09-11-1969 అవ్యక్త మురళి

 09-11-1969         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

భవిష్యత్తుని తెలుసుకునే యుక్తులు.

దీపావళి శుభదిన సందర్భంగా ప్రాణప్రియ అవ్యక్త బాప్ దాదా యొక్క మధుర మహావాక్యాలు

            బాప్ దాదా ఒక్కొక్క దీపాన్ని ఒక కాలం యొక్క దృష్టితో చూస్తున్నారా లేక మూడు కాలాల దృష్టితో చూస్తున్నారా? బాబా అయితే త్రికాలదర్శి మరియు దాదా కూడా త్రికాలదర్శియా? మీరు కూడా త్రికాలదర్శులేనా లేక తయారవుతున్నారా? త్రికాలదర్శులు అయితే మీ భవిష్యత్తుని తెలుసుకుంటున్నారా లేక చూస్తున్నారా? నేను ఎలా అవుతాను అనేది మీకు తెలుసా? పాండవసేన మీ భవిష్యత్తుని తెలుసుకుంటున్నారా? ఏమి అవుతారో మరియు ఏ రాజధానిలోకి వెళ్తారో స్పష్టంగా తెలుసా? లక్ష్మినారాయణులు అవుతారు. కానీ ఏ నెంబర్లో అవుతారు? (ప్రతి ఒక్కరు తమ ఆలోచన చెప్పారు). మీరు ఎంతెంత ముందుకి వెళ్తూ ఉంటారో అంత మీ భవిష్య నామం, రూపం, దేశం, కాలం ఈ నాలుగు విషయాలు స్పష్టం అవుతాయి. ఏ దేశంలో రాజ్యం చేస్తారు, ఏ పేరుతో, ఏ రూపంతో మరియు ఏ సమయంలో అవుతారు మరియు మొదటి రాజధానిలో ఎలా అవుతారు? ఇవన్నీ స్పష్టం అవుతాయి. రెండవ రాజధానిలో ఎలా అవుతారు, ఇలా పూర్తి జాతకం ఒక్కొక్కరికి స్పష్టం అవుతుంది. బాప్ దాదా ఎప్పుడు ఎవరిని చూసినా మూడుకాలాలను చూస్తారు. మొదట ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు. మరలా భవిష్యత్తులో ఎలా తయారవుతారు? కనుక ఒక్కొక్క దీపంలో మూడుకాలాలను చూస్తున్నారు. మీకు రెండు కాలాలు స్పష్టంగా తెలుసు, గతంలో ఏవిధంగా ఉండేవారు మరియు వర్తమానంలో ఏవిధంగా ఉన్నారు అని. కానీ భవిష్యత్తులో ఏవిధంగా అవుతారు అనేది ఎంతెంత యోగయుక్తంగా అవుతారో అంత స్పష్టంగా తెలుస్తుంది. వర్తమానం వలె భవిష్యత్తు స్పష్టంగా కనిపిస్తుంది. వర్తమానంలో ఎప్పుడూ కూడా అవునా, కాదా అనే సంకల్పాలు రావు. ఏమిటో తెలియదు ఈ విధమైన సంకల్పాలు రావు. అదేవిధంగా భవిష్యత్తు కూడా అంత స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా ప్రతి ఒక్కరిలో స్పష్ట రూపంలో నెంబర్ వారీగా నషా వస్తుంది. సాకారంలో తల్లి, తండ్రి ఇద్దరికీ భవిష్యత్తు స్పష్టంగా ఉండేది. నామం, రూపం, దేశం మరియు కాలం కూడా స్పష్టంగా ఉండేవి. ఏ సంబంధంలోకి వస్తారో ఆ సంబంధం కూడా స్పష్టంగా తెలుసు. ఇప్పుడు మనస్సులో కొద్దిమందికి కొన్ని కొన్ని వస్తుంటాయి కానీ కొంచెం సమయం తర్వాత ఇది జరగనున్నది అని నిశ్చయబుద్ది అయ్యి చెప్తారు. ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పినా ఇతరులు నిశ్చయం పెట్టుకోవచ్చు లేదా పెట్టుకోకపోవచ్చు. కానీ కొద్ది సమయంలో మీ నడవడిక, మీ పురుషార్ధము భవిష్య చిత్రాన్ని ఋజువు చేస్తాయి. ఇప్పుడు పురుషార్ధం మరియు భవిష్య పదవికి కొంచెం తేడా ఉంది. కానీ సమయం మరియు మీ యొక్క పురుషార్ధం రెండు సమానంగా అయిపోయినప్పుడు ఇక ఏ సంకల్పాలు రావు. మీరందరు దీపావళి జరుపుకున్నారు. దీపావళికి ఏమి చేస్తారు? ఒక దీపం నుండి అనేక దీపాలు వెలిగిస్తారు అంటే అనేకుల సంలగ్నత ఒకనితో జోడింపచేయటమే దీపావళి. ఒకొక్క దీపం యొక్క సంలగ్నతను ఒకే దీపంతో జోడించచేయడమే దీపావళి. దీపంలో ఉండే అగ్ని ఏమిటి? సంలగ్నత ఉంటే అగ్ని ఉన్నట్లు. సంలగ్నత లేకపోతే అగ్ని లేనట్లు. కనుక దీపాలైన మేము సంలగ్నత అనే అగ్నితో వెలుగుతున్నామా? అనేది చూసుకోండి. ఎన్ని రకాలైన దీపాలు ఉంటాయి? అవి ప్రపంచంలో కూడా ప్రసిద్ధంగా ఉంటాయి. (ప్రతి ఒక్కరు తమ ఆలోచన చెప్పారు). ఒకటి - అంధకారాన్ని తొలగించి వెలుగునిచ్చే మట్టి యొక్క స్థూల దీపం, రెండు - ఆత్మ దీపం, మూడు - కులదీపం, మరియు నాల్గవది ఏమిటి? ఆశా దీపం అంటారు కదా! బాబాకి పిల్లలపై ఆశ ఉంటుంది. కనుక నాల్గవది - ఆశా దీపం. ఇలా నాలుగు రకాలైన దీపాలు మహిమ చేయబడతాయి. ఇప్పుడు ఈ నాలుగు రకాలైన దీపాలలో అందరు ఎన్ని దీపాలు వెలిగించారు? బాప్ దాదాకి పిల్లలపై ఏవైతే ఆశలు ఉన్నాయో ఆ దీపాన్ని వెలిగించారా? మట్టి దీపాలైతే అనేక జన్మలు వెలిగించారు. ఆత్మ దీపం వెలిగిందా? ఈ నాలుగు రకాలైన దీపాలు వెలిగినప్పుడే దీపావళి జరుపుకున్నట్లు భావించండి. కులదీపం ఆరిపోయేటువంటి ఏ కర్మ చేయకూడదు. బాప్ దాదా పిల్లలపై ఏవైతే ఆశలు పెట్టుకున్నారో ఆ ఆశాదీపం ఆరిపోయే విధంగా ఏ నడవడిక ఉండకూడదు. ఏకరసమైన మరియు అచంచలమైన, స్థిరమైన ఈ దీపాలన్నీ వెలుగుతున్నాయా? స్వయం యొక్క దీపాన్ని ఎవరైతే వెలిగించుకుంటారో వారు ఇతరుల దీపాన్ని వెలిగించకుండా ఉండలేరు. బాప్ దాదాకి పిల్లలపై ముఖ్యంగా ఏమి ఆశలు ఉంటాయి? బాప్ దాదాకి తన పిల్లలందరిపై ఇవే ఆశలు ఉంటాయి - ఒకొక్క పిల్లవాడు మొదటి నెంబర్లోకి రావాలి అంటే ప్రతి ఒక్కరు విజయీరత్నంగా అవ్వాలి అని. విజయీరత్నాల గుర్తులు ఏమిటి? మీరందరు ఏవైతే చెప్పారో అవి మీరు విన్నవే చెప్పారు. కనుక సరైనవే. విజయీగా అయ్యేవారి లక్షణాలు మీరందరు చెప్పారు కానీ వెనువెంట విజయీ అని ఎవరిని అంటారంటే ఎవరైతే ఇక స్వయం విజయం పొంది ఇతరాత్మలను కూడా తమ కంటే ముందు విజయీగా చేస్తారు. బాప్ దాదా పిల్లలను తన కంటే ముందు పిల్లలను పెట్టేవారు కదా! అదేవిధంగా విజయీరత్నాల యొక్క గుర్తు ఏమిటంటే - వారు తమ సాంగత్యం యొక్క రంగుని అందరికీ అంటిస్తారు. ఎవరు వారి ఎదురుగా వచ్చిన వారు విజయీ అయ్యే తీరుతారు. అటువంటి విజయీరత్నాలు విజయీమాలలో ఏ నెంబర్లోకి వస్తారు?
                 స్వయం అయితే విజయీగా అయ్యారు కానీ ఇతరులు కూడా మీ సాంగత్యం యొక్క రంగు ద్వారా విజయీగా అవ్వాలి. ఇదే సేవ మిగిలి ఉంది. కోట్లలో కొద్దిమందే విజయీగా అవుతారు అని అనుకోకండి. ఎవరు ఎలా తయారైతే ఆవిధంగానే ఇతరులను తయారుచేస్తారు. కనుక విజయీరత్నాలు అనేకులను విజయీగా తయారుచేస్తారు. వారే మాలలో ముఖ్య మణులుగా అవుతారు. కనుక విజయీకి గుర్తు - తమ సమానంగా విజయీగా చేస్తారు. ఇప్పుడు ఈ సేవ మిగిలి ఉంది. కేవలం స్వయం విజయీగా అవ్వటం కాదు. అనేకులని విజయీగా చేయాలి. ఈ దీపావళికి దీపాలన్నీ వెలిగి ఉంటాయి. అనేక వెలిగి ఉన్న దీపాలమాలను ప్రతి ఒక్కరు ధరించారా? ఎప్పుడైతే ప్రతి ఒక్కరి మెడలో ఈ వెలిగి ఉన్న దీపాల యొక్క మాల ఉంటుందో అప్పుడే విజయం యొక్క నగాడా మ్రోగుతుంది. ఎలా అయితే దివ్యగుణాల యొక్క మాల మెడలో వేసుకుంటున్నారో అదేవిధంగా వెలిగి ఉన్న దీపాల మాలను కూడా మెడలో వేసుకోవాలి. ఇక్కడ ఎంతగా దీపాల మాలను మీ మెడలో వేసుకుంటారో అక్కడ అంతగా ప్రజలు తయారవుతారు. కొంతమంది మాల చాలా పెద్దగా ఉంటుంది, కొంతమంది మాల కేవలం మెడ వరకే ఉంటుంది. ఏ మాల ధరించాలి? చాలా పెద్ద మాలతో మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలి. ఇప్పటి వరకు ఎన్ని దీపాల మాలను ధరించారు? లెక్క పెట్టగలరా. లేక లెక్కలేనన్ని ఉన్నాయా? బాగా వెలిగి ఉన్న దీపాలే అందరికీ ఇష్టమనిపిస్తాయి. టిమ్, టిమ్ అనేవి మంచిగా అనిపించవు. మధువనం పువ్వులలో ఏమి విశేషత ఉండాలి? పేరే మధువనం. కనుక మొదటి విశేషత - మధురత. మధురత అనేది ఎవరినైనా హర్షితం చేయగలదు. మధురతను ధారణ చేసేవారు ఇక్కడ కూడా మహాన్‌గా అవుతారు మరియు అక్కడ కూడా పదవిని పొందుతారు. మధురత కలిగిన వారిని అందరూ గొప్పగా చూస్తారు. కనుక ఇక్కడ మనకి మధురత యొక్క విశేషగుణం ఉండాలి. మధురత ద్వారానే మధుసూదనుడి పేరుని ప్రఖ్యాతి చేయగలరు. పేరు మధువనం. మధు అంటే మధురత మరియు వనంలో ఏ విశేషత ఉంటుంది? వనంలోకి వైరాగ్యవృత్తి ఉన్నవారు వెళ్తారు. కనుక బేహద్ వైరాగ్యబుద్ది కూడా కావాలి. దీని ద్వారా మొత్తం అన్ని విషయాలు వచ్చేస్తాయి. మరియు మిమ్మల్ని కాపీ చేయడానికి ఇక్కడికి వస్తారు. వీరు ఈ విధంగా ఎలా తయారయ్యారు అని అందరూ ఆలోచిస్తారు. మధువనం అంటే మధువనమే అని అందరి నోటి నుండి వస్తుంది. కనుక ఈ రెండు విశేషతలు ధారణ చేయాలి. వీటినే మరోమాటలో స్నేహం మరియు శక్తి అంటారు. మీ అందరికీ అందరికంటే ఎక్కువ స్నేహం బాప్ దాదాపై ఉంది కదా! అలాగే బాప్ దాదాకి కూడా మధువనం వారిపై విశేషస్నేహం ఉంటుంది. ఎందుకంటే ఎలా ఉన్నా కానీ సర్వస్వ త్యాగులు కదా! అందువలనే ఆకర్షిస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ సర్వస్వత్యాగంతో పాటు స్నేహం మరియు శక్తిని నింపుకోవాలి. కనుక ఏ విశేషత నింపుకోవాలో అర్థమైందా! కుమారీలు అద్భుతం చేసి చూపించాలి. కుమారీల ప్రతి కర్తవ్యం అద్భుత యోగ్యంగా ఉండాలి. సంకల్పం, మాట మరియు కర్మ అద్భుతంగా ఉండాలి. కుమారీలు పవిత్రంగా ఉన్న కారణంగా తమ యొక్క ధారణని వేగంగా చేసుకోగలరు. అద్భుతమైన కర్తవ్యం చేసి చూపించాలి - ప్రతి ఒక్కరి నోటి నుండి వీరి కర్తవ్యం చాలా అద్భుతమైనది అనే మాట రావాలి. ఎలా అయితే బాప్ దాదా యొక్క ప్రతి మాట వింటూ ఈరోజు మురళి చాలా అద్భుతంగా ఉంది అని అంటారు కదా! అదేవిధంగా కుమారీల ప్రతి కర్మ కూడా ఈ విధంగా అద్భుతంగా ఉండాలి. బాప్ దాదాని అనుసరించాలి. ప్రయత్నం చేస్తాము అని చెప్పకూడదు. ఎంత వరకు ప్రయత్నం అనే మాట అంటారో అంతవరకు ఆకర్షణామూర్తిగా కాలేరు. ఆకరణామూర్తిగా కావాలంటే ప్రయత్నం అనే మాటని సమాప్తి చేయండి. ఇప్పుడు ఆకర్షణామూర్తిగా కావాలి. ఫాలోఫాదర్ చేయాలి. బాప్  దాదా ఎప్పుడైనా ప్రయత్నం చేస్తాను అని అంటారా? మరి మీరెందుకు ప్రయత్నం చేస్తాము అని అంటున్నారు? కుమారీలు అద్భుతం చేస్తే సాథీ అయిన బాబా కూడా సహాయం చేస్తారు. లేకపోతే సాథీ అయిన బాబా సాక్షి అయిపోతారు. కనుక తోడు అయిన బాబాని సదా తోడు ఉంచుకోవాలి లేకపోతే బాబా సాక్షి అయిపోతారు. సాక్షిగా ఉండటం ఇష్టమా లేక సాథీగా ఉండటం ఇష్టమా? ఎవరైతే శ్రమ చేస్తారో వారికి ఫలం కూడా ఇక్కడే లభిస్తుంది. ఇక్కడ స్నేహం మరియు భవిష్యత్తులో పదవి లభిస్తుంది. అందరికీ స్నేహీ అవ్వడానికి శ్రమ చేయాలి. ఎవరు ఎంతగా శ్రమ చేస్తారో వారు అంతగా స్నేహీగా అవుతారు. సమయానికి స్నేహీయే జ్ఞాపకం వస్తారు. కొన్ని విషయాలలో శ్రమ జ్ఞాపకం వస్తుంది. బాబా కూడా ఎందుకు జ్ఞాపకం వస్తారు? శ్రమ చేసారు కనుకే స్నేహం ఉంది. శ్రమతో స్నేహీగా కావాలి. ఎంత ఎక్కువగా శ్రమ చేస్తారో అంత సర్వులకు స్నేహీ అవుతారు. శ్రమకి ఫలితమే స్నేహం, ఎవరు ఎంత శ్రమ చేస్తారో వారిని అందరు స్నేహ దృష్టితో చూస్తారు. శ్రమ చేయని వారిని స్నేహ దృష్టితో చూడరు. విద్యార్థులు టీచర్ యొక్క గుణాలను తప్పక ధారణ చేయాలి. స్నేహమే సంపూర్ణంగా చేస్తుంది. స్నేహంతో పాటు మరలా శక్తి కూడా కావాలి. స్నేహము, శక్తి రెండూ కలిసిన స్థితి అతీతంగా మరియు అతి ప్రియంగా ఉంటుంది. ఎవరితో స్నేహం ఉందో వారి సమానంగా అవ్వాలి. ఇదే స్నేహం యొక్క ప్రత్యక్షత. కనుక దీనిలో మిమ్మల్ని మీరు ఎంత వరకు సమానతకు సమీపంగా వచ్చాము అనేది పరిశీలన చేసుకోండి. ఎంతెంత సమానతకి సమీపంగా వస్తారో అంతగా కర్మాతీత స్థితికి సమీపంగా చేరుకున్నట్లు భావించండి. ఇదే సమానత యొక్క మీటరు. మీ కర్మాతీత స్థితిని పరిశీలించుకోవాలి. కేవలం స్నేహం ఉంచుకుంటే సంపూర్ణం కాలేరు. స్నేహంతో పాటు శక్తి ఉంటే స్వయం సంపూర్ణంగా అయ్యి ఇతరులను కూడా సంపూర్ణంగా చేయగలరు. ఎందుకంటే శక్తి ద్వారా ఆ సంస్కారం నిండుతుంది. కనుక ఇప్పుడు స్నేహంతో పాటు శక్తిని కూడా నింపుకోవాలి.
                       అందరి మనసులను ఏ గుణం ద్వారా జయించగలరు? అందరినీ సంతుష్టం చేయాలి. బ్రహ్మాబాబాలో ఈ విశేష గుణం ఉండేది. దానిని అనుసరించాలి. మిలట్రీ వారికి బెడ్డింగ్ ఎప్పుడూ తయారుగా ఉంటుంది. అలాగే సంకల్పం అనే బెడ్డింగ్ కూడా తయారుగా ఉంచుకోవాలి. సదా తయారుగా ఉండేవారి సంకల్పం అనే బెడ్డింగ్ కూడా సదా తయారుగా ఉంటుంది. 
                    ఆత్మిక పిల్లలూ! మీరు ఆత్మలని వాణీకి అతీతంగా తీసుకువెళ్ళే పురుషార్టం చేయాలి. అందువలన పాత ప్రపంచంలో ఉంటూ దేహం మరియు దేహ సంబంధాలకి అతీతం అవ్వాలి. పవిత్ర ప్రపంచంలో ఉంటూ సదా పవిత్రంగా ఉండే శక్తినిస్తున్నారు బాబా.  పురుషార్ధం చేసి సదా పవిత్రంగా అవ్వాలి.
                       పిల్లలూ! సదా గుణగ్రాహకులుగా అవ్వాలి. నింద - స్తుతి, లాభం - నష్టం, జయం-పరాజయం అన్నింటిలో సంతుష్టమై నడవాలి మరియు దయాహృదయులుగా అవ్వాలి.

Comments

  1. ఓంశాంతి, భవిష్యత్తులో ఏవిధంగా అవుతాము అనేది ఎప్పుడు స్పష్టంగా తెలుస్తుంది? దీపావళి అంటే ఏమిటి? బాప్ దాదాకి పిల్లలపై ముఖ్యంగా ఏమి ఆశలు ఉంటాయి? స్నేహం యొక్క ప్రత్యక్షత అంటే ఏమిటి? ఈ విషయాలన్నీ బాప్ దాదా ఈ అవ్యక్తమురళిలో తెలిపించారు. శివబాబా యాద్ హై?

    ReplyDelete
  2. Om shanthi Mera Bapdada. Thank you Pyare Baba.

    ReplyDelete

Post a Comment