17-07-1969 అవ్యక్త మురళి

 17-07-1969                    ఓంశాంతి                 అవ్యక్త బాప్ దాదా           మధువనము

అవ్యక్త స్థితి తయారుచేసుకునే యుక్తులు

              అవ్యక్తస్థితి మంచిగా అనిపిస్తుందా లేక వ్యక్తంలోకి రావటం మంచిగా అనిపిస్తుందా? అవ్యక్త స్థితిలో ధ్వని ఉంటుందా? ధ్వనికి అతీతంగా ఉండాలనుకుంటున్నారా? మీరందరూ ధ్వనికి అతీతంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. మంచిగా కూడా అనిపిస్తుంది. మరలా బాప్ దాదాని వ్యక్తంలోకి ఎందుకు పిలుస్తున్నారు? ప్రతి సమయం అవ్యక్త స్థితిలో ఉండాలి. దీని కొరకు ఏ పురుషార్ధం చేయాలి? కేవలం ఒక పదం చెప్పండి. ఆ ఒక్క పదం ద్వారా అవ్యకస్థితి ఉండాలి. ఏ ఒక్క పదం స్మృతి ఉంచుకుంటే అవ్యక్తస్థితి తయారవుతుంది? మనసా, వాచా, కర్మణా మూడింటిలో వ్యక్తంలో ఉంటూ అవ్యక్తంగా ఉండాలి. దీని కొరకు ఒక్క పదం చెప్పండి. ఆత్మాభిమానిగా అవ్వాలి. ఆత్మాభిమాని అంటే అవ్యక్తస్థితి. కానీ ఆ స్థితి కోసం ఏమి స్మృతి ఉంచుకోవాలి? ఏ పురుషార్ధం చేయాలి? నెమ్మది నెమ్మదిగా ఈ స్థితి అందరికి వస్తుంది. ఎవరి లోపల ఏ విషయం ఉందో అది మొదటే మీకు తెలిసిపోతుంది. అందువలనే అభ్యాసం చేయిస్తున్నాను. ఎంతెంత అవ్యక్తస్థితిలో స్థితులవుతారో ఎవరైనా నోటి నుండి మాట మాట్లాడకుండానే వారి లోపల భావాన్ని తెలుసుకోగలరు. ఇలాంటి సమయం వస్తుంది. అందువలన ఈ అభ్యాసం చేయిస్తున్నాను.
               సరే మొదటి విషయం అడుగుతున్నాను - ఒక పదం ఏమి స్మృతి ఉంచుకోవాలి? మిమ్మల్ని మీరు అతిథిగా భావించాలి. ఒకవేళ అతిథిగా భావిస్తే అంతిమ స్థితి యొక్క వర్ణన మహిమ చేస్తున్నారో అది దీనిద్వారానే వస్తుంది. మిమ్మల్ని మీరు అతిధిగా భావిస్తే వ్యక్తంలో ఉంటూ కూడా అవ్యక్తంలో ఉంటారు. అతిధికి ఎవరితోనూ తగుల్పాటు ఉండదు. మనం ఈ శరీరంలో కూడా అతిథులం, ఈ పాత ప్రపంచానికి కూడా అతిథులం. శరీరానికి అతిధిగా భావిస్తే శరీరంతో కూడా తగుల్పాటు ఎలా ఉంటుంది? కేవలం కొద్ది సమయానికి ఈ శరీరం ఉపయోగించుకోవాలి.
                  ఇక్కడ అతిధిగా అయితే మరలా అక్కడ ఎలా అవుతారు? ఎంత ఇక్కడ అతిధిగా అవుతారో అంతగానే తిరిగి అక్కడ విశ్వానికి యజమానిగా అవుతారు. ఈ ప్రపంచానికి యజమానులు కాదు. ఈ ప్రపంచంలో మనం అతిథులం, క్రొత్త ప్రపంచానికి యజమానులం. వ్యక్తభావంలోకి వస్తున్నారు అంటే దానికి కారణం ఏమిటంటే అతిథిగా భావించటం లేదు. వస్తువులపై అధికారిగా భావిస్తున్నారు. అందువలనే వాటిపై తగుల్పాటు వచ్చేస్తుంది. మిమ్మల్ని మీరు అతిధిగా భావిస్తే ఈ అన్ని విషయాలు సమాప్తి అయిపోతాయి. మీకు బ్యాంక్ ఖాతాని కూడా నోట్ చేసుకోవాలి. ఎంత సంపాదిస్తున్నారో అంత తినేస్తున్నారా? లేక జమ కూడా అవుతుందా? ఎంత జమ చేసుకున్నాం అనేది మొత్తం లెక్క తీయాలి. ఆ జమా లెక్కతో  మీకు మీరు సంతుష్టం అయ్యారా? లేదు. జమ చేసుకోవడానికి ఇంకా ఏదైనా సమయం ఉందా? ఎంత సమయం ఉంది? సమయం కూడా లేదు, సంతుష్టంగా కూడా లేరు అప్పుడు ఏమౌతుంది?  ఇప్పుడు అందరూ ఈ ధ్యాస ఎక్కువ పెట్టుకోవాలి. మీ జమఖాతాని పెంచుకోవాలి. తక్కువలో తక్కువ స్వయం సంతుష్టం అయ్యేటంత అయినా ఉండాలి. మీ సంపాదనతో స్వయం కూడా సంతుష్టంగా లేకపోతే ఇతరులకి ఏమి చెప్తారు? ఒకొక్కరు ఇంత జమ చేసుకోవాలి కేవలం మీ కోసమే జమ చేసుకోవాలా లేక ఇతరుల కోసం కూడా చేయాలా? ఇతరులకి దానం ఇవ్వడానికి  జమ చేసుకోవలసిన అవసరం లేదా?              
               ఇలాంటి సమయం ఇప్పుడు వస్తుంది - అందరు బికారి రూపంలో మీ దగ్గర భిక్ష అడుగుతారు. వారికి ఇవ్వరా? ఇంత జమ చేసుకోవాలి కదా! మీ కొరకు అయితే చేసుకోవాలి. కాని వెనువెంట ఇలాంటి దృశ్యం అందరి ఎదురుగా వస్తుంది - ఈరోజు తమని తాము నిండుగా భావిస్తున్న వారు కూడా బికారీ రూపంలో మీ అందరి నుండి బిక్ష అడుగుతారు. బిక్ష ఎలా ఇస్తారు? జమ అయినప్పుడు ఇవ్వగలరు. దాత పిల్లలు కనుక అందరికి ఇచ్చేవారిగా ఉండాలి..మీ అందరి యొక్క ఒక్క సెకను దృష్టి కొరకు, అమూల్య మాట కొరకు దాహంగా ఉంటారు. ఇలాంటి అంతిమ దృశ్యం ఎదురుగా పెట్టుకొని పురుషార్ధం చేయండి. మన దగ్గరికి వచ్చిన ఏ ఆత్మ ఖాళి చేతులతో వెళ్ళకూడదు. సాకార బ్రహ్మాబాబా ఏమి చేసి చూపించారు, ఏ ఆత్మ అసంతుష్టం అయ్యి వెళ్ళలేదు. భలే ఎలాంటి ఆత్మ అయినా కానీ సంతుష్టం అయ్యి వెళ్ళేవారు. ఇలాంటి విషయాలు ఆలోచించాలి. కేవలం మీ కోసం కాదు. ఇప్పుడు మీరు రచయితలు. మీ ఒక్కొక్క రచయిత వెనుక రచన ఉంది. తల్లితండ్రులకి పిల్లలు జన్మించనంత వరకు సంసాదనను తమ పట్లే ఉపయోగించుకుంటారు. పిల్లలు జన్మించిన తర్వాత మరలా రచనపై కూడా చాలా ధ్యాస పెడతారు. అలాగే మీ కోసం సంపాదించుకుని చాలా సమయం తిన్నారు, అనుభవించారు. కానీ ఇప్పుడు మీ రచనని చూసుకున్నారా? ఎంత రచన ఉంది? చిన్నదా లేక పెద్దదా? బాప్  దాదా ప్రతి ఒక్కరి ఫలితం చూస్తున్నారు. ఒక్కొక్క తారకి ఎంత రచన ఉంది! రచించారా? మీ రచనని చూసుకున్నారా? భవిష్యత్తుని తెలుసుకుంటున్నారా? అందరు రచయితలే కానీ పెద్ద రచనా లేక చిన్న రచనా? (ఆశ అయితే పెద్దదే) పెద్ద రచన వెనుక బాధ్యతలు కూడా పెద్దగా ఉంటాయి.

Comments