16-10-1969 అవ్యక్త మురళి

 16-10-1969         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము 

పరిశీలనా శక్తిని తీవ్రం చేసుకోండి

                  ఈరోజు విశేషంగా ఏమి చూస్తున్నారు? పరివర్తన ఎలా చూస్తున్నారు? ఈ గ్రూపులో ఈ ప్రశ్నకి జవాబు ఇవ్వటంలో తెలివైనవారు ఎవరు? చూడటం మరియు పరిశీలన చేసే శక్తి ఎంతవరకు వచ్చాయి? యోగస్థితిలో నిరంతరం ఉండేవారు ఎవరు? దివ్యగుణాల ధారణలో దివ్యగుణమూర్తిగా ఎవరు కనిపిస్తున్నారు? ఇలా ఎందుకు అడుగుతున్నారంటే ప్రపంచంలోకి కార్యార్థం వెళ్తున్నప్పుడు మరియు ఆసురీ సాంప్రదాయం వారితో సంబంధం పెట్టుకునే సమయంలో పరిశీలనా శక్తి ఉండటం ద్వారా చాలా విషయాలలో విజయీగా అవుతారు. ఒకవేళ పరిశీలించే శక్తి లేకపోతే విజయీగా కాలేరు. మీ పరివారంలో ఎంతవరకు పరిశీలించగలుగుతున్నారు అని చూశారు. ప్రతి ఒక్కరత్నం ఒకరికంటే ఒకరు శ్రేష్ఠమైనవారు. కానీ పరిశీలించే అభ్యాసం తప్పకుండా ఉండాలి. ఈ పరిశీలించే అభ్యాసాన్ని చిన్న విషయంగా భావించకూడదు. దీని ద్వారానే నెంబర్ తీసుకోగలరు. ఏ పరిస్థితినైనా, ఏ సంకల్పాలు గల ఆత్మనైనా వర్తమానం మరియు భవిష్యత్తు రెండు కాలాలను కూడా పరిశీలించే అభ్యాసం ఉండాలి. విశేషంగా పాండవ సేనకు ఈ పరిశీలనా శక్తి చాలా అవసరం. ఎందుకంటే గోపకులైన మీకు చాలా రకాల పరిస్థితులు ఎదురుగా వస్తాయి. వాటిని ఎదుర్కునేటందుకు ఈ బుద్ది చాలా అవసరం. 
                పరిశీలించే శక్తి ఎలా వస్తుంది, దీనికి ముఖ్య సాధనం ఏమిటి? పరిశీలించే పద్ధతి ఏమిటి? మీ ఎదురుగా ఎవరైనా వస్తే వారిని పరిశీలించగలుగుతున్నారా? (ప్రతి ఒక్కరు తమ ఆలోచన చెప్పారు).  అన్నింటి రహస్యం ఒకటే ఆత్మిక స్థితి లేదా అవ్యక్తస్థితి. స్మృతి ఏదైనా అదే విషయం కానీ ఆత్మికస్థితితో పాటు వెనువెంట ఎవరి బుద్ధిలో ఎక్కువ వ్యర్ధ సంకల్పాలు నడవవో, ఎవరి బుద్ది ఒకని స్మృతిలో, ఒకని కార్యంలో మరియు ఏకరసస్థితిలో స్థితులవుతుందో వారే యదార్థంగా పరిశీలించగలరు. త్వరగా పరిశీలించగలరు. ఎవరి బుద్దిలో అయితే ఎక్కువ సంకల్పాలు ఉత్పన్నం అవుతాయో వారు ఇతరులని పరిశీలించటంలో కూడా వారి వ్యర్థ సంకల్పాల కల్తీ జరుగుతుంది. అందువలన ఎవరు ఎలా ఉన్నారో అలా పరిశీలించాలి. ముఖ్య రహస్యం - బుద్ధి యొక్క స్వచ్ఛత. ఎంత బుద్ధి యొక్క స్వచ్చత ఉంటుందో అంతగానే యోగయుక్త స్థితిలో ఉండగలరు. ఈ వ్యర్దసంకల్పాలు మరియు వికల్పాలు ఏవైతే నడుస్తున్నాయో అవి అవ్యక్త స్థితిలో స్థితులవ్వడంలో విఘ్నం వేస్తాయి. మాటిమాటికి ఈ శరీరం యొక్క ఆకర్షణలోకి వచ్చేస్తున్నారు. దానిని ముఖ్య  కారణం బుద్ధి యొక్క స్వచ్ఛత లేదు. బుద్ధి యొక్క స్వచ్చత అంటే బుద్ధికి ఏదైతే మహామంత్రం లభించిందో దానిలో బుద్ది నిమగ్నమై ఉండాలి. ఒకని స్మృతి వదిలి అనేక వైపులకి బుద్ధి వెళ్తున్న కారణంగా శక్తిశాలిగా ఉండటం లేదు. బుద్ధి చాలా కార్యాలవైపు తగుల్కొని ఉంటే, నిమగ్నమై ఉంటే బుద్దిలో బలహీనత, అలసట అనుభవం అవుతాయి. మరియు యదార్ధ రూపంలో కూడా నిర్ణయించలేరు. అదేవిధంగా ఏవైతే వ్యర్దసంకల్పాలు, వికల్పాలు నడుస్తున్నాయో ఇవి కూడా అలసటలోకి తీసుకువస్తాయి. అలసిపోయిన ఆత్మ పరిశీలించలేరు మరియు నిర్ణయించలేరు. ఎంత తెలివైనవారైనా కానీ ఆ అలసటలో వారి పరిశీలన, నిర్ణయశక్తిలో తేడా వస్తుంది. రోజంతా ఈ సంకల్పాలతో బుద్ది అలసిపోయిన కారణంగా నిర్ణయశక్తిలో లోపం వచ్చేస్తుంది. అందువలనే విజయీగా కాలేరు. ఓడిపోవడానికి ఇదే ముఖ్య కారణం - బుద్ధి యొక్క స్వచ్చత లేదు. హస్తలాఘవం అని అంటారు కదా! అలాగే మీరు బుద్ధి యొక్క స్వచ్చత ద్వారా ఏమైనా చేయగలరు. వారు హస్తలాఘవం ద్వారా వస్తువులని వెనువెంట మార్చేయగలరు, ఆలశ్యం అవ్వదు. అందువలనే వారిని గారడీ వాళ్ళు అంటారు. అలాగే మీలో కూడా మారేటటువంటి గారడి వస్తుంది. ఇప్పుడు మారటం నేర్చుకున్నారు కానీ గారడీ సమానంగా మారలేదు అంటే త్వరగా మారటంలేదు, సమయం పడుతుంది. గారడీ చేయడానికి ఎంత సమయం ఎవరికైతే మంత్రం స్మృతి ఉంటుందో అంత వారి గారడీ సఫలం అవుతుంది. మీకు కూడా ఒకవేళ మహామంత్రం స్మృతి ఉంటే గారడీ సమానంగా కార్యం జరుగుతుంది. ఇప్పుడు దీనిలోనే ఆలస్యం ఉంది. కనుక ఈ భట్టి ద్వారా ఎలా అయ్యి వెళ్తారు? (గారడీ చేసేవారు). ఒకవేళ ఇలా గారడి చేసేవారు భారతదేశం యొక్క మూలమూలకి వెళ్తే ఏమౌతుంది? ఒక నెలలో ఏదైనా దృశ్యం చూపించగలరా? తయారీలు చేయాలి. ఒకవేళ ఇంతమంది గారడి చేసేవారు మార్చేటటువంటి కార్యం ప్రారంభిస్తే ఏమౌతుంది? ఈ విధమైన కొత్తదనం మీరు కూడా చూడాలనుకుంటున్నారు మరియు బాప్ దాదా కూడా కోరుకుంటున్నారు. వీరు ఎవరు, ఎక్కడ నుండి వచ్చారు అనే ధ్వని వ్యాపించాలి. ఒక్కొక్క స్థానంలో ఒక అలౌకిక ఆత్మ అవతరించింది అని అనుభవం అవ్వాలి. ఒక అవతారమే చాలా చేయగలదు అంటే ఇక్కడ ఎంతమంది అవతారాలు ఉన్నారు. ఇక్కడ నుండి వెళ్తున్నప్పుడు ఈ విధంగా భావించి వెళ్ళాలి, మేము ఈ శరీరంలో ఈశ్వరీయ సేవకి అవతరించాము అని. ఈ స్మృతి ఉంచుకుని వెళ్తే మీ నడవడికలో అలౌకికత కనిపిస్తుంది. మీ దైవీ పరివారం వారైనా లేక లౌకిక పరివారమైనా వీరు అతీతంగా అయ్యి వచ్చారు, మారి వచ్చారు అని అనుభవం చేసుకుంటారు. మీరు పరివర్తన అయినట్లు అనుభవం అయినప్పుడు మీరు ప్రపంచాన్ని మార్చగలరు. మీరు మారినట్లు అనుభవం కాకపోతే ప్రపంచం మారదు. స్వయం మారి ప్రపంచాన్ని మార్చాలి. నిమిత్తమాత్రంగా ఈ శరీరాన్ని అద్దెకు తీసుకుని ఈశ్వరీయ కార్యం కోసం కొద్ది రోజులకి అవతరించాను అని భావించి నడవాలి. ఆ కార్యం సమాప్తి చేసుకుని మరలా వెళ్ళిపోతారు. ఈ స్మృతి, లక్ష్యం పెట్టుకుని ఈ స్థితి తయారు చేసుకుని వెళ్ళాలి. ఇది తోట, బాప్ దాదా చైతన్యతోటలోకి వస్తున్నారు. కొంతమంది వాచా ద్వారా సువాసన ఇస్తున్నారు, కొంతమంది నయనాలతో, మస్తకమణితో సువాసన ఇస్తున్నారు. 
                  ప్రతి ఒక్కరి మస్తకమణి యొక్క మెరుపు బాప్ దాదా చూస్తున్నారు. అలాగే ఒకవేళ మీరందరూ కూడా మస్తకమణినే చూస్తే ఈ దృష్టి, వృత్తి శుద్ధంగా, సతో ప్రధానంగా అవుతాయి. దృష్టి యొక్క చంచలతకి ముఖ్య కారణం - మస్తకమణిని చూడకుండా శారీరక రూపాన్ని చూస్తున్నారు. రూపాన్ని చూడకండి కానీ మస్తకమణిని చూడండి. రూపాన్ని చూస్తున్నప్పుడు సర్వాన్ని చూస్తున్నాను అని భావించండి. సర్పం యొక్క మస్తకంలో మణి ఉంటుంది. మణిని చూడాలి కానీ సర్పాన్ని కాదు. దేహాభిమానంతో చూస్తే సర్పాన్ని చూస్తున్నాను అని భావించండి. సర్పాన్ని చూస్తే కాటేస్తుంది. సర్పంలో విషం కూడా ఉంటుంది. కొన్ని కొన్ని విశేష సర్పాలు ఉంటాయి. వాటికి మణి ఉంటుంది. గోపకులైన మీరు సర్పాన్ని ఎలా చంపాలి? ఏమి చేస్తారు? మీరు సర్పాన్ని చూస్తూ కూడా సర్పాన్ని చూడకండి, మణినే చూడండి. మణిని చూడటం ద్వారా సర్పానికి ఏదైతే విషం ఉందో అది తేలిక అయిపోతుంది. ఒకవేళ శరీర రూపీ సర్పాన్ని చూస్తే మరలా దానికి వశం అయిపోతారు. మీరు కూడా దానివలె అయిపోతారు. కానీ మణిని చూస్తే బాప్ దాదా మాలలో మణిగా అవుతారు. అయితే సర్పం సమానంగా అవుతారు లేదా మాలలో మణిగా అవుతారు. మణిగా అవ్వాలంటే మణినే చూడండి. అప్పుడు ఏదైతే ఫిర్యాదు ఉందో అది తొలగిపోయి సంపూర్ణం అయిపోతారు. ఎక్కడ ఫిర్యాదు - ఎక్కడ సంపూర్ణత!! రాత్రి పగలుకి ఉన్నంత తేడా ఉంది. కానీ వీటిని సింధీ భాషలో వ్రాస్తే కేవలం రెండు అక్షరాలు తేడా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే రెండు బిందువులు 1.స్వయం 2.బాప్ దాదా యొక్క బిందువు. ఈ రెండు బిందువులు స్మృతి ఉంటే ఫిర్యాదులకి బదులు సంపూర్ణం అయిపోతారు. అందువలన ఈరోజు నుండి మీకు మీరు ప్రతిజ్ఞ చేస్కోండి. బాప్ దాదా ఎదురుగా చాలా ప్రతిజ్ఞలు చేశారు కానీ ఈరోజు మీకు మీరు ప్రతిజ్ఞ చేస్కోండి - ఇప్పటి నుండి మణిని తప్ప మరేదీ చూడను మరియు స్వయం మాలలో మణియై మొత్తం సృష్టి మధ్యలో మెరుస్తాను. స్వయం మణి అయినప్పుడే మెరవగలరు. ఒకవేళ మణిగా కాకపోతే మెరవలేరు. ప్రతిజ్ఞ చేసినప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది. మీకు మీరు పూర్తిగా ప్రతిజ్ఞ చేసుకోలేకపోతున్నారు. అందువలనే ప్రత్యక్షత కూడా పూర్తి జరగటం లేదు. ప్రత్యక్షత తక్కువ జరగడానికి కారణం మీ ప్రతిజ్ఞలో లోపం. ఇప్పుడిప్పుడే చెప్తున్నారు మరలా ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నారు. కానీ ఇప్పుడు ప్రతిజ్ఞ చేయటంతో పాటు వెనువెంట ప్రత్యక్షంలోకి కూడా తీసుకువస్తాం అనే నిశ్చయం పెట్టుకోండి. అప్పుడు మీ ప్రతిజ్ఞను ప్రత్యక్షం చేసి చూపించగలరు. పాండవ సేన జ్ఞానీ ఆత్మలు, శక్తిసేన స్నేహి ఆత్మలు, స్నేహీగా ఉన్నవారే యోగి అవుతారు. ఇప్పుడు ఒకొక్క పాండవుని మస్తకంలో ఉత్సాహ ఉల్లాసాల మెరుపు ఉంది. ఈ ఉత్సాహ ఉల్లాసాలు సదా ఏకరసంగా ఉండాలి. శ్రమకి ఫలితం చూపించాలి. ఒకవేళ శ్రమ చేసి ఇక్కడ సమాప్తి చేసుకోకపోతే మరలా సత్యయుగంలో శ్రమ చేసే ఫలితం ఇవ్వవలసి ఉంటుంది. కనుక ఏదైతే శ్రమ తీసుకున్నారో దానిని నింపి ఇవ్వాలి. ప్రతి సేవాకేంద్రం నుండి ఈ సమాచారం రావాలి - ఈ కుమారుడు అవతరించి ఈ భూమిపైకి వచ్చాడని. ఇలాంటి సమాచారం వచ్చినప్పుడే ఫలం వచ్చింది అని భావించండి. ఇప్పుడు స్థితి చాలా అవసరం. బాప్ దాదా శరీరాన్ని అద్దెకు తీసుకుని వస్తున్నారు. ఇప్పుడైతే ఇద్దరూ అద్దెకు తీసుకుంటున్నారు. కొద్ది సమయం కొరకు వస్తున్నారు ఎందువలన? కలుసుకోవడానికి. అలాగే మీరందరూ కూడా మేము అద్దెకు తీసుకుని కొద్ది సమయం సేవ కొరకు నిమిత్తంగా వచ్చాం అని భావించండి. ఇటువంటి స్థితి ఉన్నప్పుడే బాబా యొక్క ప్రభావం ప్రపంచంపై పడుతుంది. రెండింటి లెక్కలు మంచిగా చేశారా లేక తీసుకునే లెక్క చేసి, ఇచ్చే లేక చేయలేదా? 6 నెలల వరకు ఏకరసంగా ఉంటాం అని మరలా 15 రోజుల తర్వాత అవ్వాలనుకున్నాం కానీ ఏమి చేయము, అయిపోయింది .....ఇలా ఫిర్యాదులు రాకూడదు. అప్పుడు దీదీ పని తేలిక అయిపోతుంది. స్వయం బరువు అయితే మొత్తం పనులన్నీ బరువు అయిపోతాయి. బాప్ దాదా యొక్క ఆశ అనండి లేదా శుద్ద సంకల్పం అనండి అది ఏమిటంటే ఒకొక్కరు మొదటి నెంబరు అవ్వాలని. కానీ మొత్తం కల్పంలో చూస్తే ఇప్పుడు తయారు చేసుకునే ఈ స్థితి కూడా మొదటి నెంబరే కానీ వాస్తవిక సంపూర్ణ స్థితి కొరకు చెప్తున్నాను. మేము మొదటి నెంబరులోకి వెళ్ళాలి అని అందరూ ఇదే లక్ష్యం పెట్టుకోండి. అందరూ మొదటి నెంబరులోకి ఎలా వెళ్తారు అని ఆలోచించకండి. దీనిలో మహాదాని కాకూడదు. రెండు విషయాలు ముఖ్యంగా స్మృతిలో ఉంచుకోవాలి. 1. మణిని చూడాలి, దేహ రూపి సర్పాన్ని చూడకూడదు. 2. మిమ్మల్ని మీరు అవతరించిన ఆత్మగా భావించాలి. శరీరంలోకి అవతరించి కార్యం చేయాలి. మరియు ఒక స్లోగన్ స్మృతిలో ఉంచుకోవాలి.బాప్  దాదా ఏదైతే చెప్తారో, ఏది చేయిస్తారో, ఎలా నడిపిస్తారో అలా నడుస్తాను, అలాగే చేస్తాను, నడుస్తాను, మాట్లాడతాను మరియు చూస్తాను. ఇది పాండవులకి ముఖ్య స్లోగన్. ఏది చెప్తే అది ఆలోచించాలి మరేదీ ఆలోచించకూడదు. ఈ కళ్ళతో మరేదీ చూడకూడదు. కళ్ళు కూడా ఇచ్చేశారు కదా! పూర్తి దీపపు పురుగులు కదా! దీపపు పురుగులకి దీపం తప్ప మరేదైనా కనిపిస్తుందా? మీ కళ్ళు మరొకటి ఎందుకు చూస్తున్నాయి? మరొకటి చూస్తే అది మోసం చేస్తుంది. మిమ్మల్ని మీరు మోసం చేసుకోండి. దీనికొరకు దీపపు పురుగులు దీపాన్ని తప్ప మరేదీ చూడకూడదు. సంపూర్ణం అంటే పూర్తి దీపపు పురుగులు. ఇదే ముద్ర. ఫలితం బావుంది కానీ దీనిని అవినాశిగా ఉంచుకోవాలి. ఎప్పుడు, ఎలా కావాలంటే అలా స్థితిని తయారుచేసుకోవాలి. మనస్సు యొక్క వ్యాయామాన్ని చేయాలి. ఈ అభ్యాసం తప్పక చేయండి. ఒక సెకనులో ధ్వనిలోకి మరలా ఒక్క సెకనులో ధ్వనికి అతీతంగా మరో సంకల్పంలోకి రావాలి. మరియు ఒక్క సెకనులో సంకల్పానికి అతీత స్వరూపంలో స్థితులవ్వాలి. ఈ వ్యాయామం చాలా అవసరం. లేకపోతే శరీరం యొక్క అభిమానం నుండి తొలగలేరు, ఒక్క సెకనులో కార్యం కోసం శరీరంలోకి రావాలి మరలా ఒక్క సెకనులో అశరీరి అవ్వాలి. ఎవరికైతే ఈ వ్యాయామం బాగా ఉంటుందో వారు అన్ని పరిస్థితులను ఎదుర్కోగలరు. ఎలా అయితే శారీరక వ్యాయామం ఉదయమే చేయిస్తారో అలాగే ఈ అవ్యక్త వ్యాయామం కూడా విశేషంగా అమృతవేళ చేయాలి. రోజంతా చేయాలి కానీ విశేషంగా అమృతవేళ అభ్యాసం చేయాలి. బుద్ధి బిజీగా ఉన్నప్పుడు కూడా ఈ అభ్యాసం చేయండి. పరిస్థితులలో ఉంటూ కూడా మనం మన బుద్ధిని అతీతం చేసుకోవచ్చు కానీ ఏ కార్యం చేస్తున్నా అతీత స్థితిలో ఉన్నప్పుడే అతీతంగా కాగలరు. ఒకవేళ ఆ కార్యంతో తగుల్బాటు ఉంటే ఒక్క సెకనులో అతీతం కాలేరు, అందువలన ఈ అభ్యాసం చేయండి. ఎటువంటి పరిస్థితి అయినా ఈ అభ్యాసం ఉండాలి. ఎందుకంటే అంతిమ పేవర్ అనేక రకాల భయానక పరిస్థితుల మధ్య మరియు వద్దనుకున్నా తమ వైపు ఆకర్షించుకునే పరిస్థితుల మధ్య ఉంటుంది వాటి లెక్కతో చూస్తే ఈనాటి పరిస్థితులు పెద్దవి కావు. అంతిమ పరిస్థితులు ఏవైతే రానున్నాయో ఆ పరిస్థితుల మధ్య పరీక్ష జరుగుతుంది. దీని కొరకు ముందు నుండే తయారుగా ఉండాలి. అందువలన ఎంత బిజీగా ఉన్నా బుద్ది చాలా స్థూల కార్యంలో ఉన్నా, నలువైపుల పరిస్థితులు ఆకర్షిస్తున్నా ఆ సమయంలో ఈ అభ్యాసం చేయండి. అప్పుడు ఎంత వరకు మనం వ్యాయామం చేస్తున్నామో తెలుస్తుంది. ఈ విషయం చాలా అవసరం. ఈ వ్యాయామంలో ఉంటే సఫలత పొందుతారు. ఒకొక్క సబ్జక్టుకి నెంబరు ఉంటుంది. ఇదే ముఖ్య సబ్జక్టు. దీనిలో మంచిగా ఉంటే ముందు నెంబరు తీసుకోగలరు. ఒకవేళ ఈ సబ్జక్టులో నెంబరు తక్కువ అయితే అంతిమ నెంబరులో ముందు నెంబరు తీసుకోలేరు. అందువలనే జ్ఞానీ ఆత్మతో పాటు స్నేహి ఆత్మగా కూడా అవ్వాలి అని చెప్పాను. ఎవరు ఎంత స్నేహీగా ఉంటారో అంత స్నేహం పొందుతారు. ఎవరితోనైనా ఎక్కువ స్నేహం ఉంటే వీరు తెలివి మర్చిపోతున్నారు అని అంటారు కదా! అంటే తమ స్వరూపం యొక్క స్మృతి కూడా ఉండదు. బుద్ధి యొక్క సంలగ్నత కూడా వారితో తప్ప మరెక్కడ ఉండదు. ఇలా ఉండేవారినే స్నేహి అంటారు. ఈ గ్రూప్ యొక్క విశేషత ఇదే - అన్ని విషయాలు నేర్చుకోవటం మరియు ధారణ చేయటం. మరియు ఇక ముందు కూడా దానిలో నడవడానికి చాత్రకులుగా ఉన్నారు. చాత్రకులుగా అయ్యారు కానీ వెనువెంట చరిత్రవంతులుగా కూడా అవ్వాలి. చాత్రకులుగా అవ్వటం ఇది ఈ గ్రూప్ యొక్క విశేషత. చాత్రకులైన వారు దాహంతో ఉంటారు. ఈ చిత్రం చరిత్రలో చూసినప్పుడే చాత్రకులతో పాటు పాత్రులు కూడా అవుతారు. ఇప్పుడైతే చాత్రకులుగా ఉన్నారు. ఫలితం వచ్చిన తర్వాత రెండు బిరుదులు లభిస్తాయి. ఇప్పుడు చాత్రకులు తర్వాత విజయీమాలలో సమీపంగా రావడానికి పాత్రులు అవుతారు. ఏదైతే స్లోగన్ వినిపించానో మరియు భట్టీ యొక్క ముద్ర ఏదైతే వినిపించానో వాటిని స్థిరంగా ఉంచుకుంటే రెండు గుణాలూ వచ్చేస్తాయి.

Comments

  1. ఓంశాంతి, పరిశీలించే శక్తి ఎలా వస్తుంది, దీనికి ముఖ్య సాధనం ఏమిటి? పరిశీలించే పద్ధతి ఏమిటి? యోగయుక్త స్థితిలో ఎప్పుడు ఉండగలము? ఓడిపోవడానికి ఇదే ముఖ్య కారణం ఏమిటి? ఏ వ్యాయామం చేస్తే అన్ని పరిస్థితులను ఎదుర్కోగలరు? ఈ విషయాలన్నీ బాప్ దాదా ఈ అవ్యక్తమురళీలో తెలిపించారు.

    ReplyDelete
  2. Om shanthi Mera Bapdada. Thank you Mera Baba.

    ReplyDelete

Post a Comment