! సర్వశక్తివంతుడైన బాబాకు చెందిన సర్వశక్తుల ఆస్తి, జన్మసిద్ధ అధికారమును సదా మీ ముందు ఉంచుకోండి. సర్వశక్తివంతుని ముందు బలహీనత నిలిచి ఉండగలదా! నేటి నుండి బలహీనతలన్నీ సమాప్తము. కేవలం ఒక్క శక్తి కాదు. పాండవులు కూడా శక్తి రూపాలు. ఒక్క దీపం నుండి అనేక దీపాలు వెలుగుతాయి. అచ్ఛా!

Comments

  1. ఓంశాంతి,స్మృతికి ఫలితం ఏమిటి? దైవీ రాజ్యంలో కూడా సమీపత ఎవరికి ఉంటుంది? ఆత్మిక శక్తి ఎందుకు లోపంగా ఉంది? మనస్సు ఎప్పటి వరకు ఆకర్షిస్తూ ఉంటుంది? మరియు మన కర్తవ్యం ఏమిటి? ఈ విషయాలన్నీ బాప్ దాదా ఈ అవ్యక్తమురళిలో తెలిపించారు. శివబాబా యాద్ హై?

    ReplyDelete
  2. Om shanthi Mera Bapdada. Thank you Pyare Baba.

    ReplyDelete

Post a Comment